పిట్టా వారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. "ఎవరి కొంప ముంచాలె(?)పో హిత మెరుగని"* అందామా? 'ముంచాలె' అన్నది వ్యావహారికం. ఇక్కడ మీరు జన వ్యవహారాన్నే ప్రస్తావించారు కనుక దోషం కాదనుకుంటాను. కాదనుకుంటే "ఎవరి కొంప ముంచుదు" అనవచ్చు.
ధ్యాన ధ్యాతయు ధ్యానము తావు లెరిగి శాస్త్ర మర్మము తెలియగ చక్క గాను నపుడు జరుగును ధ్యానము నట్లుగాక ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు శాస్త్ర నిర్ణయము ననుసరించి ధ్యానం చేసేదికాదు జరిగేది అని విజ్ఞులకు తెలిసినదే అలాకాక ధ్యానం చేసేది అనుకొని చేస్తే అజ్ఞానమే కలుగుతుంది అని పూరణ చేశాను.విజ్ఞులు ఆదరింతురు గాక
కామేశ్వర రావు గారూ, మీ మొదటి పూరణ మీ అన్నగారి పూరణలను తలపించింది. 'కామద ధ్యానము' చేత మీ రెండవ పూరణ మీ ప్రత్యేకతను చాటుతున్నది. రెండు పూరణలూ మనోహరాలు. అభినందనలు.
దృష్ఠి నిల్పవాయె నినెన్ని తిట్టు చున్న
రిప్లయితొలగించండిసగము సగము పనులు జేసి సాగి పోదు
వెటుల మారక పోయిన నిచ్చును పర
ధ్యాన మొనరింప మిగుల నజ్ఞాన మొదవు.
తోపెల్ల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరధ్యాన' మన్నపుడు 'ర' గురువై గణదోషం. అక్కడ "పెర। ధ్యాన" మనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణతో:
తొలగించండిఅగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః
పగలు రాత్రి యనక నిద్ర భద్రత విడి
తిండి తిప్పలు లేకనె మొండి జేసి
సుఖములన్ని వీడియు చిత్తశుద్ధి లేని
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిచక్కని భావంతో మంచి పూరణ చేశారు. అభినందనలు.
ఆయురారోగ్యములబెంచు నవని నరుడు
రిప్లయితొలగించండినియమ నిష్ఠల తోడున నిరతముగను
ధ్యానమొనరించ , మిగుల నజ్ఞాన మొదవు
బద్దకమ్మని చెప్పిరే పెద్ద లెల్ల
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తులను పొందవచ్చును భక్తి తోడ
రిప్లయితొలగించండిప్రణవ నాదంబు లనిడుచు పరమ శివుని
ధ్యాన మొనరించ, మిగులనజ్ఞాన మొదవు
నాస్తి కత్వముం గలిగిన నరుల జాతి
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసయు శక్తిని లేని తాపసినిఁజేరి
రిప్లయితొలగించండిధ్యాస లేనట్టి గురుని ప్రార్ధనలు సలిపి
మోసపరుడగు సన్న్యాసి మందుఁజేరి
ధ్యానమొనరింప మిగుల నజ్ఞానమొదవు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండికానలను జేర జాలని ఘనులు నింట
జరుపు యష్టాక్షరిది యనసరకు గొనుడు
"ఎ.వ.రి.కొం.ప.ముం.చా.లె";పో! నెనరు లేని
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు!
డా.పిట్టా
రిప్లయితొలగించండిపూనియు నాసనాల్ గదుర ప్రొద్దున లేచును యోగవిద్య లో
కానికి మేలటంచు తన కాయము డస్సిన నోర్చు, ప్రార్థనల్
మానడు, సాత్త్వికంపు ఘనమైన ఫలాదుల నారగించు లే!
ధ్యాన మొనర్చుటే మిగుల;నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్!!
పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. "ఎవరి కొంప ముంచాలె(?)పో హిత మెరుగని"* అందామా? 'ముంచాలె' అన్నది వ్యావహారికం. ఇక్కడ మీరు జన వ్యవహారాన్నే ప్రస్తావించారు కనుక దోషం కాదనుకుంటాను. కాదనుకుంటే "ఎవరి కొంప ముంచుదు" అనవచ్చు.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా,౮అక్షరిని ఇమిడించే తొందరలో జరిగిన తృటిని సూచన మేరకు సవరించాను.కృతజ్ఞతలు.
ద్వైత సిద్ధాంతమది లేదు దైవ మొకటి
రిప్లయితొలగించండినీకు నాకును భేదమ్ము నిండు సున్న
యంచు పరమాత్మ పైదృష్టి నుంచలేని
ధ్యానమొనరింప మిగులనజ్ఞాన మొదవు
శ్రీహర్ష
శ్రీహర్హ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మద్యపానంబు చౌర్యంబు మానవతకు
రిప్లయితొలగించండిదూరమైనట్టి పనులను తోరముగను
చేయుచుండుట మొదలగు చేష్టల పయి
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు.
మానము నెంచబోవకను మానవతన్ విడనాడి మద్యమున్
పానము చేయుచుండి బహుభంగుల బొంకులు పల్కుటెల్లెడన్
జానగు కార్యమంచు తన స్వాంతము నందున నిత్య మేవిధిన్
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణలు. అభినందనలు.
తేనియలొల్కు కమ్మనగు దేవుని నామము సంస్మరింపగా
రిప్లయితొలగించండిమానసమందు నెంచుకొని మందిర మేగిన భక్తవర్యుడా
స్థానమునందు చిత్తమున సారవిహీనము తుచ్ఛమౌ పర
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
సోమయాజులు గారూ,
తొలగించండిమిక్కిలి చక్కని పూరణ నందించారు. అభినందనలు.
కానక యీశుని న్కుటిలకాంక్షలచట్రమునందు బందియై
రిప్లయితొలగించండినేనును నీవనే భ్రమల నిత్యము జోగుచునుండి సూక్తులన్
వీనులబెట్టక న్సతము వెర్రిగ తుచ్ఛసుఖాల గోరుచున్ ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్.
మిస్సన్న గారూ,
తొలగించండిమనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
'అనే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "నేనును నీవటంచు భ్రమ నిత్యము..." అంటే ఎలా ఉంటుంది?
గురువుగారూధన్యవాదములు.మీసవరణకుధన్యవాదములు.
తొలగించండి[5/17, 8:00 PM] Dr Umadevi B: 9493846984
రిప్లయితొలగించండివిజ్ఞతయు హెచ్చుచుండును విస్తృతముగ
ధ్యానమొనరింప, మిగుల నజ్ఞానమొదవు
సతము పెద్దల మాటలన్ శ్రద్దతోడ
నాలకింపక యున్నచో నవనియందు
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూనిక పుణ్య కార్యముల బొత్తిగ జేయక దైవప్రాభవ
రిప్లయితొలగించండిమ్మానక పండితాగ్రజుల నక్కట దూషణ జేయుచున్ సురా
పాన మొనర్చుచున్ తిరుగు పాపియొకండిటు పల్కె నిష్టతో ధ్యానమొనర్చుటేమిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
వీటూరి భాస్కరమ్మ
పూనియొక లిప్తపాటును పొల్పుమీరి
రిప్లయితొలగించండివడలునొంచని సోమరి నుడివెనిట్లు
చాలు చాలును దంభముల్పేలవలదు
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఒడలు'ను 'వడలు' అన్నట్టున్నారు.
రిప్లయితొలగించండివీనియ నందు తంత్రులటు వీనుల విందుగ జేయు నాదమై
జ్ఞానము, భక్తి కర్మల సజావుగ జేయ వలెన్ జిలేబి, ఓ
మానిని! నీవు మేలుగన మార్గము జీవన మందునన్ సదా
ధ్యాన మొనర్చుటే! మిగుల యజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్!
జిలేబి
హమ్మయ్య! ఇన్నాళ్ళకి నాకు కూడా అర్ధం అయేలా అందమైన పద్యం వ్రాసితిరి. చాలా సంతోషం!!!
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అజ్ఞతగా దేనిని గణిస్తారు?'
తొలగించండిమిగుల (ధ్యానము చేయకుండా మిగిలితే అజ్ఞతే అని సర్దేసుకోవాలి :)
జిలేబి
తొలగించండిధన్యవాదాలండి
జీ పీయెస్ వారు మీకు పద్యమర్థమైనందుకు సంతోషం గా ఉంది :)
నమో జీపీయెస్ వారికి! సుజన ! నా పద్యమున్ మీ
రు మెచ్చారయ్యా!యందులకు నెనరుల్ మీకు సుమ్మీ !
సమాళించామంతే ! పదములను సామ్యంబు గాంచం
గ మా యత్నంబున్జేయ సరసము గా పద్య మొచ్చెన్ :)
జిలేబి
🙏🙏🙏
తొలగించండిజిలేబి గారూ క్రొత్త పద్యములను వ్రాయు నపుడు వృత్తము పేరు కూడా వ్రాయండి. ఇది చంద్రశ్రీ వృత్తమా?
తొలగించండిపద్యము+ వచ్చెనః పద్యమొచ్చెన్ అని సంధిచేయరాదుగదా.పద్యము+అయ్యెన్ పద్యమయ్యెన్ అంటే సరిపోతుందేమో?
తొలగించండి
తొలగించండిశ్రీ రెడ్డి గారికి
మీ సవరణల కు నెనర్లు
అవునండీ చంద్రశ్రీ వృత్తమే
జిలేబీ నీపద్యమ్ముల దరువు చిత్రమ్ము సుమ్మీ :)
జిలేబి
హిరణ్యకశిపుడు సుతుడు ప్రహ్లాదునితో
రిప్లయితొలగించండిబాల! ప్రహ్లాద! సంవాదమేల నయ్య
శ్రీహరి మనకహితుఁడౌచు చేర రాడు
శత్రువైనట్టి వానిని జపతపముల
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు!
👏👏👏👏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
అధ్యయనమునేకాగ్రత నంద జేయు
రిప్లయితొలగించండిచక్కనౌ జ్ఞానము తెలివి సరళరీతి
చెడుతలంపుల నూహల చిత్త ముండ,
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్యానము మోక్ష సాధనకు తారకమై విలసిల్లునీ భువిన్
రిప్లయితొలగించండిదానినయోగ్యులెల్ల ధన దాహము దీర్చెడి సాధనంబుగన్
మానము వీడి మార్చిరథమంబుగ వారల నాశ్రయించియున్
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఅచ్ఛు తప్పు పడింది మన్నించండి
రిప్లయితొలగించండిశ్యామల
మోక్షమును పొందవలెనను దీక్షతోడ
రిప్లయితొలగించండిపుష్కరాక్షుని గుడికేగి మొక్కుబడిగ,
తలచుచు మనస్సు నందున ధనముగూర్చి
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శుద్ధి జేయుచు చిత్తమున్, సుస్థమొసగు
రిప్లయితొలగించండినేకదృష్టిని నిలుపుచు నెవ్వరైన
ధ్యానమొనరించ, మిగుల నజ్ఞానమొదవు
మనసు లగ్నము జేయక జనులు జదువ!!!
కొంగజపమును జేయుచు భంగు తాగి
రిప్లయితొలగించండిసంఘవిద్రోహ శక్తుల సరస జేరి
మభ్య బెట్టుచు జనులను మస్కరిగను
ధ్యానమొనరించ మిగుల నజ్ఞానమొదవు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దీనులఁ గూర్చితల్చకను తీవ్రపు స్వార్థపు బుద్ధితోడుతన్
రిప్లయితొలగించండికానుక లన్నియున్ గొనుచు కంజదలాక్షుని దేవళమ్మునన్
జ్ఞానితెరంగు శ్రీ ధరుని గానము తోడ నటించు తుచ్ఛమౌ
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కలిమి సుఖ శాంతులకు మూల కారణమని
రిప్లయితొలగించండిమహిని సర్వము కరతలామలకమనియు
పరమ పదమును విడనాడి సిరులగోరి
ధ్యానమొనరించ మిగులనజ్ఞానమొదవు
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివాయితో దైవ నామమ్ము పలుకకుండి
కరము నందున జపమాల కదల నీక
నిండుగ మది నితరముల నిలిపి యుండి
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిపూనియు నాసనాల్ గదుర ప్రొద్దున లేచును యోగవిద్య లో
కానికి మేలటంచు తన కాయము డస్సిన నోర్చు, ప్రార్థనల్
మానడు, సాత్త్వికంపు ఘనమైన ఫలాదుల నారగించు లే!
ధ్యాన మొనర్చుటే మిగుల;నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్యాన ధ్యాతయు ధ్యానము తావు లెరిగి
రిప్లయితొలగించండిశాస్త్ర మర్మము తెలియగ చక్క గాను
నపుడు జరుగును ధ్యానము నట్లుగాక
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
శాస్త్ర నిర్ణయము ననుసరించి ధ్యానం చేసేదికాదు జరిగేది అని విజ్ఞులకు తెలిసినదే అలాకాక ధ్యానం చేసేది అనుకొని చేస్తే అజ్ఞానమే కలుగుతుంది అని పూరణ చేశాను.విజ్ఞులు ఆదరింతురు గాక
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధ్యాన ధ్యాతయు' అన్నపుడు 'న' గురువై గణదోషం. 'తగిన ధ్యాతయు...' అందామా?
సవరణ చేసినందుకు కృతజ్ఞతలు
తొలగించండితగిన ధ్యాతయు ధ్యానము తావు లెరిగి
శాస్త్ర మర్మము తెలియగ చక్క గాను
నపుడు జరుగును ధ్యానము నట్లుగాక
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
తానిల ధ్యాన బోధకుడు తర్కము జెప్పుచు గ్రంథసాంగుడై
రిప్లయితొలగించండిచానలు చేరగన్ వెకిలి చర్యల కౌగిలి, ముద్దులాటలన్
గానఁగ వచ్చి కృష్ణుడను కల్మష మంటదు నాకటంచు పెన్
ధ్యానమొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిధ్యానము వల్లనే దెలియు దైవమొకండు జగత్తు మిధ్యగా
ధ్యానము వల్లనే తొలగు దైహిక కర్మల పాప పుణ్యముల్
మానిసి నట్టిధ్యాన ఫలమందగ యత్నము జేయకన్ పర
ధ్యానమొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
రిప్లయితొలగించండిననఁగ రా దెవ్వరికి నేల ననఁగ ధ్యాన
మిచ్చు నిలఁ జిత్త శాంతిని నేరి కైన
శాంత చిత్తుఁడు వర్ధిల్లు సద్గుణముల
మానవ జన్మ సర్వ భవ మండన మిద్ధరఁ బొంద భాగ్యమౌ
గాన సుమోక్ష సిద్ధికి నిగాదము విజ్ఞులచే నిలన్ సురా
పాన పలాన్న భక్షణకు బానిసలై యిహ లోక కామద
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ మొదటి పూరణ మీ అన్నగారి పూరణలను తలపించింది.
'కామద ధ్యానము' చేత మీ రెండవ పూరణ మీ ప్రత్యేకతను చాటుతున్నది.
రెండు పూరణలూ మనోహరాలు. అభినందనలు.
ముక్తి సాధన కొఱకయి రక్తి విడక
రిప్లయితొలగించండికోరికల తోడి నిత్యము పోరు సలిపి
విషయ వాంఛల విడివడు విధము లేని
ధ్యానమొనరించ మిగుల నజ్ఞానమొదవు!
శిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహరిని ధ్యానించు తనయుని యిష్టపడక
నాలకింపుము నామాట యాదరాన
ధ్యానమొనరించ మిగులనజ్ఞాన మొదవు
ననుచు ప్రహ్లాదు తోపల్కె నసురవరుడు
నియమ నిష్ఠలతోడను నెమ్మనమున
తలచిన పనులు నెరవేరు ధైర్యమూని
ధ్యానమొనరింప,మిగుల నజ్ఞానమొదవు
నట్లుగాక పరుల దిట్ట నవనియందు.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హానియెనాయె కాంగ్రెసుకు
రిప్లయితొలగించండిహైదరబాదున రాహులన్నరో!
దీన పరిస్థితిన్ దలచి తీరిక మీరగ చంద్రశేఖరున్
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్
కోనల కోనలన్ దవిలి కొండల ముచ్చుల పట్టగావలెన్