29, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4222

30-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని"
(లేదా...)
"రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ముదిగలం బాబు గారి సమస్య)

28 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముద్రిక + ఇచ్చి' అన్నపుడు సంధి లేదు. "ముద్రిక నిడి" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు.
      ఆటవెలది
      సీత జాడ నెఱిగి శ్రీరామ చంద్రుని
      ముద్రిక నిడి క్షేమము తెలియంగ
      జేసి, భూజ బాగు చిత్తగించుచు సంబ
      రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటరు.

      తొలగించండి

  2. అంగుళీయకమ్ము నతివ సీతకునిచ్చి
    గురుతు కొరకటంచు తిరిగి మన్ను
    చూలి నడిగి మేటి చూడామణి ప్రతిస
    రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని.

    రిప్లయితొలగించండి

  3. అమ్మహితాత్ముడా హనుమ యంబర వీధిని లంకజేరి సీ
    తమ్మను గాంచి సంతసమునందుచు శ్రీరఘు రాము గూర్చి తా
    నిమ్ముగ మాటలాడుచు గ్రహించి శిరోమణి, సీతకిచ్చి యుం
    గ్రమ్మునుఁ , దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్.

    రిప్లయితొలగించండి
  4. సీత జాడ నెరిగి శీఘ్రముగా తిర్గి
    వచ్చె సంతసమున ప్రభువు కడకు
    ఆనవాలు సీత యర్పించ భవ్యోంగ
    రమ్ము దెచ్చె హనుమ రామునకని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భవ్య + ఉంగరమ్ము' దుష్టసమాసం. అయినా సీతనుండి తెచ్చింది ఉంగరం కాదు, శిరోమణి.

      తొలగించండి
    2. ఉంగారమా బలే ఉంగారమా!నా సామీ యేలి ముద్దు టుంగారమా అంటూ ఉమ్మడి కుటుంబం సినిమాలో రామాయణ నాటకం ఉంది లెండి.అందరూ అదే అనుకుంటారు.

      తొలగించండి
  5. ఆటవెలది
    సీతఁ జూచివచ్చి చింతామణిన్ దెచ్చి
    లంకఁ గాల్చి యచటి వంకలెరిగి
    సమరమెంచఁ దగిన సత్సమా చార సా
    రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని

    ఉత్పలమాల
    అమ్మను జానకిన్ వెదకి అంబుధి కావల తోటఁ గాంచి పం
    తమ్మున లంకగాల్చి విశదమ్మగు వ్యూహములల్ల నేర్చి తా
    నిమ్ముగ నమ్మదౌ మణిని నిష్టమనంగ నొసంగనెంచి హా
    రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    చిమ్మి మహేంద్ర పర్వతముఁ జెంగున లంకను సీతఁ జూడగన్
    అమ్మకు నుంగరమ్ము నిడె నాత్రపు రీతిని నానవాలుగా
    కుమ్మగ నక్షయున్ భటులఁ గూల్చె శిరోమణిఁ దల్లినుండుపా
    *రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్.*

    ........
    ఉపారము = కానుక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నుండి + ఉపారమ్ము' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  7. నిండు భక్తి గల్గి నిర్మల హృదయాన
    చిత్త శుద్ది తోడ సేవ జేయ
    నేరి కోరి విరుల నింపుగ గూర్చి హా
    రమ్ము దెచ్చె హనుమ రాముని కని

    రిప్లయితొలగించండి
  8. రాముడంపెననుచు రాముడిచ్చిన యుంగ
    రమ్ముఁ దెచ్చె హనుమ ; రామున కని
    దన గురుతుగ సీత దలలోని మణినిచ్చె
    ఆవి ధముగ సాగె హనుమ జతన

    రిప్లయితొలగించండి
  9. రాముడిడిన యుంగరమును సీతకుజూపి
    రామునివివరమ్ము లామెకొసగి
    శోకతప్తసీత చూడామణిని సత్వ
    రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని

    రిప్లయితొలగించండి
  10. ఇమ్ముగ నబ్ధిలంఘనము నెల్లరు మెచ్చు తెరంగు సల్పి సీ
    తమ్మను లంకయందుగని తద్దయు రాముని యంగుళీయకం
    బమ్మకుఁ జూప గందువగ నాధరణీసుత యిచ్చినట్టి హా
    రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్

    రిప్లయితొలగించండి
  11. సీతజాడ దెలిపి శ్రీరామచంద్రుని
    చెంత జేరి హనుమ చింతదీర్చె
    నానవాలుగనిడ జానకీ మాత హా
    రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని

    రిప్లయితొలగించండి
  12. పలికెఁ బ్రొద్దుఁ గుఱ్ఱ ప్రక్కనఁ దా నిలు
    వంగ తమ్ముఁగుఱ్ఱ వంత తోడఁ
    గలఁత వల దెడందఁ గమ్మని సుద్దు క
    రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని

    అమ్మకచెల్ల దాశరథు లాజిని బమ్మను మేఘనాథుఁడే
    కుమ్మగ దొడ్డ తూపునను గూల దురమ్మున నంత నుంటకై
    నెమ్మిని రామలక్ష్మణులు నేర్పున మందుల కొండ నెత్తి తో
    రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముద మంద వానరుల్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.

    హనుమ లంకకేగి యవనిజ కొసగెను
    రాముడిడిన యుంగరమును; సీత
    యాభరణము నివ్వ నానవాలనుచు, హా
    రమ్ముఁ దెచ్చె హనుమ రామునికని.

    రిప్లయితొలగించండి
  14. సీత జాడ నెరిగి శీఘ్రముగా తిర్గి
    వచ్చె సంతసమున ప్రభువు కడకు
    ఆనవాలు సీత యర్పించగా సత్వ
    రమ్ము దెచ్చె హనుమ రామునకని

    రిప్లయితొలగించండి
  15. (ఇంద్రజిత్తు బాణమునకు లక్ష్మణుడు ముర్చిల్లిన సందర్భం)
    ఉ: అమ్ము మరుత్తువేగమున నంటినఁ గూలగ లక్ష్మణుండు దుః
    ఖమ్మున రాము చంద్రుడల కాంచుచు నుండగ నిస్సహాయుడై
    యమ్మహితాత్ముశోకమును నాపగ దివ్య మహౌషదీ మహీ
    ద్రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్

    రిప్లయితొలగించండి