17, ఫిబ్రవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 229 (నా తలపైఁ బాదము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.
ఈ సమస్యను పంపించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. లూతను నిమిరిన రీతిని
    కోతిని ముదమార హత్తు కొనినట్టి గతిన్
    త్రాతా! పాపము బాపగ
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.

    రిప్లయితొలగించండి
  2. భార్యాభర్తల సంభాషణ

    "ఏ తెఱవ యది? ఎటుకలిసె?
    ఏ తీరునను పరిచయము? ఇన్ని గినుములా? "
    "ఓ తల్లీ! ఇక చాలును,
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్"

    రిప్లయితొలగించండి
  3. వాతలు ధరవర లెన్నగ
    మ్రోతలు నా వీపు పైన మ్రోయగ బ్రదుకున్
    నేతా! మిగిలిన దొక్కటె
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి.

    ఓతండ్రి, కొడుకునెత్తుక
    ఆతల్పముపైపరుండి అనియెను, కన్నా!
    చూతము పాడుచు ఆడుము
    నాతలపై బాదములిడి నర్తింపదగున్.

    రిప్లయితొలగించండి
  5. జోతలు మీ హితవునకిక
    చేతును నే దానమిలను శ్రీ హరి కిపుడే
    భూతలము విడచి పోదును
    నాతలపై బాదములిడి నర్తింపదగున్.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు.
    అందరి పురణలూ
    అలరించు చున్నవి.

    భారత దేశ పౌరుని ఘోష :

    01)

    _______________________________________

    నేతల్లారా ! భాగ్య వి!
    ధాతల్లారా ! విదేశ - దయితకు , మీరే
    పాతాబాలుగ మారిరి !
    నా తలపైఁ బాదము లిడి - నర్తింపఁ దగున్.
    ________________________________________

    పాతాబా=కాళ్ళకు తొడిగే మేజోడు
    ________________________________________
    ________________________________________

    రిప్లయితొలగించండి
  7. భారత దేశ పౌరుని ఆక్రందనము :

    02)

    _________________________________________

    ఘాతకు లారా ! గ్రాసపు
    మేతరు లారా ! అమేయ- మిథ్యా ధనమున్
    ఖాతాలను నింపు కొనుడు !
    నా తలపైఁ బాదము లిడి - నర్తింపఁ దగున్.
    _________________________________________

    మిథ్యా ధనము = నల్ల డబ్బు
    ఖాతా = స్విస్ బాంకు ఖాతా
    _________________________________________

    రిప్లయితొలగించండి
  8. భారత దేశ పౌరుని నిర్వేదము :

    03)

    _________________________________________

    వాతాశి మిన్న , మీక
    న్నా! తాతలు గద, బకునికి ! - నల్ల ధనం, మా
    రాతలు మార్చును; మరలిన !
    నా తలపైఁ బాదము లిడి - నర్తింపఁ దగున్.
    _________________________________________

    రిప్లయితొలగించండి
  9. నేతల దౌష్ట్యముఁ గాంచుచు
    బ్రాతిగ నట చేరకుండ భయపడి జెష్టా!
    ఖ్యాతి నశింప తడయ తగు
    నా? తలపైఁ బాదము లిడి - నర్తింపఁ దగున్.

    రిప్లయితొలగించండి
  10. ఆ తల నిండె విషమ్మే
    త్రాతా ! కాళీయుడంట ! రా రా కృష్ణా !
    తాతై తై ధిద్ధిమ్మన
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్ !!!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కృష్ణుని పదారవిందములు చేసిన రమ్యమైన కాళీయమర్దన గురించి కవివర్యుల ద్వారా విందామని ఆశించి ఆ భావం గురువుగారికి సూచించాను.
    ఛందోబద్ధం చేస్తూ గురువు గారు ఒక సమస్య ఇచ్చారు. గురువుగారూ,
    విష్ణునందన్ గారూ , ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    రవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "నినుములు" శబ్దప్రయోగం నచ్చింది.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "పాతాబాలు" ప్రయోగం బాగుంది. నేనైతే "పైతాబాలు" అని విన్నాను.

    రిప్లయితొలగించండి
  13. చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. ధన్యవాదాలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    సమస్య నిచ్చిన మందాకిని గారు ఊహించిన విధంగా మనోహరమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    విష్ణునందనా ! సుందరా !
    ఎప్పటివలెనే మీ పూరణ
    ప్రత్యేకముగ భాసించు చున్నది!


    శంకరార్యా !
    ధన్యవాదములు !
    ఔను !ఆ అర్థము గూడా గలదు.
    చూడుడు!

    మందాకిని గారి ఊహ ఏమిటో ?
    ______________________________________________

    http://www.andhrabharati.com/dictionary/index.php

    పాతాబా
    ఉర్దూ తెలుగు నిఘంటువు - లక్ష్మణ్‌రావు పతంగే
    పు.పుంలింగం [ఫా.ఫారసీ భాష ]

    •కాళ్ళకు తొడిగే మేజోడు. పైతాబు, సాక్స్‌
    _______________________________________________

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా!ధన్యవాదాలు.క్రొత్త క్రొత్త పదాలతో,(పద్య)పాదాలను నాట్యమాడించిన కవి మిత్రులందరకు అభినందనలు.

    గోలిహనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  16. నా పూరణ ..............

    ప్రీతిని మీ రక్షత లిడ
    నా తలపైఁ; బాదము లిడి నర్తింపఁ దగున్
    ఖ్యాతిగ వేదికపై యిక
    నా తొలి నాట్య ప్రదర్శనా శుభవేళన్.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా!అరంగేట్రం చేయుచున్న నాట్య విద్యార్ధిని చేత గురు వందనం తోశుభారంభం చేయించారు.చాలాబాగుంది.

    గోలి హనుమచ్చాస్త్రి

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్చాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    నిజానికి "ఆరంగేట్రం" పదం ఎంత ఆలోచించినా నాకు తట్టలేదు. లేకుంటే పూరణలో ఆ పదాన్నే ప్రయోగించేవాణ్ణి.

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా !
    అక్షతల నాట్యం ! చాలా బావుంది !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  20. ప్రీతిగ నీకును గంగా!
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్,
    నీ తల పొగరును దించగ
    చేతనగును నాకు, సాంబ శివుడను నేనే!

    రిప్లయితొలగించండి
  21. వాతలు పెట్టిరి నేతలు
    గోతులు త్రవ్విరి హితులును గోలీ! యనుచున్
    తాతా! శఠగోపముతో
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  22. "Priyanka Gandhi Vadara to contest against Modi in Varanasi...Congess workers excited"

    చేతులతో నెత్తెద నిను
    వాతల కోర్తును ప్రియంక వదరా గాంధీ!
    ప్రీతిని కాశికి తరలుచు
    నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్

    రిప్లయితొలగించండి