21, మే 2017, ఆదివారం

దత్తపది - 113 (కోపము - తాపము - పాపము - శాపము)

కోపము - తాపము - పాపము - శాపము
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్న నియమం లేదు)

49 కామెంట్‌లు:

  1. పరశురాముని కోపము మరపునిచ్చి
    కుంతి తాపము చేతులఁ గురచ చేయ
    నభిని జంపిన పాపము నంటుకొనగ
    శాపముల్ జుట్టి కర్ణుడు క్షౌణివీడె

    రిప్లయితొలగించండి
  2. భూమాత కోపము పోరులో తనతేరు చక్రముల్ ధరణిలో చలన రహిత
    మాయెను, పరశురామ మునిని వంచించి శాపము బడయగ శస్త్ర విద్య
    గుర్తుకు రాదాయె, కుల స్త్రీని సభలోన వలువలు నొల్చంగ వలదు వలదు
    పాపము అని తాను ఆపక ధర్మము తప్పి చేసెను గొప్ప తప్పు నాడు,
    తన ప్ర తాపము కోల్పోవ తనదు తప్పి
    దములు కారణ మాయెను తరచి చూడ,
    తప్పదు తనకు మరణము, ధర్మ మెపుడు
    జయము నొందుతిరుగు లేక జగతి యందు
    యనుచు కర్ణుడు భావించి అమరు డాయె



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులస్త్రీని' అన్నపుడు 'ల' గురువై గణదోషం. "కులసతిన్ సభలోన..." అనండి. 'పాపము+అని తాను+ఆపక' అన్నచోట సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "పాప మటంచు దా నాపక..." అనండి. 'అందు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "జగతి యంద।టంచు..." అనండి.

      తొలగించండి
  3. (ధర్మజుడు తమ్ములకు శాంతిబోధ చేయు సందర్భము)
    1.*కోపము*ను *తాపము*ను మానుకొనుము వినుము
    *పాపము*నుచేయు పాపిష్టి బ్రతుకు వద్దు
    కదనమున రక్త మేరులై కదలిపారు
    గురుల *శాపము*తగులుట మరువవద్దు.

    కోపమున్ దిగమ్రింగుమా మది కోరుమా సుఖశాంతులన్
    తాపమున్ శమియింపఁజూడుము ధర్మకర్మలఁజేయుచున్
    పాపమున్ తలఁబెట్టఁబోకుము ప్రాజ్ఞులై విలసిల్లుడీ!
    శాపమున్ గురులిత్తురే!యలసత్వమున్ విడనాడుడీ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా మత్తకోకిలలో పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. కోపము లేని ధర్మజు ప్రకోపము నెంచనినాడు కల్గు సం
    తాపము, వాని కోపమున ధారుణి కంపము నొందు నింక యా
    వైపున చూడ నా ద్రుపదుపాప, ముకుందుని చెల్లి యా సతీ
    శాపముకైన జంకుగొని సంధిని వీడకుమా సుయోధనా ||
    (కృష్ణ రాయబారం: శాపము కి అన్యార్థం స్ఫురించలేదు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. భీముని పలుకులు చంద్రశీ వృత్తము

      ప్రకోపమ్ముల్గూడున్, రణమున పారింతు రక్త
      మ్మకో! శాపమ్ముల్ తీర జనుల మారాటముల్ ప
      న్నుకో! పాపమ్ముల్ పండగ మిము నూర్చంగ నిక్క
      మ్మకో! తాపమ్మున్ తీర్చనిక సమాఘాతమే కో !

      జిలేబి

      తొలగించండి
    2. నేమాని వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దత్తపదాలను అన్యార్థంలోనే ప్రయోగించాలన్న నియమం పెట్టలేదు కదా! కోపము, తాపములను కూడా స్వార్థంలోనే ప్రయోగించారు.
      *****
      జిలేబీ గారూ,
      కో అంటే కొల్లుగా పద్యాలు వ్రాస్తున్నారు. అందులోను విశేష వృత్తాలు! సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (అన్నట్టు ఎంతో అంతర్జాలానుభవం ఉన్న మీరు పైన నేమాని వారి ప్రాంగణంలోకి ప్రవేశించారెందుకు?)

      తొలగించండి
    3. ఆర్యా! ధన్యవాదములు.
      ప్రకోపము, సంతాపము అని అన్యార్థంలో ప్రయత్నించాను.
      మీ సెల్ ఫోన్ నంబరు వీలయితే ఇవ్వగలరు. జూలై 15-16 హైదరాబాదుకి వస్తున్నాను.
      మీరు ఆ సమయంలో అక్కడ ఉంటే తప్పక కలుస్తాను.

      తొలగించండి
    4. సోమయాజులు గారూ,
      కోపము, తాపములకు ఉపసర్గలు చేరి విశేషార్థాలను ఇస్తున్నవి. అంతే అర్థ భేదం లేదు.
      జూలై నెలలో నేను హైదరాబాదులోనే ఉంటాను. మనం కలుసుకోవచ్చు.
      నా ఫోన్ నెం. 8886058976

      తొలగించండి

    5. కంది వారు నమో నమః !

      కళ్ళు నిజంగానే డమాల్ అయినట్టుంది :) శస్త్ర చికిత్స మరో మారు తప్పేటట్టు లేదు ! హా జరా ! యేమి యీ మాయా !

      సో మా ని వారికి క్షమాపణలు వారి ప్రాంగణం లోకి ప్రవేశించి నందు కు !

      జిలేబి

      తొలగించండి
  5. కోపము దుర్యోధన బహు
    తాపము కలుగంగజేయు తగదని రచటన్
    పాపము నొడిగట్టెద విక
    శాపములను జూతువనుచు సజ్జను లపుడున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. *కోపము*లేనివాడు జనకోటికి వంద్యుడు చిత్తమందు సం..
    *తాపము*నొందబోవడు వినమ్రుడు ధర్మపరాయణుండునౌ
    *పాపము* జేయబోడు, పెరవారికినైనను మేలుజేసెడిన్
    *శాపము* గాక యేమి వనచారిగ మ్రగ్గ యుధిష్ఠిరుండటన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. కోపముతో సుయోధనుడు ఘోరవిషాదమునందె చూడగా
    తాపముతోడ కీచకుడు దారుణశిక్షకు పాత్రుడయ్యెనో
    పాపముచేయువారలకపాయము తప్పదటంచు నేర్పుచున్
    శాపముబొందికర్ణుడిలశక్తివిహీనత గాంచెయుద్దమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      "...గాంచె నాజిలోన్" అనండి.

      తొలగించండి
  8. ప్రణయ కోపముచే సత్య భామ యలిగె
    భక్త హృత్తాపములు దీర్చు పరమ విభుడె
    పాప ముక్తకుడే సత్య పదములంటె
    సతికి శాపము కాబోదు సరసమగుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
      కాని కథాంశం భాగవతానికి చెందినట్లున్నది.

      తొలగించండి
    2. మన్నించాలి. భారతార్థం అనే మాట చూడ లేదు.

      తొలగించండి
  9. కోపము,తాపము,పాపము
    శాపము లీధరణియందు శత్రువులనుచున్
    చూపెను భారత సంహిత
    దీపముగాదారి చూపె తీరుగ నడువన్

    రిప్లయితొలగించండి
  10. పాపము మూటగట్టుకొనె పాండు నృపాలుడు మౌనిదంపతుల్
    తాపము తీర్చుకోవగను తాము మృగమ్ముల రూపుదాల్పగన్
    తా పదునైన బాణముల తద్దయు జంపగ మౌనికోపమున్
    శాపమునొందెభార్యను రసాన్వితుడై వెసతాకి చావగన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తీర్చుకోవగను' అనడం సాధువు కాదు. "తాపము బాపగన్ దలచి..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  11. విరటుని కొల్వులో కంకుభట్టు వలుని ఉద్దేశించి-

    కోపమ్ముల్ గని లాభమే మి? వలుడా! కోతుల్వలెన్నీవిటన్
    తాపమ్మున్ గొని వృక్షమున్నట సముత్పాటించ నేలన్ సుమా
    పాపమ్ముల్ సరి జేయ నీదు యగవో ? పాలించు మన్నీడు దా?
    శాపమ్ముల్ సమ!యోధుడా! కరణముల్ సాధింప మార్గమ్మిదౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. పాప ముదురు విష మిచ్చి ప్ర
    కోపము ఫణులఁ గరపించి కుంతీ సుతునిం
    జూపి ప్రతాపమున నద భృ
    శాపమునం ద్రోసిరి పెలుచనఁ గౌరవులే

    [నద భృశ+ఆపము = నదభృశాపము: అధిక నదీ జల సముదాయము]

    రిప్లయితొలగించండి
  13. కోపముగ సూతుడనుచున్
    తాపముతో స్వామిజంఘి తాలిమి లేకన్
    శాపము నిడెతక్షణమే
    పాపము రాధేయు విద్య వ్యర్ధంబయ్యెన్!!!


    కోపమున రాజరాజును
    తాపముననె కీచకుండు, దైవాకరియున్
    శాపమున, సైంధవుండిల
    పాపమున, నశించె గాదె భారతమందున్!!!

    రిప్లయితొలగించండి
  14. కోపము జ్ఞానసంపదను గోల్పడఁ జేయును భీమసేన నీ
    తాపము సాజమౌను వ్యవధానము కావలె వైరిఁ గూల్చగన్
    పాపముచేయువాడు చను పాశిసమీపము, పూర్వజన్మపున్
    శాపము కారణమ్మునను సంకట మౌస్థితి కల్గెనిచ్చటన్

    రిప్లయితొలగించండి
  15. తాపమునొందిమారునిప్రదర్శనకూర్వశి పార్థు కోరగన్
    కోపము తో నతండు నది కూడని కృత్యమటంచు రోయగన్
    శాపము పెట్టి నచ్ఛరయుషండుని గమ్మని రాజుకొల్వునన్
    పాపము నాడు రూపమున భామలకేర్పడ జెప్పెనాట్యముల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. విరాట రాజు కొల్వు లోనికి చేరు సమయమున అర్జునుడు ధర్మ రాజుతో పల్కిన పల్కులు

    పాపము కాబోదు పార్దా| విరహ తాపమున ఈశరీరము మోజు పడుచు
    నీపొందు కోరెను నిజముగా, ఇంద్రలోకమున వావివరుస లేమి లేవు.
    ఊర్వసి యర్పించె సర్వము నీచెంత, కోపమున్విడువుము , కోరు చుంటి,
    వేడుచుంటిని, నిన్ను విడువలేను విజయా, రా, రమ్ము రయముగ రతిని సలిపి
    సౌఖ్యమును పొందు ఫల్గుణా, సరస మాడ
    కున్న పేడివై వసియించు, గోత్ర బిధుని
    ప్రేయసిని నేను శాపము నీయు చుంటి
    వేగి రమ్ముగా అర్జునా వెడలి పొమ్ము
    యనుచు రమణి శపించెను నన్ను , నేడు
    యదియె వరమాయె, విరటుని అంత పురము
    లోన నాట్యము నేర్పింతు ఘనత తోడ

    రిప్లయితొలగించండి
  18. పాపమటంచు కౌరవుల వంకర చేతల మందలించకన్
    తాపము నొందె తండ్రి సమితంబున బుత్రులు మృత్యువొందగన్
    కోపము చేత కృష్ణుగని గోపక వంశము నాశమయ్యెడిన్
    శాపము నిచ్చె తల్లి తను సాంతము దప్పని దీక్ష బెంపునన్

    రిప్లయితొలగించండి
  19. కోపమన్నను విను కుంతిమధ్యమునిదే
    .....రారాజు నవని పొర్లాడజేసె
    తాపమన్నను చూడు ద్రౌపదీదేవిదే
    .....కౌరవకులమెల్ల నారజేసె
    శాపమన్నను శృంగిదే పరీక్షిత్తుకు
    .....సప్తాహములను నిస్తార మిడెను
    పాపమన్నను శిశుపాలునిదేకదా
    .....దైవదూషణము సాధనము నిచ్చె

    కోపతాపము ల్వైరుల కొంపగూల్చె
    శాపము తుదిని ముక్తికి జూపె ద్రోవ
    పాప మీశుని జేరెడి బాట వేసె
    భారతమ్మున చిత్రము ల్పావనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      కోప తాప పాప శాపాలను ఎంత మనోహరంగా, ఎంత వైవిధ్యంగా భారతార్థంలో నిబద్ధం చేశారు. ధారాశుద్ధి కలిగిన అద్భుతమైన పూరణ. అభినందనలు.
      ఆరోజంతా అమెరికా వెళ్తున్న మా మిత్రునితో ఉండి ఎండలో తిరగవలసి వచ్చింది. విపరీతమైన తలనొప్పి, అలసట కారణంగా పద్యాలను సమీక్షించలేకపోయాను. మరునాడు చూద్దామనుకున్నాను. మరిచిపోయాను.

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదశతములు

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కోపము లేని నడితితో
    తాపము నొందక దరుమము దాల్చిన పొడతో
    పాపము శాపము లంటక
    పెంపారెను ధర్మరాజు పెద్దఱికముతో

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. కోపము లేని ధర్మజుకు కోపము కల్గగ యుద్ధ మేర్పడెన్
    తాపము తీర భీముడట తా రిపు మర్దన జేసె, వారలున్
    పాపము జేసి కౌరవులు పాప ఫలంబును పొంద, కర్ణుడున్
    శాపము చేత యుద్ధమున సర్వ వినాశము నొందె చూడగన్

    రిప్లయితొలగించండి
  23. కోపముప్పొంగ దుర్వాస తాపసుండు
    విరహ తాపము చే తన్ను విస్మరించు
    కణ్వ పుత్రికి పాపము కరుణ లేక
    శాపమునొసంగె సంయమ శక్తుడయ్యు

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులకు నమస్కృతులు.
    విపరీతమైన శిరోవేదన కారణంగా ఈనాటి మీ పూరణ పద్యాలను సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి.
    వీలైతే రేపు ఉదయం పరిశీలించి స్పందిస్తాను.

    రిప్లయితొలగించండి
  25. పాపపు పనులను చేయుచు
    తాపముకల్గించి వారు దండన లిడగన్
    శాపమె వరమోనిదియని
    కోపమునాపుకొనలేక కోమలి పలికెన్

    రిప్లయితొలగించండి
  26. నా పూరణ

    కృష్ణునికి గాంధారి శాపం.

    ఉ.||
    కోపము పట్టలేక మరి కూనలు నూర్గురి చావుజూడగా
    తాపము తీరగా హరికి దాపున నిల్చెను హేతువేలనన్
    పాపము త్రుంచగా భువిని బంధువు లందర జంపనేర్తువే
    శాపము మాధవున్ కిచ్చెను జత్తువు నీవని శోకమగ్నయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాధవున ఇచ్చెను' అనవలసింది... "మాధవున్ కిచ్చెను' అన్నారు. అక్కడ "శాప మొసంగె నా హరికి జత్తువు..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువుగారూ నా పద్యం కూడా చూడండి.

      తొలగించండి