31-1-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."కామమును గోపమే కదా కామ్యము లిడు"(లేదా...)"కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా"(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో శ్రవణ్ కుమార్ గారి సమస్య)
ఐహిక సుఖలాలసములే యవని యందునరుని పతనమునకు కారణమ్ము లవియెకామమును గోపమే కదా, కామ్యము లిడుపూర్ణకాముని ధ్యానమే ముదముగాను.స్యూమమ్మున్ విడి మోక్షమార్గమునికన్ శోధించు యత్నంబులో రాముండొక్కడె దిక్కటంచు జపమున్ రాతమ్మునే జేయు సత్కామార్థిన్ దరి జేరబోవికను సత్యాణ్వేషికిన్ దూరమౌ కామక్రోధములే కదా ! నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా.
మనుజ పతనమునకు మూల మనుచు నంద్రుకామమును కోపమే కదా : :కామ్యము లిడుసత్ప్రవర్తన సుగుణా లు సత్య ధర్మములను పాటించి మెలగెడు పురుష తతికి
మనిషి పతనమునకు ముఖ్యమైన దేది?కామమును కోపమే కదా, కామ్యములిడుదప్పకుండ శ్రీనాధుడు దనదు సేవశ్రద్ధతో జేయు వారకి సమ్ముదమున
పూరుషుడు విఫలతనొంద మూల మౌనుకామమును గోపమే కదా ! కామ్యము లిడుశాంతమువహించి తగిన యోచనను జేసికార్యము సలుపు టందున కాంక్ష జూప
డా బల్లూరి ఉమాదేవిహాని గూర్చును మనలోన నణగి యున్న కామమును కోపమే కదా; కామ్యములిడు నెల్లవేళల యందును నీశ్వరుండుభక్తితోడ నారాధింపవడిగతాను
ఆమూలాగ్రము చేటుదెచ్చు పనులే ఐశ్వర్య మందించినన్కామక్రోధములే కదా మనుజులన్ కష్ఠాల పాల్జేయుగానీమంబుల్నడరింప తప్పదుసదా నిక్కంబు స్వాధీనమౌకామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
శ్రీమాతా!శుభదాయినీ!జయసుధా!శ్రీకాళి హేమాంబ!నీనామంబుల్బఠియించుచున్జెలగిబ్రాణంబు ల్విలీనంబునన్క్షేమంబందుచుఁగాములై నిలచి వీక్షింపంగ వేసారెడిన్కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చు సదాకొరుప్రోలు రాధాకృష్ణరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామక్రోధమదమ్ము మచ్చరములాకాంక్షల్ ప్రలోభంబులేస్యూమమ్మున్ హరియించు శత్రువులునై శోకార్ణవం బందునందేమాత్రంబును జాలిచూపకనినున్ దెర్లించు, వర్జింపనీకామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
అడుగ కున్న నీ వెన్నండు నమ్మ యైనఁ బెట్ట నేర్చునె యన్నము కట్ట నీకు మెత్తగా నున్న నెల్లరు మొత్తు వార కామమును గోపమే కదా కామ్యము లిడుఏమైనన్ మఱి యేది కల్గినను మీ కెన్నండు డెందమ్ములం దేమీ యిట్టుల నయ్యె నంచు వగ పింతింతేని రాకున్నచో మీ మీ కోర్కెలు దమ్మ మందుఁ దనరన్ మీ కిన్క లట్లుండఁగాఁ గామక్రోధములే కదా నరులకున్ గామ్యంబు లిచ్చున్ సదా
తేటగీతివైర భక్తితో వైకుంఠ పతిని జేరజన్మమెత్తిన వారన జయ విజయులుక్రూరకర్మల నొనరించు కుటిలబుద్ధిఁకామమును గోపమే కదా కామ్యము లిడుశార్దూలవిక్రీడితముశ్రీమన్మంగళ దివ్యమూర్తి హరినే సేవింప రా మౌనులున్నీమంబెంచిన ద్వారపాలకులటన్ నిల్పంగ శాపింపగన్ప్రాముఖ్యమ్మన తన్ను జేర వడిగన్ వైరంపు జన్మంబిడన్కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
కామమును జయించినవాడె కలియుగమునధీయుతుండనఁ బరగును ధిషణఁ జూపియున్నతాశయములతోడ నుజ్జగించు"కామమును గోపమే కదా కామ్యము లిడు"
మరొక పూరణ నేమమునుమరచుచు నవినీతి పనుల. నాచరించెడివారల నణచివేయు కామమును కోపమే కద;కామ్యములిడు. వాడు శ్రీహరియొక్కడేవసుధయందు
పిన్నక నాగేశ్వరరావు.వ్యక్తి నాశమునకు హేతువగు గుణములుకామమును గోపమే కదా; కామ్యము లిడుప్రతి దినంబు నీశ్వరుని సద్భక్తి తోడధ్యానమున్ జేసి కొలువ ముదమ్ముగాను.
రిప్లయితొలగించండిఐహిక సుఖలాలసములే యవని యందు
నరుని పతనమునకు కారణమ్ము లవియె
కామమును గోపమే కదా, కామ్యము లిడు
పూర్ణకాముని ధ్యానమే ముదముగాను.
స్యూమమ్మున్ విడి మోక్షమార్గమునికన్ శోధించు యత్నంబులో
రాముండొక్కడె దిక్కటంచు జపమున్ రాతమ్మునే జేయు స
త్కామార్థిన్ దరి జేరబోవికను సత్యాణ్వేషికిన్ దూరమౌ
కామక్రోధములే కదా ! నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా.
మనుజ పతనమునకు మూల మనుచు నంద్రు
రిప్లయితొలగించండికామమును కోపమే కదా : :కామ్యము లిడు
సత్ప్రవర్తన సుగుణా లు సత్య ధర్మ
ములను పాటించి మెలగెడు పురుష తతికి
మనిషి పతనమునకు ముఖ్యమైన దేది?
రిప్లయితొలగించండికామమును కోపమే కదా, కామ్యములిడు
దప్పకుండ శ్రీనాధుడు దనదు సేవ
శ్రద్ధతో జేయు వారకి సమ్ముదమున
పూరుషుడు విఫలతనొంద మూల మౌను
రిప్లయితొలగించండికామమును గోపమే కదా ! కామ్యము లిడు
శాంతమువహించి తగిన యోచనను జేసి
కార్యము సలుపు టందున కాంక్ష జూప
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిహాని గూర్చును మనలోన నణగి యున్న
కామమును కోపమే కదా; కామ్యములిడు
నెల్లవేళల యందును నీశ్వరుండు
భక్తితోడ నారాధింపవడిగతాను
ఆమూలాగ్రము చేటుదెచ్చు పనులే ఐశ్వర్య మందించినన్
రిప్లయితొలగించండికామక్రోధములే కదా మనుజులన్ కష్ఠాల పాల్జేయుగా
నీమంబుల్నడరింప తప్పదుసదా నిక్కంబు స్వాధీనమౌ
కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
శ్రీమాతా!శుభదాయినీ!జయసుధా!శ్రీకాళి హేమాంబ!నీ
రిప్లయితొలగించండినామంబుల్బఠియించుచున్జెలగిబ్రాణంబు ల్విలీనంబునన్
క్షేమంబందుచుఁగాములై నిలచి వీక్షింపంగ వేసారెడిన్
కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చు సదా
కొరుప్రోలు రాధాకృష్ణరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామక్రోధమదమ్ము మచ్చరములాకాంక్షల్ ప్రలోభంబులే
రిప్లయితొలగించండిస్యూమమ్మున్ హరియించు శత్రువులునై శోకార్ణవం బందునం
దేమాత్రంబును జాలిచూపకనినున్ దెర్లించు, వర్జింపనీ
కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
అడుగ కున్న నీ వెన్నండు నమ్మ యైనఁ
రిప్లయితొలగించండిబెట్ట నేర్చునె యన్నము కట్ట నీకు
మెత్తగా నున్న నెల్లరు మొత్తు వార
కామమును గోపమే కదా కామ్యము లిడు
ఏమైనన్ మఱి యేది కల్గినను మీ కెన్నండు డెందమ్ములం
దేమీ యిట్టుల నయ్యె నంచు వగ పింతింతేని రాకున్నచో
మీ మీ కోర్కెలు దమ్మ మందుఁ దనరన్ మీ కిన్క లట్లుండఁగాఁ
గామక్రోధములే కదా నరులకున్ గామ్యంబు లిచ్చున్ సదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండివైర భక్తితో వైకుంఠ పతిని జేర
జన్మమెత్తిన వారన జయ విజయులు
క్రూరకర్మల నొనరించు కుటిలబుద్ధిఁ
కామమును గోపమే కదా కామ్యము లిడు
శార్దూలవిక్రీడితము
శ్రీమన్మంగళ దివ్యమూర్తి హరినే సేవింప రా మౌనులున్
నీమంబెంచిన ద్వారపాలకులటన్ నిల్పంగ శాపింపగన్
ప్రాముఖ్యమ్మన తన్ను జేర వడిగన్ వైరంపు జన్మంబిడన్
కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా
కామమును జయించినవాడె కలియుగమున
తొలగించండిధీయుతుండనఁ బరగును ధిషణఁ జూపి
యున్నతాశయములతోడ నుజ్జగించు
"కామమును గోపమే కదా కామ్యము లిడు"
మరొక పూరణ
రిప్లయితొలగించండినేమమునుమరచుచు నవినీతి పనుల.
నాచరించెడివారల నణచివేయు
కామమును కోపమే కద;కామ్యములిడు.
వాడు శ్రీహరియొక్కడేవసుధయందు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
వ్యక్తి నాశమునకు హేతువగు గుణములు
కామమును గోపమే కదా; కామ్యము లిడు
ప్రతి దినంబు నీశ్వరుని సద్భక్తి తోడ
ధ్యానమున్ జేసి కొలువ ముదమ్ముగాను.