26, మే 2017, శుక్రవారం

సమస్య - 2370 (రతిపతి మన్మథుఁడు గాఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రతిపతి  మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్"
(లేదా...)
"రతిపతి మారుఁ డెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్"
ఈ (ఆకాశవాణి వారి) సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. సతతము వీణా వాదన
  చతురత్వమున తన రత్న సభను సకలశో
  భితము చేసెడి నాభా
  రతిపతి మన్మధుడు కాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 2. రతిపతి మన్మధు డేనని
  సతతము నమ్మిన సబబగు; సరసిజ భవుడే
  సుతరాముగ దెలియుము భా
  రతిపతి; మన్మథుఁడు గాఁడు; బ్రహ్మయె తలఁపన్

  రిప్లయితొలగించండి
 3. అతివల చెంతకు చేరెడు
  . రతిపతి మన్మధుడు గాదె? రాగము కూర్పన్
  . మతి యందుననిల్చెడి భా
  .రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్

  రిప్లయితొలగించండి


 4. సతతము తలరాతల మా
  ర్చు తరము గల కమలజుండు చూడిమి మార్చన్
  యతిశయమేమి గలదికన్
  రతిపతి  మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. అతులిత మహిమోపేతపు
  స్థితి పుట్టుకఁజేసి వేద చింతన కలుగన్
  స్తుతమగు వాడు గుణాఢ్యుడు
  రతిపతి మన్మధుడు కాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి


 6. సతతము రాతలన్నిటిని సాగర ఘోషవ లెన్ తరంగ వే
  గ తరము గాను మార్చుచు సగంధునిగా నతడే రచింపగన్
  రతిపతి మారుఁ డెట్లగును, బ్రహ్మయె కాదె తలంచి చూచినన్
  జతలను నిల్పువాడు, మరి చక్కగ నార్యుని తాను మార్చునౌ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. చతురానను డని యన్నను,
  క్షితిపయి పరమేష్ఠి యన్న, క్షేమంకరుడౌ
  శతధృతి, స్రష్ట యటన్నను
  రతిపతి! మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  రతనపుగని యామ్నాయము
  లతిగా గను బ్రహ్మ తానె యారంభించెన్
  సుతనే సతిగా జేకొను
  "రతి" పతి మన్మథుడు గాదు బ్రహ్మయె త ల పన్!

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  రతికిని యూహలే చెలగ రక్కసి యెవ్వరొ కాదు,నీవె; నీ
  మతి జెడగొట్టు మారుడను మర్మ మెరుంగని కేళి సల్పి నీ
  స్థితిని దలంచ దోషివిక ఛీ ,తవ ఖ(క)ర్మయె నొష్టరాత పో
  "రతి" పతి మారుడెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  ఆర్యా, మూడవ పాదంలో "స్థితిని యెరుంగ"గా చదువ గలరు.
  (అక్రమ లైంగిక సంబంధాలను నిరసిస్తూ! అనే మాటను వచనంగా క్రింద జోడించండి)

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు హైదరాబాదు వెళ్తున్నాను. రోజంతా ప్రయాణంలో ఉంటాను కనుక మీ పూరణలను సమీక్షించక పోవచ్చు. దయచేసి మీ మీ పూరణ పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 12. సిత కమలాలయి శారద
  శ్రుతి వీణాధరి శుభకరి రుచి సంభాషా
  వితతి నొసంగెడి శ్రీ, భా
  రతి, పతి మన్మథుడు గాడు, బ్రహ్మయె తలపన్!

  రిప్లయితొలగించండి
 13. డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
  మతిమాలి పల్క బోకుర
  గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
  సతిపతుల మార్చకుము భా
  రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 14. డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
  మతిమాలి పల్క బోకుర
  గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
  సతిపతుల మార్చకుము భా
  రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 15. డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
  మతిమాలి పల్క బోకుర
  గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
  సతిపతుల మార్చకుము భా
  రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 16. రతిపతి యెవరని నరయగ
  రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తలపన్
  హతవిధి! యనకుమ యట్లని
  పతిదేవుడు వాణికతడు పరమాత్ముండున్

  రిప్లయితొలగించండి
 17. _ప్రతిసతిపతిజత రసపద
  గతినతిమధురజతుల రతికార్యము సల్పన్
  వితరణమునుచేయునతడు
  రతిపతి మన్మధుడు; గాడు బ్రహ్మయె తెలుపన్

  రిప్లయితొలగించండి
 18. మతిమంతుడ పఠియించుము
  శ్రుతుల బురాణముల నీకు రూఢిగ తెలియున్
  అతులిత యక్షర సుర భా
  రతి పతి, మన్మథుడు గాడు, బ్రహ్మయె తలఁపన్.

  రిప్లయితొలగించండి
 19. స్తుతమతి చెప్పెద వినుమా
  రతిపతి మన్మథుడు గాద, రసనాగ్రమునన్
  అతులితముగ నిలచిన భా
  రతిపతి మన్మధుడుగాడు, బ్రహ్మయె తెలుపన్.

  రిప్లయితొలగించండి
 20. కం.వితతిగ సృష్టించె జగతి
  సతతము యా జదువులమ్మ సాంగత్యమునన్,
  శ్రుతులకు మూలము జయ భా
  రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మ యె తలఁపన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 21. సత తాబ్జభవ మనోరత
  విత తాభిన వాక్షమాల విలసిత హస్త
  ద్యుతి జిత శశాంక తను భా
  రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్


  కతిపయ మానవేంద్రులకుఁ గల్గును సందియముల్ మనమ్ములన్
  ద్యుతిసెడి వ్యర్థ కార్యములఁ దోరము నిల్పగఁ జిత్త మంతయున్
  స్తుతమతి కేల సంశయము చోద్యమ!వాణికి భర్త, కంతుఁ డా
  రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సెప్టెంబర్ 22, 2015 నాటి నా పూరణ కించిత్సవరణ తో. అసమీక్షితము.

   సతి వాణి చతుర్ముఖహృ
   ద్రత శుకవారిజ విమల కరాంబుజ బ్రాహ్మీ
   శృతి సూక్తి వివిక్తయు భా
   రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.

   తొలగించండి
 22. లతికను బోలు దేహమున రంజిలు చుండును శౌరి కోడలౌ
  రతి ప్రియపత్ని సుందరుడు లచ్చికుమారుడు శంబరారికిన్
  సతతము నాల్క లందునను చక్కగపల్కెడు తమ్మికంటి భా
  రతి పతి మారుడెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్

  రిప్లయితొలగించండి
 23. సుతునంద శివుని సురలున్
  స్తుతించ నంగజుని గాల్చి సూనునిఁ గన నా
  సుతు నుదుటి లేఖకుడనఁగ
  రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్

  రిప్లయితొలగించండి
 24. ప్రతిమలఁ జేసి ప్రాణమును భాసిలఁ బోయుచు శౌరిసూనుఁడే
  సతతము ప్రాణులన్ భువికిఁ జక్కఁగఁ జేర్చుచు నుండి భక్తి స
  న్నుతులు గొనన్ జతుశ్శ్రుతులు నోటను వెల్వడఁ జేయునట్టి భా
  రతిపతి, మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె, తలంచి చూచినన్!

  రిప్లయితొలగించండి
 25. అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున్
  స్థితికిని కారకుండయిన శ్రీహరియున్ మరొకండు వానికిన్
  సుతుఁడగు పద్మసంభవుఁడు శుభ్రి, విధాతయె పుష్పభానుడౌ
  రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్!

  రిప్లయితొలగించండి
 26. మతులను పోగొట్టు రీతుల
  ధాత నహల్యను సృష్టింప తా నట జూడన్
  మతిచెడి సురపతి యనుకొనె
  రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 27. చతురాననుడు ప్రజాపతి
  పితువు విరించనుడు కర్త వేలుపుబెద్దన్
  శతదళసంభవుడే భా
  రతి పతి,మన్మధుడుగాడు, బ్రహ్మయె తలపన్!!!


  సుతుడగు గణపతి శివునకు
  రతిపతి మన్మధుడు గాడు, బ్రహ్మయె తలపన్
  పతియగు వాణికి సతతము
  రతినాధ జనకు డగునుగ లక్ష్మీపతియే!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెతలబ్బునొ ? హితమందునొ ?
   మతిచెడునో ? ధృతి కలుగునొ ? మా తలరాతల్
   బ్రతుకున వ్రాయునెవండన
   రతిపతి మన్మథుడు గాడు ! బ్రహ్మయె తలపన్ !!

   అతుల సుగంధ బంధుర సుమావళికాయువు మూడునాళ్లుగా
   గతి యన లేని కొండ కలకాలము నిల్చెడి రీతి, చంచల
   స్థితి విరచించెడిన్ గజిబిజిన్ తలరాతనెవండటన్నచో
   రతిపతి మారుడెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూడగన్!!

   తొలగించండి
 28. అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున్
  స్థితికిని కారకుండయిన శ్రీహరియున్ మరొకండు వానికిన్
  సుతుఁడగు పద్మసంభవుఁడు శుభ్రి, విధాతయె పుష్పభానుడౌ
  రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్!

  రిప్లయితొలగించండి
 29. పతి యయ్యెను 'హరి లక్ష్మికి'

  సతి యయ్యెను 'నగజ' సంతస మొప్పన్;

  సతి చదువుల తల్లికి నీ

  రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలపన్.

  విద్వాన్,డాక్టర్,మూలె రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా,7396564549.

  రిప్లయితొలగించండి
 30. క్షితిలో మానవ జాతిని
  మితిమీరగ పెంపు సేయ మేధస్సులలో
  నతి కామము సృజియించెడి
  రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె తలపన్

  రిప్లయితొలగించండి
 31. నుతమగు వాక్కు పల్కితివి నూతన మింతయు లేనె లేదు; భా
  రతిపతి మారుఁ డెట్లగును?; బ్రహ్మయె కాదె తలంచి చూచినన్!
  సతమత మౌచు పృచ్ఛకుడ! చచ్చుచు బ్రత్కుచు సృష్టిజేసితో
  కుతిగొని కైపదమ్మిటను క్రుద్ధుడు గాకయె షాలు కప్పుకో!

  రిప్లయితొలగించండి