24, జనవరి 2023, మంగళవారం

సమస్య - 4217

25-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంట లేని యింట బంధువు దినె”
(లేదా...)
“వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో గీతా శైలజ గారి సమస్య)

24 కామెంట్‌లు:

 1. కందమూలఫలము లందుబాటుననుండి
  యారగించుచుందు రచటిమునులు
  పర్ణశాలలోన ప్రాశించు సమయాన
  వంట లేని యింట బంధువు దినె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పంటలమేయమై సిరులు బంగరు రాశుల కాలవాలమౌ
   యింటికి వచ్చువారలకు యింపును గూర్చెడు విందులే సదా
   వంటలు కమ్మగానమరి పల్వురు కోరిన వంటలెల్ల లే
   వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్

   తొలగించండి
 2. పురము నందునగల భోజనశాలపు
  పారికాపు తెచ్చె పాత్ర లందు
  పలురకముల. మధుర వంటకములు గాన
  వంట లేని యింట బంధువు దినె

  రిప్లయితొలగించండి
 3. సాత్వికు డగు వాడు శాకమ్ము భుజియించు
  తాను దినగ బోడు దైత్యు భంగి
  పిలువ బంధు వొకడు వెడలి మాంసంపు
  వంట లేని యింట బంధువు దినె

  రిప్లయితొలగించండి
 4. ఆటవెలది
  కార్యమనఁగ గృహిణి కాల్చుకొనక చేయి
  పైకమిచ్చి బయటవారి తోడ
  భోజన సదుపాయముల నేర్పరచినంత
  వంట లేని యింట బంధువు దినె


  ఉత్పలమాల
  కంటను గాంతుమే గృహిణి కార్యములన్నను నేడు తృప్తిగా
  నింటను వండి బంధువులకింపుగ వడ్డన జేయుపోకడల్?
  మింటిని దాకు మోదమున ప్రీతిగ నన్యులు దెచ్చి పెట్టినన్
  వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్

  రిప్లయితొలగించండి


 5. హరిదినమ్మ టంచు నందరుపవసింప
  నతిథి యొకడు రాగ నాదరమున
  కదళి ఫలములొసగ కడుపార ముదమున
  వంటలేనియింట బంధువుదినె

  రిప్లయితొలగించండి

 6. (పుట్టింటిలో వున్న భార్యతో భర్త చరవాణిలో చెబుతున్న మాటలు)

  నీవు లేనినాడు నిరశన మీయింట
  దాలి వెలుగ బోదు తథ్యమంచు
  భేషజములు చెప్పు ప్రియురాల నేడు నీ
  వంట లేని యింట బంధువు దినె.


  వంటలు నాకు రావనుచు బామముతో నెగతాళిజేసి పు
  ట్టింటికి నేగ పాపయె కుటీరము లోగల బామ్మ చెంత నా
  చంటిది వంటలన్నియును చక్కగ నేర్చెను ధీతవల్ల నీ
  వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉ.

   గంటలు మ్రోగగా గుడిని గ్రాసముకై పరిశోధనమ్మునన్
   జంటను జూచి ముచ్చటగ జర్రున జేరెను తిండిపందయే
   తుంటరి పిండివంటలను తోయము భిన్నము పాయసాన్నమౌ
   *వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్*

   తొలగించండి
 7. ఇంటిది చేనుగోయ జన యెచ్చుగ చేయికి
  గాయమాయె తా
  వంటను జేయ లేదనియు వారము
  నుండియు నాదుమిత్రుడున్
  బంటికి యిష్టమైనటుల పాజము వండియు
  తెచ్చుచుండెడిన్
  వంటయె లేనియింట తిని బంధువు త్రేన్చెను
  పొట్టనిండగన్

  రిప్లయితొలగించండి
 8. ఆ.వె.
  ఇట్టి పదము లేవి ("లేదు" "కావంట" "లే
  వంట") లేని యింట బంధువు దినె
  నిట్టి యతిధి సేవ నీశుండు మెచ్చును
  భాగ్యములను పెంచు బాగు గాను

  "లేవు", "కావు" వంటి పదములు లేని ఇంట అతిథి భోజనము చేసెను.

  రిప్లయితొలగించండి
 9. తంటవడక నేటి తరుణి తీరున కబు
  రంపి తిండి తెచ్చి రయము నిచ్చు
  వాని చేతఁ బొంది వడ్డింౘ బోనము
  వంట లేని యింట బంధువు దినె

  చివుకుల అచ్యుత దేవరాయలు

  రిప్లయితొలగించండి
 10. ఒంటరివాడు భోజనము హోటలు నుండియె వచ్చు నింటికిన్
  వంటను చేయు పద్ధతి రవంతయు నేర్వని కారణంబునన్,
  తింటకు నొక్కరోజు నరుదెంచెను బంధుఁడు గీముకున్ భళా
  వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్

  రిప్లయితొలగించండి
 11. ఆటవెలది
  గంజి నీరు తాగి కడుపు నింపుకొనెడి
  బీద కాపురమది, పిలుపు లేక
  వచ్చెచుట్ట మొకడు భక్ష్యాలు మరి పిండి
  వంట లేని యింట బంధువు దినె.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు

  రిప్లయితొలగించండి
 12. ఆ.వె:పేద యింటి వారు బియ్యమే కొన లేక
  బాధపడగ చేరె బంధు వచట
  పొమ్మనంగ లేని పొలతి నర్మపు తిట్లు
  వంట లేని యింట బంధువు తినె
  (బంధువులు పొమ్మని అనలేని ఆ స్త్రీ సూటీ పోటీ తిట్లు తిట్టుకొంటోంది.బంధువు ఆ తిట్లు తిన్నాడు.)

  రిప్లయితొలగించండి
 13. వంట రాని జంట పడును కష్టములెన్నొ
  చేరె బంధు గణము వారి యింట
  చేయు నంట వంట స్విగ్గీ జొమాటోలు
  వంట లేని యింట బంధువు దినె

  రిప్లయితొలగించండి
 14. వచ్చి నట్టి వాఁడు బంధు వనుచు నెంచి
  యున్న నింక లేకయున్న నొసఁగఁ
  గంటగింపకుండఁ గాంచి వడ్డించిన
  వంట లేని యింట బంధువు దినె

  పంటయు నింట నుంటయు స భద్రము గల్గు నకంటకమ్ముగా
  వెంటఁ జరింప నింటిది నివేశము సేరి తలంచి యట్టులం
  గొంటయె కాని భక్ష్యములు గూర్మి సెలంగఁగ నే దినమ్మునన్
  వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను బొట్ట నిండఁగన్

  రిప్లయితొలగించండి
 15. వంట శాల నుండి పలురకములు రాగ
  వంట లేని యింట బంధువు దినె
  వంటఁజేయు వారు పల్చన గుట,కార
  ణమున కేటరింగు లుమొదలాయె

  రిప్లయితొలగించండి
 16. ఉ:"వంటల నెట్లు చేసినను బంధువు మెచ్చితి నంచు దెల్పడే
  యింటిన నున్న వంట తన కిష్టము కాదొకొ" యంచు దల్చి తా
  మింటిన వంట మాని ధర హెచ్చగు హోటలు తిండి పెట్టగా
  వంటయె లేని యింట దిని బంధువు త్రేంచెను పొట్ట నిండగన్

  రిప్లయితొలగించండి
 17. ఖర్చుబెట్టివంటకాలను దెప్పించి
  కార్యమన్నదొకటి ఘనముగాను
  చేసిచూపెనొకడు వాసిగయింటిలో
  వంటలేనియింట బందువుదినె

  రిప్లయితొలగించండి
 18. ఒంటిగాడువంట నొనరించ నేర్వడు
  పూటకూళ్ళఁదినుచు ప్రొద్దుఁబుచ్చు
  చుట్టమొకఁడు వాని చూచిపోవఁగ వచ్చె
  వంట లేని యింట బంధువు దినె

  రిప్లయితొలగించండి
 19. కంటి జబ్బుచేత గష్టపడు వనితను
  బంధువొకడు వచ్చె బలకరించ
  బయటనుండి తెచ్చి వడ్డించె నన్నము
  వంటలేని యింట బంధువుదినె

  రిప్లయితొలగించండి
 20. వంటలు లేకపోయినను వండిన చక్కని భోజ్య వస్తువుల్
  వంటల వాడు తెచ్చుటన పంక్తిని కూర్చుని దృప్తిఁగల్గనౌ
  వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్
  బంటునుబిల్చి చెప్పితిని బండిని దెచ్చియు దింపుమాతనిన్

  రిప్లయితొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  పుట్టినింటి కేగె పోట్లాడి తన భార్య
  అప్పు డేగుదెంచ నతిథి యొకరు
  హోటలందు తెచ్చె నాటి సాపాటును
  వంట లేని యింట బంధువు దినె.

  రిప్లయితొలగించండి