16, మే 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 42 (ప్ర-భా-త-ము)

అంశము- సూర్యోదయ వర్ణనము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా ప్ర - భా - త - ము ఉండాలి.

99 కామెంట్‌లు:

  1. ప్రభను వదలుచు వదలగ ప్రభలు చెలగ
    భాను డుదయించె తూర్పున పక్షులంత
    తమత మకిలకి లలు వెట్ట ధాత్రి నందు
    ముకుళి తకమలా లువిరిసె ముదము తోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు పద్యాన్ని గణాల వారీగా కాకుండా పదాల వారీగా ప్రకటించండి.

      తొలగించండి
  2. ప్రణతులిడి యర్ఘ్యమిడుచుండ బ్రహ్మవిదులు
    భాను బింబంబు పూర్వాద్రి భవ్యముగను
    తళుకు లీనెడి కిరణపు వళులు కురియ
    ముకుళ పద్మంబు సరసున మురిసి విరిసె

    రిప్లయితొలగించండి
  3. ప్రజ్వరిల్లుచు తూర్పున పైకివచ్చు
    భాను లేలేత కిరణాల ప్రసరణమున
    తరులు గిరులును విరులన్ని మెరయుచుండ
    ముదము గొల్పె ప్రభాతమ్ము హృదయమునకు

    రిప్లయితొలగించండి
  4. ప్రబలతరతిమిరమ్ములు బడలుపడెను
    భాను డగుపించె నెఱ్ఱని వర్ణమందు
    తరుతతులనుండి మందవాతమ్ము వీచె
    ముచ్చటగ సుప్రభాతమ్ము వచ్చె నిచట

    రిప్లయితొలగించండి
  5. *ప్ర*కృతి కాంతకు శోభ సంభవముఁగాగ
    *భా*గ్య దాయకుడగు బాల భాస్కరుండు
    *త*నివి తీరగ నుదయించె,ధన్యతగని
    *ము*దము నర్ఘ్యము నిడువారు మురిసి నిలువ.

    రిప్లయితొలగించండి
  6. ప్రణవ రవములు గుళ్ళల్లో పల్లవించి
    భావుకములు నిడియు చుండ , పంచమములు
    తన్మయము గొల్పు పాటలు ధాత్రి పైన
    ముదము తోడ గానము చేయ, మొగులు దారి
    పైన అరుణ కాంతులతోడ భాస్కరుండు
    మెల మెల్లగా వచ్చెను వెలుగు లిడుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇది న్యస్తాక్షరి కనుక నాలుగు పాదాల్లోనే పూర్తి చేస్తే బాగుంటుంది.

      తొలగించండి
    2. ఆర్యులకు నమస్కారములు. తేటగీతి ఎన్ని పాదములైన పూరించ వచ్చు అను ఉద్దేశ్యముతో చొరవ తీసుకొన్నాను. నాకు తెలియదు. ఇకనుంచి ఆ తప్పు పునరావృతము కాదు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. తేటగీతిక పేరుతో తేటగీతిని ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చు. కాని ఇక్కడ న్యస్తాక్షరి కనుక ఇచ్చిన నాలుగు అక్షరాలలే పరిమితం కనుక అలా వ్యాఖ్యానించాను. అంతే.

      తొలగించండి
  7. (ప్ర)కృతి పులకించ సత్త్వంబు సకలమునకు
    (భా)సురం బౌచు నందంగ భాస్కరుండు
    (త)మములను ద్రుంచి ప్రాగ్ధరాధరము నుండి
    (ము)దము మీరగ నేతెంచె హృదయ మలర.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  8. ప్రతిదినము కనబడు దృశ్య రక్త కంద
    భాసము జిలేబి కన్నుల పండువగ స
    తతము కనిపించి మించారు తరము తెన్ను
    ముగతి గోధి కుంకుమబొట్టు ముద్దుగాఱు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పూరణ బాగుంది. నడక కొంత కుంటుపడింది.
      'రక్త కందభాసము, తెన్నుముగతి...'...? 'మించారు' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    ప్రకృతి నోంకార స్వనములు పరిఢవిల్ల
    భాను కిరణాలదాకి నభమ్ము మురిసె
    తమము వీడి కర్మల గన తరలు బోధ
    ముద్దుగా సాగె సత్కృతుల్మోసులెత్త!

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    ప్రజల కడగండ్ల కికనైన ప్రాపు దొరుకు
    భాను కిరణాల నాశించె భద్ర కవిగ
    తమపు దందాలు వెలుగున తారసిల్ల
    ముదము గోల్పోయి దుఃఖపు మూర్తి యాయె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఓంకార స్వనములు' అన్నపుడు 'ర' గురువై గణదోషం. "తనువు నోంకార రవములు/ శబ్దముల్..." అనవచ్చు కదా!

      తొలగించండి
  11. ప్రచుర బాలార్క కిరణ సంపర్క హృదయ
    భాసితామల జలజాత పంక్తి మధ్య
    తరల షట్పద మధుపాన సరస దృశ్య
    ముదిత శుభ సుప్రభాతము ముద్దులొల్కు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      ప్రబంద పద్యం వలె మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. మురళీకృష్ణగారూ, పద్యం చాలా బాగుందండి. ఆభినందనలు.

      తొలగించండి
    3. సురుచిర ప్రభాత వేళ.....! నమస్సులు!

      తొలగించండి
  12. ప్రకృతి సతి ముఖము గడిగి వరలినట్లు
    భాసమాన మయ్యెను నింగి వాసిగాను
    తరుణి కుంకుమ తిలకమ్ము దాల్చినట్లు
    ముద్దుగాఁ దోచె సూర్యుండు పూర్వదిశను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రణామములు గురువుగారు..బాలభానుని గాంచుచు పరవశించు భావకవిలా ముగ్ధమోహనమైన పద్యాన్ని మాకందించారు.....

      తొలగించండి
  13. *ప్ర* కృతి ప్రాగ్దిశ నరుణంపు వర్ణమద్ది
    *భా* సురముగ ఖగముల నేపథ్యమమర
    *త* రణి కిరువైపులన్ మేఘ తతులఁ దీర్చి
    *ము* దమునందుచు కుంచెను మొదటఁ గదిపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మనోహరమైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు మరియు vsnmhari గారికి ధన్యవాదములు

      తొలగించండి
    3. మూడవ పాదంలో కొద్దిపాటి సవరణతో

      *ప్ర* కృతి ప్రాగ్దిశ నరుణంపు వర్ణమద్ది
      *భా* సురముగ ఖగముల నేపథ్యమమర
      *త* రణి కిరువైపులన్ మబ్బు తరకలలర
      *ము* దమునందుచు కుంచెను మొదటఁ గదిపె

      తొలగించండి
  14. ప్రబల బాలార్క కిరణవిపంచి శృతి, వి
    భావరిని మీటె,నుదయ పద జతుల పక్షి పక్ష
    తతి పురులు విప్పె,ప్రాగ్దిశ త్యాగ రాజ
    ముఖ జనితకృత సంగీత మూర్తి యనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ మనోహరమైన భావంతో అలరారుతున్నది. రెండవ పాదంలో గణదోషాన్ని సవరించండి.

      తొలగించండి
  15. ప్రకట కాంతి కిరణముల ప్రాభవమున
    భానుడుదయించె లోకము భాసమొంద
    తరలిపోయెను చీకటి వెరుపునొంది
    ముదము పొందెను ప్రాణి సమూహమంత

    రిప్లయితొలగించండి
  16. ప్రస్ఫురిత రక్తవర్ణము ప్రకట రీతి
    భాసమానము కాగను, భానుదీప్తి
    తతులు విస్తరింపగ నట ధాత్రిలోన
    మురిసె జగము నానందపు మూర్తి గాను.

    రిప్లయితొలగించండి
  17. ప్రకట నవరాగ హేలా ప్రభాకరుండు
    భాసిలెన్ జూడ ప్రాగ్వీధి హాస మొసగి
    తనరె లేలేత కిరణాల తరళ కాంతి
    ముక్త తిమిర సంరావాను రక్తి యవగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా వారూ,
      మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
      'అవగ' అన్నది సాధువు కాదేమో? 'రక్తి సెలగ' అందామా?

      తొలగించండి
  18. ప్రన్న గొలిపెడు పాటతో పంచమమ్ము
    భావుకమ్మును పలుక ,నభంబు పైన
    తమము పారద్రోలుచు త్రయీతనువు ధరణి
    ముద్దియను కిరణములతో ముద్దు లిడెను

    రిప్లయితొలగించండి
  19. ప్రకృతి పులకించి పాడెను స్వాగతమ్ము
    భానుడుదయించ ప్రాగ్దిశ భాసురముగ
    తమ్మి పూవులు వికసించె తపను గనుచు
    మురిసి యంజలి ఘటియించె భూతధాత్రి!!!

    రిప్లయితొలగించండి
  20. ప్రతిది నమ్మును నుదయించు భాస్కరుండు
    భాసు రంబగు కిరణాల ప్రభల తోడ
    తమము బోగొట్టి వెలుగులు దానయిచ్చి
    ముదము గలిగించు బ్రజలకు ముఖ్యముగను

    రిప్లయితొలగించండి
  21. డా.పిట్టా
    ఎప్పుడో వ్రాసుకొన్న స్వగతం
    శ్రమమలం జెందగ కేంద్ర సాహితి పురస్కారాలు రావింక నీ
    భ్రమలం బద్యము బట్టుకొంట నగవౌ ప్రాభాత"మంచున్"తగన్
    విమలంబౌ "జల"రాశిగా గొనము యీ విభ్రాంతినిన్ జూడ నీ
    మములన్ నిష్ఠలు గద్య గౌరవములౌ మళ్ళింప నా సంస్కృతిన్!!
    పండిత రాజకీయములు ప్రాపులు వర్గములున్ బ్రకర్షలున్
    ఖండన మండనల్ యెదుటి గ్రాహకులన్ భ్రమలోన నుంచుటల్
    దండి వచోసుకౌశలము దండుకొనన్ దమరే యటంచు వే
    దండము నెక్కినట్లు బహు దార్ఢ్యతలన్ గడియింత్రు రాజకీ
    యాండము పిండమై చెలగు నార్భటముల్ కలికాల లక్ష్యముల్
    రానున్న T.S.ఉత్సవాలను తలంచుకొని భీతితో.....

    రిప్లయితొలగించండి
  22. [16/05, 10:07 AM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *ప్ర*గతిసాధించి ప్రజలెల్ల ఫలములంది
    *భా* గ్యమందుచుముదములన్ బడయునట్లు
    *త* థ్యమారోగ్య సంస్థితుల్ సాధ్యపడగ
    *ము*రిపమున్ గూర్చరవికినే మ్రొక్కులిడుదుఁ

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    [16/05, 11:32 AM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *ప్ర*జ్వలారుణాంబరుడట్లుపరుగులెత్త
    *భా*సితశ్వేతసత్ప్రభా భద్రమగుచు
    *త*ల్లడిల్లుచునా సంధ్య తరలివచ్చె
    *ము*న్నె రవికై పడమటికి మోజు దీర

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      (మీ పేరు నాలుగు సార్లు పెట్టడం అవసరమా? మీరు వాట్సప్‍లో పెట్టిన పద్యాలను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. కాని 'ప్రచురించు' అన్నదానికి నొక్కే ముందు తేదీ, సమయం, అదనంగా వస్తున్న మీ పేరును బ్యాక్ స్పేస్ బటన్ నొక్కుతూ తొలగించవచ్చు కదా!)

      తొలగించండి
  23. ప్రకృతి కాంతామణి రుచిర ఫాల తటిని
    భాసిలు తిలక బింబంపు భాతి వెలసి
    తరుణ రవి బింబ మిచ్చెను దర్శనమ్ము
    ముగ్ధ మోహనముగ నంతఁ బూర్వ దిశను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ఆలంకారికంగా, మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

  24. తే.గీ:ప్రకృతి కాంతయు మరియుచు పరవశింప
    భానుడుదయవేళలందు భాంతి చూప
    తమ్మిపూవులు కొలనులో దరహసింప
    ముచ్చటగ గాంచిరా సౌరు ముదితలెల్ల.

    2.తే.గీ:ప్రథమ పూజలిడ దలచి ప్రణతు లిడుచు
    భాస్కరుని చెంత విప్రులు భాసురముగ
    తడయక ర్ఘ్యము లనిడగ తమిని జూప
    ముదితలు సహకరింపగ మురిసిరెల్ల.

    3..తే.గీ: ప్రకటితమవగ నరుణుడు ప్రభలు చూపి
    భాను డేతెంచె గగనాన ప్రాచి దిశను
    తమమ తొలగించిముదమిడ ధరణికాంత
    మురిసి స్వాగతము పలికె మోహనముగ.

    4.తే.గీ:ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
    బాలభానుని రాకకై వార్ధి చెంత
    తరుణమరసి యంబరమున తరణి రాగ
    ముకుళితకరకమలముల మ్రొక్కి రచట.

    5.తే.గీ :ప్రకృతి కాంత ప్రాచీ దిశన్ వలపుతోడ
    భానుమంతుని చూచుచు పలవరించి
    తమకమునుచూపుచు నచట త్వరితగతిని
    ముగ్ధవోలె తానరుదెంచ మురిసె రవియు.

    రిప్లయితొలగించండి

  25. ప్రభలు చిలుకుచు గగనాన భాసురముగ
    భానుడేతెంచె గనుడట ప్రజలార
    తమము తొలగ వెలుతురులో ధైర్యమూని
    మురిసి తామరలు విరిసె ముదము తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రకృతిలలన పై పంచ పద్యములను
      భావయుక్తముగా గూర్చి భల్ల వూరి
      తరుణి వ్రాసెను ఘనముగ , తరచి చూడ
      ముర్మురంబొకటి తనను మోసగించె

      మూడు పద్యహయమ్ములు మోజుతోడ
      పరుగులిడగ తదుపరిది భంగపడెను
      బాల భానుడు గతితప్పి భారామాయె
      ఓర్పు చూపి పరీక్షించుమొక్క మారు

      నాల్గవ పద్యము రెండవ పాదము మొదటి అక్షరము “భా” కావాలి . “బా” తో పద్యము నడచినది అన్యధా భావించ వలదు సుమీ.
      (పద్యములను సూర్యుని గుర్రములు అని తలచాను ).

      తొలగించండి
    2. డా. ఉమాదేవి గారూ,
      మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఒకటి, రెండు సూచనలు సమూహంలో చేశాను. గమనించండి.

      తొలగించండి
    3. పూసపాటి వారూ,
      మీ తాజా పూరణ బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "ప్రకృతి లలనపైనను పంచ..." అనండి.
      మీ నాల్గవ పద్యంలో (రెండవ పాదంలోనే కాదు) ఏ పాదంలోను న్యస్తాక్షరి నియమం పాటింపబడలేదు.

      తొలగించండి
  26. ప్రస్ఫురిల్లుచు నుండ ప్రభాతవేళ
    భాస్కరుండు రైతులు ప్రీతి బండ్లఁ గట్టి
    తరలిపోవుచుండ్రి పొలము త్వరితముగను
    ముదముతోడుత తరుణులుఁ గదలిరాగ

    రిప్లయితొలగించండి
  27. ప్రజ్వరిల్లె తూర్పు నెగసి పగటి రేడు
    భాసములు విరజిమ్మె నపారముగను
    తళుకుమనె హిమగిరులు పుత్తడిని బోలి
    మురిసి విచ్చె సూర్యముఖులు ముదముదోడ ౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రజ్వరిలె తూర్పున నెగసి..." అనండి.

      తొలగించండి
  28. ప్రణతులిడెదరు జనులిల భక్తిగదుర
    భానుడుదయించ వేకువన్ ప్రతిదినమ్ము
    తరులు విరులును వెల్గగ తళ తళ మని
    ముక్తి నొసగు మటంచును మోకరిల్లి

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కనులు లేనివాడు కనగల డెందైన
    నర్థిగొలుచునా డనంతు నచట ;
    నరునిగా జనించి నాస్తికుడగువాడు
    కనులు వేయి గలిగి కాంచలేఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. ప్రకృతి యొడిలోకి బయనించు బాల భాను
    భాసురం బది యారోగ్య భాగ్య మగుత,
    తరులు గిరులన్ని బులకించి దనరు నిచట
    ముద్ద మందార వర్ణంబు బులుము కొనగ
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ప్రయతుడై వెలుగొందుచు ప్రతి దినమ్ము
    భాగ్యమిడుచు నారోగ్యమ్మె పంచు చుండు
    తమ్మిదొర నేడుదయమందె తళుకు బెంచి
    ముచ్చెమటల ముంచుచు నుండి ముమ్మరించె

    రిప్లయితొలగించండి
  31. ప్రణతు లిడుతును ఖగరాశి రమ్యముగను
    భావగీతికలను పాడి స్వాగతింప
    తరణి పూర్వాద్రులేజేర ధరణినేల
    మురిసె తామరల్ ద్వాదశాత్ముడని గాంచి


    ప్రణయని తిమిరమును పొంద పంతమందు
    భానుడుదయించె నభ పూర్వభాగమందు
    తనను కామింపదలచిన తరణిగాంచి
    ముప్పువాటిల్లుననుచును ముగ్దపాఱె.

    రిప్లయితొలగించండి
  32. ప్రత్యుషస్సున అరుణిమ ప్రభలు దాల్చి
    భాస్కరుడు తూర్పు నుదయించు భాసురముగ
    తనరు జీవము లన్నియు తాండవించ
    ముక్తమౌ గాదె తామసి, మోద మలర

    అల్వాల లక్ష్మణ మూర్తి కలువ కుర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మణ మూర్తి గారూ,
      'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    ప్రథమ సంధ్యాంగనామణి ప్రథిత ఫాల
    భాగమున నొప్పు సింధూర వరతిలకము
    నరె ననఁగ, హిరణ్యరేతసుఁడు కమల
    ముఖ వికసిత సత్కార్య సుముఖతఁ దనరె!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  34. ప్రగతి రథపు సారథిగ తా ప్రతిన బూని
    భాను డరుదెంచ తిమిరమ్ము పారి పోయె!
    తల్లడిల్లె కలువ, నవ్వె తమ్మి పూవు
    ముదముతో బాల భాస్కరు మోము గనుచు!

    రిప్లయితొలగించండి
  35. ప్రవిలమలమ్ముగ తూర్పుననవతరించు
    భాస్కరుని స్వాగతింపంగ పద్మమనెడు
    తన్వి రేకులువిప్పంగ తనరెనదిగొ
    ముగ్ధమోహన సౌందర్య మొలుకు దీప్తి
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రవిలమలమ్ముగ'...?

      తొలగించండి
    2. విమలము అను పదముయొక్క శోభను అధికంచేస్తుంది

      తొలగించండి

  36. పిన్నక నాగేశ్వరరావు.

    ప్రకృతి​ యరుణ వర్ణమ్మున భాసిలంగ

    భానుడుదయాన తిమిరమున్
    బాఱ ద్రోల
    తరలి వచ్చె సప్తాశ్వ రథంబునందు

    ముదిత నుదుటను సింధూర బొట్టు
    వోలె.
    ****************************

    రిప్లయితొలగించండి
  37. 4 వపద్యసవరణతో
    ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
    భానుకేసరు రాకకై వార్ధి చెంత
    తరుణమరసి యంబరమున తరణి రాగ
    ముకుళిత కరకమలముల మ్రొక్కి రచట.

    ప్రగతి పథమున సాగంగ ప్రతిదినమ్ము
    భాసురముగ నిను గొలువ ప్రజలు నెల్ల
    తహతహబూని వత్తురు ధరణియందు
    ముజ్జగములకు వెలుగిడ ముందు రార.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'భానుకేసరు'...? రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. "తహతహను బూని వత్తురు..." అనండి.

      తొలగించండి
  38. ప్రణయ సుశ్రాంతులకు నిద్ర భంగపఱుప
    భాస్కరా! యింత ప్రొద్దుట వచ్చితేమి
    తరళ కాంతుల ప్రాగ్దిశ దళుకులిడుచు
    ముగుద మోమున కెంజాయ ముద్రలిడుచు

    రిప్లయితొలగించండి
  39. ప్రగతి కడ్డైన తిమిరాల పార ద్రోల
    భాస్కరుని దివ్య తేజంబు పారుచుండ
    తనువు పులకించ విరిసేను తరుల విరులు
    ముందు పక్షులు మేల్కొని పులకరించు

    రాధాకృష్ణ రేగళ్ళ
    సింహపురి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విరిసేను' అన్నదాన్ని 'విరిసెను' అనండి.

      తొలగించండి