18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 230 (దిక్కు లేనివాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దిక్కు లేనివాఁడు దినకరుండు.

32 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.

    01)

    _______________________________________

    సర్వ సాక్షి యతడె - సర్వాత్ము డతడేను !
    ప్రాణి కోటి కెల్ల - ప్రాణ మొసగు !
    దిక్కు లన్ని యతడె - దేదీప్య మానము !
    దిక్కు లేనివాఁడు దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులందరికీ నమస్కారములు. చాలా కాలం తర్వాత మళ్ళా పద్యం వ్రాద్దమంటే నా పరిస్థితి, "ఆమ్నాయామయోగేన విద్యాం ప్రశిథిలామివ" అన్నట్లు వుంది. హేమాహేమీలూ, ఉద్దండ పండితులూ బ్లాగుకి శోభ చేకూరుస్తున్నారు. మిస్సన్న గారు కత్తి రెండు ప్రక్కలా పదుపెట్టి వాడిగా వేడిగా పద్య రచన సాగిస్తున్నారు. చిరమిత్రులు డా మూర్తి గారు సొగసులు కురిపిస్తున్నారు. వసంత కిశోర్ గారు పద్యధార అనంతంగా కొనసాగుతోంది. చింతా వారు, ఫణీంద్ర, విష్ణునందన్ గారు మెరుపులు కురిపిస్తున్నారు. శంకరయ్య గారు కాకతీయుల ఆస్థానం వీడి నవాబుల దర్బారు చేరారు. నిదానంగా బృందంలో చేరతాను కానీ మేష్టారు మళ్ళా 35/100 మార్కులు వేస్తారో లేదో అని భయంగా వుంది.
    త్వరలో,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  3. దిక్కులెల్లఁగల్గె తేజస్వి దినకరుం
    డొక్కడుండె గాన.నిక్కమయ్య.
    దిక్కు లేని వారి దిక్కౌచు నీసృష్టి
    దిక్కు లేనివాఁడు దినకరుండు.

    రిప్లయితొలగించండి
  4. చంద్ర శేఖరులకు
    ధన్య వాదములు మరియు
    స్వాగతం !

    02)
    _______________________________________

    కంటి ముందు గదలు - కర్మ యోగి యతడు !
    ఎల్ల వారి బ్రోచు - చల్ల గాను !
    దైవ సముడు; సర్వ - దిక్కుల బ్రసరించు !
    దిక్కు లేనివాఁడు దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  5. చింతా వారి పూరణ
    చక్కగా నున్నది !

    03)

    _________________________________________

    దిగ్దిగంత ములకు - దీప్తి నిచ్చెడు వాడు !
    ఒక్క దిక్కు నుండ; - ఉసురు బోవు !
    చలన మున్న దైవ - మిల నత డొక్కడే !
    దిక్కు లేనివాఁడు - దినకరుండు.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  6. 04)

    __________________________________________

    అతడు లేక యున్న - నవశేషమె మిగులు !
    అవని యంతరించు ! - నాగు సృష్టి !
    అఖిల భువన దీప్తి ! - ఆదిత్యు డాతడు !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  7. 05)

    __________________________________________

    లోక పాల కుండు ! - లోకేశు డతగాడు !
    జనుల రక్ష జేయు - జయము గూర్చు !
    నిఖిల లోకములకు - నిత్య దీప్తొనరించు !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  8. 06)

    ________________________________________

    అతని జుట్టు జగతి - అనువర్తనము జేయు
    అఘము దొలగ జేయు ! - నంశు ధరుడు !
    విశ్వ మంత వెలుగు ! - వేయి చేతుల ఱేడు !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  9. 07)

    ________________________________________

    విరతి లేక యతడు - విశ్వ మంతయు దిరుగు !
    మోద మిచ్చు జగతి ! - మోక్ష మిచ్చు !
    భవుడు మిథ్య ? యేమొ ? - భానువు మిథ్యౌన ?
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  10. 08)

    _________________________________________

    పక్షపాత రహితు; - బ్రార్థింప బనిలేదు !
    పిలువ కుండ , ప్రేమ; - ప్రేపు నొచ్చు !
    అన్య దైవ మెవరు ? - అట్లు తా నొచ్చును ?
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    ప్రేపు = ఉపఃకాలము
    ________________________________________

    రిప్లయితొలగించండి
  11. 09)

    _______________________________________

    వాడి పోవు సర్వ - వల్లి సంతతి యుర్వి !
    పశు ,పక్షి , వృక్ష - పరమ పదము !
    నలువ గావ లేడు; - నాకుడు లేకున్న !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  12. 10)

    _______________________________________

    నీరజముల గాచు - భూజములను గాచు !
    ఖేచరంబు గాచు ! - కిరణ మాలి !
    విశ్వ మెల్ల గావ - విహరించు నఖిలము !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  13. 11)

    ______________________________________

    అర్జునన్న కిచ్చె; - అక్షయ పాత్రను !
    ఊరు పిచ్చు , జనుల - కుర్వి యందు !
    శక్తి , ప్రాణి కోటి, - సావిత్రు డిచ్చును !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    ఊరుపు = శ్వాసము
    ________________________________________

    రిప్లయితొలగించండి
  14. 12)

    _______________________________________

    అంశు , డంబరీషు - డంబర రత్నము !
    అశిరు, డినుడు, సవిత , - అర్కుడు, రవి !
    కాళి , ఖేళి,జ్యోతి - కపి, కాల చక్రుడు !
    దిక్కు లేని వాఁడు - దినకరుండు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  15. దినకరుని - ప్రమాణమును గొని దిక్కులే
    ర్పరచినాము తూర్పు పడమరలుగ ;
    దిక్కులన్ని మనకె . దిక్సూచికుండునా ?
    దిక్కు లేనివాఁడు దినకరుండు !!!

    రిప్లయితొలగించండి
  16. ధారగా వెలుగులు దశదిశల గురిసి,
    పంచ భూతములకె ప్రాణమగుచు,
    దిక్కుతోచకుండ దిరుగాడు తిమిరంపు
    దిక్కు లేనివాఁడు దినకరుండు.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మంచి పూరణలను ఇచ్చిన చింతా వారికి, విష్ణునందన్ గారికి,రామమూర్తి గారికి అభినందనలు.దినకరుని చుట్టూ దశదిశలు దాటి రెండవ చుట్టు తిరుగుచున్న కిశోర్ గారికి ప్రత్యేక అబినందనలు.
    --------------------------------------

    తిమిర ములను బాప తిరుగుచుండెడి వాడు
    గ్రహము గతుల తానె గరపు వాడు
    దిక్కు చూపు తానె, దిక్కులు తనకేల?
    దిక్కులేనివాడు దినకరుండు.

    రిప్లయితొలగించండి
  18. నాల్గు దిక్కులందు నలువైపు లందుండు
    ఆది దేవు డనగ నతడె గనుక
    జీవ రాసు లన్ని జీవించు నతడిపై
    దిక్కు లేని వాడు దినకరుండు

    రిప్లయితొలగించండి
  19. నా పూరణలు .......
    (1)
    భానుఁ డుదయమంద ప్రాణంబు పోవు శా
    పంబుఁ గన్న భర్త బ్రతుకు కొఱకు
    సుమతి యడ్డుకొనఁగ సూటిగా రాలేని
    దిక్కు లేనివాఁడు దినకరుండు.

    (2)
    మేరు పర్వతమ్ము పేరెన్నికను గన్న
    సైపలేని వింధ్య శైల మలిగి
    మించి సూర్యు నడ్డగించగా సాగని
    దిక్కు లేనివాఁడు దినకరుండు.

    (3)
    పేవుమెంటు మీద విగతజీవుండయ్యె
    దిక్కు లేనివాఁడు; దినకరుండు
    పొడవగానె జనము మూగిరి కార్పొరే
    షనుకు కబురు పెట్టగను వెడలిరి.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి.

    ముచ్చటగా మూడు విభిన్న పూరణలతో అలరించిన శంకరార్యులకు అబినందన మందారమాల.ఆర్యా!అందుకోండి.

    రిప్లయితొలగించండి
  21. వసంత్ కిశోర్ గారూ,
    మీ ద్వాదశాదిత్యుల పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "దేదీప్యమానుడు" కంటే "దేదీప్యదేహుండు" లేక "దేదీప్యకిరణుండు" అంటే బాగుండేదేమో?
    రెండవ పూరణలో "కర్మసాక్షి"కి బదులు "కర్మయోగి" అన్నారు.
    ఐదవ పూరణలో "దీప్తి + ఒనరించు" అన్నప్పుడు సంధి లేదు. "దీప్తి నొసంగు" అందాం.
    ఆరవ పూరణలో "అతని జుట్టు" కాదు. "అతని చుట్టు".
    ఏడవ పూరణలో "మిథ్యౌన" ను "మిథ్యయా" అందాం.
    ఎనిమిదవ పూరణలో " తాను + వచ్చును" కదా. ఒచ్చును గ్రామ్యం. "తా నరుదెంచు" అందాం.
    తొమ్మిదవ పూరణలో "పసులు పక్షి వృక్ష వస్తు చయము" అంటే ఎలా ఉంటుంది?
    మీ పన్నెండవ పూరణ సూపర్!

    రిప్లయితొలగించండి
  22. చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ఉత్తమమై శోభిస్తున్నది. ధన్యవాదాలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    అద్భుతమైన పూరణ మీది. ధన్యవాదాలు.

    ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
    మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    "గ్రహము గతుల" కంటె "గ్రహ గతులను" అంటే ఎలా ఉంటుంది?

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. ఈమధ్య నాకు సవరించే పని తప్పిస్తున్నారు. సంతోషం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. అన్ని పూరణలూ చక్కగా ఉన్నాయి.
    రవి గురించి చెప్పటానికి రవిగారు రాలేదేమి?
    వింతయే!

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ ! ధన్య వాదములు. " మీ అందరి పండితుల వలె నేనేమైనా మంచి బరువైన పదాలతొ రాస్తె కదా ? సవరించ డానికి ? 60 ఏళ్ళు వెనక్కెళ్ళీ ఒకటో క్లాసు పిల్లలా రాస్తున్న నా పూరణలను ఏముందని సవరించ గలరు ?ఇంకా నాకనిపిస్తుంది ,నన్ను ప్రోత్స హించ డానికె " బాగున్నయంటున్నారేమొ అని ? ఔనా ?

    రిప్లయితొలగించండి
  25. కక్ష గట్టినారు గ్రహణ సమయమందు
    రాహు కేతువులన రక్ష కలదె?
    దినకరుండునైన దీనుడే! రక్షించు
    దిక్కు లేనివాఁడు దినకరుండు!

    రిప్లయితొలగించండి
  26. అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    శంకరార్యా !
    మీ చక్కని సవరణలకు
    ధన్యవాదములు !
    త్రివిధములైన మీ పూరణలు
    ముచ్చటగా నున్నవి.
    అభినందనలు!

    రిప్లయితొలగించండి
  27. రాజేశ్వరి నేదునూరి గారూ,
    నిజమే చెప్పాను. ఈ మధ్య మీ పద్యాలు సలక్షణంగా, నిర్దోషంగా ఉంటున్నాయి. మీకు పద్యరచనా నైపుణ్యం పట్టుబడింది. ఇక పదగుంఫన మంటారా? దానికదే వస్తుంది. వృత్త రచన కూడ ప్రయత్నించండి. శుభమస్తు!

    జిగురు సత్యనారాయణ గారు,
    విభిన్నమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మందాకిని గారూ,
    వసంత్ కిశోర్ గారూ,
    .................... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. మందాకిని గారు, ఏం చేయాలి చెప్పండి?

    పగలు రాత్రి యనక పరిగెత్తుచుండుటన్
    ఇతర విషయములను మతిని గొనక
    వెనక బడెను రవియె. కనగ మింట, భువినిన్
    దిక్కు లేనివాడు దినకరుండు.

    అయినా మహామహుల పూరణల ముందు నేనెంతండి?

    రిప్లయితొలగించండి
  29. సత్యనారాయణ గారూ... మీ పూరణ అదిరింది. దినకరుడిని మేము చూసిన దిక్కు నుండి కాకుండా వేరే దిక్కునుండి సానుభూతి కోణం లో చూశారు. చాలా బాగుంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  30. రాజేశ్వరమ్మ గారు, మీ వయసులో అసలు పద్యరచన మీద ఆసక్తి ప్రదర్శించి ఇన్ని పద్యాలు వ్రాయడమే గొప్ప విషయం. మీరు వ్రాసిన కొన్ని కొన్ని పద్యాలు చమక్కుమంటున్నాయి. ఇలాగే వ్రాస్తూ ఉండండి. వీలయితే మీరు ఒకసారి పద్యం పూర్తి చేశాక, కొన్ని కొన్ని పదాలకు ఆన్ లైన్ నిఘంటువులో అర్థాలు వెతకండి. మంచి పదాలు దొరికితే మార్చండి. శుభమ్.

    రిప్లయితొలగించండి
  31. ఆ.వె.
    పూర్వ పశ్చిమాది పుడమిని దీపించి
    దిక్కులన్నిదిరుగుధీరుడతడు
    భూమినాథుఁబోలు భూఖండ పతి గాదు
    *దిక్కు లేని వాఁడు దినకరుండు*

    రిప్లయితొలగించండి
  32. ఆ.వె.
    కాలమేదియైన, కచ్చితమ్ముగవచ్చు
    నిదురలేపిపంప, లేరుజనులు
    ఉదయనగమునున్న, నుర్విలోవ్యాపించు
    దిక్కులేనివాడుదినకరుండు

    రిప్లయితొలగించండి