10, ఫిబ్రవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 222 (రంగవల్లి యుద్ధ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

42 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.
    01)
    ______________________________________

    రమ్యముగ జరుగును - రమణుల మధ్యను
    కనుమ పండుగ యన - కనుల విందు
    రంగు రంగుల , పలు - రంగవల్లుల పోటి !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    ______________________________________

    రంగ వల్లి , తీర్చి - రమణు లందరు గూడి
    ముసి ముసిగ నగుచును - ముచ్చటాడు
    వేళ; పాడు జేయ - పిల్ల లంతా వచ్చి !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  3. 03)
    _______________________________________

    ముగ్గు పోటి యందు - ముఖ్య కానుక నొందె
    చిన్న కోడ లైన - చేడి యొకతె !
    పెద్ద కోడ లంత - పెనుదుమారము లేప
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  4. మింగ మెతుకు లేక మీసాల సంపెంగ
    నూనె కొఱకు మగడు నోటు నడుగ
    భంగ పడదె భార్య భర్తకు భయమేల
    రంగవల్లి యుధ్ధరంగ మయ్యె

    రిప్లయితొలగించండి
  5. వంగరాజ్య మందు దొంగ లందఱు గూడి
    బంగరమ్ము వెండి పంచుకొనగ
    రాత్రి ముగియ కుండ రంజిల్లెనే పోరు
    రంగవల్లి యుధ్ధరంగ మయ్యె

    రిప్లయితొలగించండి
  6. 04)
    _____________________________________

    సుంత సిగ్గు లేని - సోమరు లందరు
    ముచ్చ టైన రంగు - ముగ్గు మీద
    కోడి పందె ములకు - కూడిన; నచ్చట
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి

    'రంగ ' డడిగె వంద రమ్మును త్రాగంగ
    ఒల్ల ననియె భార్య 'వల్లి ' యపుడు
    ఊరి వారి నడుమ పూరి గుడిసె ముందు
    రంగ,వల్లి, యుద్ధ రంగ మయ్యె.

    రిప్లయితొలగించండి
  8. 05)
    ______________________________________

    చిత్ర , చిత్ర గతుల - చేడియ లందరు
    ముచ్చట నొక , పెద్ద - ముగ్గు; తీర్చ
    చిన్న పిల్ల లంత - చెడుగుడు నాడిరి !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  9. సంకురాత్రి నాడు సందడి చేయుచు
    రథము ముగ్గులల్లి రమణులంత
    చుట్టు సైనికులను జట్టుగా వేయగా
    రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

    రిప్లయితొలగించండి
  10. 06)
    _______________________________________

    ముగ్గు పెట్టు కొఱకు - ముగ్గు లేనందున
    మగని తెమ్మ నడిగె - మగువ యొకతి !
    తాగు బోతు మగడు - తన్నెను భార్యను !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  11. పబ్బమునకుఁ గేళి గొబ్బెమ్మలనుఁ బెట్టి
    తెలుఁగు కన్నెపడుచులు లలితముగ
    నాడ రామరావణానీకమునుఁ బాడ
    రంగవల్లి యుద్ధరంగమయ్యె

    రిప్లయితొలగించండి
  12. 07)
    _________________________________________

    ముద్ద బంతి వంటి - ముగ్ధ లందరు జేరి
    ముచ్చ టైన మంచి - ముగ్గు దీర్చ !
    నీళ్ళ టేంకు వచ్చి - నిల్చెను నచ్చోట
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  13. కిశొర్ జీ మీ పద్యాలు మధురంగా ఉన్నాయి. స్రవంతి అలా సాగుతొందని తెలుసు.పండుగ మళ్ళీ గుర్తు చేస్తున్నారు

    రిప్లయితొలగించండి
  14. 08)
    _________________________________________

    "చంద్ర ముఖి " యనబడు - చక్కని చిత్రమున్
    రజని జంపె; ప్రియుని - రమణి తోడ !
    రక్త సిక్త మయ్యె - రంగ మండప మంత !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  15. హనుమఛ్ఛాస్త్రి గారూ ,హరి గారూ బాగున్నయి మీ పూరణలు. రాఘవ గారూ చాలా బాగుంది. మీ పేరు చూడగానే సంస్కృత సమాసాలు ఉంటయేమో నని చూసా. మంచి తెలుగు నుడికారము వాడారు.

    రిప్లయితొలగించండి
  16. 09)
    _________________________________________

    "ముగ్గు "మారు పేరు - ముద్దుగ బలుకుడు !
    శత్రు సైన్య మెచట - సమర మాడు ?
    "అగుట "యన్న నేమి - యర్థము జెప్పుడు !
    రంగవల్లి యుద్ధ - రంగ మయ్యె !
    ________________________________________

    (రంగవల్లి-యుద్ధరంగము-అయ్యె)
    ________________________________________

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి

    అతివలంత గూడి ఆవూరి కూడలి
    మ్రుగ్గు లేసి తాము మురియుచుండ,
    తంద నాలు ఆడ త్రాగుబోతులు వచ్చి
    రంగవల్లి యుద్ధ రంగమయ్యె.

    రిప్లయితొలగించండి
  18. అందరి పూరణలూ
    అలరించు చున్నవి.
    మూర్తి గారూ !
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  19. వసంత్ కిశోర్ గారూ,
    ఇప్పటికి మీ నవరత్నాలు అందాయి. దేనికదే మనోహరంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో "అంతా" అని వ్యావహారిక పదాన్ని వాడారు. "పిల్లాలు చేరగా" అంటే ఎలా ఉంటుంది?
    ఆరవ పూరణలో "తెమ్మని + అడిగె" అన్నప్పుడు సంధి రాదు. "మగని తెమ్మటంచు మగువ కోరె" అంటే బాగుంటుందని నా సలహా.
    ఏడవ పూరణలో ముద్దబంతి ఏకవచనం కాగా, ముగ్ధలు బగువచనం అవుతున్నది. "ముద్దబంతుల వలె ముగ్ధ లందరు" అందామా? "నిల్చెను నచ్చోట" అనేది "నిల్చిన నచ్చోట" అంటే బాగుంటుంది.
    ఇక మీ తొమ్మిదవ పూరణ "సూపర్"!

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    కవి మిత్రుల పూరణలను సహృదయంతో ప్రశంసించినందుకు ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రంగడు, వల్లి దంపతుల ఊహ అద్భుతంగా ఉంది. రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.

    హరి గారూ,
    రథం ముగ్గు చుట్టు సైనికులా? మంచి పూరణ. అభినందనలు.

    రాఘవ గారూ,
    అద్భుతం. రంగవల్లి చుట్టు రమణులు చేరి రామరావణయుద్ధకథాగానం చేయడం ఉదాత్తమైన కల్పన. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా !
    మీ సవరణలకు
    సలహాలకు
    కడుంగడు
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. నరసిం హ మూర్తి గారికి,శంకరయ్య గారికి ధన్యవాదములు.రంగవల్లుల మీద తన (పద్య)పాదములతో నవ విధములుగా దాడి చేసిన వసంత కిశోర్ గారికి అబినందనలు.నవ నవ విధములు దశ దిశగా పయనించాలని కోరుచున్నాను.రాఘవ గారి,హరి గారి పూరణలు బాగున్నవి.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మంత్రగాడు యొకడు మంచి మ్రుగ్గులు వేసి
    దయ్యము నట జేర తాను బిలిచె
    భూత మాంత్రి కునకు భూతమ్మునకుగూడ
    రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందరి పూరణలు అద్భుతంగా అలరారుతున్నాయి.

    శకట గమన రుచులు, శస్త్రాస్త్ర ఘాతముల్,
    చిందు ఘర్మ రుధిర బిందు చయము
    రాలి మెరయు భూషణాలు యోధున కది
    రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

    రిప్లయితొలగించండి
  25. శాస్త్రిగారూ ! సూపర్
    మీ పూరణ ! మీ భూతం చాలా
    భీకరముగా నున్నది !

    మిస్సన్న మహాశయా !
    అద్భుతం ! మహాద్భుతం !
    యుద్ధరంగానే రంగవల్లి జేసిన
    మీ ప్రతిభకు జొహార్లు !

    మేం ఎన్ని సార్లు దొర్లినా
    ఆ ముగ్గులోనే దొర్లుతున్నాం !

    ఎన్ని పద్యాలు వ్రాస్తే ఏం ప్రయోజనం ?
    వేమన్న గారు ఎప్పుడో చెప్పారు !
    " మంచి నీలమొక్కటి చాలు -తళుకు బెళుకు రాలు తట్టెడేల?"యని
    మీకు రెండు వీరతాళ్ళు!
    (ప్రస్తుతం లేవు; వచ్చాక ఇస్తాను)

    రిప్లయితొలగించండి
  26. "ముగ్గు తొక్కినావు సిగ్గులేదేమిటే?"
    "జూచినాము లేమ్మ చుప్పనాతి!"
    అంగనలిరువురును యఱచి కొట్టుకొనఁగ
    రంగవల్లి యుద్ధరంగమయ్యె.

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ బ్రహ్మాండము. రవి జీ అదిరింది పూరణ.

    రిప్లయితొలగించండి
  28. ముగ్గులోకి దింపి మురిపాలు కురిపించి
    మగని గెలవజూచె మగువ నేడు
    ఆలు మగల వలపుటాటలన్ గమనింప
    "రంగవల్లి" యుద్ధరంగ మయ్యె

    రిప్లయితొలగించండి
  29. వసంత కిషోర్ గారూ మీ వ్యాఖ్య చూసి నవ్వాపుకోలేక పోతున్నాము మాఇంట్లో. హాయిగా నవ్వించారు. మీరు ముగ్గులో దొర్లడమేమిటి?
    మీ పూరణలు చాల సహజంగా అందంగా ఉన్నాయి. అయినా
    గురువుగారి మెప్పును పొందాలి కదా.
    మా మిత్రులందరం కలసి ఓ పని చేద్దామను కొంటున్నాము.
    " అరువు లేదు. "
    పై బోర్డు పెట్టేద్దామని.
    ధన్యవాదాలు.
    నరసింహమూర్తి గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీపతి గారూ చిలిపి పూరణ! చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ మీ యుద్ధరంగవల్లి అదిరింది.కిశోర్ గారూ ధన్య వాదాలు. నేనడిగిన పదవ పూరణ కోసం ఎదురు చూస్తున్నాను.రవి, శ్రీపతి గార్ల ముగ్గు యుద్ధాలు బాగున్నాయి.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  32. ముగ్గు లెన్నొ తీర్చె ముంగిట మురిపెముగ
    మంచి నీళ్ళ టాంకు మలచి వేసె
    గుండె చెదరి వనిత కన్నీరు రాలగ
    రంగ వల్లి యుద్ధ రంగ మయ్యె !

    రిప్లయితొలగించండి
  33. రవి గారూ !
    అంగనల యుద్ధరంగం ! బావుంది !

    శ్రీపతి గారూ !
    మొగుడూ పెళ్ళాల మధ్య ముగ్గాట !
    మురిపెముగా నున్నది.

    మిస్సన్న మహాశయా ! నిశ్శందేహంగా
    మీపూరణ ఉత్తమోత్తమమై భాసించు చున్నది !
    ముందు బాకీ తీర్చనివ్వండి ! బోర్డు తరువాత పెట్టొచ్చు !
    నేనేమీ బాకీ ఎగ్గొట్టే వాణ్ణి కాను సుమండీ !
    (జిగురు సత్య నారాయణ గారిని అడిగి చూడండి)


    అక్కయ్యా ! బావుంది !

    రిప్లయితొలగించండి
  34. మీ అందరి ఆదరాభి మానములతొ నాకు అక్క గా పెద్ద పీట వేసి నందుకు మీ అందరికి ధన్య వాదములు. నేను చాలా అదృష్ట వంతు రాలిని [ నేను రాసినా రాయ లేక పోయినా ] ఈ జన్మకి ఇంతకంటె అదృష్టం మరేముంది ?

    రిప్లయితొలగించండి
  35. రాజేశ్వరి గారూ యుద్ధరంగంలో కూడా కరుణ రసాన్ని ఒలికించారు. బాగుంది.నీళ్ళ ట్యాంకు వచ్చే తొందరలో హడావిడిలో ముగ్గు(మొదటి పాదం)లో ఒక చుక్క(అక్షరం) యెక్కువైంది.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  36. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ భూతవైద్యుని ఉదంతంతో పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "మంత్రగాడు + ఒకడు" అన్నప్పుడు "యడాగమం" రాదు. "మంత్రగా డొకండు" అంటే సరి.

    రవి గారూ,
    తిట్లతో మొదలైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    సనత్ శ్రీపతి గారూ,
    మిస్సన్న, వసత్ కిశోర్ గారలు చెప్పినట్లు చిలిపి పూరణతో అదరగొట్టారు. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ నీళ్ళటాంకు పూరణ బాగుంది. అభినందనలు.
    తమ్ముళ్ళ ప్రశంసలను, అభిమానాన్ని పొందుతున్నందుకు సంతోషం. బహుశా .. అందరిలో నేనే పెద్ద తమ్ముణ్ణేమో?
    "మురిపాల"ను "ముద్దుగా" మార్చండి. గణదోషం మంచినీళ్ళలో కొట్టుకుపోతుంది.

    రిప్లయితొలగించండి
  37. బ్లాగును ఎప్పటి కప్పుడు వీక్షిస్తూ, వెంటవెంటనే ప్రతిస్పందిస్తూ, గుణదోష విచారణ చేస్తూ, సాటి కవిమిత్రుల పూరణలను ప్రశంసిస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా బ్లాగు అభిమానులందరికీ విజ్ఞప్తి.

    రిప్లయితొలగించండి
  38. శంకరార్యా !
    మిస్సన్న గారి పూరణ పై
    మీ వ్యాఖ్య ???

    రిప్లయితొలగించండి
  39. మిస్సన్న గారూ,
    ఎందుకో గాని మీ పూరణ నా దృష్టికి రాలేదు. వసంత్ కిశోర్ గారూ చెప్పేదాక నేను గమనించలేదు. మన్నించాలి,
    యోధులకు యుద్ధరంగాన్నే రంగవల్లిగా మార్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  40. గురువు గారూ ధన్యవాదాలు.
    వసంత మహోదయా మీక్కూడా గురువుగారికి గుర్తు చేసినందుకు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  41. "అసుర సేనకెదుట నమర సేనయునమ
    రంగ, వల్లి! యుద్ధరంగ మయ్యె,
    తారకాసురవధ తడవయ్యెను చెలియా!"
    అనెను కార్తికేయుడాలితోడ!!

    రిప్లయితొలగించండి