4, మే 2017, గురువారం

న్యస్తాక్షరి - 41 (తి-రు-మ-ల)

అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.
నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.

92 కామెంట్‌లు:

  1. కలియుగమ్మున శుభములు గలుగు రీతి
    నేడు కొండల ఱేడయి నాడు, తీరు
    భక్త జనులకు నొసగుచు ఫలము, మహిమ
    జూపు నాతండు దివిలోన, సొగియు కనుల!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీరు'కు అన్వయం? మీ ఉద్దేశం 'తీరుగా' అని! కాని కేవలం తీరు అంటే అన్వయించడం లేదు.

      తొలగించండి
  2. వేయి కళ్ళు చాలవు కాంచ వేoకటపతి
    దివ్య రూపము, భార్యలు దేవునికిరు
    ప్రక్కలాశీనులై ఉండ భక్తజన మ
    దిని సతతము దోచునుగదా దేవనేల




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జన మది' అనడం దుష్ట సమాసం. "భక్తజన మ।నమ్ములను సతతము దోచు నెమ్మి నేల" అందామా?

      తొలగించండి
  3. వెలసె నేడుకొండలపైన వేంకటపతి
    దివ్యసుందర రూపమ్ము తేజమలరు
    తరమె వర్ణింప నతని సౌందర్యగరిమ
    వర్ణనాతీతమే మారు పలుక నేల?

    రిప్లయితొలగించండి

  4. ఏడు కొండల రాయడ యెన్ని తంతి
    యలన గడచివత్తును నిను యటగ న మిరు
    మిట్లు గొలిపెడి మూర్తివి మిన్న గా మ
    దినెర నమ్మినాను జిలేబి దీలు యబల !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ! మీ పద్యాల వలన కొత్త కొత్త పదాలు నేర్చుకోరడం జరుగుతోంది. ధన్యవాదములు.
      వీలయితే ఆ అసామాన్య పదాలకి మీరే అర్థం వ్రాసి మా శ్రమ తగ్గించ గలరు.

      తొలగించండి
    2. నిను యట, అన్నపుడు యడాగమం రాదేమో గమనించండి.

      తొలగించండి

    3. నేమాని సోమ గారు,

      నెనర్లు! అసామాన్య పదాలకు మూలం ఆంధ్రభారతి "కట్ ప్రేషితః " :)

      ఏడు కొండల రాయడ యెన్ని తంతి
      యలన గడచివత్తును సూవె, యవనిని మిరు
      మిట్లు గొలిపెడి మూర్తివి మిన్న గా మ
      ది నెరనమ్మినాను జిలేబి దీలు యబల !

      జిలేబి

      జిలేబి

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. శంఖు చక్రాల నామాల సామి!కినతి
    సుందర తులసి మాలల చుట్ట నలరు
    లచ్చి యొత్తిన పాదము లిచ్చతో మ
    నమున ప్రార్థింప బ్రోతువు రమణ! జనుల.

    రిప్లయితొలగించండి
  6. కలియుగంబున దైవమై వెలుగు రీ*తి *
    ఏడు కొండలపైన మీరెక్కినా*రు*
    చక్రి వో లేక శక్తివో సదయ!చెపు*మ*!
    వేంకటేశ్వర!పాహిమాం!వినుత శీ*ల*!!

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  7. మదిని దోచుచుండెడినీదు మకుట కాంతి
    సకల శుభములు నిచ్చెడి స్వర్ణతేరు
    కాంచన భరిత మైనట్టి కంఠ సీమ
    దీప్తి నొప్పు నీ కీర్తి నే తెలుప జాల,
    సుప్రభాతమ్ముతోడ నీస్తుతి మొదలు
    పెట్టి నిదురలెమ్మందుము ప్రేమతోడ
    అర్చనలు చేసి కొల్తుము ఆర్తి తోడ,
    శంఖ చక్ర ముల్ మెరయగ సంబరాన
    నాగ పడగలు కరముల నాట్యమాడ
    అభయ హస్తము చూపినీవాదుకొనగ
    వేడుకొందుము సతతము వేంక టేశ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ తేటగీతిక బాగున్నది. అభినందనలు.
      'కొల్తుము+ఆర్తి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కొలిచెద మార్తితోడ" అనండి.

      తొలగించండి
  8. శ్రీకరం బైన ముద్రతో నీకర మ(తి)
    సుందరం బౌర! దేహంపు సొగసు తీ(రు)
    మాట కందదు మధురాతి మధుర నా(మ)
    వేంకటేశ్వర!నినుగొల్తు వివిధ గతు(ల).
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  9. కలుష సంహార మొనరించు కనుల కాం(తి)
    సిరులు జగతికి బంచెడి చేతి సౌ(రు)
    తులసి పెనగొన్న కాయంపు టలఘు సీ(మ)
    తిరుమలేశుని రూపంబు సురుచిర మి(ల)
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా:

      మీ పూరణలు ఎప్పుడూ ఎక్కువ తక్కువలు లేకుండా ముచ్చటగా ఉంటాయి.

      __/\__

      తొలగించండి
  10. డా.పిట్టా
    (కుబేరుని అప్పు తీరక పోవడం వల్ల లోక కళ్యాణం సిద్ధమనే హర్షాతి రేకంతో శ్రీ వేంకటేశ్వరుని వైభవ వర్ణన)
    పుష్కరిణి యందు సురులదౌ పూజ భణితి
    దినము నరభక్తవర రాశి దిరుగు తీరు
    నరసి ధనదుడప్పుల నిన్ను నడుగతరమ?
    తిరుగు"గోవింద"!యని తన దీక్ష తరల!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      చమత్కార భరితమై మీ పూరణ అలరింప జేస్తున్నది. అభినందనలు.
      'సురలదౌ' ఆనండి.

      తొలగించండి
  11. డా.పిట్టా,నుండి
    ఆర్యా,"స్వామి పుష్కరిణీతీర్థౌ రాత్రౌ దేవ గణార్చితాయనమః"అనివేం.ర అష్టోత్తర శతనామావళిలోని శబ్దము, మొదటి పాదంలో ప్రమాణంగా గైకొన్నాను.

    రిప్లయితొలగించండి

  12. వేదములకంద నేరని వేంకటపతి
    భువన మోహన రూపమై పుడమి నలరు
    దీన జన రక్షణోద్యోగ దివ్య గరిమ
    వసుధవైకుంఠమున్ నిల్చె వకుళబాల

    రిప్లయితొలగించండి
  13. విశ్వ సౌందర్యమొకచోట వెలయు రీతి
    దివ్యమంగళ విగ్రహ దీప్తి సౌరు
    రుదితహరణము రుచిర తిరుమల సీమ
    కాంచ సులభమె మనకు వెంకన్న లీల

    రిప్లయితొలగించండి
  14. ఏడుకొండలపైనను ఎంతో ప్రీతి
    వెలయనెల్లరు నీ రూపె తలచినారు
    భక్తులకు ముక్తిబాటల పరచుగరిమ
    చెల్లెనీకిట్లు లోకాన శ్రీవిలోల
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కొండలపైన తా నెంతొ ప్రీతి" అనండి. 'పైనను+ఎంతొ' అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  15. అవనియందు నీకె అందెను ప్రఖ్యాతి
    ఇష్టదైవమనుచు నెంచినారు
    పరగ కరుణ రసము ప్రసరించు దైవమ
    నీవె శరణు ధీవిశాల
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోష. "నీవె శరణు నాకు ధీవిశాల" అనండి.

      తొలగించండి
  16. భూరి నవరత్నఖచిత కోటీరకాంతి
    రమ్య భుజముల శంఖచక్రాలతీరు
    మోహనాకృతి భక్తులపుణ్యఫలమ
    నంగ శ్రీపతి నిల్చెనానందలీల!!

    రిప్లయితొలగించండి
  17. బ్రహ్మ కడిగిన పాదమ్ము పట్టిన గ*తి*
    యభయ హస్తమ్ము వైపుకు సాగి తీ*రు*
    శ్రీనివాసమ్ము చేరగ పూనిన శ్ర*మ*
    జయము నందును గమలాక్షు నయన ప్రభ*ల*

    రిప్లయితొలగించండి

  18. తిమిరమును పార ద్రోలుచు తిరముగ గతి
    రువ్వ మును గాక బతుకు హరువుగ పారు
    మతిని వేడుకొందును సామి మదిని గల మ
    లకలను తొలగించుమయ మలయజశీల !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. హృదయమందు లక్ష్మీ ఒదిగెను సంప్రీతి
    అరయ పక్షమందు అలరులలరు
    అభయహస్తమందు ప్రభవించెనరుణిమ
    పాదయుగము తానె పద్మ హేల
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  20. కనులు మూసిన జగమెల్ల కనెడు రీతి
    ప్రబలు కనకంపు నగలనేపారు సౌరు
    భక్తజనులకునభయమ్ము పలుకు పటిమ
    నీకెతగునయ్య శేషాద్రి నిలయలోల
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  21. అక్షరముగ తా నన్నమాచార్యుని కృతి
    అవధరింప,మేలుకొలుపా యమ్మ తీరు
    తినగ లడ్డుగా దోచెడు తీయని కృప
    యిలకు దిగివచ్చె గోవిందు డిట్టి రీతి

    రిప్లయితొలగించండి
  22. విశ్వరూప! శేషశయన! వేంకటపతి!
    శౌరి! నినుమించు దైవము లేరు లేరు
    కాచి కాపాడు నిత్యము కరము ప్రేమ
    కైటభారి! గోవింద! భక్తజనపాల!

    రిప్లయితొలగించండి
  23. వేడుకొందు నయ్య వేంకటాచలపతి
    నీరజాక్ష సతము నీదు నెనరు
    పాలకడలి శయన పద్మనాభ, భరిమ
    వేయిపేరులున్న వేణులోల!!!



    సప్త గిరినివాస జగమేలు శ్రీపతి
    శరణుశరణు సతము సంకుదారు
    ఆర్తజనుల బ్రోచు నభయహస్తమహిమ
    నాదు తరమె బొగడ నందబాల!!!

    రిప్లయితొలగించండి
  24. విరులు సిరులతో వెలుగొందు వేంకట పతి
    కలి యుగంబున దైవమై కాచు తీరు,
    శుభము గూర్చు నా రూపమ్ము జూపు ప్రేమ
    కూడి మదిని చేరగ వేఱు కోర నేల!

    రిప్లయితొలగించండి
  25. మహము నొప్పు ఓ అలమేలు మంగ పతి,
    ధగధగ మెరిసె గళమున నగల పేరు,
    ముదము నిచ్చె నీపడతికి హృదయ సీమ
    ప్రభలు గొల్పెనీ తనువుపై పట్టు చేల

    ఏడు కొండల నెక్కుచూ ఎల్ల జనులు
    చేరు చుందురు నినుచూడ పరుగులెట్టి
    ముఖ్య సన్నిధి గొల్లడు ముందు నడువ,
    అర్చకులు జియ్యరు లు కూడి అడుగు బెట్ట
    క్షేత్ర పాలకునిశిలకు చెలిమి తోడ
    తాళ పుచెవులు తాకించి ద్వారములను
    తెరచి సుప్రభాతపు సేవ జరుపు చుండు,
    అర్చన,విశేష పూజలు అష్ట దళపు
    పాద పద్మ సేవయును , నిజ పాద దర్శ
    నంబుయు, తిరుపావడసేవ సంబరముగ
    నీదు గుడిలోన జరుగును నిజము గాను,
    నిత్య కళ్యాణము ,వసంత యుత్స వమ్ము
    నిత్య ఊoజలు సేవలు,నెరపు చుండు
    గరుడ వాహన మున వచ్చి కాచుమయ్య
    హనుమ వాహనమున వచ్చి ఆదుకొనుము
    సూర్య వాహనమున వచ్చి శుభము లిడుము
    చంద్ర వాహనమున వచ్చి శక్తి నిమ్ము
    హంస వాహనమున వచ్చి హాయి నిమ్ము
    తురగ వాహనమున వచ్చి కరుణ చూపు
    సర్ప వాహనమున వచ్చి సంతునిమ్ము
    మాడ వీధుల తిరుగాడి మమత నిమ్ము,
    వడ్డి కాసులు గైకొని వరము లిమ్ము
    క్లేశములు తీర్ప, కొనుము మా కేశములను
    మహిమ గల పుష్కరిణి లోన మనుజు లెల్ల
    స్నానమాడ పాపములన్ని సమసి పోవు
    వేంక టరమణా తొలగించు సంకటములు




















    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      మొదటి పాదంలో 'మంగ పతి' అన్నచోట గణదోషం.
      శ్రీవేంకటేశ్వరుని నిత్యసేవలను ఉత్సవాలను వివరించిన మీ తేటగీతిక మనోహరంగా ఉంది.

      తొలగించండి
    2. స్వామీ దేముడు కళ్ళు మూశాడు కాసేపు

      తొలగించండి
  26. రూపు రేఖలసౌంధర్య రుచి తిరుపతి
    భక్తవర్యుల మమతలు ,వసుధగోరు
    ఏడు కొండల ప్రాకృతి జూడ?పరమ
    పావన కుసుమగంధంబు|దైవలీల|
    2.ఏడు కొండలెత్తు ఎదిగినతిరుపతి
    వేంకటేశ|రూపు వెదుక తీరు
    అవని కందనట్టి ఆకసమంత|మ
    తకమునిల్పెనిజము తర్కమేల?

    రిప్లయితొలగించండి
  27. నేత్ర యుగళి సూర్య నీరజ రిపు భాతి
    నొప్ప నురము నందు నుభయు లలరుఁ
    బోడు లొప్ప నుదుటఁ బుండ్ర మమరెను మ
    హాత్మ కావుము కరుణాలవాల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      శ్రీనివాసుని దివ్య మంగళ రూపాన్ని చక్కగా వర్ణిస్తూ పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  28. కవిమిత్రులారా,
    ఒక మిత్రుని సందేహం. ఈనాటి అంశం 'వేంకటేశ్వరుని దివ్య మంగళ రూపాన్ని వర్ణించడం' కదా! కాని దాదాపుగా అందరూ వేంకటేశ్వరుని స్తుతించారే తప్ప రూప వర్ణన చేయలేదు" అని.. నాకూ నిజమే అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కందివారు

      దగ్గరికి వెళ్ళి మంగళ రూపాన్ని దర్శించే సమయం యివ్వ టం లే తితిదే వారు :) జరగండి జరగండి లో నమో వేంకటేశాయ :)

      జిలేబి

      తొలగించండి
  29. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🌸: *న్యస్తాక్షరి -
    (తి-రు-మ-ల)*

    *అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.*

    *ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.*

    *నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.*
    🌼🦋🌸🦋🌺🦋🌸🌼:
    *తి*ష్టవేసెజూడ దేవుండు శ్రీప *తి*
    *రు*క్మిణిపతి మహి పరుండు తీ *రు*
    *మ*మతతోయశోద మాతవకుళసీ *మ*
    *ల*డ్డులొసగి దీర్చు లాల సా *ల*


    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      ఉభయతారకంగా మీరు వ్రాసిన పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
      కాని కొంత అన్వయలోపం ఉన్నది.

      తొలగించండి
  30. ాపద్యపాదంం మొదల చివర కూడా తిరుమల వచ్చేట్లు ప్రయత్నింంచాను

    రిప్లయితొలగించండి
  31. వజ్రమకుటమ్ము వెలయించు పసిమి భాతి
    శంఖుచక్రమ్ము నామంపు సహజ సవురు
    అభయహస్తాల ప్రసరించు నమృతమహిమ
    సప్తగిరివాసుని గనని జన్మమేల!!!

    రిప్లయితొలగించండి
  32. హరికి సాటి గాదు విభవ మందు జగతి
    ధన-కనక-వస్తు-వాహన ధాని వీరు
    విలువ నెంచ నశక్యము విభుని మహిమ
    కాంతి దీప్తుని గనలేని కన్ను లేల?

    ఏడుకొండల పైనున్న వేంకట పతి
    తలచినంత వెతల మాపు తండ్రి తీరు
    మంగళాకృతి వర్ణింప మనిషి తరమ?
    చెంతనుండగ వెంకన్న చింత యేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ధాని వీరు'...?

      తొలగించండి
  33. తే.గీ. కాంచినంత నీ రూపు మా కనుల కాంతి,
    మాకు ప్రేమభావమ్ములు మదిని ముసురు,
    కాననయ్యె, కౌస్తుభము నీ కంఠ సీమ,
    నెమ్మి దర్శనమొసగుట నీదు లీల

    రిప్లయితొలగించండి
  34. వసుధ పైన బ్రహ్మోత్సవ వైభవ మతి
    సౌష్ఠవముతోడ కొండపై జరుగు తీరు
    గాంచి భూలోక వైకుంఠ మంచు తిరుప
    పతి తిరుమలేశు సేవింత్రు ప్రజలు ప్రీతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిరుప పతి'...?

      తొలగించండి
    2. చివరి అక్షరములు తి-రు-మ-ల - మీరు తిరుపతి వ్రాసారు. గమనించండి.

      తొలగించండి
  35. శరణు.శరణు రాయడం మరచితిమి
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  36. శ్రీని ధరియించి,మంగను జేసె సవితి
    దివ్య మంగళ రూపుడు తెచ్చె పోరు
    శేషగిరివాసు డతని యశేష మహిమ
    సన్నుతింపగ తరమె యాపన్నులకిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సవతి' సాధువు.

      తొలగించండి
  37. తాకి వజ్ర కిరీటంపు ధవళ కాం *తి*
    మూడు నామాల ముచ్చట మోమునల *రు*
    చేర హృదయాబ్జమందున శ్రీలలా *మ*
    జారు తోమాల పాదాలఁ బ్రభుని మ్రో *ల*

    రిప్లయితొలగించండి
  38. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🌸: *న్యస్తాక్షరి -
    (తి-రు-మ-ల)*

    *అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.*

    *ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.*

    *నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.*
    🌼🦋🌸🦋🌺🦋🌸🌼:
    *తి*లకమనమూడునామాలజ్వలితకాం *తి*
    *రు*చిర ఫలపుష్పవేద్యరచనచా *రు*
    *మ*కుటఖచితమైతీండ్రింపమణులమహి *మ*

    *ల*క్ష్మినారాయణాలవాలముతిరుమ *ల*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ యీ తాజా పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
      "నైవేద్య' టైపాటు...

      తొలగించండి
  39. శ్రీకృష్ణ భగవానుడు యశోదా దేవిని
    వీడి దేవకీవసుదేవుల వారసునిగా వెళ్ళునప్పుడు తన పెళ్ళి ముచ్చటతీర్చేఅదృష్టం కలియుగంలో కలుగజేస్తానన్నాడు
    యశోదయేవకుళ !
    రేపల్లెగోపగోవిందుడే తిరుమలగోవిందుడు!
    వరాహస్వామి ఆశ్రమపరిధిలోనే వకుళాశ్రమము! వకుళాదేవి యే వకుళానది వకుళానదీ(వక్కిలేరు)
    పరివాహకప్రదేశమైనందున రాయలసీమ అనాదిగావకుళసీమ!
    పవళింపుసేవలు చేయించుకుంటూ
    తిష్టవేశాడు.క్యూలో ఉచితలడ్డుప్రసాదమిస్తూ కోర్కెలు
    తీర్చుచున్నాడు.అప్పులపాలైనా
    శ్రీనివాసుడు శ్రీపతి యే!
    ఇక అన్వయలోపం వుందంటారా?🙏🌹🙏

    రిప్లయితొలగించండి

  40. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
    ఆ.వె:శేషశైలవాస శ్రీ వెంకటాపతి
    కోరి కొలుతు నిన్ను చేరు దారు
    లిలను చూపవయ్య నింటిల్లిపాది మ
    హోత్సవమున వత్తుము గన లీల.

    తే.గీ:వేదగోచరుడవు నీవె విష్ణుమూర్తి
    యలిగి నిను వీడి యరిగె చారు
    శీల చేరితివతి శీఘ్రముగ తిరుమ
    లగిరి నొంటిగాను లక్ష్మి లోల.

    తే.గీ:భక్తి శ్రద్ధల తోడను భక్తులు నతి
    నెమ్మది తనము బూనుచు నిలిచినారు
    నీదు రూపము చూడంగ నిలను భామ
    యునరుదెంచెచూ పుమిచట నీదు లీల.

    ఆ.వె:ధరణి నేలు దేవ దర్శింప వచ్చితి
    నేడు కొండలెక్కి ,యింపు నలరు
    బోడి లక్ష్మి సతము పూజలు చేసి మ
    నమున నిను కోరి యష్ట లక్ష్మి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నేను సూచించిన ఒకటి రెండు సవరణలను వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  41. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🌸: *న్యస్తాక్షరి -
    (తి-రు-మ-ల)*

    *అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.*

    *ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.*

    *నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.*
    🌼🦋🌸🦋🌺🦋🌸🌼:
    *తి*లకమనమూడునామాలజ్వలితకాం *తి*
    *రు*చిర ఫలపుష్పనైవేద్యరచనచా *రు*
    *మ*కుటఖచితమైతీండ్రింపమణులమహి *మ*

    *ల*క్ష్మినారాయణాలవాలముతిరుమ *ల*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      కేవలం పూరణ ఇచ్చి పద్యానికి ముందో వెనుకో మీ పేరు ఇస్తే చాలు! సమస్య పాఠం ఇవ్వనవసరం లేదు.

      తొలగించండి
  42. కలియుగమ్ము నేల నిలిచిన శ్రీపతి
    దయను పొంద జనులు తరలినారు
    పొగడ వశము కాదు భువిని నీదు మహిమ
    గరుడగమన మమ్ము గావవేల


    దిక్కు లెల్లడ మణిమయ దివ్య కాంతి
    నొసగు వజ్రకిరీటమ్ము , నుదుటన తిరు
    నామముల్ , శంఖు చక్రముల్ , నల్లని కమ
    నీయ రూపుని దర్శింతు నేను మరల

    రిప్లయితొలగించండి