12, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 224 (నను నుతియించెడి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.
ఈ సమస్యను సూచించిన "అజ్ఞాత" గారికి ధన్యవాదాలు.

41 కామెంట్‌లు:

  1. జనులకు తానే దిక్కని
    తను జేసెడి కార్యములను త్యాగమ్మనుచున్
    ఘనముగ మన యిటలీ లల
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

    రిప్లయితొలగించండి
  2. జిగురు సత్యనారాయణ గారూ,
    వారెవ్వా! పొద్దున్నే ఎంత చక్కని పూరణతో పలకరించారండీ. సంతోషం!

    రిప్లయితొలగించండి
  3. ఔనా ! జి.ఎస్.జీ !
    ఇటలీ లలనను నుతించవలెనా ?

    నేనింకా నవనిధు లబ్బుటకు
    ఏ దేవిని నుతించవలెనో
    యని తడ బాటు నొందు చుంటిని !

    భళా ! భేషైన పూరణ !

    రిప్లయితొలగించండి
  4. కన నీలఘనమునఁ దడి
    త్తనఁ దోఁచు ముకుందుని వరదయిత మహాప
    ద్మ
    ను సాగరజాతను మన్న
    ననుతియించెడి జనులకు నవనిధులబ్బున్

    సత్యనారాయణగారూ, భలే! భలే పూరణండీ!

    రిప్లయితొలగించండి
  5. నీల ముకుంద కుంద వర మహాపద్మ పద్మ -- ఆఱునిధులు నుతియించెడు జనులకునబ్బున్. ఐతే మిగతా మూడు నిధులూ (శంఖ మకర కచ్ఛప) గూఢంగా సాగరంలో ఉండిపోయాయి! :)

    ఆఖరు పాదంలో ఒక 'ను' లోపించింది. "నను నుతియించెడి" అని చదువుకోగలరు.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !

    01)
    ____________________________________

    అనవరతము శుచి , శుభ్రత
    ననుసరణము జేయుచుండు - నరులకు నిలలో
    శ్రీ హరి భార్య ననుదినము
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  7. రాఘవ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మొదటి పూరణ బాగుంది.
    అయితే మూడవ పాదంలో ప్రాస తప్పింది. పాదం గురువుతో ప్రారంభమయింది.
    "................. నరులకు పద్మా
    క్షుని సతి లక్ష్మి ననుదినము
    నను ....." అని నా సవరణ.

    రిప్లయితొలగించండి
  8. ఇనుడుండు నంత కాలము
    నను గొలువగ హెచ్చుసత్య నైపుణి గుణముల్ !
    మనసారగ నరహరియగు
    నను నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్!!!

    రిప్లయితొలగించండి
  9. అనయము సభక్తికమ్ముగ
    వినయమ్మున రామకోటి విరచించుచు నా
    ఇన కుల తిలకు , జిత దశా
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్!!!
    ( జిత దశాననః = జితః దశాననః యేన సః , ఎవని చేత రావణుడు గెలవబడెనో అతడు = రాముడు )

    రిప్లయితొలగించండి
  10. పని లేని పదవి గలుగుగ
    ననయంబును నీతు లన్ని యడుగున ద్రొక్కన్
    గనుగొనుమ రాజకీయము
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్ !

    రిప్లయితొలగించండి
  11. రాఘవ గారు,డా.విష్ణునందన్ గారు అద్భుతమైన పూరణ లందించారు.శ్రీ పీతాంబర్ గారు,కిశోర్ జీ మీ పూరణలు చాలా బాగున్నాయి. సత్యన్నారాయణ గారూ మీ పూరణ అదిరింది.

    రిప్లయితొలగించండి
  12. అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    రాఘవ గారి పూరణ రమ్యముగా నున్నది.
    "దడిత్తన దోచు " నన్న యర్థమేమో ?

    శంకరార్యా ! మీ సవరణకు
    ధన్య వాదములు.

    పీతాంబరధరా !
    నరహరిని హీరో జేసిన
    మీ పూరణ ముచ్చటగా నున్నది.

    విష్ణునందనా ! సుందరా !
    ఇనకుల తిలకుని నుతించాలన్న
    మీ పూరణ మోదము గొల్పు చున్నది.

    మూర్తి గారూ !
    మీ పూరణ బావుంది కాని
    మీ హీరో ఎవరో ?
    అరాజకీయమా ?
    రాజకీయమా ?
    ఇటలీ లలనా ?
    పనిలేని పదవి ఎవరికి కలిగిందో?
    మీ పూరణల నర్థం చేసుకోవడం
    నా బోంట్లకు కష్టం సుమా !

    02)
    _________________________________________

    మనసిజు గెల్చిన వానిని
    మనమున నెన్నడు జపించు - మంగళ; నిలలో
    శనిని దొలగించు; ఇభయా
    నను నుతియించెడి జనులకు - నవనిధు లబ్బున్.
    _________________________________________

    రిప్లయితొలగించండి
  13. 03)
    __________________________________________

    ఆ నగజాతకు తనయుడు !
    ఘన విఘ్నములను , సహితము - గాల్చును త్రుటిలో !
    అనితరమగు భక్తి , గజా
    నను , నుతియించెడి జనులకు - నవనిధు లబ్బున్.
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  14. హనుమా జానకి నీకే
    మనివరములనిచ్చె? దెల్పమన నిటుపల్కెన్
    ఎనిమిది సిధ్ధులు అబ్బును
    నను నుతియించెడి జనులకు నవనిధులబ్బున్

    "అష్ట సిధ్ధి నవ నిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగా"

    రిప్లయితొలగించండి
  15. కిశొర్ గారూ, "ఆ నగజాతకు" లో గురువుతో మొదలయ్యింది కనుక అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభం అవ్వాలి. కనుక దానిని సరిజేయగలరు

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి.

    తనువున వసనము లేకనె
    తన సతినే అన్నమడుగు తాపసి,భిక్షున్,
    మనసున దీక్షతొ యెపుడై
    నను, నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్.

    రిప్లయితొలగించండి
  17. సత్యనారాయణ గారూ నిజంగానే అగ్రభాగాన నిలిచింది మీ పూరణ.ప్రత్యేక అభినందనలు. రకరకాలుగా పూరించిన కవిమిత్రులందరికి అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  18. కిశొర్ గారూ, "కన నీలఘనమునఁ దడిత్తనఁ దోఁచు" అంటే "నీలి మేఘంపై మెరుపుతీగ వలె దోచుచున్న" అని భావం

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    సమస్య అర్థాన్ని మార్చకుండా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    "జిత దశాననుఁడైన" రాముడు వస్తువుగా మీ పూరణ ఉత్తమమై శోభిస్తున్నది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రాజకీయపు పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణలో సర్వమంగళను స్తుతించడం మంగళదాయక మయింది. బాగుంది.
    మూడవ పూరణలో "గజాననుని" ప్రస్తావించారు. అసలు ఈ సమస్యకు మొట్టమొదటి పూరణలోనే ఎవరైనా గజాననుని ఆశ్రయిస్తారని ఊహించాను. సమస్య నిచ్చిన "అజ్ఞాత" గారూ అదేమాట అన్నారు. కాని ఎనిమిదవ పూరణలో మీరు "గజాననుని" పట్టుకున్నారు. బాగుంది.
    మొదటి పాదాన్ని "తనయుండా నగజాతకు" అంటే సరి!

    సనత్ శ్రీపతి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఎపుడైనను హ్రస్వాంతమైన "తొ" ప్రయోగించడం వ్యాకరణ విరుద్ధం. "మనమందు దీక్ష నెపుడై/నను" అందాం.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి.

    శంకరయ్య గారూ ధన్యవాదములు. తరచుగా అదే దొషము దొర్లుచున్నది. సవరించి పంపుచున్నాను.నిందాస్తుతిగా ఉండాలని వ్రాశాను.చిత్తగించగలరు.

    తనువున వసనము లేకనె
    తనసతినే అన్నమడుగు తాపసి,భిక్షున్,
    మనసిజు వైరిని,యెపుడై
    నను, నుతియించెడి జనులకు నవనిధులబ్బున్.

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతి గారూ ! ధన్య వాదములు !
    "దడిత్తన" -నాకీ పదమెక్కడా దొరుకుట లేదు
    సంధి గాని యున్నదా ?
    ఏక పదమా ? ద్విపదా ?

    మీ రెండవ పూరణ
    హనుమ పరంగా బావుంది !

    శాస్త్రి గారూ !
    దిగంబరుణ్ణి ఆశ్రయించిన
    మీ పూరణ బావుంది !

    04)
    ________________________________________

    వనజ భవుడు; నా నుడువుల
    ననబోడి విభుడు; విధాత; - నలుమోమయ్యన్
    ననవరతము , నా చతురా
    నను,నుతియించెడి జనులకు - నవనిధు లబ్బున్.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  22. మిత్రు లందరి పూరణలు ఒకరివి మించి మరొకరివిగా భాసిల్లుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సవరణతో ఇప్పుడు బాగుంది.

    వసంత్ కిశోర్ గారూ,
    ఈసారి చతురాననుణ్ణి పట్టారు. బాగుంది.
    అయితే నలుమోమయ్య, చతురాననుడు అన్నప్పుడు పునరుక్తి దోషం ఉంది. "నలుమోమయ్యన్"ను "నారదజనకున్" చేద్దామా?

    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. శంకరయ్య గారూ, కిశోర్ జీ ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  25. అనయము మరువక మనమున
    వనజభవుని శ్రీనివాసుఁ వారిజ నయనున్;
    దనుజారి పూర్ణ బింబా
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

    రిప్లయితొలగించండి
  26. కిశోర్ జీ !
    తడిత్ +తన తడిత్తన అయ్యింది. తటిత్ అన్నా తడిత్ అన్నా ఒకటే ! "తటిల్లతా సమరుచిః" అన్న మాట

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న మహాశయా !
    ధన్యవాదములు !

    శంకరార్యా !
    మీ సవరణతో పూరణ
    సంపూర్ణమైనది.
    ధన్యవాదములు !

    రవిగారూ !బావుంది!
    అభినందనలు !

    శ్రీపతిగారూ !
    ఓపికగా వివరించినందులకు
    మిక్కిలి ధన్యవాదములు.
    తటిత్తు=మెఱపు(నిఘంటువులో దొరికింది)
    ఏమీ అనుకోకండేం ! మళ్ళీ చిన్న సందేహం !
    తటిత్-తడిత్ ఎట్లా ఔతుందీ యని ?
    ఎప్పుడో వానాకాలం నాటి చదువులు మరి !
    అన్నీ సందేహాలే !తీర్చుకుంటే గాని నిద్ర పట్టదు !

    రిప్లయితొలగించండి
  28. నా పూరణలు .....
    (1)
    అనిలాశన భూషణుఁడై
    తనువున సగభాగ మొసఁగి తన్విని మెచ్చెన్
    త్రినయనుని, హరుని, పంచా
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

    (2)
    ఆని సేయను, బంధులఁ జం
    పను నే నన నర్జునుండు; భగవద్గీతన్
    వినిపించు నా సహస్రా
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా !
    మిక్కిలి శోభాయమానంగా
    నుతించారు
    పంచాననుణ్ణీ
    సహస్త్రాననుణ్ణీనూ.

    మంచి పూరణలనిచ్చినందుకు
    అభినందనలూ
    మరియు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారూ మీ పూరణలు మనోహరముగా ఉన్నాయి. చక్కని పూరణలు అందజేసినందులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  31. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. శంకరయ్య గారూ ..శివ కేశవులిద్దరినీ సమంగా, అసామాన్యంగా పూరించి, మాకు ఆనందము కలుగజేసినందులకు ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  33. పంచాననుని, సహస్రశీర్షుని చక్కగా నుతియించి ఈ కవిగోష్ఠికి ఒక పూర్ణతను సమకూర్చిన గురువర్యులకు వందనములు.

    రిప్లయితొలగించండి
  34. గురువు గారూ హరిహర స్తుతి మనోజ్ఞంగా చేశారు.
    మందాకినిగారు చెప్పినట్లు ఒక పరిపూర్ణత కలుగజేశారు.

    రిప్లయితొలగించండి
  35. భగవానువాచ:

    "వనమున జలమున నింగిని
    తనువున మనమునను హృదిని తాదాత్మ్యతతో
    ధనమున దారిద్ర్యమునన్
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్"

    రిప్లయితొలగించండి
  36. తినడాతడు తిననీయడు
    ధనమును నొసగడు దరిద్ర దామోదరుడా
    తనిని పడ ద్రోసెదను భళి!
    నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్

    దామోదరుడు = నరేంద్ర దామోదర మోడి

    రిప్లయితొలగించండి