15, మే 2017, సోమవారం

సమస్య - 2361 (కనులు వేయి గలిగి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కనులు వేయి గలిగి కాంచలేఁడు" 
(లేదా...)
*కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు. 

75 కామెంట్‌లు:

  1. శివుని ముద్దు బిడ్డ శృంగారి వాహ్యము
    అందమైన పక్షి మంద బుద్ధి
    పురిని విప్పి యాడ కరిగి పోవు మనసు
    కనులు వేయి గలిగి కాంచలేఁడు

    వాహ్యము = వాహనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివుని ముద్దు బిడ్డ శృంగారి వాహన
      మందమైన పక్షి మంద బుద్ధి
      పురిని విప్పి యాడ కరిగి పోవు మనసు
      కనులు వేయి గలిగి కాంచలేఁడు

      వాహ్యము = vaahanamu

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఆత్మ జ్ఞానము పరమాత్మ నెరుక జేయు
    పాంచ బౌతికపు ప్రపంచ మనుజు
    నెదుట నిల్చు దేవు నెరుకతె లియదోయి
    కనులు వేయి గలిగి కాంచ లేడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      బాగుంది మీ పూరణ.
      'ఆత్మజ్ఞాన' మన్నపుడు త్మ గురువై గణదోషం. 'ప్రపంచ మనుజు' డనుట దుష్ట సమాసం. "ఆత్మ నెరిగియు పరమాత్మ... ప్రపంచ నరుని। యెదుట..." అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదపూర్వక నమస్సులతో సవరించి
      ఆత్మ నెరిగియు పరమాత్మ నెరుక జేయు
      పాంచ బౌతికపు ప్రపంచ నరుని
      యెదుట నిల్చు దేవు నెరుకతె లియదోయి
      కనులు వేయి గలిగి కాంచ లేడు.

      తొలగించండి
  3. పాపకర్ముడౌచు కోపంబు వహియించి
    భూతదయను వీడి పుడమిలోన
    తిరుగు చుండువాడు దేవుని లీలలు
    కనులు వేయి గలిగి కాంచలేఁడు.

    ఎన్నగ బోక కర్మముల నింతయు ధర్మము చేయబోక తా
    నెన్నడు మానవత్వ మొక యించుకయైనను చూపబోక యా
    పన్నుల కెల్లరీతులను బాధను గూర్చుచు నుండువా డిలన్
    కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్.

    హ.వేం.స.మూర్తి.

    రిప్లయితొలగించండి


  4. ఆడు వారి మనసు నా యింద్రు డైనను
    కనులు వేయి గలిగి కాంచలేఁడు
    వెసులు బాటు నిచ్చె వేలుపగమికాడు
    లేమ మది జిలేబి లెస్స సూవె !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. అన్నులు మిన్నగన్ మదియు యా పర మాత్ముని గాంచ కోరినన్ ,
    కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్
    మిన్నగ గావలెన్ మనము, మిక్కుట మైనటి కాంతి పుంజమున్
    తిన్నగ జూడనౌ తపము తీవ్రము జేయ వలెన్ జిలేబి సూ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "మిక్కుటమై తగు కాంతి..." అనండి.

      తొలగించండి
  6. తల్లిదండ్రులన్నదమ్ములు చక్కగా
    నమరి లోక రీతి నరసినారు
    వీడు దక్కనింట--విధి బలీయముఁగాదె!
    కనులు వేయికలిగి కాంచలేడు
    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కర్మచారి శిక్ష గనకుండ యుండును
    నర్మ భాషణముల నాడు నేత
    చాప క్రింద నీళ్లు చప్పున రా గను
    కనులు వేయి కలిగి కాంచ లేడు

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    అన్నివిధాల దైవతము లాడుచు నుండగ ముందు వెన్క నా
    పన్నుడు జీవి పూర్వకృత భాగ్యము లేకను దేవదేవు ని
    న్నెన్నడు మాయలో బడిన నేక గురోర్మిని దాకకున్నచో
    కన్నులు వేయి గల్గినను గాంచగలేడు గదా ప్రకాశమున్

    రిప్లయితొలగించండి
  9. ఆత్మజ్ఞానమొకటె అంధత్వమును బాపు
    విశ్వభవుని రూపు వీక్షనిండు
    నతిశయించనహము నాపర మాత్ముని
    కనులు వేయికలిగి కాంచలేడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ఆత్మజ్ఞాన'మన్నపుడు త్మ గురువై గణదోషం. 'వీక్షనిండు' ...?

      తొలగించండి
  10. అన్ని రకాల సాయముల నక్కెర దీర్చుచు కే.సి.యారు తా
    నెన్ని విధాల సంస్కరణ నేమిని దోలుచునుండ దుండగుల్
    పన్నిరి నీతి దూరమగు బాటల సంఘటనా బలమ్ముతో
    ఎన్నరు కార్య నిర్వహణనే యవినీతికి నింటి దొంగలై
    కన్నులు వేయి గల్గినను గాంచగలేడు గదా ప్రకాశమున్...డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  11. "సహస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ |"


    అంతరాత్మ సృష్టినంత జేసి మనల
    దాగి యుండి సత్య ధర్మములను పాప పుణ్యములను కోప తాపములను;
    కనులు వేయి గలిగి కాంచలేఁడు


    "శరీరస్థోsపి కౌన్తేయ న కరోతి నలిప్యతే||"

    రిప్లయితొలగించండి
  12. నిషి కాము కతను మైమరచి తనదు
    తెలివి తగ్గ నతడు తెలియలేడు
    నిజము నెరిగి మసల నియతము తోడను
    కనులు వేయి గలిగి గాంచ లేడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిషి'...? అక్కడ గణదోషం కూడా. 'నిశిని' అనడం మీ అభిప్రాయమా?

      తొలగించండి
    2. ఓహో... మనిషిలో మ టైప్ కాలేదా? అర్థమయింది. బాగుంది.

      తొలగించండి
    3. పొరపాటు జరిగిందండీ నేను కూడా చూసుకోలేదు.మరల పంపుతున్నాను. నా తృప్తి కోసం
      మనిషి కాము కతను మైమరచి తనదు
      తెలివి తగ్గ నతడు తెలియలేడు
      నిజము నెరిగి మసల నియతము తోడను
      కనులు వేయి గలిగి గాంచ లేడు.

      తొలగించండి
  13. తల్లి విలువ తెలియ తనయుండు లోకాన
    ఎల్లవేళలందు నెంతొ ఘనుడు
    ఎరుక లేనివాడు ఎంతయునజ్ఞాని
    కనులు వేయికలుగ కనడు వెలుగు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  14. కనులు లేనివాడు కనలేడు కాంతిని
    కనులు గలుగువాడు కాంచగలడు
    కాని యున్న కనుల గట్టిగా మూసిన
    కనులు వేయి గలిగి కాంచలేఁడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మూసుకున్నప్పుడు రెండు కళ్ళున్నా, వేయి కళ్ళున్నా ఒకటే. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. మున్ను మహేంద్రు డెంతయును మోహముతో మునిపత్ని గోరి తా
    నెన్నగ భర్తరూపమునేగి అహల్యను మోసగించి వే
    చన్న విధమ్మెరింగి ముని శాపమిడంగను దేహమంతయున్
    కన్నులు వేయి గల్గినను కాంచగలేడు కదా ప్రకాశమున్
    ఇక్కడ ప్రకాశము అంటే వివేకము అన్న అర్థం వాడాను
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  16. బాల భక్తుడైన ప్రహ్లాదు రక్షించె
    దారుణాలనాపు దక్షుడైన
    నఘముఁ బండు దాక హరి తెరువననుచు
    కనులు వేయి గలిగి,కాంచ లేఁడు

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.

    చేతులేమి లేవు చేపట్టు జీవుల

    కనులు వేయి గలిగి కాంచలేడు

    విప్పి చెప్పమనగ వెంటనే చెప్పితి

    ' వల ' యనుచు కథకు జవాబు నేను.

    ****************************

    రిప్లయితొలగించండి
  18. వేయి కనులు గలిగి కాంచలే డనుటయ
    జగమె రుంగు నగ్న సత్య మదియ
    నాక లోకవిభుడు నర్మభా వముతోడ
    నుండు కతన నయ్యె నొండు విధము

    రిప్లయితొలగించండి
  19. [5/15, 7:28 AM] sreeramaraochepuri: ఆత్మ నెరుగు టొకటెఅంధత్వమును బాపు
    విశ్వభవుని జూడ వీలు కలుగు
    నతిశయించ నహము నా పరమాత్ముని
    కనులు వేయి కలిగి కాంచలేడు
    [5/15, 11:05 AM] sreeramaraochepuri: పున్నమివెన్నెలల్ విరిసెపుణ్యము బొందగ నెన్నిజన్మలన్
    కన్నుల నిండ గాంచితిని కృష్ణుని విశ్వజనీన రూపమున్
    బన్నములెన్ను కౌరవులు పాపులు దుర్మద చిత్తవృత్తులన్
    కన్నులు వేయి గల్గినను గాంచగలేరుగదా ప్రకాశమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      క.....కృ యతిని సవరించండి

      తొలగించండి
    3. "కన్నుల నిండ గాంచితిని కంజదళాక్షుని దివ్యరూపమున్" అందాం.

      తొలగించండి
  20. ఆలుబిడ్డలంచు ననవరతము తల్చి
    స్వార్థపరత మనసు సాగుచుండ
    పరుల కష్టములను సరకుగొనడుతాను
    కనులు వేయి గలిగి కాంచ లేడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. వెల్గె భూ నభముల విశ్వరూపంబున
    గీత బోధఁ జేసి కృష్ణ మూర్తి
    మహము నిహము నుండు మానవమాత్రుండు
    కనులు వేయి గలిగి కాంచ లేఁడు

    రిప్లయితొలగించండి
  22. సుర గణాధినేత సుత్రాముఁడు బలారి
    పాకశాసనుండు వజ్ర ధారి
    పర సతీ వికార వశమున ధర్మము,
    గనులు వేయి గలిగి, కాంచ లేఁడు

    తన్నిల వైనతేయునకుఁ దాదృశ మంచు వచింప నెల్లరున్
    మిన్నున సంచరించుచు నమేయ జవమ్మున బర్హి రాజమే
    పన్నుగఁ దారకమ్ము లనఁ బక్ష యుగమ్మునఁ జిత్ర చిత్రపుం
    గన్నులు వేయి గల్గినను గాంచఁగ లేఁడు గదా ప్రకాశమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. ఉన్నతమైన వర్తనల నుర్వినొనర్చక పెచ్చరిల్లుచున్
    చెన్నగు కాంత రూపుఁ గని చెంతకుచేరి చరించువాడు తా
    కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్
    మన్నన కల్గునా జగతి మానవ నైజము వీడు కొంటెకున్

    రిప్లయితొలగించండి
  24. కనులు వేయి కలిగి గాంచ లేడు వెలుగు
    లేని చోట చూపు లేని వాడు
    వేయి చెవులు కలిగి విన నోచు కొనలేడు
    బధిరు డెటుల యెరుగు ప్రణవ రవము

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    అన్నులమిన్నకోసమయి యంధుఁడు శక్రుఁడుఁ గుక్కుటమ్మునై
    చెన్నలరారఁ గూసి, ముని చెచ్చెఱ నేఁగఁగ, నింట దూరి, య
    న్నన్న! మహాపరాధ మట నా మునిపత్నికిఁ జేసి, శప్తతన్
    గ్రన్నన జ్ఞానదూరగుఁడుగా నవివేకిగ నయ్యు, వ్యర్థమౌ

    కన్నులు వేయి గల్గినను, గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో...

      అన్నులమిన్నకయ్యు రిధమాంధుఁడు శక్రుఁడుఁ గుక్కుటమ్మునై
      చెన్నలరారఁ గూసి, ముని చెచ్చెఱ నేఁగఁగ, నింట దూరి, య
      న్నన్న! మహాపరాధ మట నా మునిపత్నికిఁ జేసి, శప్తతన్
      గ్రన్నన జ్ఞానదూరగుఁడుగా నవివేకిగ నయ్యు, వ్యర్థమౌ
      కన్నులు వేయి గల్గినను, గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  26. వినుము విశ్వ మందు విజ్ఞుడైనను గాని
    మనసు తమిని దాటి మసలు దనుక
    దివ్యమైన జగతి నవ్యతనంతయు
    కనులు వేయి గలిగి కాంచ లేడు!

    రిప్లయితొలగించండి
  27. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    మోసగించుమాయ మోహంబునన్ జూడ
    దానిలీలలెఱుగతరముగాదు
    ఘనసురేంద్రుడైన కడకోడునేగాని
    *కనులువేయిగలిగి కాంచలేడు*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  28. కోట్లు గూడబెట్టి నోట్లు హుండినవేసి
    పసిడి కాన్క లిడుచు ప్రస్తుతించి
    యాత్మశుద్ధిలేక నాదివరాహుని
    కనులు వేయి గలిగి గాంచలేడు!!!

    రిప్లయితొలగించండి
  29. ఆలి వోలె తలచి అతివల నెప్పుడూ
    పడక సుఖము కోరు పాపి కెపుడు
    తల్లి గుర్తు రాదు, దైత్యసుతుడిలలో
    కనులు వేయి కలిగి కాంచ లేడు

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శ్రీహరి యవతార శీలము లందలి
    లెస్స గూర్చు నట్టి లీల లన్ని
    దివము నేలు చుండు దేవేంద్రు డైనను
    కనులు వేయి కలిగి కాంచ లేడు

    రిప్లయితొలగించండి

  31. అంధుడైన వాడు నవనిలో మంచిని
    కాంచ గలడు నయముగాను తాను
    కలిమి మదము చేత కలిగిన వాడైన
    కనులు వేయి కలిగి కాంచలేడు.

    రిప్లయితొలగించండి


  32. అక్రమార్జనమ్ము నవలీలగా చేసి

    తప్పు కప్పి పుచ్చ ధరణి యందు

    గోపురములు మరియు గుడులతిరుగ హరిన్

    కనులు వేయి కలిగి కాంచలేడు.


    2.ఇంద్ర పదవి నంది యిలలో శచీపతి

    మునియొసంగి నట్టి ముచ్చటైన

    హారము కరికిడుచు హానిని పొందెతా

    కనులు వేయి కలిగి కాంచలేడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. ఏక నేత్రుడైన ఇలలోని యందాలు

    తనివి తీర గాంచి ధన్యుడౌను;

    ఎంత దారుణమ్మొ? ఇంద్రుని శాపమ్ము

    కనులు వేయి కలిగి కాంచ లేడు.

    విద్వాన్,డాక్టర్,మూలె రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు. ప్రొద్దుటూరు.7396564549

    రిప్లయితొలగించండి
  34. అంతరాత్మలోన నలరారు శ్రీరామ
    చంద్రమూర్తి రూపమింద్రుడైన
    ధ్యాన యోగ సాధనాన మునగ కున్న
    కనులువేయిగలిగి కాంచలేడు

    రిప్లయితొలగించండి
  35. ఆర్తత్రాణుడనుచు నవనిజనులు నమ్మి
    కొలువనేమివాడు కలియుగమున
    వీనులున్ననేమి వినగలేడాతండు
    కనులు వేయి గలిగి కాంచలేడు

    స్వార్థపరుడగుచును వసుధను మనుజుండు
    కలత దీర్చమనుచు కలియుగమున
    వేడనేమి వినడువీనులున్నను వేల్పు
    కనులువేయిగలిగి కాంచలేడు


    ఎన్నియొ శాస్త్రముల్ జదివి యీశుని భక్తునిగాను కీర్తినే
    మిన్నగ బొందిరావణుడు మేదిని పుత్రిని రామపత్నియౌ
    యన్నులమిన్నగోరుటయె యబ్బురమేమది జ్ఞానశూన్యుడే
    కన్నులు వేయిగల్గినను కాంచగ లేడుగదాప్రకాశమున్

    రిప్లయితొలగించండి
  36. యంత్ర మునకు కనుల నేర్పాటు జేసినా
    యింద్రు డావహించి యేమి జేయు?
    విద్యు దావహనము పెట్ట కుండిన యంత
    కనులు వేయి గలిగి కాంచలేడు

    రాధాకృష్ణ రేగళ్ళ
    సింహపురి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ మూర్తి గారూ,
      'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...జేసినా' అన్నదాన్ని '...జేసినన్' అనండి.

      తొలగించండి
    2. మీ సూచనకి ధన్యవాదములు. ఇప్పుడే పద్యరచన సాధన మొదలు పెట్టాను. పెద్లల సలహా సహకారాలు తప్పకుంజా భేషజాలేమీ లేకుండా స్వీకరించి అనుసరిస్తాను

      తొలగించండి
  37. Customs Official:👇

    చిన్నవి పెద్దవిన్ గనక చేతికి చిక్కిన వన్నితిందు నే
    పన్నులు కట్టకుండనిట పాడుదు నాడుదు నన్నివేళలన్
    పన్నుగ భారతావనిని పాలన జేసెడి నాయకుండహో!
    కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్ :)

    రిప్లయితొలగించండి