6, జనవరి 2023, శుక్రవారం

సమస్య - 4301

7-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్”
(లేదా...)
“సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పోచిరాజు కామేశ్వర రావు గారి సమస్య)

37 కామెంట్‌లు:

  1. విద్యార్థిని పలికించును
    సద్యఃస్ఫూర్తియె ; బుధులకు
    సంకటము లిడున్
    మద్యము త్రాగించి పిదప
    పద్యము జెప్పమని కోరు వటువులు కలుగన్

    రిప్లయితొలగించండి
  2. విద్యారహితులకైనన్
    సద్యఃస్ఫూర్తి దయసేయు సఫలతనిలలో
    నాద్యంతము లోపించిన
    సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సద్యఃస్ఫూర్తి తొలంగజేయునిడుముల్ సవ్యంబుగా జూపినన్
      సద్యోజాతుని పట్టికిన్ ఫలితమే సంప్రాప్త మాయెన్గదా
      విద్యావే త్తలకైన నీవిషయమే విస్పష్టమే, లేనిదౌ
      సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. కందం
      వేద్యుడు కౌశికునకు నిర
      వద్య హరిశ్చంద్రుఁడొప్పి వరమిడి వగచెన్
      విధ్యుక్త వ్రతాచరణన్
      సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్

      శార్దూలవిక్రీడితము
      సాధ్యంబౌనని పంతమూనుచు హరిశ్చంద్రాఖ్యు బొంకింపగన్
      వేద్యుండౌ మునికౌశికుండు మిగులన్ వేదించె, సత్యవ్రత
      మ్ముద్యుక్తంబుగ నెంచి మౌనివరమే యూరింప నూకొట్టెడున్
      సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. ఆద్యులు ముందే తెలిపిరి
    విద్యావంతుండ్రకైన విదితుల కైనన్
    బద్యున కైనను లేనిచొ
    సద్యఃస్ఫూర్తియె , బుధులకు సంకటము లిడున్.


    ఆద్యంతమ్ములు లేనివానిని సదా యర్చించుచున్ నిత్యమున్
    సద్యోజాతుని మేటి భక్తుడయినన్ సామ్రాట్టులైనన్ భువిన్
    విద్యావంతులు సంభృతశ్రుతులకున్ విజ్ఞానికిన్ లేనిచో
    సద్యఃస్ఫూర్తి , యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్.

    రిప్లయితొలగించండి
  5. విద్యా వంతునకు గలుగు
    సద్య స్ఫూర్తి యె : సంకటము లిడున్
    విద్యా హీనున కిలలో
    మద్యపు బానిస గ మార మందుండ గు చుమ్

    రిప్లయితొలగించండి
  6. విద్యగడించిన చాలదు
    సద్యస్స్ఫూర్తియు గలిగిన సద్యశమొందున్
    విద్యలు నేర్చియు కొరవడ
    సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్

    రిప్లయితొలగించండి
  7. ఆద్యం బయిన మనశ్శో
    కాద్యావలి మఱవ నీక యార్తి సెలంగం
    జోద్యంబై జ్ఞప్తి నొసఁగ
    సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్

    విద్యా బుద్ధులు నేర్చి మిక్కుటముగన్ విద్యాధికుండై వెసం
    బద్యవ్రాతము దా రచించి రచనా ప్రావీణ్య మేపారఁగన్
    విద్యా గంధ విహీన భూధవునకున్ విన్పింప దీపింపఁగా
    సద్యఃస్ఫూర్తి, యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

    రిప్లయితొలగించండి
  8. విద్యల్నేరిచి పాండితీ గరిమతో విజ్ఞానియై యొప్పినన్
    సద్యఃస్ఫూర్తియె సద్యశంబు నిలలో సాధ్యంబొనర్చున్ గనన్
    విద్యావేత్తకు కార్యనిర్వహణకున్ వేద్యంబిదే, లేనిచో
    సద్యఃస్ఫూర్తి, యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్

    రిప్లయితొలగించండి
  9. కందం.
    ఆద్యంతములు వినకనే
    పద్యములు నుడువ ఘనుడని పండితుడనుచున్
    పద్యములు జెప్ప జాలని
    సద్యఃస్ఫూర్తియె, బుధులకు సంకటము లిడున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. కం:సద్యస్స్ఫూర్తిన్ స్తుతితో
    పద్యముల జెప్పు విద్య వచ్చుట నెపుడున్
    పద్యము లడిగెద రెల్లరు
    సద్యస్స్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్

    రిప్లయితొలగించండి
  11. పద్యరచనయన వలయును
    సద్యస్ఫూర్తియెబుదుಲకు,సంకటములిడున్,
    హృద్యముగానిపదమ్ముల
    విద్యావంతులుసతతమువినియోగించన్

    రిప్లయితొలగించండి
  12. శా:ఉద్యద్వేగము తోడుతన్ హరి యమందోద్వేగియై శంఖచ
    క్రాద్యమ్ముల్,మరి వాహనమ్ము గొనకే ,యాలిన్ నను దల్చకే
    యుద్యోగించుచు నుండె నీ పయనమే యూహింప దుస్సాధ్య మౌ
    సద్యస్స్ఫూర్తి యొసంగు కష్టములు నష్టమ్ముల్ బుధశ్రేణికిన్
    (గజేంద్ర మోక్షం కొరకు శ్రీమహావిష్ణువు ఉన్న పళాన ఎవరికీ ఏమి చెప్పకుండా వెడుతున్నప్పుడు లక్ష్మీ దేవి ఇలా అనుకొన్నట్లు ఊహ.)

    రిప్లయితొలగించండి
  13. హృద్యంబైనసుపద్యముల్ సతతమున్ హృద్యంగమంబైసదా
    సద్యామోదము కూర్చుచున్ చెవులకున్ సంతోషమేనింపునా
    *“సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధ శ్రేణికిన్”*
    విద్యాగంధములేకనొక్కడచటన్ విద్వత్తు చూపించగన్

    రిప్లయితొలగించండి
  14. విద్యాదేవి కటాక్ష లబ్ధ విభవంబే గాంచ ధారాళమౌ
    పద్యఃప్రౌఢి గ్రహింపకన్ విచలురై వర్తింప వైరస్యమౌ
    సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్
    విద్యోతంబగు విద్య సద్వినయసంవేదానుసంసక్తమై

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. విద్యాగంధం బేటికి
    ఉద్యోగ విజయము కాక పోయిన ౘూఁడన్
    సద్యంబున తరుగువడిన
    సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటములిడున్

    చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా

    రిప్లయితొలగించండి