4, జనవరి 2023, బుధవారం

సమస్య - 4299

5-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్”
(లేదా...)
“భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుం డహో”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

29 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      గుఱుకొని శతావధానము
      చిఱుతనమునఁ జేయఁగ దలచెను,పృచ్ఛకుఁడై
      మెఱయన్ బద్య సమస్యగ
      భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్

      చంపకమాల
      చిఱుతనమందు భారతి విశేష వరంబున బ్రోచినంతటన్
      మెఱయ వధానిగన్ దనరి మీదట మేటి శతావధానమున్
      గుఱుకొనఁ బృచ్ఛకుండగుచుఁ గూర్మిని పద్యసమస్యగన్ దగన్
      భరతున కిచ్చెఁ బాదము శుభంబనగన్ మురళీధరుం డహో!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. నిరతిని పండితులును పా
    మరులట గాంచుతరుణమ్ము మాన్యుండును స
    ర్వరసుడు వధాని ధడియం
    భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్.


    (ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)


    సరసకవీంద్రులున్ సకల శాస్త్ర విశారదులైన పండితుల్
    విరివిగ సాహితీ ప్రియులభీష్టితులై కనుచుండు వేళ స
    ర్వరసుడు ప్రాజ్ఞుడుప్పలపు వంశవిరాజితుడై వెలుంగెడిన్
    భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచు మురళీధరుం డహో.


    (ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

    రిప్లయితొలగించండి
  3. విరతియొకింతలేక కడు వేడుకఁజేయ శతావధానమున్
    భరతుడు బాల భాస్కరుని భాతి చెలంగుచు చెంగలించ సం
    బరముగనా వధానమున బాలుని పాండితి నిగ్గు దేల్చగా
    భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుం డహో

    రిప్లయితొలగించండి
  4. మూడవ అడుగు అనే నెపముతో తన పాదము మోపి శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళమునకు ద్రోయు సన్నివేశము........

    స్థిరతర చిత్తవృత్తినొక దీర్ఘతపంబొనరించి స్రష్టచే
    వరముల నెల్ల గైకొని జవంబు బలంబు రహించి వెల్గగా
    సురగణమెల్ల భీతిలగ చోద్యముగా బలిచక్రవర్తి దం
    భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచు మురళీధరుం డహో

    రిప్లయితొలగించండి
  5. భరతుని యవధానంబున
    కరుకైన. సమస్య నొసగఁ
    కౌతుక మొప్పన్
    భరతా పూరించు మనుచు
    భరతునకున్ వేణు ధరుడు. పాదము నిచ్చె న్

    రిప్లయితొలగించండి
  6. భరతాగ్రజుడిడె పాదుక
    భరతునకున్ ; వేణుధరుఁడు పాదము నిచ్చెన్
    శిరము పయిన వామనుడై ,
    సురద్విషుల నృపతి బలిని సుతలము కంపన్

    రిప్లయితొలగించండి
  7. సరసమగు వధానంబున
    భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్
    బిరబిరనిడిన సమస్యను
    దరహాసముతో వధాని తాపూరించెన్

    రిప్లయితొలగించండి
  8. చిరుతప్రాయమునందున
    వరముగనవధానములను భరతుడు సలుపన్
    హరుసముగా పూరింపన్
    భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిరుత ప్రాయ' మన్నపుడు 'త' లఘువే. అందువల్ల గణభంగం.

      తొలగించండి
    2. సవరిస్తున్నాను గురువుగారూ. ధన్యవాదములు _/\_

      కందం:
      చిరుతవయసు నందుననే
      వరముగనవధానములనుభరతుడు సలుపన్
      హరుసముగా పూరింపన్
      భరతునకున్ వేణుధరుఁడుపాదము నిచ్చెన్

      తొలగించండి
  9. కందం.
    కరచరణాదులు చిందిల
    సరియగు భంగిమల నాట్య శాస్త్ర రచన జే
    సి, రసజ్ఞత తో గొలువగ
    భరతనకున్ వేణుధరుడు పాదము నిచ్చెన్ .
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    (భరతముని భరత నాట్యం వ్రాసి వేణుధరుని పాదపద్మముల చేరిన సందర్భం తలంపుతో)

    రిప్లయితొలగించండి
  10. వర విష్ణు ధనువు నెక్కిడి
    ధరామరు తపోమహిమను దాఁ గొని హరియే
    గిరి కేఁగ నిర్జి తాఖిల
    భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్

    [నిర్జి తాఖిల భరతునకు = జయించిన భరతఖండము గలవాఁడు, ఇక్కడ పరశు రాముఁడు; పాదము నిచ్చెన్ = మహేంద్ర గిరికిఁ జనఁ బాదము నడచుటకు ఖండింపక యిచ్చెను]

    త్వర గెలిపింప బాలవరుఁ బన్నిన యా సభలోనఁ బేర్మితో
    భరతున కిచ్చెఁ బాదము శుభం బనుచున్ మురళీ వరాఖ్యుఁడే
    నరు జయ మెంచి యా నళిన నాభుఁడు తేరున నిల్ప విశ్వ గ
    ర్భ రతున కిచ్చెఁ బాదము శుభం బనుచున్ మురళీధరుం డహో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందపూరణమున కితివృత్తము:

      తదిమాం త్వం గతిం వీర హన్తుం నార్హసి రాఘవ.
      మనోజవం గమిష్యామి మహేన్ద్రం పర్వతోత్తమమ్৷৷1.76.15৷৷

      లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా .
      జహి తాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయ:৷৷1.76.16৷৷

      చం.
      గమనపు శక్తి వీరవర! కావున నాకు లయంబు సేయ రా
      దు మనుజముఖ్య! హర్షమునఁ దూర్ణము పోవ మహేంద్ర శృంగికిన్
      సముచిత రీతి లోకముల సత్య తపఃఫలితమ్ము లయ్య జం
      పుమ వడి జాగు సేయకుమ మూరి శరమ్మునఁ బద్మలోచనా!
      శ్రీమదాంధ్ర రామా. 1. 76. 13.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  11. భరతుని యవధా నంబున
    భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెం
    దిరమగు నర్ధముఁ గలుగగ
    సరసముగాఁబూ రణంబుఁజక్కగఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  12. అరయగ దండ్రి యానతి వనంబునకేగిన రాఘవుండహా
    పరిణత మానసంబునటు పాదుకలిమ్మని వేడినట్టి యా
    భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్; మురళీధరుం డహో
    చిరచిరలాడు నెచ్చెలికి సేవలు జేయుచు పాదమంటెనే

    రిప్లయితొలగించండి
  13. చిరుతవయస్సు నందెన తిశీఘ్రగతిన్ యవధానవిద్యతా
    దరికినిచేరబాలభరతాన్వయుడొప్పుగచేయగన్
    భరతునికిచ్చెబాదముశుభంబనుచున్ మురళీధరుండహో
    మరియెటుచేసెపూరణముమానుగగాంచగరండువేగమే

    రిప్లయితొలగించండి