22, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4215

23-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్”
(లేదా...)
“పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో మల్లెల నాగరాజు గారి సమస్య)

46 కామెంట్‌లు:

 1. పలుకుల తల్లికరుణతో
  నలవోకగబాలుడొకడునందరుమెచ్చన్
  న్నతిసులువుగనేమాటలు
  పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్

  రిప్లయితొలగించండి
 2. కందం
  చెలువంపు రూపమందునఁ
  గులుకుచు నేపథ్య గాయకుఁడమర నటుడై
  కిలకిల నగవులు సిందుచుఁ
  బలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్

  చంపకమాల
  చెలువపు రూపమున్ గలుగ చేరె నటుండుగ చిత్రసీమలో
  వెలయుచు వేషమందు తెర వెన్కను పాడఁగనుండ గాయకుం
  డలరుచు హావభావముల నాంగికమొప్పగఁ బాత్రధారిగన్
  బలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

  రిప్లయితొలగించండి
 3. వెలది యగు దెలుగు భాషన
  పలుకన్ రానట్టి వాఁడు , పాటలు పాడెన్
  బొలమున నుండిన రైతులు
  లలినొందునటుల సరియగు రసికత తోడన్

  వెలది = నిర్మలము

  రిప్లయితొలగించండి

 4. ఇల మహ్మద్రఫియే కద
  యలవోకగ తెలుగుపాట లవియెన్నియొ తా
  బలుచిత్రములందు తెనుగు
  పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్.

  రిప్లయితొలగించండి
 5. పలుభాషా చిత్రములం
  దలవోకగ పాడగలుగునా గాయకుడే
  తెలుగున నవకాశమొదవ
  పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్

  రిప్లయితొలగించండి
 6. ఇల కడు హీనమైన గతి నిర్వురు యాచకులుండె హేలగన్
  వెలయగ నాట్యమాడి యొక భిక్షువు తాను గడించె నూకలన్
  సలుపగ రాని నాట్యమును సల్పక, యోచన చేయ, బియ్యపున్
  బలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

  బియ్యపుంబలుకులు =నూకలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
   'యాచకులు' బహువచనం, 'ఉండె' ఏకవచనం. *యాచకులుండ* అనవచ్చు.

   తొలగించండి

 7. కళలకు భాషతోడపని కానగరాదు నిజమ్మిదే సుమా
  యిల గన మహ్మదీయుడట యింపగు గాత్రము తోడ నెన్నియో
  పలువురు భేషు భేషనెడు భంగిని పాడెను గాంచ తెన్గులో
  పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా.

  రిప్లయితొలగించండి
 8. పలు సినిమాలను జూచుచు
  వలచిన గీతాల కెల్ల పర వశు డగుచున్
  జెలువపు మన నము వలనన్
  బలుకగ రానట్టి వాడు పాటలు పాడెన్

  రిప్లయితొలగించండి
 9. మరొక పూరణ

  పలువురువార్షికోత్సవసభన్గళమెత్తుచునాలపించగన్
  నెలతలుహావభావములనెమ్మినిచూపుచునాట్యమాడగన్
  పలుకులతల్లిదీవెనిడ వాగ్ఝరిధారగనొక్కసారిగా
  *"పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా*

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సలలితముగ బాల్యమునన్
   బలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్
   బలికించుచు నవరసములు
   కలరవములతోడ విమల గాంధర్వంబున్

   విలసితమైన పల్కులను వెంబడి నేర్వక బాల్యమందునన్
   బలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా
   కలరవ కూజితంబనగ కమ్మని గానము వెల్వరించుచున్
   బలువురు కోవిదుల్ పొగడి పద్మపురస్కృతి నిచ్చునంతగా

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. కందం
  ఇలలో కామాక్షీకృప
  కలుగ పలుకువచ్చె, మూకకవి పంచశతిన్
  బలికి కొలిచె మాతనపుడు
  పలుకులు రానట్టి వాడు పాటలు పాడెన్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 14. పలువురు మెచ్చురీతి పలుభాషల చిత్రములందు గానమున్
  సలిపెడు గాయకుండతడు శ్రావ్యములాతని గానమాధురుల్
  తెలుగును నేర్వ లేదెపుఁడుతీయని తేనియలూరు గొంతుతో
  పలుకులు రానివాఁడు పలుపాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

  రిప్లయితొలగించండి
 15. అల! తెలుఁగు వాఁడు గాఁడే
  చెలరేఁగుచు శ్రావ్యముగ వశీకరణుండై
  లలితంపు టన్య భాషం
  బలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్

  చలము సెలంగ డెందములఁ జక్కని కంఠము గాంచి నంత ను
  త్తలము జనింప మిక్కుటము తత్తఱ పాటునఁ బట్టణమ్ములోఁ
  బలువురు రిక్త నిందలను బాధ లొసంగినఁ గూడ ఱేపుమా
  పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

  [ఱేపుమాపు + అలుకలు = ఱేపుమా పలుకలు]

  రిప్లయితొలగించండి
 16. కలుగక విద్య కైకొనియె కర్షక వృత్తిని గ్రామమందునన్
  పలువురు గానకోవిదుల పాటల నిత్యము నాలకించుచున్
  సులువుగ ధారణన్ సలిపి చోద్యముగానొక కూటమందునన్
  పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా

  రిప్లయితొలగించండి
 17. పలుకులరాణి సత్కృపయొ బాలుడు
  మండెడు పొట్టకోసమై
  యలసటలేక తిర్గుచు మహాద్భత
  మొప్పగ రైలుపెట్టెలో
  కలరవమోలె సక్కగను గానము సేయగ
  ముర్సిరందరున్
  పలుకులు రానివాడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చగా

  రిప్లయితొలగించండి
 18. కం:పలువురు గలగల లాడుచు
  కలసిరి చీటీ కి,మూగ గా శ్రమ పడుచున్
  కలమును,కాగితమును గొని
  పలుకన్ రానట్టి వాడు పాటలు పాడెన్
  (చీటీ పాటకి అంతా వచ్చారు.పలుకు రాని మూగ కలము,కాగితం తీసుకొని రాస్తూ పాటలు పాడాడు.)

  రిప్లయితొలగించండి
 19. చం:పలుకును నాస్తికత్వమునె,భ గ్గను రాముని పేరు చెప్పగా
  వలచెను గానవిద్య తన బాల్యమునందున గాన పాండితిన్
  దెలుపగ రామచంద్రు పయి ,దేవుని దల్చెడు నాలుగేనియున్
  పలుకులు రాని వాడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చగా
  (అతడికి రాముడి పై భక్తి లేదు.అలాంటి నాలుగు పలుకులు కూడా రావు.కానీ పాండిత్య ప్రదర్శన కోసం రాముడి పై సంగీతం పాడాడు.)

  రిప్లయితొలగించండి
 20. తెలియనిభాషలునేర్వక
  అలవోకగ పాటపాడు యనుకరణలచే
  తెలసిన భాషన చదువుచు
  పలుకన్ రానట్టివాడు పాటలుపాడెన్.

  రిప్లయితొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  నలుగురు మెచ్చు విధంబుగ
  నలరించుచు రాగ,తాళ మనుగుణ్యముగా
  లలితముగా మురళిపయిన,
  పలుకన్ రానట్టివాడు, పాటలు పాడెన్.

  రిప్లయితొలగించండి