16, జనవరి 2023, సోమవారం

సమస్య - 4309

17-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున”
(లేదా...)
“దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాడుగుల నారాయణ మూర్తి గారి సమస్య)

48 కామెంట్‌లు:

 1. లవకుశులతో లక్ష్మణస్వామి:

  తేటగీతి
  మీరు బాలలు రామాశ్వమేరి పట్ట
  తగదు తగదందు నా స్వామి తమ్ముడగుచు
  నొప్పి విడువంగ మీకు నయోధ్యనేలు
  దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   కొండలరాయుడై వెలిఁగి కోరిన కోర్కెల దీర్చుదైవమై
   యండగ నుండి యార్తులను నమ్మల తోడుగ కాచువాడనన్
   బండగ దిర్మలన్ మనకు, బ్రహ్మ భజించెడు వాడు శార్ఙ్గకో
   దండధరుం ,డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. చండుడు రావణాధముడు జానకి నొంటరి చేయబూనుచున్
  మొండిగ కుట్ర బన్నెనిట భూమిజ రాముని వేరు సేయగన్
  దండన మేల నాకు ఖలు దానవు చేతను,... రాఘవుండు, కో
  దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్.

  రిప్లయితొలగించండి
 3. చండ సుశాశనుండు గద చచ్చినవారికి
  కఠిన శిక్షలున్
  దండధరుండొసంగునట , దర్శన
  మాత్రమునన్ విముక్తయున్
  కొండలరాయుడిచ్చునట, కోరిన కోర్కుల
  భక్తకోటికిన్
  నిండు మనంబునన్నతని నిత్యము గొల్చిన
  చిత్తశుద్ధితో.

  రిప్లయితొలగించండి
 4. పాప మొనరించు వారల పద్దు జూసి
  తగిన శిక్షను నరకాన దండన ముగ
  దండ ధరు డిచ్చు :: ముక్తిని దర్శనమున
  వేంక టేశు డొ సంగును వేడు కొనగ

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. నిండినకోర్కెలన్గలుగు నీరజనేత్రుడు శైవ చాపమున్
   ఖండమునర్చి లోకమున ఖ్యాతిని పొందిన శౌర్య మూర్తి, యా
   భండన భీముడచ్యుతుడు పండిత పామర రంజకుండు, కో
   దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'ఖండమొనర్చి' టైపాటు.

   తొలగించండి

 6. తే.గీ.

  గంగను జడలో దాల్చుచు గౌరికి తన
  యర్థ దేహమునిచ్చిన యంగజ హరు
  డంబరీశుడు కటమర్దు డజుడు సర్ప
  దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున.


  ఉత్పలమాల.

  నిండు మనస్సునన్ నిలిపి నీరజ పత్రదళాయ తాక్షుడా
  భండన భీముడార్థజన బాంధవుడౌ గుణ శీలికీ భువిన్
  రెండవ సాటిదైవమిక లేడని నమ్మి నుతించినంత కో
  దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్.

  రిప్లయితొలగించండి
 7. కంఠమున విషము మెడలో కర్ప రముల
  దండధరుఁ డిచ్చు ముక్తిని , దర్శనమున
  దన్మయత్వము నొందుచు దమను దాము
  మరచి యతనియో చనయందె మనుచునుండ

  రిప్లయితొలగించండి
 8. డా. బల్లూరి ఉమాదేవి

  ఆయువాగ గొంపోవును నాగ కుండ
  దండధరుఁ డి,,చ్చు ముక్తిని దర్శనమున
  రామభద్రుడీ భువిలోన రయము గాను
  భక్తజనసమూహమునకు బాయకెపుడు

  రిప్లయితొలగించండి
 9. భండన భీముడైన రఘువంశ సుధాంబుధి రామచంద్రుడే
  యండగనిల్చు దెప్పరము లందునఁ వర్మము వోలె, భక్తితో
  నిండగు నమ్మికన్ మనసు నిల్ప పదాంబుజ యుగ్మమందు కో
  దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. నిండగు సేనతో తరలి నిశ్చల చిత్తుడు రామచంద్రుడే
   భండన సల్పినన్ మివులు భస్మము నీకిక నాలకింపుమా
   దండన తథ్యమే యగును ధర్మము తప్పిన దానవేంద్ర కో
   దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

   తొలగించండి
  2. మృతికి చేరువైన మరణ మెవ్వరిచ్చు?
   ఘోర తపమున దేనిని కోరవచ్చు?
   కంటి పాపల నెచ్చోట గాంచవచ్చు?
   'దండధరుఁ డిచ్చు' 'ముక్తిని' 'దర్శనమున'

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. ధరణినేలెడు దేవర దండధరుడు
  రక్ష యొనగూర్చి జనులకు రాజ్యమేలు
  ధర్మసంకటమేర్పడు తరుణమందు
  దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున

  రిప్లయితొలగించండి
 12. ఉ.మా.
  బండను మార్చి,నాతిగను భాగ్యమొసంగిన పుణ్యమూర్తి తా
  జండుడు రావణాసురుని సంగరమందున ద్రుంచివేయగా
  నండగనుండి రాజ్యమున నాదటనేలిన నాయకుండు కో
  *దండధరుండొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్*

  రిప్లయితొలగించండి
 13. అంబరాంబరుండు శివుండు నక్షరుండు
  కాలకంఠుండు నిత్యకపాలధారి
  చంద్రచూడుండు త్రిపురారి శంభుఁడు జిత
  దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున

  గండము భండనమ్ములును గల్గక యున్నను గాలవాయువుల్
  మెండుగ వీవకున్న నిల మీరము నింగిని ముట్టకున్న ను
  ద్దండున కైన బక్కకును దథ్యము కాలము దాపురించినన్
  దండధరుం డొసంగు నఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

  రిప్లయితొలగించండి
 14. ఖండితదుష్టరాక్షసనికాయుడు నిర్జరమౌళిరత్నరు
  ఙ్మండితపాదపద్ముడు సమస్తజగత్సృజనాదిహేతుభూ
  తుండును ముక్తిదుండు హరి దూరితదుష్కృతకోటిదండనో
  ద్దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించండి
 15. తేటగీతి.
  సాధకుండు యోగంబునష్టాంగ ములను
  విధిగ పాటించి తనలోని వింత గొల్పు
  శక్తి మేల్కొన కుండలి శక్తి కదల
  దండ ధరుడిచ్చు ముక్తిని దర్శనమున.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 16. భండన మందునన్ నిలిచి వైరి నృపాలుర యుక్కడంచగా
  ఖండన చేసి సైనికుల కాలుని చేరుచు కీర్తిమంతుడౌ
  గండరగండడైన భువి కాలము తీరిన నిశ్చయమ్ముగా
  దండధరుండొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్

  రిప్లయితొలగించండి
 17. పాప కర్మలు సేసిన వలయు శిక్ష
  దండధరుఁడిచ్చు,ముక్తిని దర్శనమున
  వేంకటేశుఁడు మాత్రమే విరివిగనిడు
  సందియంబును వలదార్య! సత్యమిదియ

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నియమనిష్ఠలు పాటించి నిరతమెల్ల
  భవుని నిండు మనమ్మున భక్తితోడ
  జపతపమ్ముల మెచ్చించ సంతసించి
  దండధరుడిచ్చు ముక్తిని దర్శనమున.

  మెండుగ డెందమందు కడుమెల్పుగ ఫాలుని దివ్యనామమున్
  నిండుగ నోటబల్కుచున్ నిచ్చలు ధ్యానము చేయుచుండగన్
  అండగనుండి ప్రాపునిడి నంత్యమునందున నిశ్చయంబుగా
  దండధరుండొసగునట దర్శనమాత్రమునన్ విముక్తినిన్.

  రిప్లయితొలగించండి
 19. మెండుగఁ బాపముల్గలుగఁ జేసెడు వారికి గట్టి శిక్షనున్
  దండధరుం డొసంగునఁట, దర్శన మాత్రమునన్ విముక్తినిన్
  భండన భీముఁడే యొసఁగు భక్తజనంబులకెల్ల వేళలం
  దండిగ సంపదల్సిరులు దానిడుఁదప్పక సత్యమేసుమా

  రిప్లయితొలగించండి