11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 223 (మాఘ మందున స్నానమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.
ఈ సమస్యను పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    ________________________________________

    తల్లి దండ్రి తోడ , వెడలి - తనయు డొకడు !
    స్నాన మాచరింప , మునిగి - సాగరమున !
    దైవ సన్నిధి , కతగాడు - తరలి నాడు !
    మాఘ మందున స్నానమ్ము - మరణ మొసఁగు(గె) !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)

    ________________________________________

    "మాఘ మందున స్నానమ్ము - మరణ మొసఁగు"
    నని , నెవరొ , జెప్ప విని , యా - యర్భకుండు !
    మజ్జన మొనరించుటే , మానె - మాఘ మందు !
    విశ్వ మందున గలరెట్టి - వెఱ్ఱి వాండ్రు !
    _________________________________________

    అర్భకుడు = మూర్ఖుడు
    మజ్జనము = స్నానము
    ________________________________________

    రిప్లయితొలగించండి
  3. 2012 లో జల ప్రళయం అనిగదా పుకార్లు :

    03)
    _________________________________________

    పుడమి యంతయు జలధిని మునిగి పోవు !
    మరల వచ్చును ప్రళయమ్ము - మరుస టేడు !
    మాఘ మందున స్నానమ్ము - మరణ మొసఁగు !
    వెఱ్ఱి మాటలు కావొకొ ? - విఙ్ఞు లార !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  4. 04)

    _________________________________________

    మాఘ మందున , స్నానమ్ము - మరణ మొసఁగు !
    సత్య దూరము ! గావున - సాక వద్దు!
    విబుధ వరులార ! నుపస్పర్శ - విడువ కండి !
    స్నాత్ర మిచ్చును ,నారోగ్య - సంపదెంతొ !
    _________________________________________
    సాకు = పెంచు , పోషించు
    (పుకార్లనుప్రచారం చేయ వలదని)
    ఉపస్పర్శము = స్నాత్రము = స్నానము
    _________________________________________

    రిప్లయితొలగించండి
  5. పుత్రుడున్న యెడల పున్నామ నరకమ్ము
    దాటవచ్చు ననుచు దలపనేల
    బ్రూణ హత్య యనిన బుణ్యమ్మె? విషబీజ
    మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.

    విష బీజం+అఘము = విషబీజమాఘము అని భావించా. తప్పో ఒప్పో తెలీదు

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి.

    బద్ధకానికి మరి భవ బంధములకు
    మాఘమందున స్నానమ్ము మరణ మొసగు
    మాఘ మాసపు పూజల మహిమ వలన
    శ్రీహరి దయను కోరిన సిరులు గలుగు.

    రిప్లయితొలగించండి
  7. పోటీ పడి పూరణలు పంపించి కనువిందు చేస్తున్న వారందరికి అభినందనలు.
    ఎందుకో బ్లాగులేవీ ఒక్కోసారి ఓపెన్ కావటంలేదు.

    రిప్లయితొలగించండి
  8. కిషోర్ మహోదయా మీ మూడవ పూరణ చాలా బాగుంది.
    శ్రీపతి గారూ మీపూరణ చాలా బాగుంది.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ చక్కగా ఉంది.

    మంచి నదిలోన నుదయాన మంచి జేయు
    మాఘ మందున స్నానము; మరణ మిచ్చు
    వ్యాధి బాధలు, లేకున్న వయసు నందు
    మంచి నడవడి జనులకు, నెంచి జూడ.

    రిప్లయితొలగించండి
  9. మంగళ స్నానమై, మాఘ మాసమందు
    తా గృహస్థుగా నవ జీవితమ్ము బడయు
    వరునికిక - బ్రహ్మచర్య జీవనము ముగియు!
    మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు!

    రిప్లయితొలగించండి
  10. మాఘ మందున స్నానమ్ము ,మరణ మొసగు
    పాపములకని ,పలువురు పలుక వినమె?
    గాన ,గంగలో మునుగంగ కదలి రమ్ము!
    స్నాన మొసగును సౌఖ్యమ్ము ,సంతసమ్ము!

    రిప్లయితొలగించండి
  11. వసంత్ కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ వైవిధ్యంగా అలరించాయి.
    మొదటి పూరణ అన్ని విధాలా బాగుంది. కరుణరసాన్ని ఆవిష్కరించింది.
    రెండవ పూరణ హాస్యరసస్ఫోరకంగా ఉంది. కాని రెండవ పాదంలో గణదోషం! "అని నెవరొ" అనడం కుసంధి. "అనుచు నెవరొ" అంటే రెండు దోషాలూ పోతాయి.
    మూడవ పూరణలో విజ్ఞత చూపించారు.
    నాల్గవ పూరణ మంచి బావంతో మెప్పిస్తున్నది. కాని రెండు దోషాలు. "ఉపస్పర్ష" ను మీరు "నలం"గా భావించారు. కాని అది "యలం" అవుతున్నది. అలాగే "సంపద + ఎంతొ"లో సంధి లేదు. ఆ రెండు పాదాలకు నా సవరణ....
    "విబుధులార! యుపస్పర్ష విడువకండి
    స్నాత్రమే యిచ్చు నారోగ్య సంపదలను."

    రిప్లయితొలగించండి
  12. సనత్ శ్రీపతి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    కాని "విషబీజం(ము) + అఘము = విషబీజ మఘము" అవుతుంది. "విషబీజ మాఘము" కాదు. సవరించే ప్రయత్నం చేసాను కాని వీలు కాలేదు.

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    నాకు కూడ మొన్న నెట్‌కేఫ్‌లో జిమెయిల్ ఓపెన్ అయింది కాని నా శంకరాభరణం ఓపెన్ కాలేదు. ఎందుకో?

    మిస్సన్న గారూ,
    పూరణలో మీరు ఆశ్రయించిన విరుపు బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    బ్రహ్మచర్యానికి మరణాన్ని కూర్చిన మీ పూరణ అత్యుత్తమం. ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    పాపములకు మరణ మొసగిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. జావ కారిపోయె జవము జ్వరము వచ్చి,
    జలుబు, మధుమేహమును, దగ్గు, చాతి నొప్పి,
    రక్త పోటు రోగికి నిజ భక్తి మీర
    మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ
    వందనములు.
    అభినందనలు మరియు
    ధన్యవాదములు.

    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    శంకరార్యా !
    మీ సవరణలతో
    నా సమస్యలు
    మంచి సొగసును
    సంతరించు కొన్నవి.
    కడుంగడు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. జిగురు సత్యనారాయణ గారూ,
    మంచి విషయంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    రోగులకు మన పెద్దలు స్నానానికి ప్రత్యామ్నాయాలుగా మంత్రస్నానం, విభుతిస్నానం మొదలైనవి ఏర్పాటు చేసారు. ఈ విషయం తెలియక కొందరు ఆరోగ్యం సహకరించకున్నా ఆచారమని చన్నీటి స్నానం చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంటారు.

    రిప్లయితొలగించండి
  18. వసంత్ కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.
    అన్నట్టు ... మీరు తెలిసి తెలిసి "కిషోర్" అని వ్రాయడం ఏమిటి? అది "కిశోర్" కదా. "నౌన్" కాబట్టి ఎలా వ్రాసినా తప్పులేదంటే సరే :-)

    రిప్లయితొలగించండి
  19. మాఘ మందున భానుడు మకర రాశి
    కాలుడే గద కాలమ్ము గణుతి చేయు
    దాన ధర్మాలు చెయుచు దైవ మనగ
    మాఘ మందున స్నామ్ము మరణ మొసఁగు !

    రిప్లయితొలగించండి
  20. మాఘ మాసము నందుట మంచు గురియు,
    మల్లె మందార,రోజాల వల్లికలకు
    మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు
    నింటి లోనికిఁ గొనిదెమ్మ యిందువదన !

    రిప్లయితొలగించండి
  21. పాలు పొంగింతు రే నెల భానునికిడ?
    వీట నరు లేమి సేతురు నీటియందు?
    జీవులకుఁ గాలుఁ డేమిటి సేయుచుండు?
    మాఘమందున, స్నానంబు, మరణమొసఁగు

    రిప్లయితొలగించండి
  22. పూరణ యెలా చెయ్యాలా అనుకొంటుంటే శీతా కాలలో మాతో సహజీవనము చేసే పూలమొక్కలు ఎదురుగా కనిపించాయి భోజనాల గదిలో.

    రిప్లయితొలగించండి
  23. మిత్రుల పూరణలు అందంగా ఉన్నాయి. రాఘవ గారు ప్రశ్నోత్తర పూరణ బాగుంది.శ్రీ మందా వారు కనిపించలేదే యీ మధ్య అనుకోంటే చక్కని పూరణతో దర్శనము నిచ్చారు. గురువుగారూ, నేను యెప్పుడూ కిశోర్ జీ అనే సంబోధిస్తాను,వసంత గారిని.

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరి నేదునూరి గారూ,
    పద్యం నిర్దోషంగా బాగుంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో "నందిట" అనేది "నందుట" అని టైపాటా?

    రాఘవ గారూ,
    ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు
    మరియు అభినందనలు.

    మిత్రుల పూరణలు
    చిత్ర విచిత్ర పోకడలతో
    ముచ్చట గొలుపు చున్నవి.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా !
    అది ఇంగ్లీషును సరాసరి
    అనువదించుటచే జరిగిన పొరపాటు.
    మీ సూచన మేరకు సవరించితిని.
    మిక్కిలి ధన్య వాదములు.

    మూర్తి గారూ ! మీక్కూడా !

    రిప్లయితొలగించండి