13, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 225 (చీర గట్టెను పురుషుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.

27 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.

    అందరికీ వందనములు.

    01)
    _______________________________________

    లక్ష కోట్లకు యవినీతి - రచ్చకెక్క
    మంత్రి వర్యుల దుశ్చేష్ట -మాప లేక
    సిగ్గు యెగ్గులు వదలెను - సింగు గారు !
    చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    ______________________________________

    సోనియా తల్లి చెప్పుల - శుభ్ర పరచ
    నాత్మ గౌరవ మంతయు - నావి రయ్యె !
    తెలుగు జాతికీ దుర్గతి - తీరు నెపుడు !
    చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
    ______________________________________

    రిప్లయితొలగించండి
  3. కిశోర్ మహోదయా మీరు కూడా రాజకీయాల్లో రాటుదేలిపోయారు. అద్భుతం.

    రిప్లయితొలగించండి
  4. మీరు జూపిన దారియే ,మిస్సనన్న !
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  5. 03)
    _______________________________________

    "పారిజాతాప హరణము" - ప్రాకటముగ
    పేరు గాంచెను; పేర్రాజు - పెద్ద నటుడు !
    సత్య భామగ వేషమ్ము - సలుపువేళ !
    చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  6. 04)

    _________________________________________

    పుత్రి కే లేని నొక యింట - పురుషు లేడు
    గురు గలరు ! వారి యందొక - కుర్ర వాని
    తరుణి గను జూడ నెంచిన - తల్లి దండ్రి !
    చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  7. ఇంతు లయ్యిరి మంత్రులు నిందిరమ్మ
    పురుష భావము నొందగ పుణ్య మనుచు
    పడతు లందఱు నడువగ పంచ లందు
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా కిశోర్ జీ మిమ్మలని కాపీ కొట్ట నిస్తారా, ఒక్కసారి,

    నాటకమ్మున స్త్రీ పాత్ర నటన జేయ
    అక్కినేనికి తప్పదె యల్లనాడు
    కలికి చేష్టలు,మాటలు చలన మయ్యు
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.

    రిప్లయితొలగించండి
  9. కిశోర్ జీ మరోసారి ( కాపీ )

    రంగు రంగుల చీరలు సింగు కిచ్చె
    సోనియమ్మకు మిగులుగ,శోభ గూర్చ
    శిరము దాల్చెను భక్తిగ, సింగు వాని
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక

    రిప్లయితొలగించండి
  10. నిన్నటి జి.యస్ జీ ,నేటి కిషోర్,మూర్తి గారి బాటలోనే నేను..

    కిరణు పై జాలి వేసెనో ? కిటుకు లేమొ!
    గాల మేసెను సోనియా గాంధి, చిరుకు,
    గంతు లేయుచు కాంగ్రేసు వింత లీను
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !

    రిప్లయితొలగించండి
  11. కిశోర్ జీ మీ పద్యాలు బాగున్నాయి, అందుకే గా కాపీ కొట్టింది ! శ్రీ మందా పీతాంబర్ గారూ అదిరింది మీ పూరణ !

    రిప్లయితొలగించండి
  12. రేయి గడచిన యగువాడు రేడు భువికి
    తనదు పినతల్లి వాక్కుల తలను దాల్చి
    జటిల వనవాస యాత్రకు చనగ నార
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.

    రిప్లయితొలగించండి
  13. సాంబ శివునిఁజూడ శివుఁడు సగము గిరిజ
    సగము, పులి తోలు చీరయు సగము సగము,
    నిగమ పురుషుండె యీరీతి మగడు కాగ
    చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.

    రిప్లయితొలగించండి
  14. క్రొత్త కాపురమది ; ప్రీతి కోరి కోరి
    చేత గోరింట నలది యా చెలువ మురిసె ;
    ప్రేమ దినిపించె , ద్రాగించె , పిదప సతికి
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి.

    చీరను పలు పలు విధముల కట్టిజూపిన కవిమిత్రులకు అబినందనలు.నేనొక విధముగ కట్టిజూపుటకు ప్రయత్నించెదను.

    వనితలిర్వురు కొనరాగ వస్త్రములను
    సేల్సు మ్యానట జూపుచు చీరనొకటి
    కట్టనిటులుండు నన్నిటు కాంచుడనుచు
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందరూ చీరలు రకరకాలుగా పంచేసుకొన్నారు.
    నాకొక్క చీర కూడా లేదు. అందుకని:

    పాలు పితికెడు వేళలో పాడి యావు
    గట్ట రాటను రండని కాంత మగని<
    జీర, కట్టెను పురుషుండు, సిగ్గు పడక
    పాలు గొనుడనె తనయాడ పడుచు రాగ.

    రిప్లయితొలగించండి
  17. అమృతమ్మును పంచగ హరుడు వెడలె
    సురలు యసురులు యేకమై సర్ధు కొనిరి
    అమృత భాండమ్ము చేబట్టె హొయలు కురియ
    చీర గట్టెను పురుషుండు చిగ్గు పడక !

    రిప్లయితొలగించండి
  18. వసంత్ కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "కోట్లకు + అవినీతి" అన్నప్పుడు యడాగమం రాదు. "లక్ష కోట్లైన యవినీతి" అందాం.
    మూడవ పూరణలో "సత్యభామగ వేషమ్ము సలుపు వేళ" కంటే "సత్యభామగ పాత్ర పోషణము జేయ" అంటే బాగుంటుందేమో?
    నాల్గవ పూరణలో "లేని + ఒక" అన్నప్పుడు ద్రుతం రాదు. యడాగమం వచ్చి "లేని యొక" అవుతుంది.

    రిప్లయితొలగించండి
  19. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలూ మువ్వన్నెలతో అలరిస్తున్నాయి. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    "గాలమేసెను"కు "గాలమును వేసె" అనీ, "గంతులేయుచు"కు "గంతులే వేసి" అనీ నా సవరణలు.

    హరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "గడచినన్ + అగు = గడచిన నగు" అవుతుంది.

    రిప్లయితొలగించండి
  20. జిగురు సత్యనారాయణ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    ఉత్తమోత్తమం మీ పూరణ. శంకరాభరణం బ్లాగుకు ద్విగుణీకృత శోభ నిస్తున్న మీకు ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ విలక్షణంగా చక్కగా ఉంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ పూరణకు తిరుగు లేదు. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    పంచడానికి వెళ్ళింది హరుడు కాడు, హరి కదా! "హరుడు వెడలె"ను "హరి వెడలెను" అనండి. అలాగే "సురలు నసురులు" అనండి. అలాగే "సర్దుకొనిరి" అంటే యతి తప్పుతుంది. "సరుదు కొనిరి" అంటే ప్రాసయతి కుదురుతుంది.

    రిప్లయితొలగించండి
  21. జిగురు సత్యనారాయణ గారి పద్యం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  22. మొగుడుపెండ్లము ఉద్యోగములను వెలగ
    బెట్టుచుండు రోజులివిరో! ప్రీతిఁ సతికి
    అండఁ ఉతికి ఎండబెట్టఁ కండె మందు
    చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక

    రిప్లయితొలగించండి
  23. నమస్కారములు గురువు గారు ! మీ సూచన ప్రకారం ఇలా రాసాను ఇప్పుడు కుదురు తుందేమొ అని మీ సహనమునకు ధన్య వాదములు

    అమృతమ్మును పంచగ హరియె వెడలె
    సురలు నసురులు నటునిటు సరుదు కొనగ
    అమృత భాండము చేబట్టి హొయలు కురియ
    చీర గట్టెను పురుషుండు సిగ్గు విడచి

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు
    మరియు అభినందనలు.

    మూర్తిగారూ !
    మీ మూడూ పూరణలూ
    ముచ్చటగా నున్నవి.
    కాపీ కొట్టినా మార్కు లెక్కువ మీకే వచ్చినై !

    పీతాంబరధరా !
    కిరణుకూ చిరూకూ కలిపి కట్టేసారు చీర !
    బావుంది !

    హరిగారు ! నారచీరతో
    రాముణ్ణి గుర్తు చేసిన మీ పూరణ
    ప్రత్యేకతను సంతరించుకుంది.

    జి.ఎస్.జీ ! అర్థ నారీశ్వరుణ్ణి
    సాక్షాత్కరింపజేసిన మీ పూరణ !అద్భుతం !

    విష్ణు నందనా !సుందరా !
    సమస్యకు వ్యతిరేక భావాన్ని
    సాధించడంలో సిద్ధ హస్తులు మీరు!
    సతికే చీర గట్టిన మీ ప్రతిభ, అమోఘం !

    శాస్త్రి గారూ !
    సేల్స్ మేన్ తో చీర కట్టిచడం!బావుంది !

    మిస్సన్న మహాశయా !
    సమస్యను తెగనరకడంలో
    మీ ప్రత్యేకత మీదే !
    ఇంతకీ చీరను ఏం చేసారు ?
    మీ ఇంట్లో దాచేసుకున్నారా !

    అక్కయ్యా !
    జగన్మోహినిని సాక్షాత్కరింపజేసావు!
    మనోహరంగా ఉంది !

    రవీజీ !
    చీర కట్టడమే కాదు ఉతికి ఆరెయ్యడం కూడానా !
    సమస్యనే ఉతికి ఆరేసారు !
    బావుంది !

    రిప్లయితొలగించండి
  25. "క్రొత్త కాపురమది ; ప్రీతి కోరి కోరి
    చేత గోరింట నలది యా చెలువ మురిసె ;
    ప్రేమ దినిపించె , ద్రాగించె , పిదప సతికి
    చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక!"
    డా. విష్ణు నందన్ గారూ!
    ఎంత చక్కని పూరణండి!
    అభినందనలు!

    రిప్లయితొలగించండి