21, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 233 (మాతృ భాషాభిమానమ్ము)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

52 కామెంట్‌లు:

  1. రాణకెక్కిన కలికి తురాయి తెలుగు ;
    కీచు రాయిల ఘోష ఆంగ్లేయ భాష !
    నాపరాయిని బోలిన ఆ పరాయి
    మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు !!!

    (ఇతరుల మాతృభాషాభిమానం మనకేల? మన మాతృభాష మనకుండగా?)

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి.

    తెలుగు భాషను బలుకగ తెగులు యనుచు
    ఆంగ్ల భాషను నేర్వగ ఆత్ర పడుచు
    తేనె నొదలెద వదియేల? తెల్ల పరుల (దొరల అనుట ఇష్టం లేక)
    మాతృ భాషాబిమానమ్ము మనకు వద్దు.

    రిప్లయితొలగించండి
  3. లేదు పట్టింపు,రోశమ్ములేదు,లేదు
    మాతృ భాషాభి మానమ్ము మనకు! వద్దు
    వద్దురా,మరువద్దురా,ముద్దు లొలుకు
    తెలుగు భాషను, తెలుగేర వెలుగు మనకు!

    రిప్లయితొలగించండి
  4. మిత్రు లందఱికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

    మాన ముండిన నుండును మనసు నందు
    మాతృ భాషాభిమానమ్ము ; మనకు వద్దు
    ద్వేష పూరిత చింతలు, ధీరులార
    తెలుగు భారతి మిన్నయు పలుకు లందు !!!

    రిప్లయితొలగించండి
  5. డా.విష్ణునందన్ గారు,శ్రీ మంద పీతాంబర్ గారు,శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు చక్కని పద్యాలు చెప్పారు,సత్య వాక్కులు నుడివి నందులకు అందఱికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు.
    అందరిపూరణలలో
    మాతృ భాషాభి మానము
    పెల్లుబుకు చున్నది !

    _______________________________________
    01)

    తేనె లొల్కెడి తెలుగునే - తృప్తి దీర
    త్రాగి సంతోష మందరే - ధాత్రి యౌట !
    వేద భాషయె దీనికి - పితరు భాష
    వేద భాషను నెంతేని - విద్య గలదు !

    02)

    కన్న భాషను గొలుచుము - మిన్న గాను
    కరుణ; నీతల్లి ,నీ భాష - కాచ వయ్య !
    కష్ట మెందుకు పడెదవు - ఇష్ట పడుము
    కోటి భాషల నీభాష - మేటి గదుర !

    03)

    ఆంధ్ర భాషకు నంతమ్ము - నవని లేదు
    లేదు లేదంటు చాటుము - రేయి బవలు !
    విశ్వ మున్నంత వరకును - వెలుగు నంచు
    తెలుగు భాషకు గల శక్తి - దెలుప వయ్య !

    04)

    యెంచు కోవయ్య నీ భాష -మించు నట్లు
    వెర్రి నైరోప భాషల - వెంట బడకు !
    కీడు వచ్చును నీభాష - కిలను;ఇతర
    మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  7. పల్ల వించదె ప్రేమయు తల్లి పైన
    తేనె లొలుకుచు పలుకర తెలుగు నందు
    పాడి గలుగుట ;ఆ పరభాష మోజు
    మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు!

    రిప్లయితొలగించండి
  8. డా. విష్ణు నందన్ గారూ,
    "నాపరాయి వంటి ఆ పరాయి భాష" .... చాలా బాగుంది. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "తెలుగు + అనుచు" అన్నప్పుడు యడాగమం రాదు. "తెలు గటంచు" అందాం. అలాగే "తేనెను + ఒదలెదవు" అన్నారు. అది "వదలెదవు" కదా. "తేనెను వదలు టది యేల" అందాం.
    "తెల్ల దొరలు" అని ఇంకా అనడం నాకూ నచ్చదు. సంతోషం!

    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    శాస్త్రి గారు చేసిన పొరపాటునే మీరు చేసారు. "మరువద్దురా" అనేదాన్ని "మరువ వలదు" అందాం.

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ "తెలుగు భారతి మిన్నయు" కంటే "తెలుగు భారతియే మిన్న" అంటే బాగుంటుందేమో!
    రెండవ పూరణలో "పాడి గలుగుట ;ఆ పరభాష మోజు మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు!" అన్నప్పుడు సందిగ్ధత తోస్తున్నది. కాస్త వివరించడమో, సవరించడమో చేస్తారా?

    రిప్లయితొలగించండి
  10. వసంత్ కిశోర్ గారూ,
    మాతృభాషాభిమానాన్ని వర్షిస్తున్న మీ పద్య చతుష్టయం బాగుంది. అభినందనలు.
    మొదటి పద్యంలో "పితరు భాష" ప్రయోగ యుక్తాయుక్తాలను విష్ణు నందన్ గారే విశ్లేషించాలి.
    మూడవ పద్యంలో "లేదు లేదంటు"ను "లేదు లేదంచు" అనండి.
    నాల్గవ పద్యం యడాగమంతో మొదలు పెట్టారు. "ఎంచుకోవయ్య" కదా!

    రిప్లయితొలగించండి
  11. గురువు గారూ ధన్య వాదములు. ఈ సవరణ చూడండి .

    పల్లవించదె ప్రేమయు తల్లి పైన
    తేనె లొలుకుచు పలుకర తెలుగు మీఱ
    మాతృభాషాభిమానమ్ము ; మనకు వద్దు
    పరుల భాషల మోజది పాడి గాదు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ నమస్కారములు. మీ సూచనలు యెప్పుడూ బాగుంటాయి. మీ పూరణలు కూడా చాలా బాగుంటాయి. మీకు మరో పర్యాయము కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  13. పంచ దారలో అక్షరాల్ ముంచి రేమొ!
    చెఱుకు రసములో వడగట్టి చెక్కి రేమొ!
    తేనెలో వేసి ఊరించి తీసి రేమొ !
    తీయ దనమబ్బె(నీరీతి తెలుగు నకును!) తెలుగుకతిగ, పరాయి
    మాతృ భాషాభి మానమ్ము మనకు వద్దు!

    సమస్య పూరణ గా భావించ వచ్చునను కొంటే బ్రాకెట్ లోది తీసి వేయ వచ్చును లేదా మిగితా దానిని తొలగించి పద్యం గా భావించ వచ్చును

    డా.విష్ణు నందన్ గారి బ్లాగైన "ధర్మ దండం " లో 14 -12 -2010 న వారు ప్రకటించిన "తెలుగు భాష -తెలుగు వాడు"ను మరొక్క సారి మననం చేసుకుంటే సందర్భోచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  14. 1)
    కలవిపుడురెండుకులములు గనగ మనకు
    "మాతృభాషాభిమానమ్ము మనకు ముద్దు"
    యని పలుకనొకటి,పెరది అరచు నిటుల:
    "మాతృభాషాభిమానమ్ము మనకు వద్దు"

    నన్ను నాన్నా అని పిలిచే మా అబ్బాయి (ఒకటో తరగతి) బడికివెళ్లిన కొన్నాళ్ళకి డాడీ అని మొదలు పెట్టాడు. ఆ అలవాటు మానిపించాను - ఇప్పుడు నన్ను నాన్నా అనే పిలుస్తాడు, కానీ తోటి పిల్లలతో మాటాడేటప్పుడు మాత్రం డాడీ నే - మా డాడీ కొన్నాడు, మా డాడీ వద్దన్నాడు - ఇలా.
    2)
    ఘోర మిద్ది; ఆ యాంగ్లపు కొరివి తోడ
    గోకు వైనమిద్ది; పరమ క్రూరమిద్ది;
    చిన్ని వాండ్రకు బడులద్దు చీడ యిద్ది:
    "మాతృభాషాభిమానమ్ము మనకు వద్దు"

    రిప్లయితొలగించండి
  15. వసంత్ కిషోర్ గారూ -
    పితరు భాష బదులు నాకు తోచినది చెబుతున్నాను - మన్నించమని మనవి
    "వేద భాషయొప్పును తల్లి వేరు గాను",
    ఐతే మీ శైలి లో ప్రాస ముందు "-" ఉంచితే ఇబ్బందే :)
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి.

    శంకరార్యా..మూర్తి గారూ.. ధన్యవాదములు.
    ----------------------------------------
    తెలుగు పలుకులు విడనాడు తెగులు యేల?
    ఆంగ్ల భాషను మాట్లాడ ఆత్రమేల?
    తెల్లవారెను నీతెల్వి,తెల్లవారి
    మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి.

    అందరికీ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
    ----------------------------------------
    తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము
    మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
    నల్ల ముఖమును వేయకు తెల్ల వారి
    మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందరి పూరణలూ
    ముద్దుగా
    మురిపెముగా
    ముచ్చటగా
    మందహాస బంధురమై
    అలరారుచున్నవి.

    ఊకదంపుడు గారూ !
    మీ సలహాకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  19. నా పూరణ ..............

    యాసలే వేఱు, మన తల్లి బాస యొకటె;
    ప్రాంత భేదముల్ తొలఁగఁ, గావలెను నేఁడు
    మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు
    మ్లేచ్ఛ భాషపై వ్యామోహమే; వినుఁ డిదె!

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సవరించిన మీ పూరణ ఆణిముత్య మయింది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    "అమృతమున వేసినట్టి పద్యమ్మటంచు
    పొగడఁ దగినట్టిదయ్య నీ పూరణమ్ము.
    అందుకొనుఁ డభినందన మంద వంశ
    వార్ధి శశివి పీతాంబరా! బాగు బాగు.

    రిప్లయితొలగించండి
  21. ఊకదంపుడు గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పై రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "తెగులు + ఏల" అన్నప్పుడు యడాగమం రాదు. "తెగులు వలదు" అందాం.

    ఇతరుల పూరణలను ప్రశంసిస్తున్న కవి మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గారు, నమస్కారం .మీ ప్రశంస మహదానందాన్ని కలుగజేసింది .మీకు కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  23. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, ఫిబ్రవరి 21, 2011 4:26:00 PM

    గురువు గారికీ, సాహితీ పెద్దలందరికీ
    అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  24. గురువుగారూ,ధన్యవాదములు. మీ పూరణ చాలా బాగుంది.


    అమ్మ బొమ్మర ? మమ్మీ యటంచు పిలువ
    ఇమ్ముగ తెలుగు నమ్మని 'అమ్మ 'యనుర
    తండ్రి నాన్నర ! ముద్దుల తండ్రి నీవు
    'డాడి 'యనకుర యెన్నడున్ గాడి తప్పి !

    పుట్టు బట్టులపై యెట్టి పట్టు లేని
    భాష తల యెక్కె భారమై,భూషణ మగు
    మాతృభాషాభిమానమ్ము; మనకు వద్దు
    యితర భాష లయ్యొయ్యొ కూడెంగిలి యయె !

    రిప్లయితొలగించండి
  25. శ్రీ మందా పీతాంబర్ గారూ, మీ పద్యము చాలా మధురంగా ఉంది. తెలుగు భాష నెలా చేసారో రహస్యము చెప్పేసారు.

    రిప్లయితొలగించండి
  26. మంద పీతాంబర్ గారు , చక్కని పద్యము . తెలుగుదనము గుబాళిస్తూన్నది. అభినందనలు .

    రిప్లయితొలగించండి
  27. కవి మిత్రులందరూ తేనెలొలికే మన తెలుగు భాషాభిమానాన్ని చాటుకొంటూ
    తెలుగు భారతి గుండె మంటను చల్లార్పడానికి శాయశక్తులా ప్రయత్నించారు.
    అందరికీ వందనాలు.

    అ ఆ లు దిద్దుట అవమాన మైపోయె
    ఏ బి సీ డీ యఫు లెక్కు వాయె!
    అమ్మ నాన్నా యన్న అది చాల తప్పాయె
    మమ్మి డాడీ లెన్న కమ్మ నాయె!
    పాఠశాలలు బడుల్ పనికి రానివి యాయె
    కాన్వెంట్ల వైపుకే కాళ్ళు పోయె!
    అత్తయ్య మామయ్య అంటరా నైపోయె
    ఆంటి అంకుల్ అన్న అందమాయె!

    తెలుగు భారతి చినవోయె తెల్లవారి
    మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు
    భాష దారిద్ర్య మీనేల పరిఢ విల్లు
    నిట్టి దుర్గతి! కానరే గట్టి సుగతి!

    రిప్లయితొలగించండి
  28. శంకరార్యా!యాస లెన్ని ఉన్నా ప్రాంత భేదాలను వదలి తెలుగువారందరు ఒకటిగా ఉండాలని చెప్పిన మీపద్యం ఉత్తేజకరంగా ఉంది.
    విష్ణు నందన్ గారు పరాయి భాషను 'రాయల్ ' భాష కాదు కీచురాయిల ఘోష అని చెప్పారు. బాగుంది.
    తెలుగు గొప్పదనాన్ని ఎంతో చతురతగా చెప్పారు కిశోర్ గారు. చదువుతూ ఉంటేనే నోరు ఊరేట్టు చేశారు పీతాంబర్ గారు.
    మమ్మీ దా(డా)డి నుంచి తెలుగును రక్షించమన్నారు ఊకదంపుడు గారు,మూర్తి గారు.అందరికీ అబినందనలు. మరియు మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్నగారూ అదరగొట్టేసారు. చాలా బాగుంది. మా పిల్లలు యెప్పుడూ అమ్మ,నాన్న అనే పిలుస్తారు.తెలుగు వ్రాయడము,చదవడము నేర్పించాను. కాని అక్కడకు వచ్చినపుడు, మమ్మీ,డాడీలు, మెడలో గొఱ్ఱె తోకల కాన్వెంటు సంస్కృతి చూస్తే వళ్ళు జలదరిస్తుంది.అమెరికా పోయి యిలా మాట్లాడుతావు అని కొంత మంది విమర్శిస్తారు. అది నిజమే ప్రస్తుతానికి యిక్కడ చిక్కడిపోయాము. బ్రతుకు తెరువికి ఆంగ్లము తప్పదు కాబట్టి నేర్చుకోవచ్చు గాని మన భాష, సంస్కృతి మంట గలిపేస్తే ఎలా ? చక్కని సీసము చెప్పారు.

    రిప్లయితొలగించండి
  30. మిస్సన్న గారూ! భాషాదారిద్ర్యాన్నివదిలించుకొని మాతృభాషా సంపద పెంచుకోవాలని చెప్పారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  31. వగలమారి తళుకు పట్టుబట్ట కట్టు
    యాంగ్ల భాష కూటి కొరకె,ఆంధ్ర భాష
    నాదు తల్లి గట్టు ముతక నార చీర
    గట్టె పో,నాదు తల్లినా కమ్ము, వీడ
    మాతృ భాషాభిమానమ్ము, మనకు వద్దు
    పట్టు తళుకుల బుట్టయౌ పరుల తల్లి!

    మనవి: కన్నడ సాహిత్యంలో నే చదివిన "రేష్మీ సీరే హుట్టిదే యంత బెరే యవరన్న అమ్మా అంత కరియక్కాగుత్తియే! అన్నదే స్ఫూర్తి ఈ పద్యానికి. దీనికి అనువాదం అఖ్కరలేదనుకొంటా. అయినాగానీ, "పట్టు చీర కట్టిందని వేరే వాళ్ళని అమ్మా అనగలమా!".

    రిప్లయితొలగించండి
  32. వైద్య నిపుణులు విష్ణు నందన్ గారూ, వైద్యశాస్త్రాన్ని చక్కని తెలుగులో వ్రాసేయండి.తెలుగులో చదవాలని చాలా అభిలాషగా ఉంది.

    రిప్లయితొలగించండి
  33. ధన్యవాదాలు, గురుతుల్యులయిన మూర్తి గారికి. కొంచెం ఆవేశంతోనే వ్రాశాను. యతి ప్రాసలు అడ్డు రాలేదనే అనుకొంటున్నాను. ఉద్దండ పండితులముందు చాలా కాలం తర్వాత సాహసం చేశాను, "సాహసం సేయరా డింభకా!" అని పాతాళభైరవిని తలచుకొంటూ.

    రిప్లయితొలగించండి
  34. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    కవి మిత్రు లందరి పక్షాన మీకు నా ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మాతృ భాషాభిమానన్ని భూషణంగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ సీసపద్యం అదిరింది. ధన్యవాదాలు.
    "పనికి రానివి యాయె"ను "పనికి మాలిన వయ్యె" అంటే బాగుంటుంది కదా.
    "అత్తయ్య మామయ్య అంటరా నైపోయె"ను "అత్తయ్య మామయ్య లంటరానివి కాగ" అందాం.
    "భాషా దారిద్ర్యం" అనాలి కదా.

    చంద్రశేఖర్ గారూ,
    స్వాగతం. మంచి పూరణతో ఆనందింప జేసారు. అభినందనలు.
    "కట్టు యాంగ్లభాష"ను "కట్టు నాంగ్లభాషను" అందాం.

    రిప్లయితొలగించండి
  35. ఎంత యానంద మందితి నీ దినంబు?
    సాటి కవిమిత్రు లెల్లరు చాటినారు
    మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు
    సంకుచిత భేద భావ కళంక మింక!

    రిప్లయితొలగించండి
  36. మాస్టారూ, కట్టు "నా" వ్రాసినవాడినే "యా" గా మార్చాను చివరి క్షణంలో. ఇంకా నా తెలుగు తలుపులకు పట్టిన తుప్పు దులపలేదన్న మాట సరిగ్గా, పూర్తిగా తెరుచుకోవటంలేదు. వచ్చేసారికి....

    రిప్లయితొలగించండి
  37. శంకరార్యా ! ఈ రోజు తెలుగు తల్లికి
    కుల,మత వర్గ, ప్రాంత భేద రహితంగా
    జరిగిన పద్యాభిషేక మహోత్సవం
    మహా మురిపెముగా నున్నది !

    వారాంతపు స-పూ చూచుట
    మరచితిరి !

    రిప్లయితొలగించండి
  38. శంకరయ్యగారూ, ఈ రోజు కదా నా జన్మకు ఒక సార్థకత వచ్చింది, అదీ మీ టపా చదవటం ద్వారా!
    ఇటువంటి మహోన్నత కార్యం చేపట్టినందుకు మీకెన్నో నెనరులు.
    మీ ఆశీర్వాదములు ఎల్లపుడూ మాకుండాలి!

    రిప్లయితొలగించండి
  39. సవరణతో:
    వగలమారి తళుకు పట్టుబట్ట కట్టి
    నాంగ్ల భాష కూటి కొరకె,ఆంధ్ర భాష
    నాదు తల్లి గట్టు ముతక నార చీర
    గట్టె పో,నాదు తల్లినా కమ్ము, వీడ
    మాతృ భాషాభిమానమ్ము, మనకు వద్దు
    పట్టు తళుకుల బుట్టయౌ పరుల తల్లి!

    రిప్లయితొలగించండి
  40. గురువుగారూ మీ సవరణలకు, సూచనకు కృతజ్ఞతలు.

    సవరించిన నా పద్యం:

    అ ఆ ల దిద్దించు టవమాన మైపోయె
    ఏ బి సీ డీ యఫు లెక్కు వాయె!
    అమ్మ నాన్నా యన్న అది చాల తప్పాయె
    మమ్మి డాడీ లెన్న కమ్మ నాయె!
    పాఠశాలలు బడుల్ పనికి మాలిన వాయె
    కాన్వెంట్ల వైపుకే కాళ్ళు పోయె!
    అత్తయ్య మామయ్య లంటరానివి కాగ
    ఆంటి అంకు ళ్ళన్న అందమాయె!

    తెలుగు భారతి చినవోయె తెల్లవారి
    మాతృ భాషాభిమానమ్ము; మనకు వద్దు
    భాష కంటిన దారిద్ర్య భావ తతులు,
    నిట్టి దుర్గతి! కానరే గట్టి సుగతి!

    రిప్లయితొలగించండి
  41. చంద్ర శేఖర్ గారూ కడు చక్కని భావ ప్రకటన!

    రహ్మానుద్దీన్ షేక్ గారూ! చాల సంతోషం.
    మీ ప్రొఫైల్ చూసి, మీ తెలుగు భాషాభిమానాన్ని విని
    తెలుగు పట్ల ప్రేమ లేని తెలుగు వాళ్ళం సిగ్గుతో తల దించుకోవాలి.
    అయ్యా మీ జన్మ కాదు ఈ బ్లాగు సార్థక మైంది మీ సందర్శనతో.

    రిప్లయితొలగించండి
  42. వసంత్ కిశోర్ గారూ,
    సంతోషం!
    వారాంతపు సమస్యాపూరణలను ఎప్పటి కప్పుడు చూస్తున్నాను. కాని సమయాభావం వల్ల వ్యాఖ్యానించలేదు. వారాంతం వరకు గడువు ఉందికదా అనే బద్ధకం కావచ్చు.

    రహ్మానుద్దీన్ షేక్ గారూ,
    ధన్యవాదాలు. మిస్సన్న గారి అభిప్రాయమే నాది కూడ.
    మనం మళ్ళీ కలుసుకోవాలనుకున్నాం. కాని అవకాశం దొరకడం లేదు.

    రిప్లయితొలగించండి
  43. రెహ్మాన్‌ జీ ! ఆదాబ్ !
    మై భీ మిస్సన్న సాబ్ ఔర్
    శంకరయ్య సాబ్ కె సాత్ మి‌ల్‌జు‌ల్ క‌ర్ కే
    ఆప్‌కో షుక్రియా పేష్‌ కర్‌ రహా హూ !


    శంకరార్యా !
    వ్యాఖ్యానించ డానికి గడువు లెందుకు !
    మీకు తీరిక చిక్కినప్పుడల్లా వ్యాఖ్యానించొచ్చు !

    ఏదో మాకొచ్చిన చెత్త రాసేసి
    అందులో ఎన్ని తప్పులున్నాయో అని
    మీ వ్యాఖ్యల కోసం
    చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ ఉంటాం గదా !

    "పితరు భాష"
    అని నిన్న నేను చేసి న కొత్త ప్రయోగానికి
    ------------------------------------------
    "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి ! వెయ్‌ వీడికి రెండు"
    ------------------------------------------
    అంటారనుకున్నాను !
    మీరేమో ఆ బాద్యత విష్ణు నందనుల మీద పెట్టేసారు !

    రిప్లయితొలగించండి
  44. వసంత మహోదయా ! " పితరు భాష " గురించి మరిచేపోయారేమో అనుకున్నా . ఇంకా గుర్తుందా?
    సరే ! పిత శబ్దం ప్రథమా - ఏక ద్వి బహు వచన రూపాలివీ - పితః పితరౌ పితరః

    పితరుల భాష అనే అర్థం చెప్పవలసి వస్తే సంస్కృతంలో అయితే పిత్రూణాం భాషా అనీ, తెలుగులో అయితే పితరుల భాష అనే చెప్పవలసి ఉంటుంది . ఇక్కడ ' పితరుల ' లోని ' ల ' అక్షరానికి లోపం రాదు .
    సరే ఇది కాదనుకుంటే ప్రతి పదానికి నైఘంటికార్థం అని , రూఢ్యర్థం అని ఉంటాయి . కళేబరం , కంపు ఇలాంటి వాటికి నైఘంటికార్థం ఎంత మంచిదైనా , రూఢిగా మనకు స్ఫురించే అర్థం వేరే .
    అదే ఈ ' పితర ' శబ్దంలోనూ ... గతించి పోయిన పెద్దవాళ్లు అనే ఒక సామాన్యార్థం ఉంది లోక వ్యవహారంలో . ఒక ప్రాంత ఆంధ్ర దేశంలో , ' పెత్తర్ల అమావాస్య ' ( పితరుల అమావాస్య కు పలుకలేని జనాలేర్పరచిన వికృత రూపం ) అనే పద్ధటొకటుంది . ఆరోజు వాళ్ల వాళ్ల పద్ధతులలో తర్పణాలూ వగైరా చేస్తారు .
    కాబట్టి పితరుల కంటే మరేదైనా మంచి పదం స్ఫురిస్తే వాడవచ్చు .
    దీనికి సంబంధించిన పూర్వకవి ప్రయోగాలు ఉంటే ఇక మనమేమీ మాట్లాడలేము .
    " పూర్వకవి ప్రయోగంబులు యథా ప్రకారంబుగా గ్రాహ్యంబులు "
    మీరన్నట్టు మన ముందు తరాలకు ఆ పూర్వకవి మీరే ఎందుకు కాకూడదు ? శంకరయ్య గారి వీరతాళ్లకి అర్హత సంపాదించినట్టే అలా అయితే !!!

    రిప్లయితొలగించండి
  45. విష్ణు నందనా !సుందరా !

    మాతృభాష యన్నట్లే పితృ భాష
    అంటే తప్పేంటని "పితరు "శబ్దం వాడాను.
    నిఘంటువునందా శబ్దము న్నది
    ఇంతకీ అభ్యంతరం
    "పితరు " ---శబ్దానికో
    "పితృ భాష"---ప్రయోగానికో
    నిన్నటి నుండీ నా కర్థం కావట్లేదు
    _________________________________________
    పితరుడు
    •1. తండ్రి;
    "క. సతియుం బతియును సుతుఁడును,
    బితరుఁడు నొండొరులతోడఁ బెసఁగెడుచో సా,
    •2. బ. మృతిపొందిన పితృవర్గమువారు, పితృదేవతలు.
    "క. కృతమతియై యేడేఁడులు,
    హుతవహు ఘృతమునను బ్రీతినొందించిన సు,
    వ్రతుఁ డీరేడుతరంబుల,
    పితరులఁ గొని దివికినేగుఁ బెంపెసలారన్‌." భార. ఆర. ౪, ఆ.
    బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
    [Skt.] n. A father. తండ్రి.
    (@ఆంధ్రభారతి వివరణ@ - మూలప్రతిలో ఆరోపములు: 'పిత, పితర, పితరుడు')
    _______________________________________

    రిప్లయితొలగించండి
  46. వసంత కిశోర్ గారు పితృ భాష సరైనదే . పితరు శబ్దం సాధ్యం కాదు . ఏక వచన షష్ఠీ తత్పురుష సమాసంలో ' పితృ ' , ద్వివచనం లో ' పిత్రోః ' , బహు వచనం గా ' పిత్రూణాం ' .
    తెలుగు విగ్రహ వాక్యం ' పితరుని భాష ' - పితృ భాష
    ' ఇద్దరు పితరుల భాష '- పిత్రోః భాష
    ' అనేక మంది పితరుల భాష ' - పిత్రూణాం భాష

    కనుక , తెలుగు లో వ్రాసేటప్పుడు పితరుల భాష అనే వ్రాయాలి . ' ల ' కారానికి లోపం రాదు .' ల ' లేకపోతే వ్యాకరణ భంగం .

    ఇది ఒక విషయం . కేవలం వ్యాకరణ పరంగా.
    ఇకపోతే రెండో విషయం - 'పితరులు ' అనే పదం గురించిన లౌకిక చర్చ . అది నిఘంటువులలో ఎలా ఉన్నప్పటికి అపర కర్మలలో విరివిగా ఉపయోగించే పదం కాబట్టి పరిహరిస్తే మంచిదనేది . ఇది శాస్త్రమేమీ కాదు . మన యిష్టాయిష్టాలకు సంబంధించినదే . " చందన చర్చిత నీల కళేబర పీత వసన వన మాలీ " అని వాడలేదూ ...కాబట్టి వాడాలనుకుంటే నిరభ్యంతరంగా వాడవచ్చు . కానీ అలా వాడే సందర్భాల్లో " పితరు " అని ఆపకూడదు వ్రాస్తే 'పితౄ ' అనో లేదా ' పితరుల ' అనో వ్రాయాలి. సందేహ నివృత్తి జరిగిందా ? లేక విషయం ఇంకొంచెం క్లిష్టతరం చేసితినా???

    రిప్లయితొలగించండి
  47. వసంతార్యా !!! నిజానికి ఇదొక అతి సూక్ష్మమైన వ్యవహారం . మామూలుగా వ్రాసే వ్రాతలలోని వ్యాకరణ సహజమైన , అసంకల్పితమైన పొరపాట్లతో పోలిస్తే ఇదేమంత విషయం కాదు. శంకరయ్యగారూ , మీరూ అడిగినమేరకే తప్ప , నా వరకు నాకు ఇది పెద్దగా పట్టింపులు లేని విషయమే . కేవలం విద్యా విషయిక చర్చలకు ( అకడమిక్ ఇంటరెస్ట్ ) కి ఉపయోగపడే విషయమంతే !!!

    రిప్లయితొలగించండి
  48. విష్ణు నందనా !సుందరా !
    మిక్కిలి ధన్యవాదములు !
    నేనేమీ మిమ్మల్ని విసిగించట్లేదు గదా !
    మీ విధులకు అంతరాయం కలిగించడము లేదు గదా !
    మీతో చర్చించడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది.
    మీతో మరింత ఘట్టిగా చర్చించడానికి
    సంస్కృతం కూడా నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను.

    ఆ శబ్దాన్ని నేను వాడిన సందర్భం గమనించారా !
    అక్కడ షష్ఠీ తత్పురుష ఉంటేనే ఇబ్బందిగా ఉంటుంది !
    "వేద భాషయె దీనికి - పితరు భాష "
    అంటే తెలుగు సంస్కృతం నుండి జనించినదని నా భావం.

    ఇదెవరి ప్రకటన అంటే - విష్ణు నందనుల ప్రకటన -అన్నప్పుడు
    షష్ఠీతత్పురుష లోపించినను ఊహ్యము గదా!

    రిప్లయితొలగించండి
  49. అట్లే
    రామ రాజ్యం - అన్నప్పుడుషష్ఠీ తత్పురుష లోపించిననూ
    విగ్రహ వాక్యం - రాముని యొక్క రాజ్యం - అనే నుడువుదుము గదా !

    రిప్లయితొలగించండి