15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ప్రహేళిక - 43

ఇది ఏమిటి?
మంద పీతాంబర్ గారూ పంపిన ప్రహేళిక ఇది. వారికి ధన్యవాదాలతో .....
ఆ. వె.
"కాళ్ళు లేవు గాని కదలి వెళ్ళుచునుండు,
మ్రింగ నోరు లేదు, మ్రింగు నూళ్ళు,
కడుపు నింపు, పంట ఘనముగా పండించు
తెలియు వారు దాని తెలుప గలరె ?

ఇది ఏమిటో చెప్పండి.
సమాధానాన్ని బ్లాగులో వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది చిరునామాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

3 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    జి. మైథిలీరాం గారూ,
    మీ ఇద్దరి సమాధానాలు విభేదించినా, ఇద్దరూ కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. బి. మైత్రేయి గారూ,
    రాజేశ్వరి నేదునూరి గారూ,
    రామమోహన్ అందవోలు గారూ,
    మీ మీ సమాధానాలు సరియైనవే. అభినందనలు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు ప్రహేళిక సమాధానాన్ని పద్యంలోనే చెప్పారు. వారికి ధన్యవాదాలు. వారి పద్యం ఇది ...
    ప్రహెళిక 43 కు సమాధానము .......................
    (ఉప్పొంగి ప్రవహించే నది .. పంటలు పండిచునన్నారు కనుక వరద కాదు)
    మందగారు చాల మాధుర్య ముప్పొంగ
    ప్రశ్న అడిగినారు పద్యమందు
    శంకరార్య! దాని సరి జవాబును జూడ
    ఝరుల పొంగు గాని వరద కాదు.
    ..................... గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి
  3. మరిచాను ....
    సమాధానం చెప్పినవారిలో "వసంత్ కిశోర్" గారూ ఉన్నారు. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి