2, మే 2017, మంగళవారం

సమస్య - 2351 (కారమ్మును మించి తీపి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారమ్మును మించి తీపి కలదే పుడమిన్"
(లేదా...)
"కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:

  1. మారాము చేయు బిడ్డను
    గారాబుగ జేరదీసి కౌగిలి జేర్చన్
    రారా తండ్రీ యను మమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా శర్మ గారూ,
      మమకారంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  2. కారము సహకా రము వెట
    కారము, మరియున్ పరోప కారము జూడన్
    కారము లన్నిట నా మమ
    "కారమ్మును మించి తీపి కలదే పుడమిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      'కారాలలో కెల్ల ఏ కారమ్ము మేలు? మమకారం తప్ప మరేమున్నది? చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. శ్రీరమణుండు భక్తులకు క్షేమకరుండును లోకనాథుడున్
    నారద శౌనకాదుల మనమ్ముల నుండెడి భక్తపాలుడున్
    సారసనేత్రుడచ్యుతుడు సారసగర్భుని దివ్యమోహనా
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      భగవంతుని మోహనాకారాన్ని గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. మీరిన వృద్ధాప్యములో
    తీరని కోరికలు నోటి తీతలు కాగా
    పోరెడి కోడలిపై యధి
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్


    తీత : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970    

    నరములు లాగు బాధ (తీయుట). [నెల్లూరు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      వృద్ధాప్యంలో కోడలిపై అధికారం .... బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  5. నేరిచి సర్వ శాస్త్రముల నిర్మల భావ గభీర చిత్తుడై
    సారెకు సద్గురూత్తము విశాల మహోన్నతు ,పండితాగ్రణిన్,
    ధీరత మించి,వాగ్విభవ ధీయుతుడై విలసిల్లు ఛాత్ర ధి
    క్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాదరావు గారూ,
      పద్యం చక్కని ధారతో విలసిల్లుతున్నది. శిష్యుడు తనను మించిపోవడం గురువుకు తీయని విషయమే. కాని 'ధిక్కారం'...?

      తొలగించండి
    2. ఛాత్రు సంస్కార ము....అంటేసరిపోతుందా దయచేసి సూచింప ప్రార్ధన

      తొలగించండి
  6. దూరాన వున్న నాధులు
    వారానికి యొక్కమారు వచ్చిన చో
    నారీ మణులకు మదనవి
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      విరహాంతంలో మదన వికారం! సరసమైన పూరణ. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "వారమ్మున కొక్కమారు వచ్చినచో నా। నారీ..." అనండి.

      తొలగించండి
    2. స్వామీ నమస్కారము ముద్ర రాక్షసము వచ్చినచో ఆ అని అనుకున్నాను ఆ

      తొలగించండి


  7. ధీరత్వమువల యును సా
    హోరే యనుచును జిలేబి హోరెత్తంగన్
    వీరము మాన్యంబగు సహ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. వీరుల మానసాంబుధిని వీకొనగాను నిరాశ, కావలెన్‌
    తీరగు రీతి యూరటయు, తిమ్మయు గానగ మేని, వారికిన్
    జోరుగ సాగ జీవితము జోకము లేక, జిలేబులూర స
    త్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. సమస్యా పూరణ లే రీ టయర్డు జీవులకు వూపిరి :)

    మా రీటైర్డు జనులకున్
    సారంబొప్పెడి కవులకు సరసి జిలేబీ
    యేరాల సమస్యా స్వీ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సహకార సత్కార స్వీకారాలతో మూడు పూరణలు వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
      ఇతరుల సంగతేమో కాని నాకు మాత్రం రిటైర్డ్ జీవిజంలో ఇతర సమస్యలు ఎంత చీకాకు పెట్టినా, బ్లాగులోని సమస్యలు సాంత్వన నిస్తున్నాయి.

      తొలగించండి
  10. డా.పిట్టా
    సారమ్మేదని యెంచగ
    పారమ్మే లేదు వెదుక పారీణునకున్
    పోరక "మాయే" యన "కా
    కా!"రమ్మును మించు తీపి కలదే పుడమిన్!

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    భారవహంబు జీవికయ!బాలుని కేవిధి యూతనివ్వ? నా(యా)
    కారపు పుష్టి చాలునటె,కమ్మని యూహల దేలు హాయినిన్
    జారగనీక తుష్టి నిడ చక్కని యక్షర విద్యకైన శ్రీ
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్!!
    (నేను శ్రీకారం దిద్దించిన డా.తోట,నా ప్రథమ కావ్యమును,అమెరికా నుండి అచ్చొత్తించిన ఘటనను జ్ఞ ప్తికి తెచ్చుకొంటూ, ఆతనికి కృతజ్ఞతలతో!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా శ్రీకారంతో మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      మొదటి పూరణలో 'కాకారము'...?

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా ధన్యవాదములు

      తొలగించండి
    3. డా.పిట్టా నుండి
      మొదటి పూ. హాస్య స్ఫోరకము
      "కా..కా" ॥ఓ బాబాయీ/చిచ్చా/చిన్న నాయనా!(సంబోధన)
      రమ్ము(rum,a dink).తాగిన వాడు జగమేమాయ గా తేల్చి చెప్పగలడు.అతడు Rumకంటఘ తీపిది లేదంటున్నాడు.నా bad luck😢,మీ దృష్టిని గైకొన లేదు.ఇక చూడరు, వ్యాఖ్యానించరు.I missed a lot!ఆర్యా!

      తొలగించండి
    4. పిట్టా వారూ,
      మొన్న నిన్న ప్రయాణంలో ఉండి మీ వివరణను చూచి స్పందించలేకపోయాను. మన్నించండి.
      పినతండ్రి అనే అర్థంలో 'కాకా' అన్నది మాండలిక పదం. ఆ అర్థాన్ని ఊహించక పోవడంతో భావం అవగాహన కాక ఆ వ్యాఖ్య పెట్టాను. ఇప్పుడు అర్థమయింది. మాండలికమైనా సమస్యా పూరణ కాబట్టి స్వీకరించవచ్చు. అభినందనలు.

      తొలగించండి
    5. మీరు మీ పూరణ క్రింద కాకా=పినతండ్రి; రమ్ము=Rum అని అర్థాలిచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.

      తొలగించండి
  12. కోరికతో తను గొల్వగ
    చేరెడు సద్భక్త తతికి చిత్సౌఖ్యంబుల్
    గూరుచు జనార్దను శుభా
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

    నేరము లెంచబోక నను నీపదదాసుని గాంచి త్వత్కృపా
    సారము బంచి గావుమని సన్మతి గొల్చెడివారి కాంక్షలన్
    దీరిచి సర్వ సౌఖ్యముల దేల్చెడి మోక్షదు డైన శార్జ్గి యా
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      దేవుని ఆకారాన్ని ప్రస్తావించిన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. వారని వీరని తేడా
    నేరక మనసులనుకలిపి నీతిగ చెలిమిన్
    కోరెడి ప్రగతిగమన సహ
    కారమ్మును మించితీపికలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  14. ప్రేరణ పొందుచున్ చెలిమి ప్రీతిగ జేయుచు మానసంబునన్
    చేరువ నుండి కూరిమిని జీవన రీతిగ తీర్చిదిద్దుచున్
    కోరెడి సాన్నిహిత్యమదె కొంగుపసిండిగ, వీడుచున్నహం
    కారము, కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
  15. ప్రేరణ పొందుచున్ చెలిమి ప్రీతిగ జేయుచు మానసంబునన్
    చేరువ నుండి కూరిమిని జీవన రీతిగ తీర్చిదిద్దుచున్
    కోరెడి సాన్నిహిత్యమదె కొంగుపసిండిగ, వీడుచున్నహం
    కారము, కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి

  16. తీరము చెంతకు దేహము
    చేరు సమయమున మనమున చింతవిడుచుచూ
    నోరారగ సల్పెడిఓం
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్


    రిప్లయితొలగించండి
  17. భారీ బెట్టింగులతో
    హోరా హోరీ క్రికెట్టు యొత్తిడి మీరన్
    తీరిచి కెప్టెన్ జూపు 'వి' (V)
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్!

    రిప్లయితొలగించండి
  18. నేరము లెంచక నందరి
    పారమ్యము గోరుకొనుచు పదుగురి తోడన్
    సౌరుగ బల్కు తెలుగు నుడి
    కారమ్నును మించి తీపి కలదే పుడమిన్ !!!


    తీరుగ కుటుంబ సభ్యులు
    కూరిమితో యొకరికొకరు కువలయమందున్
    గారము నందించెడు మమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్!!!

    రిప్లయితొలగించండి
  19. ఆరయనాకసమ్మునను అందములొల్కుచునెల్లవారికిన్
    పారము లేని మోదమును పంచుచు చల్లని చూపులన్ ధరన్
    సారెకు నింపుచున్ వెలుగు చంద్రుని చక్కని ముగ్ధమోహనా
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్
    శాస్త్రి

    రిప్లయితొలగించండి
  20. శ్రీ ఆముదాలమురళీ గారికి *వంద*నములతో...

    ధీరాష్టవధానశతక
    తారాశశియైన యాముదాల మురళికిన్
    సార సభాంతర వర స..
    త్కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ !!


    ధీరునకాజి కంటె , మగధీరునకున్ సరసమ్ము కంటె , బం..
    గారము కంటె భామినికి,గౌరవనేతకు కీర్తి కంటె, శృం...
    గారము కంటె జారునకు, కైతల సత్కవికిన్ విశేష స...
    త్కారముకంటె తీయనిది కల్గునె లోకమునందుచూడగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధారయు ధోరణిన్ విపుల ధైర్యము గల్గి యనన్యమైనదౌ
      ధారణ గూడియుండియు వధానము సాధు పదార్థ భావసం..
      భారయుతమ్మునయ్యును సభాసదులన్ మురిపించగా చమ..
      త్కారముకంటె తీయనిది కల్గునె లోకమునందుచూడగన్!!

      తొలగించండి
  21. తీరుగ గనగా కవివర
    చేరుచు నాకన్నతల్లి చిన్నారులపై
    మీరుచు జూపెడి సరిమమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్య గారి పూరణలలో చమత్కారము
    తెల్లవారగానెనింపాలనే కంగారము తెలుగు
    పై ఆయన కున్న మమ కారము విశ్రాంత పెద్దలకు అందించే సహ కారమ్మునుమించిన తీప కలదె పుడమిన్
    ఇది పూరణ కాదు నా మనసు లోని మాట
    తప్పులను మన్నించండి
    వీటూరి శ్యామల

    రిప్లయితొలగించండి
  23. ధారుణియందు మానవుడు దండిగ నర్థము కూడ బెట్టినన్
    కారులు మేడలున్ మిగుల కాంచన హారము లెన్నియున్న సం
    సారములోన మిన్నయగు సద్గణ సంపద కల్గినట్టి సం
    స్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
  24. ధీరత్వముతో నెల్లలఁ
    బోరాటముచేయుచున్న మూకకు సతమున్
    భారతదేశముపై మమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులారా,
    నమస్కృతులు. ఒక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. ప్రయాణంలో ఉన్నాను. గమనించ మనవి.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారు నమస్కారములు�������� ఇద్దరు బాలురీవిధంగా మాట్లడుకుంటున్నారు.
    కం||
    ఏరా! భువిలోనెక్కడ
    నేరేరి గనఁగ దొరకదు నీభాషసమం
    బౌరా! తెనుఁగు పలుకునుడి
    *కారమ్మును మించి తీపి కలదే పుడమిన్*

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. కోరక మారు నిన్ను తము గూర్చిరి విద్యల శక్తి మించినన్
    నేరిచి పట్నవాసమున నిల్చుచుఁ గొల్వున మాతృమూర్తులన్
    వారము నొక్కసారి తగు భక్తిని జూపుచు పల్కరించు సం
    స్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా మరో ప్రయత్నము పరిశీలించ మనవి:

      జేరఁగ మిత్రులు కూడిక,
      మీరఁగ కథ తీసివేత, మేలగు పంచన్
      పోరామి,కలిమికిని గుణ
      కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

      పోరామి=సంకటము

      తొలగించండి
    2. నా మరో ప్రయత్నము పరిశీలించ మనవి:

      జేరఁగ మిత్రులు కూడిక,
      మీరఁగ కథ తీసివేత, మేలగు పంచన్
      పోరామి,కలిమికిని గుణ
      కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

      పోరామి=సంకటము

      తొలగించండి
  30. అధికార మిచ్చు నహంకారము, నమస్కా
    రము తోడ నీ ప్రకారము నడచును.
    తిరస్కారము ల్లేక ధిక్కారములకోర్చి
    సహకార మిచ్చును సంతసముగ,
    ఆకారమునకు నలంకారములు చేసి
    ఛీత్కారములు లేక చెలిమి తోడ
    స్వీకారము తెలిపి,ఘీంకారమునుచేయు,
    ప్రాకారమున నీదు పదవి ముగియ

    సాకారములు లేక శ్రీకారమును చుట్టు
    మరణ పుస్తకమున మనసు విరిగి,
    గుణకారములు, నీదు కూడికల్ తప్పగా
    నీ చమత్కారము నీల్గి వికారమై
    అంధకారము కాగ, వ్యధను పొంది మమకా
    రములు తగ్గ నుడికారములు వన్నె
    తగ్గి ఝoకారము తడబడి కుసుమము
    పైన తిరుగు చుండు భ్రమరకము

    వోలె బ్రతుకు నీడ్చ, జాలి పడక,
    ఇంటిలో వెటకారము, ఈర్ష్య పెరుగ,
    ముఖ్యులెల్ల హాహాకారములు సలుపగ,
    నీ ఉనికి నిరాకారమై నెత్తురోడ,


    కోరుము సాక్షాత్కారము
    మారక సమయమున నీవు భగవంతుని, నో
    రారగ పలికెడి ఆ ఓం
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  31. సోదర కవిపుంగవులకు నమస్కారములు పై పద్యములను పరిశీలిమ్చి తప్పులున్న సరిదిద్ది
    నాకు సహకరించ ప్రార్ధన. పూసపాటి కృష్ణ సూర్య కుమార్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారికి నమస్కారం. సీసమాలిక బాగుంది. గణదోషాలుంటే కొద్దిగా సవరించాను. నచ్చిందేమో చూడండి.
      అధికార మిచ్చు నహంకారమును, నమ
      స్కారము చను నీ ప్రకారముగను
      తిరస్కారము లేక ధిక్కారములకోర్చి
      సహకార మిచ్చును సంతసముగ,
      ఆకారమునకు నలంకారములు చేసి
      ఛీత్కారములు లేక చెలిమి తోడ
      స్వీకారము తెలిపి,ఘీంకారమునుచేయు,
      ప్రాకారమున నీదు పదవి ముగియ
      సాకారములు లేక శ్రీకారమును చుట్టు
      మరణ పుస్తకమున మనసు విరిగి,
      గుణకారములు, నీదు కూడికల్ తప్పగా
      నీ చమత్కారము నీల్గి నీల్గి
      అదియె వికారమై అంధకారము కాగ,
      మమకారములు తగ్గ మథన పడుచు
      ఝంకారములతోడ సౌమనస్యమ్ముల
      పై తిరుగాడెడి భ్రమరకమ్ము
      వోలె బ్రతుకుల నీడ్చుచు, జాలి పడక,
      ఇంటిలో వెటకారము, నీర్ష్య పెరుగ,
      ముఖ్యులెల్ల హాహాకారములు సలుపగ,
      నీ యునికి నిరాకారమై నెత్తురోడు

      తొలగించండి
    2. రెండవపాదం ఇలా మార్చండి:
      లేక తిరస్కార లేశమ్ము లెంతయు
      సహకార మిచ్చును సంతసముగ,

      తొలగించండి
    3. ధన్యవాదములు తప్పక మారుస్తాను

      తొలగించండి
    4. రాత్రి 10 గంటలకు ఈ చిరుత పై శ్రమ తీసుకుని సవరించినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు మిత్రమా

      తొలగించండి
  32. కారణ మేమైనను మమ
    కారము నుపకారము నిలఁ గమనీయపు స
    త్కారము రమణీయ శుభా
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్


    తారక రామ పాదయుగ దర్శన తత్పర మానసమ్మునన్
    ధారుణి మోక్ష సాధన విధానము నెంచి నిరంతరమ్ము దా
    భారము నుంచ దైవమున భక్తి తటాకపు విష్ణునామ ఝం
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగున్నాయండీ పూరణములు.... నమస్సులు! కామేశ్వర రావుగారు!

      తొలగించండి
    2. నమస్సులు మరియు ధన్యవాదములండి శర్మ గారు. మీ పూరణ కూడ గురువు గారు చెప్పినట్లు మనోహరముగా నున్నది.

      తొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. దూరపు కొండల నునుపు,యె
    డారిని మృగతృష్ణ జలపు ఠావులు,కలలో
    పేరాసలు,ఫలియించిన
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  35. .ప్రేరణ చేతను మనసున
    కా”రమ్ము”నుమించితీపి కలదే పుడమిన్
    బేరముజేయుచు నొకడనె
    వేరగు యేపానియాలు వెగటేదెచ్చున్|
    2.ఔర|విచిత్ర బంధమిది|యాశకు గల్గిన సంతు కంతు “లా
    కారమె” తల్లిదండ్రి మమకారము నందునపెద్దలౌచు స
    త్కారముసాకుచుండ సహకారపు పూరణదైవపున్ చమ
    త్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందుచూడగన్|

    రిప్లయితొలగించండి
  36. కారపుబూందితో కలసి కమ్మగ చివ్వను వేళలోన గోం గూరనుగూడి పచ్చడిగ గుమ్ముగ జిహ్వను కమ్ము వేళలో నూరగ నీరు నోట చవులూరెడు క్రొత్తది యావకాయలో
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్.

    రిప్లయితొలగించండి
  37. ఏరుచి లేకనె చప్పగ
    వారము రోజులను మీఱు పథ్యము పిదపన్
    జోరుగ నుల్లుల మిరపల
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  38. ప్రేరణ ఆశావాదమె
    తారస పడ?గాముదాలమురళీ|మూరున్
    జేరవదాన కళాస
    త్కారమ్మునుమించితీపికలదే పుడమిన్|

    రిప్లయితొలగించండి
  39. శూరత లేని భీరువులు శుంఠలు నిత్యము దొంగచాటుగా
    నేరచరిత్రతోడ కడునీచపు చేష్టలు చేయుచుండగా
    భారత మాత రక్షణము భాగ్యమటంచును వీరసైనికుల్
    పోరును సల్పుచుండిరి ప్రమోదముతోడుత జన్మభూమి స
    త్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందుచూడగన్

    రిప్లయితొలగించండి
  40. *పేరు: *శ్రీమతి జి సందిత* *బెంగుళూరు*
    అంశం:నేటి సమస్యకు పూరణ

    *తీరుగశంకరయ్యగురుదేవులుమెచ్చగ!మెచ్చగాచమ*
    *త్కారముశంకరాభరణధామమునందునతోటిపండితుల్!*
    *జోరుగనేనుమాత్రమటుజూపగ!పద్యసమస్యకున్ పరిష్*
    *కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్!*

    రిప్లయితొలగించండి
  41. పంండితులంందరూమెచ్చేరీతిగా మిగతా పంండితులంందరికంంటే ముంందుగా అంందరూ భళే చమత్కారము అనిమెచ్చుకొనేరీతిగా సమస్య పరిష్కాకాన్ని
    చేయగలిగే అవకాశంం దొరికితే ఆ పరిష్కారముకంంటే తీయనైైనది నాప్రాణముకూడా కాదు మరి.

    రిప్లయితొలగించండి
  42. కోరక మారు నిన్ను తము గూర్చిరి విద్యల శక్తి మించినన్
    నేరిచి పట్నవాసమున నిల్చుచుఁ గొల్వున మాతృమూర్తులన్
    వారము నొక్కసారి తగు భక్తిని జూపుచు పల్కరించు సం
    స్కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
  43. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
    *శూరులకున్ గురువులకధి*
    *కారులకున్ పెద్దలకునుగౌరవమిమడన్*
    *కోరకయెలభించునమస్*
    *కారమ్మును మించుతీపిగలదేపుడమిన్*
    🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

    రిప్లయితొలగించండి
  44. అటు నమస్కారములను స్వికరింంచువారికి తీయనైైనవి
    ఇటు ఇచ్చువారికి కూడా స్వీట్లపాకెట్లకన్నా మధురమైైనవి

    రిప్లయితొలగించండి
  45. శ్రీ రమణి మనోహర విశిష్ట విలాస కళా లసత్ చమ
    త్కారము,భారతీ వర పదాంకిత కంకణ కింకిణీ ఝణ
    త్కారము,లాస్య సుందర సుఖంకర శంకర శాంకరీ శుభా
    కారమె మూల హేతువు జగంబున తీయని హాయి నంపగన్

    ఊరక వాదులేల?చవులూర జనింప రసజ్ఞులార!గుం
    టూరు పొలాల పండిన కడుంగడు రుచ్యము నైన పుల్ల గోం
    గూరకు పప్పునేయి జత గూరిచి నంజిన మిర్పకాయదౌ
    కారమె మూల హేతువు జగంబున తీయని హాయి నింపగన్

    పాత సమస్యలు-పూరణలు
    సేకరణ బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి

  46. పిన్నక నాగేశ్వరరావు.

    గారము చేసెడు పిల్లలు

    చేరగ సెలవులకు మాదు చెంతకు ప్రీతిన్

    వారలు చూపించెడు మమ

    కారమ్మును మించి తీపికలదే పుడమిన్.

    *****************************

    రిప్లయితొలగించండి
  47. మిత్రులందఱకు నమస్సులు!

    ధారుణి నెచ్చటఁ జూచిన
    వీరముతో లంచ మెదిగి, విశ్వాకృతినిన్
    ధారణఁ గొనె! ధనసాక్షా

    త్కారమ్మును మించి తీపి కలదే పుడమిన్?

    రిప్లయితొలగించండి
  48. బూరెలు లడ్లు పాయసము పొంగలి చక్కెర జున్ను జాములున్
    క్షీరము హల్వ మీగడయు క్రీములు చమ్చము పాలకొవయున్
    సారము గల్గు ద్రాక్షలు రసాలము లాదిగ నున్ననున్ నమ
    స్కారము కంటె తీయనిది కల్గునె లోకము నందు చూడగన్

    సప్తగిరి దూరదర్శన్ వారు తే 23/08 /2006దీ కై యిదే సమస్యను యివ్వగా
    దానికి నేను చేసిన పూరణమునకు పురస్కార మీయ బడినది . ఆ నాటి పూరణమును
    క్రింద నుదహరించితిని

    ధారణి జీవరాశులకు తానె సమస్తము నై చరించుచున్
    నీరము వాయు వగ్ని క్షితి నింగిని కట్టడి జేయు మాత కౌ
    మారిని గొల్చి ముక్తికయి మక్కువ గొల్వగ నుచ్చరించు ఓం
    కారము కంటె తీయనిది కల్గునె లోకము నందు చూడగన్



    రిప్లయితొలగించండి



  49. కంరారా కన్నా యనుచును
    గారాబముతోడసుతుని కమ్మగ పిలువన్
    మారామును వీడగ మమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్.

    కోరిన విచ్చెద రా సుకు
    మారాయనుచును తనయుని మాలిమి తోడన్
    కూరిమిచూపగ నామమ
    కారమ్మును మించి తీపి గలదె పుడమిన్.

    రిప్లయితొలగించండి
  50. చేరగ నున్నత స్థితికై
    యారాటపడుచు నరుడిల యలసిన వేళన్
    దారా సుతులెల్లరిమమ
    కారమ్మునుమించితీపి కలదే పుడమిన్


    బారెడు వేణియున్న విరిబాలకు కన్నులు చారడేసి, బం
    గారపు రంగుమేనియును కాంతులు చిందెడు చూపులుండియా
    వారిజకున్ ఘనంబయిన వక్షము లుండిన అందమైన యా
    కారముకంటె తీయనిది కల్గున లోకమునందుచూడగన్

    రిప్లయితొలగించండి
  51. కారణ జన్మ మే జగతి కామితమేకల వారికే సదా
    ధారణ తోడనే బహుళ ధా ర్మిక పద్యము లే పురాణమే
    ప్రేరణగా జగానసమ ప్రేరణ తోడ జనాళి చేయు సత్
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి
  52. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  53. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  54. వారము వర్జ్యము జూచిరి
    కారణమా యాడు బిడ్డ గడుపు చలువకున్,
    చేరి యొడి నింపగను మమ
    కారమ్మును మించి తీపి కలదే పుడమిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  55. చేరగ నున్నత స్థితికై
    యారాటపడుచు నరుడిల యలసిన వేళన్
    దారా సుతులెల్లరిమమ
    కారమ్మునుమించితీపి కలదే పుడమిన్


    బారెడు వేణియున్న విరిబాలకు కన్నులు చారడేసి, బం
    గారపు రంగుమేనియును కాంతులు చిందెడు చూపులుండియా
    వారిజతుల్యనేత్ర కుచభార వినమ్రగ వచ్చి నిల్వ నా
    కారముకంటె తీయనిది కల్గున లోకమునందుచూడగన్

    రిప్లయితొలగించండి
  56. ధారుణిలో వృద్ధులకును
    నేరని పసి పాపలకును నెలతలకెపుడున్
    కోరక నొనరించెడి సహ
    కారమ్మును మించి తీపి గలదే పుడమిన్

    రిప్లయితొలగించండి
  57. శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  58. నేరము లెన్నొజేసితిని నివ్వెర వోవక కమ్యునిష్టునై
    ఘోరము లెన్నొజూచితిని కోరిక తీరగ కాంగ్రెసందునన్
    చేరెద భాజపానిపుడె చెల్వము మీరగ మోడి! నీదు స్వీ
    కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్

    రిప్లయితొలగించండి