6, మే 2017, శనివారం

సమస్య - 2354 (పురుషుని గళమందు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్"
(లేదా...)
"పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:


 1. విరుల సరంబును వేసెను
  పురుషుని గళమందు చాన, పుస్తెను కట్టెన్
  వరుడు శుభ ఘడియ లప్పుడు
  దరహా సముతో ముఖములు తన్మయ మొందన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. వరుసగ స్త్రీస్వామ్యములో
  ధరణియు స్వర్ణము ధనమును దానమ్మైనన్
  తరుణుల ప్రాప్తమ్మవగా
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్

  స్త్రీస్వామ్యము = matriarchy

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   స్త్రీస్వామ్యాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. సరసిజ లోచనినట భూ
  సురవాక్కుల మధ్యన మనసున సంతసమున్
  విరియగ, వేయగ మాలను
  పురుషుని గళమందు చాన, పుస్తెను కట్టెన్

  రిప్లయితొలగించండి
 5. పురమున దుష్ట చేష్టల కుబుద్ధి చరించెడు వానిబట్టి వే
  సిరి మెడలోన"గాడిద"ని చెప్పెడు 'బోర్డు'నుకోరికోరి కా
  పురుషుని కంఠమందపుడు;--పుస్తెనుగట్టెను--చాన వేడ్కతో
  పరుగున తన్నుజేర---నొక భగ్నమనస్కుడు కోర్కెదీరగన్
  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించండి
 6. కాపురుషుడు=కుత్సిత పురుషుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గాడిద + అని' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "...మెడలో 'ఖర' మ్మనుచు చెప్పెడి..." అందామా? లేదా "...మెడలోన 'గాడిద'గ జెప్పెడు..." అనవచ్చు.

   తొలగించండి
  2. కృతజ్ఞతలండీ శంకరయ్యగారూ నమస్తే
   బొగ్గరం ప్రసాదరావు

   తొలగించండి
 7. వరముల నిచ్చు శంకరుడు భామిని మోహిని చూచినట్టి యా
  తరుణము నందు మోహమున తాళిని గట్టగె నెంచె నెమ్మదిన్
  తరుణియ పూరుషోత్తముగ దర్శన మిచ్చెను భక్తకోటికిన్
  పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేమాని వారూ,
   మోహినీ శంకరుల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..గట్టగ నెంచె'..టైపాటు.

   తొలగించండి
  2. ఆర్యా! పూరణ నచ్చినందుకు, టైపాటు సవరించి నందుకు ధన్యవాదములు

   తొలగించండి


 8. వరమాలవేయ ముదమున
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  చిరిసాకిగ వల్లభుడట
  కురిసెన్నాశీస్సులెల్ల కువలయములనన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చిరిసాకిగ'...? (ఆంధ్రభారతమ్మ నడిగితే చెప్పలేదు).

   తొలగించండి

  2. చిరి సాకిగ =

   చిరి - అగ్ని

   సాకి = సాక్షి

   ఆంధ్రభారతి సాకి గా :)

   జిలేబి

   తొలగించండి
 9. సరసపు మాటల కన్యల
  విరివిగ పెండ్లాడు నిత్య పెండ్లికొడుకునే
  చెరసాలకు పంపుచు నా
  పురుషు,నిగళమందు చాన పుస్తెను గట్టెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజ్ కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిత్య పెళ్ళికొడుకు' దుష్ట సమాసం. "పెండ్లాడునట్టి పెండ్లికొడుకునే" అనవచ్చు... కాని 'నిత్యపెళ్ళికోడుకు'లోని విశేషార్థం రాదు. 'ముత్యాలముగ్గు' చిత్రంతో ఈ పదబంధం బహుళ ప్రచారం పొందింది.

   తొలగించండి
  2. "దొంగపెండ్లికొడుకు" సరిపోతుందనుకుంటా.._^_

   తొలగించండి
 10. గరళము గొనుమనియె పరమ
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  పరిచర్యల తనవాడను
  వరుసన్ జూడక తలంచి ప్రజలకు మేలున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మ్రింగుమనె సర్వమంగళ। మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో' గుర్తుకు వచ్చింది.

   తొలగించండి

 11. వరముగ వచ్చె యోదుడట, వారిజ జూచి ముదంబు గానగా
  పురుషుని, కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో
  పురజను లెల్ల మెచ్చగను! పూవిలుకాడి యవాయి మత్తులో
  న రమణి యా జిలేబి సరి నాధుని గూడె శుభాంగియై భళీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  పరుషము పురుషునిదన నరు
  నిరుదలపాముగను మార్చునింతియె గాదే!
  కరుకగు(కరకగు)నాజ్ఞల దేల్చదె!!
  "పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్!
  (ఇరుదలపాము॥రెండు తలల పాము.ఆజ్ఞలను అనసరించడానికి ఎడా,పెడా వెళ్ళడానికి సిద్ధ పడానికి వీలుగా మార్చుకోవడం)

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  పొర గని ‌స్త్రీ సువాదమని పొంగిరి యంగన లెల్ల నిద్ధరిన్
  సరికి సరిన్ గొనంగ నట సర్వసమానత జాటు నిష్ఠకై
  బరితెగి బ్రాహ్మణున్ జరిపి బాహు బలంబును జూప ,బెళ్లినిన్
  పురుషుని కంఠమందపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో!
  (స్త్రీ వాదము, సమీప భవిష్యద్వీక్షణ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. వరమాల వేయగ నపుడు
  పురుషుని గళమందుచాన, పుస్తెను కట్టెన్
  వరుడట నంతట నందరు
  కరతాళములు మరి జేసికాన్కలనిడిరే

  రిప్లయితొలగించండి
 15. ఉరుకులు పర్వులెత్తుచును ఉర్వి సమస్తము ముందుకేగగన్
  చెరిసగమైమెలంగుచును చేడియలా మగవారిమించుచున్
  సరియనలేనిరీతి పసచాటుచునుండ గళమ్ము మారగన్
  పురషుని కంఠమందునను పుస్తెను కట్టెను చాన వేడ్కతో
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చేడియలా' అని 'వలె'ను 'లా' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 16. గరళము దాచెను పార్వతి
  పురుషుని గళమందు,చాన పుస్తెను గట్టెన్
  ధరకళ్యానమునకు,మది
  నెరనమ్మినదై తన పతి నిత్యమ్మగుటన్

  రిప్లయితొలగించండి
 17. కరమనురాగమొప్పగను కాంతలు ముందుకుసాగువేళలన్
  తరములు మారినన్ గడప దాటని పద్ధతులేలనంచునో
  తరుణి తలంచుచున్ నిదురతద్దయు చెందగ స్వప్న సీమలో
  పురుషుని కంఠమందపుడు పుస్తెను కట్టెను చాన వేడ్కతో
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. *సమస్యాపూరణము*
  శంకరాభరణం

  *"పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్"*

  కం.

  తరుణిగ వేషము వేసిన,
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  సరసపు నాటక మందున,
  విరసము గలుగక నటకుడె వేడ్కను బంచెన్,

  అంబటి భానుప్రకాశ్.

  రిప్లయితొలగించండి
 19. గిరిజన ప్రాంతమ్ముననో
  తరముననాచారమకట తార్మారయ్యెన్
  తరుణుల మాటయె చెల్లగ
  పురుషుని గళమందు చాన పుస్తెనుగట్టెన్
  -- వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒక'ను 'ఓ' అన్నారు. "ప్రాంతమ్మున నొక" అంటే సరి!

   తొలగించండి
 20. వరుసకుఁ బావనంచుఁ జెలిఁ బట్టగఁ జూచెడు మొండివానితో
  కరకుగ నుండలేక తన కండబలమ్మును జూపఁ బోటిలో
  గిరిజన జోదు ప్రేయసిని గెల్వగ,పెండ్లిన నడ్డఁ జంపి కా
  పురుషుని కంఠమందపుడు పుస్తెను కట్టెను చాన వేడ్కతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. చివరిపాదంలో
   చాన = చాల
   కా/పురుషుని,కంఠమందపుడు.....

   తొలగించండి
  3. రాజ్ కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అధికం అనే అర్థంలో 'చాన' కేవలం మాండలికం. గ్రాంధికం కాదని గమనించండి.

   తొలగించండి
  4. అందుకే గిరిజన సంబంధమైన ఇతివృత్తాన్ని ఎత్తుకున్నానండి.

   తొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  పురుషుడు స్త్రీ వేషమ్మును

  పురుషుని వేషమును మగువ పూనగ
  నటనా
  భిరుచిన్నొ ; క దృశ్యమ్మున

  పురుషుని గళమందు చాన పుస్తెను
  గట్టెన్.

  ***************************

  రిప్లయితొలగించండి
 22. సరసము విరసము కాగా
  పరుషపు పలుకులు విసురుచు పకపక నవ్వన్;
  దొరసాని మండిపడి తన
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్


  పురుషుఁడు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953    n. 

  2. a husband

  రిప్లయితొలగించండి
 23. సరసంబున కొకరోజున
  నిరువురు వేషములు మార్చ నేకాంతమునన్
  తరుణీ రూపుండగు తన
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్

  ఉరుతర ప్రేమభావమున నొక్కదినంబున నూత్నదంపతుల్
  సరసపు లాటలోన కడు సంతస మందుచు స్వీయ వేషముల్
  సురుచిరరీతి మార్చుతరి సుందరి యాకృతి దాల్చియున్న యా
  పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. హరుసమున మాలవేయగ
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  వరడు కడు సంతసమ్మున
  మురిసిరి పెద్దలుకనుగొని ముద్దుల జంటన్

  రిప్లయితొలగించండి
 25. కరమును పట్టె నెవ్వరిది కన్య వివాహము నందు? నామెయున్
  శిరమును వంచగా నతడు చేసిన దేమిటి? వాని జీవితం
  బరయగ వెల్గు టెట్లు నిటుపైనను? చెప్పుము సత్కవీశ్వరా!
  పురుషుని, కంఠమం దపుడు పుస్తెను గట్టెను, చాన వేడ్కతో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. విరుల సరంబు వేసెను
  పురుషుని గళమందు చాన,పుస్తెను గట్టెన్
  పురుషుడు వధువుకు మెడలో
  సరసము లాడుచును కట్టె సమ్మోహముతోన్.

  పురుషుని వేషము తోడను
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్
  చెరగని దరహాసముతో
  పరుగున నటచేరినట్టి బంధులు మెచ్చన్.

  వరమాలను వేసె నగుచు
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్
  హరువిల్లు విరిచి రాముడు
  దరహాసముతోడ తాను ధరణిజ మెడలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'సరంబులు వేయుచు' అనండి. లేకుంటే గణదోషం. 'కట్టె' పునరుక్తమయింది. 'మిగుల సమ్మోహముతోన్" అనండి.

   తొలగించండి
 27. కరమగుతృప్తితోడుతను కన్గొని కన్నియ వేసె మాలఁ దా
  పురుషుని కంఠమందపుడు, పుస్తెను గట్టెను చాన వేడ్కతో
  వరపురుషుండు మండ పపు ప్రాపున పెద్దల మెప్పునొందుచున్
  మురిసిరనుంగు మిత్రులును ముద్దులజంటను కాంచి ప్రేముడిన్
  చానః ఎక్కువ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. పురుషోత్తముదు పతి యని
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్
  హరి భజన చేసి "మీరా"
  విరాగ శృంగార భక్తి వెలయగ భువిలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. 'పురుషోత్తముండు పతి యని / పురుషోత్తముడే పతి యని' అనండి.

   తొలగించండి
  2. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
   పురుషోత్తముడే పతి యని
   పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్
   హరి భజన చేసి "మీరా"
   విరాగ శృంగార భక్తి వెలయగ భువిలో

   తొలగించండి
 29. వరమాలనువేయగ తన
  పురుషునిగళమందు చాన; పుస్తెను గట్టెన్
  చిరునగవులవధువుమెడన
  వరుడందరుజూచుచుండ వలపులుపండన్ !!!

  రిప్లయితొలగించండి
 30. పురుషాయిత మొనరించెడి
  తరుణి గళమ్మునను వ్రేలు తాళి యతనిపై
  మురిపెముగాఁ బడఁ దోచెను
  బురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్.

  రిప్లయితొలగించండి
 31. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  06-05-2017
  🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
  *పురుషయనుపేరుఁజేకొనె*
  *తరుణియుకవయిత్రిపొందెతగయశమట్లున్*
  *వరుడున్ చాటువు నరహరి!*
  *పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్*

  🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻క

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. విరిదండవేసెనప్పుడు
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్
  వరుడా పిదపను ధరణీ
  సురులే దీవించిరపుడు శుభమస్తంచున్


  తరుణుల వంచించుపతికి
  సరియగు పాఠమ్ము జెప్ప సద్గుణవతియే
  తరుణోపాయమ్మనుచును
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్ .


  నిరతము తేనెటీగవలె నీరజ నేత్రుల చుట్టు చేరుచున్
  తరుణుల బొందు గోరుచు సదా సరసమ్ములనాడు వాడికిన్
  సరియగ బుద్ధిజెప్ప సతి సద్గుణ శీలియె యోచనమ్ముతో
  పురుషుని కంఠమందపుడు పుస్తెను కట్టెను చాన వేడ్కతో


  సరసిజ నేత్రి సీతగను సాంబడు రాముని పాత్ర మోదమున్
  బరిమళ వేసె, నాటకము పల్లెజనాళియె మెచ్చిరెల్లరున్
  హరునిధనుస్సు భంగమయె నన్నులమిన్నను బెండ్లియాడగన్
  పురుషుని కంఠమందపుడు పుస్తెను కట్టెను చాన వేడ్కతో

  రిప్లయితొలగించండి
 34. వరుడై యింపుగ నంతటఁ
  దరుణుం డొక్కఁడు ముదముగఁ, దరుణీ మణియే
  వరియింప ఘనంబుగ నా
  పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్
  [చాన గళమందు.....]


  వరుఁడు గుణాధికుండు వర బంధము నిల్పగ, నత్త మామ లా
  పరమ పవిత్రమై వెలుఁగు పావన సూత్ర మలంకరింపగం
  బురుషుని కంఠమం దపుడు, పుస్తెను గట్టెను, చాన వేడ్క తో
  నురమున హస్త ముంచి కను చుండగ సూత్రము, సంతసమ్మునన్

  [సూత్రము = 1. జన్నిదము, 2. మంగళ సూత్రము ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'చాన గళమందు' అన్వయించుకొనడంలో సందేహం!

   తొలగించండి
 35. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పరపుగ నిలిపెను మాల్యము
  పురుషుని గళమందు చాన; పుస్తెను గట్టెన్
  కెరలెడి వలపున పురుషుడు
  తరళేక్షణ కంఠమందు దరహాసమునన్

  రిప్లయితొలగించండి
 36. ధర భూతవైద్యుడొక్కడు
  తరుణికి నిజ భర్తృ రుగ్మతకు నిది జెప్పెన్
  తరుణోపాయము చెవిలో !
  పురుషుని గళమందు చాన పుస్తెన్ కట్టెన్ !

  తిరుమలఁ గ్రొత్తదంపతులు తీరికగా జలకమ్ములాడ పు..
  ష్కరిణిని మున్గగా పడతి జారుట గాంచియు పుస్తెలన్ , పర..
  స్పర సహకార యోగమున జందెమునన్ ముడి వేయ నెంచి , తా
  పురుషుని కంఠమందపుడు పుస్తెల గట్టెను చాన వేడ్కతో !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 37. వరుడై యింపుగ నంతటఁ
  దరుణుం డొక్కఁడు ముదముగఁ, దరుణీ మణియే
  వరియింపు మంచుఁ బెట్టగ
  పురుషుని గళమందు చాన, పుస్తెను గట్టెన్

  [గళము+అందుచు +ఆన = గళమందుచాన ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   విలక్షణమైన పద విభాగంతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 38. మురియుచు పీటల మీదన్
  వరుని గని తనను వలచిన వాడని దెలియన్
  కరములు జుట్టుచు యొరుగన్
  పురుషుని గళమందు చాన,పుస్తెను గట్టెన్
  ('మనం' సినిమాలో నాగార్జునను జూచి శ్రీయ పైన వాలిన సన్నివేశము)

  రిప్లయితొలగించండి
 39. మరునిని మించు సుందరుడు మాన్యుడు రూకలు లేనివాడయో
  బరువుగ బంగరుండు నొక భామకు జిక్కగ ఘాటుప్రేమలో
  పరువది బోవు సంఘమున పాణిని బట్టిన నీదుతోడనిన్
  పరుగులు బెట్ట బోవగను పట్టుచు చెవ్వును మెల్పి త్రిప్పుచున్
  పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో!

  రిప్లయితొలగించండి