5, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 218 (దున్న హరినిఁ జూచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.

    తనను రక్షించిన హరిని ప్రహ్లాదుడు :

    01)
    ___________________________________________

    పరమ హింస బెట్టి - పాతకములు జేసి
    కడకు మడిసె కనక - కశిపుడంత !
    ఆర్త రక్ష సేయ - నవతరించి , తన , ముం
    దున్న హరిని జూచి - సన్నుతించె !
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి

    మాఘమాసమందు మహిలోన హరిజూడ
    తీర్థ యాత్ర కొరకు తిరుపతేగి
    వేంకటేశురూపు వెలిగిపోతు తనముం
    దున్న హరిని జూచి సన్నుతించె.

    రిప్లయితొలగించండి
  3. 02)
    _________________________________________

    అసురుడు నరకునిని;- అంత మొందింపగా
    సర్వ జగము రక్ష - సేయ గోరి
    చిత్ర రథుడు , సురలు;- శేష శయనము , నం
    దున్న హరిని జూచి - సన్ను తించె !
    __________________________________________

    చిత్ర రథుడు = దేవేంద్రుడు
    __________________________________________

    రిప్లయితొలగించండి
  4. భరతుడు తోగూడి
    అయోద్యాపుర వాసులు
    అనంతమైన ఆనందముతో :

    03)
    _________________________________________

    దుష్ట రావణునిని - దునుమాడి లంకలో
    రాము డంత జేరె - రాచ నగరు !
    మిగుల భక్తి తోడ - మృగరాజ పీఠమం
    దున్న హరిని జూచి సన్నుతించె !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  5. 'కల్ప వృక్ష మితడె, కామ ధేనువు వీడె,
    చింతలన్ని దీర్చు శ్రీశుడితడె'
    అన్నమయ్య యిట్లు ఆశేష తల్పమం-
    దున్న హరినిఁ జూచి సన్నుతించె.

    రిప్లయితొలగించండి
  6. వసంత్ కిశోర్ గారూ,
    మీ పూరణల పరంపరలో ఇప్పటికి చేరిన మూడింటిని చూసాను. అన్నీ బాగున్నాయి.
    మొదటిది అత్యుత్తమంగా ఉంది.
    రెండవ పూరణ మొదటి పాదంలో "నరకునిని" అనకుండా "అసురుఁ డైన నరకు నంతమొందిపఁగా" అంటే బాగుంటుంది కదా.
    అలాగే మూడవ పూరణలో "దుష్ట రావణాఖ్యు" అంటే బాగుంటుందని నా సలహా!

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది.
    "తిరుపతేగి" అనక "తిరుపతిఁ జని" అనీ, "వెలిగిపోతు" అనక "వెలిగిపోగ", "వెలుగుచుండ" అనీ ఉంటే బాగుంటుంది.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. సురలు ,నసురులు :
    04)
    ______________________________________

    పాము ,తాడు జేసి - పర్వ తమును జుట్టి
    క్షీర సాగ రమును, - జిలుకు వేళ
    మంధరమును దేల్చ - మాషాదముగను , క్రిం
    దున్న హరిని జూచి సన్నుతించె !
    ______________________________________

    మాషాదము = తాబేలు
    _______________________________________

    రిప్లయితొలగించండి
  9. వసంత్ కిశోర్ గారి మొదటి పూరణ స్ఫూర్తితో నా పూరణ ....

    ఇందు గలఁడు దేవుఁ డందు లేఁడనక నెం
    దెందు వెదకి చూడ నందె గలఁడ
    టంచు నమ్మి భక్తుఁ డణువాది విశ్వమం
    దున్న హరినిఁ జూచి సన్నుతించె.

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీ మెరుగులతో
    నా పూరణలు
    మెరుగై
    మురిపెముగ నున్నవి.

    రిప్లయితొలగించండి
  11. వసంత్ కిశోర్ గారూ,
    మీ నాల్గవ పూరణ అద్భుతంగా ఉంది. ఈ మద్య వీరతాళ్ళు రావడం లేదన్నారు కదా! మొదటి పూరణ కొకటి, నాల్గవ పూరణకు రెండు, వెరసి మూడు వీరతాళ్ళు మీకు.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి

    కావుమనుచు నాడు గజరాజు వేడగా
    పరుగు పరుగునొచ్చి ప్రాణములను
    రక్షజేసి శ్రీతొ రమ్యముగ తనముం
    దున్న హరిని జూచి సన్నుతించె.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా !
    కడుంగడు ధన్యవాదములు!
    మీ పూరణ పోతన్న గారిని
    దలపించు చున్నది.

    అణువాది యనిన నేమో
    అర్థము గాకున్నది
    మన్నించి వివరించుడు

    రిప్లయితొలగించండి
  14. శంకరయ్య గారూ ధన్యవాదములు. అణువుమొదలు విశ్వమంతా హరిని జూచిన మీపూరణ చాలాబాగుంది.వసంతకిశోర్ గారు ఆటవెలదులతో ఆడుకుంటున్నారు.విస్సన్న గారి పూరణ బాగుంది. అందరికీ అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా !
    అద్భుతం !
    శాస్త్రి గారి వివరణతో
    అర్థమైనది
    అణువాది అంటే
    అణువు ఆదిగా గల విశ్వమని !

    రిప్లయితొలగించండి
  16. శాస్త్రి గారికి ధన్యవాదములు !
    ____________________________________

    మా అమ్మాయి
    శాంతి సూచన యిది :
    "గడ్డి తినే వాళ్ళను
    దున్న మెచ్చు కొన్నట్లు
    వ్రాయమని "
    _____________________________________

    పూర్వము లాలూ ప్రసాదు యాదవ్
    అని ఒక ప్రముఖు డుండే వాడు .
    పశువులు తినే గడ్డిని తానే మేసి
    200 కోట్లకు పైగా కుంభకోణం
    నెఱపిన ఘన చరిత్ర గలిగిన వాడు.

    అతనిని గాంచిన దున్న పోతు :

    05)
    _______________________________________

    గడ్డి మేయు టందు - గెడ్డము నెరిసిన
    యముడు గాన ఎల్ పి - యాదవు గని
    మిన్నె హద్దు , నీకు - నన్నె , మించితి వని
    దున్న హరిని జూచి - సన్నుతించె !
    _______________________________________

    హరి = శ్రీ కృష్ణుడు = యాదవ ప్రముఖుడు

    యాదవ ప్రముఖుడు = లాలూ ప్రసాదు యాదవ్
    _______________________________________

    రిప్లయితొలగించండి
  17. దున్న ఒకటి వచ్చి తిన్నదనుచు గడ్డి
    పార్కుగార్డు వచ్చి బాదుచుండ
    పద్యకవిత నాపి వచ్చి కాపాడగ
    దున్న 'హరి'ని జూచి సన్నుతించె!

    రిప్లయితొలగించండి
  18. భస్మాసురుని బారి నుండి
    గాపాడిన హరిని గాంచి హరుడు :

    06)
    ______________________________________

    తనదు వరమె తనకు - తాపమై ,తనరార
    హరియె తనను గాచ; - నసురు జంపి !
    ముదము నొంది , జగము - మోహించు రూపునం
    దున్న హరిని జూచి - సన్నుతించె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  19. 07)
    ________________________________________

    మిన్ను మీద పడును ! - మేదిని భస్మమౌ !
    దున్న హరిని జూచి - సన్నుతించె !
    మనిషి మహిషి యౌను ! - మహిషే మనిషౌను !
    నన్న విన్న జనులు - నమ్మ గలరె ?
    ________________________________________

    రిప్లయితొలగించండి
  20. 08)
    ________________________________________

    ధాత కైన , వాని - తాత కైనను గాని
    ప్రాణములను దీసి - పాశ ముక్తి !
    కర్మ దీరి నంత - కలిగింతు వీవని
    దున్న హరిని జూచి - సన్నుతించె !
    ________________________________________

    హరి = యముడు
    ________________________________________

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి విషయంతో పూరించారు. అభినందనలు.
    "పరుగున + వచ్చి" పరుగునొచ్చి అనడం సరి కాదు. "పరుగు తీసి వచ్చి" లేదా "పరుగుతోడ వచ్చి" అనండి. "శ్రీతొ" అనడమూ సరికాదు. "రక్ష సేయ శ్రీవిరాజితుం డగుచు ముం" అంటే ఎలా ఉంటుంది?

    వసంత్ కిశోర్ గారూ,
    మీ "లేటెస్ట్" నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    5వ పూరణలో చమత్కారం అలరించింది. "గడ్డము" అంటే సరిపోతుండగా "గెడ్డము" అన్నా రెందుకు?
    6వ పూరణలో జగన్మోహినీ రూపమందున్న హరి అనడం బాగుంది.
    ప్రశ్నార్థకంగా 7వ పూరణ బాగుంది. మూడవ పాదంలో "మనిషి + ఔను" అన్నచో సంధి లేదు. "మహిషి మనుజుఁ డౌను" అంటే సరి.
    8వ పూరణలో హరి శబ్దానికి యముడనే అర్థాన్నిచ్చిన విధం బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. హరి గారూ,
    మీ పేరునే సమస్యాపూరణకు వాడుకున్నారు. బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ, శాస్త్రి గారూ,
    నా పూరణలో "అణువాది" కాకుండా "అణ్వాది" అని ఉండాలి.

    రిప్లయితొలగించండి
  23. చేరి మృగములన్ని సింహమును నిలిపె
    వనికి రాజుగ, మరి వాని మంత్రి
    దున్న పోతు, ముదము మిన్నంటగ సభలో
    దున్న హరినిఁ జూచి సన్నుతించె.

    హరి = సింహము

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా !
    మీ మెరుగులకు
    నా కైమోడ్పులు !

    రిప్లయితొలగించండి
  25. ఈ సారి ప్రతి పూరణమూ కమనీయ కవితా తోరణమై భాసిల్లుచున్నది . మిస్సన్న గారి పద్యపు నడక రమణీయం. శాస్త్రి గారి,హరి గారి , సత్యనారాయణ గార్ల పూరణలు మురిపముగా కనిపిస్తున్నాయి . ఇక వసంత కిషోర్ గారి విజృంభణం గురించి చెప్పేదేముంది? శంకరయ్య గారి పూరణం రసభరితం . ఇందరిన్ని విధాలుగా ' దున్నేసిన ' తరువాత చివరికి మాకేం మిగులుతుందీ???

    హాలికుండతండు , హరిని బూజించును
    తొట్టదొలుత కార్యమెట్టిదయిన!
    తొలకరి గమనించి, పొలము చదును జేసి
    దున్న , హరిని జూచి సన్నుతించె !!!

    రిప్లయితొలగించండి
  26. శంకరయ్య గారికి ధన్యవాదాలు.
    దున్నను రక్షించిన హరి గారికి,
    మంత్రి పదవినిచ్చిన సత్యనారయణగారికి అభినందనలు.
    ఎనిమిది ఆటవెలదులందించిన కిశొర్ గారికి మరియొకసారి అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి
  27. విష్న్ణునందన్ గారూ
    అందరు దున్నేసినా మీరు పండించారుగా.అందుకోండి అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణు నందన్ గారూ,
    మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. గురువు గారి పూరణ వారి గురుత్వానికి తగ్గట్లుగా ఉంది.
    వసంత కిషోర్ గారి అన్ని పూరణలూ ఒకదాన్ని మించి ఒకటి అలరారుతున్నాయి.
    విష్ణు నందను గారూ ధన్యవాదాలు. మీ పూరణ మిగిలిన వాటికి విభిన్నంగా ఉండి రమణీయంగా ఆకట్టుకొంటూంది.
    మిగిలిన మిత్రులందరి పూరణలూ యెంతో మనోహరంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  30. మకరి తోడ బోరు మాతంగమును గాచి
    భక్త జనుల కెల్ల ముక్తి నొసగి
    శిరము వంచి మ్రొక్కి శేష తల్పమునం
    దున్న హరిని జూచి సన్ను తించె

    రిప్లయితొలగించండి
  31. యముని దున్న - ఉచ్ఛైశ్రవాన్ని గూర్చి

    కాలుని రథమేను గాఁక యా తురగము
    పాల కడలి నుండి వచ్చెఁ గనుక
    గొప్పదేను సుమ్మి నప్పటముగ యని
    దున్న హరినిఁ జూచి సన్నుతించె.

    (హరి = గుర్రము)

    రిప్లయితొలగించండి
  32. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. గురువు గారి పూరణ బ్రహ్మాండము.
    కిశోర్ జీ లాలూవేనా ? నాయకు లందఱూ అలాగే ఉన్నారు కదా !

    త్వక్కు దట్ట మయ్యె దనకు హద్దులు లేమి
    దేశ నాయ కుండు లేశ మైన
    సిగ్గు లేక మసల పగ్గమ్ము విడివడి
    దున్న హరినిఁ జూచి సన్నుతించె.

    త్వక్కు = చర్మము

    రిప్లయితొలగించండి
  33. విష్ణు నందన్ గారు దున్నిన విధము
    ప్రత్యేకతను సంతరించుకొంది.

    మిత్రులందరిపూరణలూ
    మనోహరముగానున్నవి.

    మూర్తి గారూ !
    సమస్యలో హరి ఉండడం వలన
    దాన్ని లాలూకే అన్వయించడం జరిగింది.

    కాని పగ్గాలు తెంచుకొని
    సిగ్గూ లజ్జా విడిచిన
    వాళ్ళందరూ
    తోలు మందం గాళ్ళే నని
    మీరు చక్కగా నిరూపించి
    సమస్యా పూరణలో
    మీకు హద్దులు లేవని చాటు కున్న
    విధం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  34. ఈ రోజు గురువు గారి దగ్గర
    3 వీర తాళ్ళు సంపాదించాను.

    జిగురు సత్యనారాయణ గారూ !

    మీకు 15-01-2011 న ఇవ్వ వలసిన దొకటీ
    మరల 17-01-2011 న ఇవ్వవలసినవి రెండూ
    వెఱసి 3 వీరతాళ్ళూ చెల్లు !

    రిప్లయితొలగించండి
  35. రాజేశ్వరి నేదునూరి గారూ,
    బాగుంది పూరణ. అభినందనలు.
    "శేషతల్పమ్మునం" అంటే గణదోషం తొలగిపోతుంది.

    రవి గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. వసంత్ కిషోర్ గారు,
    నేను వ్రాసిన ఒకటి అర పూరణలకు మీరు వీరతాళ్లు ఇస్తే, మీ పద్యేక్షు రస ప్రవాహానికి మేమేమి యివ్వగలము.

    రిప్లయితొలగించండి