14, మే 2017, ఆదివారం

సమస్య - 2360 (పోయిన దేదియును దిరిగి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పోయిన దేదియును దిరిగి పొందగ వశమే"
(లేదా...)
"పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే"

63 కామెంట్‌లు:

 1. పోయిన కాలమును మరియు
  పోయిన జీవులు, వయస్సు,పుడమిని యెపుడున్
  పోయిన పరువము జూడగ
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పుడమిని నెపుడున్" అనండి.

   తొలగించండి
 2. ధ్యేయము భగవన్నుతియని
  సాయించెడు వారికెపుడు సత్వరమందున్
  సాయము,తథ్యము,నమ్ముము!
  పోయినదంతయును తిరిగి పొందగ వశమే!!!
  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించండి
 3. పోయిన ధనమ్ము దొరకును
  పోయిన సుఖ శాంతులన్ని పొందగ వచ్చున్
  మాయని యశమ్ము మినహా
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే...


  "Who steals my purse steals trash; 'tis something, nothing;
  'Twas mine, 'tis his, and has been slave to thousands;
  But he that filches from me my good name
  Robs me of that which not enriches him,
  And makes me poor indeed."


  ...Shakespeare in Othello

  రిప్లయితొలగించండి
 4. పోయిన ప్రాణము గణముల
  నాయకుడు తిరిగి బడసెను నగసుత వేడన్
  కాయ వదనములు వేరై,
  పోయినదేదియును దిరిగి పొందగ వశమే


  రిప్లయితొలగించండి
 5. కందగణమేల తప్పెన్,
  ఎందుకుతప్పెను యతిగతి, ఎప్పుడు లేదే,
  కందివిరచిత సమశ్యల్
  అందరి మన్ననలు పొంది ఆహ్లాదమిడన్

  పోయెనట బ్యాగు బస్సులో, పుస్త కములు
  పాసు బుక్కులున్న ఎడల భంగ పడక
  పొంద వచ్చు, పాన్ కార్డును పొంద వచ్చు
  మరల,ధనము నగలు యున్న తిరిగి రావు,
  ఐనను వలదు చింతలు, ఆంధ్ర రాష్ట్ర
  కవుల కావ్యపు సంపద గదుల లోన
  తూగుచున్న ఏ దొంగలు దోచ గలరు,
  ఇన్క ముల పైన చేయునా ఎప్పుడైన
  దాడులు అనిశా వారలు, ధరణి పైన
  కంది వారు చింతను మాని కవులు కొరకు
  బ్లాగులోసమస్యల నిమ్ము బాగు గాను

  రిప్లయితొలగించండి
 6. గురువు గారూ నమస్కారములు అన్యధా తలచ వలదు. కొంత స్వాంతనకు మాత్రమే సుమా

  నిన్న పూరించిన సమస్య ఒక్క సారి అవకాశమున్న వీక్షించమ్డి

  పాములును చంపు నెయ్యవి,
  దేముడు కరుణించు నెపుడు,దేవిని కొలువన్
  ఏమిజరుగు మానవులకు
  చీమల, గొల్చిననె,కలుగు శ్రీ భాగ్యమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. పోయెను బ్యాగ్ వాహనమున,
  పోయినది తిరిగి దొరకును పోలీసులకున్
  సాయము కోరిన యెడలన్.
  పోయినదేదియును దిరిగి పొందగ వశమే

  పోలీసుల సాయముతో తిరిగి పోయిన వస్తువు పొందగ వచ్చు నాను ఊహతో

  రిప్లయితొలగించండి


 8. మాయా లోకము లోనన్
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే
  గాయము లాయెను జీవన
  సాయం కాలపు సమయము సంకటపాటుల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. గాయము గాంచెనౌ మదియు కాలపు సాయము బోవగన్నిటన్
  న్యాయము గాదు భారతి వయస్యులు తెక్కలిపాటు లోనవన్
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే
  చేయన యత్నమున్ గురువు చేర్చును లబ్ధిని సోవసీయముల్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  నా ప్రశ్నా జ్ఞానము కొలది వ్రాస్తున్నాను.
  సాయము గోరి వేదమున సాగిన విద్యన జోష్యమబ్బగా
  పోయిన మీదు వస్తువది పొందుగ చేరునటన్న ఘోషరాన్
  మీయది మీదియే యగును మిన్నిట క్రిందకు వంగినన్ జుమీ!
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే!!

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  ఖాయము ఆశావాదము
  శ్రేయము, చింతిల్ల ఫలమె చిక్కగ జతనం
  బేయగు శోధన గనుమా
  పోయినదేదియును తిరిగి పొందగ వశమే!!

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  పోయెను అంతర్జాలము
  మాయమయెన్ లెక్కలన్ని మరియొకపరి "కొ
  క్కో"యన, కొల్లలు వెతకన్,
  పోయిన దేదియును తిరిగి పొందగ వశమే!!

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  ఖాయము ద్రవ్యరాశి తన కాయము మార్చునుగాని లుప్తమౌ
  టా?యది యున్నదెచ్చటనొ ఠావును దప్పిన చింత దుర్భరం
  బేయది నీది కాదు యిది బీరమె నాదన గాంచ నొక్కచో
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే!!

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా
  సాయము జేయువారలును చక్కని శీలము గల్గువారికిన్
  "పోయిన వస్తువం"చెరుకబూనిన మానరు శోధనాళి నా
  దేయను జాడ యుండవలె దేవునిదౌ కృప తోడ నొక్కచో
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే!!

  రిప్లయితొలగించండి
 15. మాయము చేయును కాలము
  నాయువు, ప్రాయమును పూర్వ నాత్మ స్థితులన్
  రేయిని, పగలును రయమున
  బోయినదేదియును దిరిగి పొందగ వశమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పూర్వ+ఆత్మ' అన్నపుడు నుగాగమం ఎలా వచ్చింది? "ప్రాయము, వెనుకటి యాత్మస్థితులన్" అనండి.

   తొలగించండి
 16. న్యాయానువర్తనంబును
  ధ్యేయము చేరంగ సతము దివురుట యుక్తం
  బేయెడ తగ దలసత్వము
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?.

  న్యాయము ధర్మవర్తనము నవ్యయశంబుల నందగోరు స
  ద్ధ్యేయముతోడ మానవుడు దీప్తచరిత్రను గాంచగా వలెన్
  శ్రేయము లందగోరవలె చెల్వ మశాశ్వత మెంచి చూడగా
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే?

  హ.వేం.స.నా. మూర్తి.

  రిప్లయితొలగించండి
 17. ధ్యేయము దృఢతర మైనను
  న్యాయంబును నమ్మి యున్న నవయత్నముతో
  నేయెడ చరియించినచో
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే.

  న్యాయము ధర్మవర్తనము నవ్యయశంబుల నందగోరు స
  ద్ధ్యేయముతోడ మానవుడు ధీయుతు డౌచు నిరంతరంబుగా
  నేయెడ సంచరించినను నిమ్మహి సత్ఫల సిద్ధియౌ నికన్
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే.

  హ.వేం.స.నా.మూర్తి.


  రిప్లయితొలగించండి
 18. ప్రాయము నాపగ లేమిక
  సాయము జేసెడి మనసును జతగొన లేమే
  కాయము నిలుపగ లేమిట
  పోయిన దేదియును తిరిగి పొందగ వశమే!

  రిప్లయితొలగించండి
 19. భార్యావియోగి తక్షణ స్పందన:

  ఆయమ షట్కర్మలఁ దా
  నాయికయై మమత పంచి నన్నిల వీడన్
  తీయని స్మృతులవి తక్కన్
  పోయిన దేదియును తిరిగి పొందగ వశమే?

  రిప్లయితొలగించండి
 20. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. కాయము, కాలము, ప్రాణము,
  నాయువు, దానముగ నొసఁగినట్టి ధనమ్మున్
  న్యాయము దప్పిన నడతయుఁ
  బోయిన దేదియును దిరిగి పొందగ వశమే

  రిప్లయితొలగించండి
 22. తీయని మమతలపంచుచు
  హాయిగ మిము పెంచుచుండు నమృతమూర్తుల్
  బాయకుడు తల్లిప్రేమను
  పోయినదేదియును తిరిగి పొందగ వశమే
  మాతృదినోత్సవం సందర్భంగా
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. "పెంచుచుండు నమృతపు మూర్తుల్" అనండి. 'నమృత' అన్నపుడు 'న' లఘువే.

   తొలగించండి
 23. మాయలమారి లోకమున మత్తును కొందరక్కటా
  తీయగ మాటలాడుచును తేనెల పూసిన కత్తులై సదా
  హేయముగా జనావళిని వింతయు ముంచగ వారికుట్రలో
  పొయినదేదియున్ తిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "మత్తున నుండియు కొంద రక్కటా" అందామా?

   తొలగించండి
 24. బోయని వేట గాగ నటు మోక్షము బొందెను బావురమ్ము ,ఎడన్
  బాయఁగ జంట బావురము భాష్ప పు ధారలు గుర్య జేయ రా
  మాయణ దివ్యవాణి ఘన మంత్రపు వాణి గ బొంది నాడనన్
  బోయి న దేదియున్ దిరిగి పొందగ నెవ్వరి కైన సాధ్యమే !
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...బావురమ్ము+ఎడన్' అని విసంధిగా వ్రాశారెందుకు? '..బావుర మ్మెడన్' అంటే సరి!

   తొలగించండి
 25. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హాయిగ తిరుగాడుటలో
  కాయము నలవడ పరచెడి కట్టడ నుండన్
  పీయువు తోడను బ్రదుకున
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?

  రిప్లయితొలగించండి
 26. కాయము నార్జనమ్ము కలకాలము నిల్వవు భూతలమ్మునన్
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే
  మాయను జిక్కి వర్తిలు యమానుష వ్యక్తులు తారసిల్లగన్
  పోయిన పత్రపున్ నకలు పొందెడు మార్గము చూడ మేలగున్

  రిప్లయితొలగించండి
 27. భూయానమునందుఁ దొలగి
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?
  మాయామయమౌ జగమున
  ఖాయము గాచేతిలోనఁ గలదే మనదౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'నకలు' అన్యదేశ్యం కదా! అక్కడ "పత్రపున్ ప్రతిని పొందెడు..." అనండి.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.

   తొలగించండి
  3. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.

   తొలగించండి
 28. మాయా మయ మీ విశ్వము
  ప్రాయమ్ములు బుద్బుదంపు ప్రాయములు సుమీ
  కాయమ్ము లనిత్యమ్ములు
  వోయిన దేదియును దిరిగి పొందగ వశమే


  తోయపు వారి కీయ పరితోషము వొందగఁ బుస్తకమ్ములుం
  బాయక దృష్టి విత్త సముపార్జనపై సతి నుంచ నొక్కెడన్
  మాయపు మాట లెల్ల విని మన్నన నిచ్చిన విత్త రాశులుం
  బోయిన దేదియుం దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   అనిత్యములతో మొదటి పూరణ, 'పుస్తకం వనితా విత్తం...' శ్లోకాన్ని గుర్తుకు తెచ్చిన రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. పోయెడి కాలమున్, గడచి
  పోయెడి జీవన యాత్రలో నిటన్
  మాయని యాత్మ బంధములు, మానసమందనుభూతి రాగముల్
  తీయని గుర్తులై మిగిలి
  తీరును చెంతననంత గీతమై,
  పోయిన దేదియున్ దిరిగి
  పొందగ నెవ్వరికైన సాధ్యమే!

  రిప్లయితొలగించండి
 30. చల్లుచు మరిచా మన్నించండి
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 31. బోయని వేట గాగ నటు మోక్షము బొందెను బావురమ్మెడన్
  బాయఁగ జంట బావురము భాష్ప పు ధారలు గుర్య జేయ రా
  మాయణ దివ్యవాణి ఘన మంత్రపు వాణి గ బొంది నాడనన్
  బోయి న దేదియున్ దిరిగి పొందగ నెవ్వరి కైన సాధ్యమే !
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 32. మాయామయ జగమున వా
  పోయిన దేదియును,తిరిగి పొందగవశమే
  పోయినదిక పోల్లనుకొని
  హాయిగ నిదురించు నతడు యన్నిట సుఖుడౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాయామేయజగత్తిది
   ప్రాయము కాలము యశమును ప్రాణము మరియున్
   కాయములనుయైదింటిని
   పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?

   పోయిననేమి సంపదలు పొందిన బొందగ వచ్చునేమొ యీ
   మాయజగత్తునందు గన మానము మాటయు కీర్తిచంద్రికల్
   ప్రాయము కాలమున్ మరియు ప్రాణములన్నవాటిలో
   పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే.

   తొలగించండి
  2. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "ప్రాణములంచు గణించువానిలో..." అనండి.

   తొలగించండి
 33. పోయిన ప్రాణము పరువులు
  పోయిన మన ధనము రూపు పుత్తడిమరియున్
  పోయిన వన్నియు రావిక
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే

  రిప్లయితొలగించండి
 34. పోయెను జూదమ్ముకు- పడి
  పోయెను పెన్నూబిలోన- పోయెను సొత్తుల్
  పోయెను మానము- తనకట
  పోయిన దేదియును దిరిగి బొందగ వశమే

  రిప్లయితొలగించండి


 35. కాయమె యైనను మరియును
  ప్రాయము గాయములె యైన వసుధను జూడన్
  నాయువె యైనను ఘనముగ
  పోయిన దేదియును దిరిగి పొందగ వశమే?

  రిప్లయితొలగించండి
 36. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  పోయెన్ వత్సరశతములు
  పోయెన్ రాజరికరాజ్యభోగములెల్లన్
  ఖాయముకాలగతిఁకలిసి
  పోయిన దేదియును తిరిగి పొందగ వశమే?.


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  🌹🙏🌹

  రిప్లయితొలగించండి

 37. పిన్నక నాగేశ్వరరావు.

  పోయిన మానము,మాటయు

  ప్రాయము,గడిచిన సమయము,
  బాల్యము, యశమున్
  కాయమును వీడు ప్రాణము

  పోయిన దేదియును దిరిగి పొందగ
  వశమే ?

  ****************************

  రిప్లయితొలగించండి
 38. పోయిన స్వర్ణమున్ దిరిగి పొందగ వచ్చును పోలిసొల్లగా
  పోయిన రాజ్యమున్ దిరిగి పొందగ వచ్చును సోనియమ్మరో
  పోయిన కీర్తినిన్ మినహ పోకిరి మాటల శాస్త్రివర్యుడా!
  పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే...

  రిప్లయితొలగించండి