23, మే 2017, మంగళవారం

సమస్య - 2367 (శ్రీరామునిఁ గని యహల్య...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్" 
(లేదా...) 
"రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే"
(శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలతో...)

69 కామెంట్‌లు:

  1. శ్రీరామపాద ధూళికి
    ఆ రామపు వెతలు దొలగ నానందముతో
    నీరాజన దృక్కుల హృది
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్
    ( శిల = సెలయేరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. "ఘోరమ్మగునీ శాపము
    నేరీతిగ మాప బడును నెపుడ" ని; వినగన్:
    "నీరూపము మారగలదు
    శ్రీరామునిఁ గని";...యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  3. నారాయణుడా రాముడె!
    రారా!రామా!యటంచు ప్రార్ధించి మదిన్
    ధీరోదాత్తుని నూహల
    శ్రీరామునిఁగని యహల్య,శిలగా మారెన్.

    రిప్లయితొలగించండి

  4. ధారా ళంబుగ కథలన్
    యేరాళంబుగ జిలేబి యెన్నిటి నో శ
    య్యై రాసెన్నందులనన్
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. ఆముని వాటికన్ మయిల యైపడి యుండెను లేమ గాద?"ఆ
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య" చిత్రమే
    యీ మినుకున్ గనంగ సుమ, యీవిధమై యన కారణంబదే
    దో మరి గానరాదు! భళి దోగ్దృల ధోరణి చిత్ర భావముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కథలన్+ఏరాళ' మన్నపుడు యడాగమం రాదు. "ధారాళంబుగ గాథల। నేరాళంబుగ..." అనండి.

      తొలగించండి
  6. ఆ మునియే శపించ శిలయై బహుకాలము వేచి వేచి శ్రీ
    రాముని పాదధూళి నభిరామ సురూపము నంది పొంగె నా
    రామ; మనోహరాద్భుత సురమ్యునిఁ గాంచి సంసంభ్రమంబునన్
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరుగారూ! మీ పూరణలో భావం సహజ సుందరంగా ఉన్నది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రమణీయమైన పూరణ నందించితిరి. “సుసంభ్రమంబునన్” నకు “సంసంభ్రమంబునన్” గా ముద్రణ లోపము.

      తొలగించండి
  7. ఏమని చెప్పుదాన పతినే మది నెంచు సతీలలామనౌ
    నామది నంకురించినది నన్ పతితన్ పొనరించు జాడ్య మీ
    బామును తెచ్చి పెట్టెనని భర్తకు మ్రొక్కెను గౌతమున్ మనో
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే.

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    తీరా శాప విలోకన
    భారమ్మున భద్రమూర్తి పనుపున నిల్వన్
    హైరానవగను మనమున
    శ్రీరాముని గని యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  9. నారీ రూపము దాల్చుచు
    నారాధనగా ముకులిత హస్తంబుల నోం
    కారుని మంగళ రూపుని
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    బాములు బాయకున్నసరి భవ్య చరిత్రము శూన్య మౌటయున్
    క్షేమమె? రామ పాద రజ శ్రేయము దీర్చదు నాదు తప్పుకున్
    భూమి బ్రతిష్ఠ జేయుటకు బుట్టిన యా యపకీర్తి భావనన్
    రాముని కన్నులారగని రాయిగ మారె నహల్య చిత్రమే

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా(గత పూరణము)
    స్త్రీని వేధించ జట్టము చేరునచట
    పరువమెంతయు గలచినన్ పరుగువెట్ట
    "నిర్భయా"దుల యొడికిని నీడ్చు నితర
    కలికి కౌగిలి ప్రాణాంతకారి గాద?!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    కులికెను రాజవంశములు కొల్లలు భార్యల సంప్రదాయమే
    వెలసెను సమ్మతింబడసి వీకన రెండవ భార్య పోషణల్
    గలిసెను మంట, నేడిచట గైకొన గోరి ద్వితీయ మన్వుకై
    కలికి కవుంగిలింతకనగా నుసురుల్ గొను నట్టిదే కదా!

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    కోపము తాపమున్ గనియ కొండెములన్ గ్రహియించె పోరుకై
    పాపము గూడగట్టగ సభా భవనంబున సాధ్వి నీడ్వ నా
    శాపము యూర్వులన్ పగుల సాచగ తానొక చావు జచ్చె బో,
    ఆపదలన్ని కర్మ ఫల మౌను, సుయోధనులార, గాంచుడీ!!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    ఆర్యా,tab విసిగించి నన్ను దూరం జేసింది.మీరే సరిజేయగల శ్రమ తప్పింది.B.P.Reddy ని కలువ లేని స్థతిలో చాలా నిరాశకు లోనయ్యాను.ద.చే.అన్నిటిపై మీ దృష్టి సారించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
      సభకు మీరు వస్తారని మిత్రులందరం ఎదురుచూశాము.

      తొలగించండి
  15. _ఆరాటమిడితి శాపము_,
    _శ్రీరాముని గని,యహల్య!శిలగా మారె_
    _న్నీరూపము పొందగలవు_
    _కారుణ్యపు పాదమిడిన„ గౌతముడనియెన్_

    రిప్లయితొలగించండి
  16. మారుతి కోర్కె ఫలించిన
    తీరేమిటి,గౌతమముని తిట్టగ ఇలలో
    నారీ మణికే మాయెను,
    శ్రీ రామునిగని, యహల్య శిలగామారెన్

    రిప్లయితొలగించండి
  17. మాస్టరుగారి భావంతోనే నేనూ......

    శ్రీరామ రూపమట్టిది
    ఆరెప్పలవేయ మరతురాతని జూడన్
    తీరుగ నాతిగ మార్చిన
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్.

    రిప్లయితొలగించండి
  18. ఔరా పురాణ జ్ఞానము
    సారెకు గనరాదు రామచంద్రుని పాత్రన్
    మారీచుడని భ్రమింపుచు
    శ్రీరాముని గని నహల్య శిలగా మారెన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      జ్ఞాకు ముందున్న ణ గురువై గణదోషం. "పురాణ బోధన/ పురాణ చేతన" అందామా?

      తొలగించండి
  19. దోరఫలములనిడె శబరి
    శ్రీరాముని గని, యహల్య శిలగా మారెన్
    కోరివరించిన భర్తయె
    యీరసతో శాపమునిడ యింద్రుని వలనన్!!!

    ఈరస =కోపము

    ఓరామా ! నను బ్రోవగ
    వేరంబుగ రమ్ము స్వామి వేడుచు నిన్ను
    న్నే రాయిగ నుందు ననుచు
    శ్రీరాముని గని యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  20. రాముడు,దీనభక్తవర లక్షణ ధాముడు,నీలవర్ణ శో
    భామయ దేహ కాంతి కనువిందును పంచెడివాడు,మూర్తి,శ్రీ
    రాముని కన్నులార గని రాయిగ మారె నహల్య, చిత్రమే
    క్షేమము నిచ్చు సుందరత శీఘ్రమె స్థాణువు జేయగానిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      రెండవపాదంలో యతి బహుదూరమవడం ఒక్కొక్కప్పుడు జరుగుతుంది.భా.కు వి దగ్గర యతి.భావం బాగుంది.

      తొలగించండి
  21. కోరిపరించె నింద్రుడటు కోడిగ తా పలుమారు కూయగన్
    సారెకు తెల్లవారెననిసాగెను మౌని జపమ్మొనర్పగన్
    చోరుని వోలె దేవపతి జొచ్ఛిసతిన్గికురింప భర్త తా
    రా మునిగన్నులారగని రాయిగ మారెనహల్య చిత్రమే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  22. మీరడు ధర్మము నెపుడును
    చేరడు పరసతులను మరి చూడగ వాడున్
    చేరువ నిలువగ మనిషిగ
    శ్రీరామునిఁ గని నహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  23. చేష్టలుడిగిన వ్యక్తిగా అహల్య అయిందనే భావంలో వ్రాశాను

    రిప్లయితొలగించండి
  24. ధారుణి నదృశ్యము ప్రజా
    వారమ్మున కెల్ల వాయు భక్షిణియు నిరా
    హారి సుముదాశ్రు ధారల
    శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్
    [శిల = సెలయేఱు]


    నీమము తప్పి నందులకు నిత్య తపోధన సంయ మీంద్రునిన్
    భీమపు శాప తప్త యయి పేర్మిని నొక్క నిమేష మాత్రమున్
    వామసులోచ నాతిశయ వర్ష సహస్రము లెల్ల వేచి తా
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే
    [రాయి = స్థాణువు, నిశ్చేష్టత]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. గురువులు క్షమించాలి
    పురాణ జ్ఞానము అనేవి వేరే పదాలు దానికి గణదోషం ఉండదని రాశాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురాణజ్ఞానముఒకటేపదమండీ.పురాణములందుజ్ఞానము.సప్తమీతత్పురుషసమాసము.

      తొలగించండి
  26. పోరాడి సమసె తాటక
    శ్రీరామునిఁ గని, యహల్య శిలగా మారెన్
    ఘోరపు శాపంబిడఁ బతి
    శ్రీరాముని పాదధూళి చెలియగమార్చెన్

    రిప్లయితొలగించండి
  27. ఏరినిగన సీత కనులు
    భారమయెను సిగ్గుతోడ?పతి శాపముచే
    మారెనెటులహల్యయకట?
    శ్రీరాముని గని,యహల్య శిలగా మారెన్
    శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      ప్రశ్నోత్తర విధానంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  28. మారుతి మనసెపుడు మురిసె
    యేరమణే రీతిగాను నిలలో పతిచే
    నేరూపము పొందెననగ
    శ్రీరామునిగని యహల్య శిలగా మారెన్.


    రారా యనె కౌసల్యయు
    శ్రీరామునిగని,యహల్య శిలగా మారెన్
    తూరుపు రేని తగులమున
    నారీమణితా శిలవలె నచ్చోనుండెన్.


    కూరిమితో శబరి మురిసె
    శ్రీరామునిగని :యహల్య శిలగామారెన్
    వారిదవాహుడొనర్చిన
    ఘోరంబగు చేష్టవలన కువలయమందున్.

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:
    శ్రీరామ పాద పృక్తితో
    యీరూప మెడలునని విని నిప్పటి కిపుడే
    యారాముని దలచుచు మది
    శ్రీరాముని గని యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. పొరబాటును సవరించాను. మరొక్కసారి పరిశీలించండి

    శ్రీరామాంఘ్రి తడవుతో
    యీరూప మెడలునని విని నిప్పటి కిపుడే
    యారాముని దలచుచు మది
    శ్రీరాముని గని యహల్య శిలగా మారెన్

    రిప్లయితొలగించండి
  31. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *23 మే 2017*


    మారెశిలస్త్రీగ పదమిడ
    శ్రీరాముని గని! యహల్య శిలగా
    మారెసురేంద్రుడుపదమిడ
    ధారుణిపదఘట్టణములెతనరె చరితలై



    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *23 మే 2017*

    రిప్లయితొలగించండి
  32. వీర కిశోరుండగు నా
    శ్రీరాముని గని "యహల్య శిలగా మారెన్
    ఆ రామ శాపమోచన
    మోరామా!నీ వలన"నె మునివరుడంతన్

    రిప్లయితొలగించండి
  33. కామముతోడ వాసవుడు గౌతముభార్యనుకూడ మత్తుడై
    యాముని దివ్యదృష్టిఁ గని యాగ్రహమొందిశపించ గేహినిన్
    రామకు కల్గెమోచనము రాముని పాదపుధూళితోడ నా
    రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే

    రిప్లయితొలగించండి
  34. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *23 మే 2017*


    మారెశిలస్త్రీగ పదమిడ
    శ్రీరాముని గని! యహల్య శిలగామారెన్
    చేరఁసురేంద్రుడుపదమిడ
    ధారుణిపదఘట్టణములెతనరె చరితలై

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *23 మే 2017*

    గురుదేవా సవరించా దీవించండి

    రిప్లయితొలగించండి
  35. కం.శ్రీరామాయణ గాధను
    సారాయినిగొన్న యొకడు సాల్వడి బలికెన్,
    "శ్రీ రావణ సతి సీత" ని
    శ్రీ రాముని గని యహల్య శిలగా మా రెన్"
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  36. కోరి శబరి యిడె కువలము
    శ్రీరామునిఁ గని; యహల్య శిలగా మారెన్
    క్రూరుడు యింద్రుడు చెఱపగ,
    నేరము నెరుగనిదియైన నిందను బడసెన్

    రిప్లయితొలగించండి
  37. ఆ ముని వాల్మికమ్మునగు నాకథ నందున లేదటంచు నే
    గోముగ వింటినయ్యనిటు ఘోరపు దృశ్యము నాతిరాతియౌ...
    కోమలి రంగనాయకిని కోరెద సత్యము తెల్పమంచిటన్:👇
    "రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే"

    రిప్లయితొలగించండి