13, మే 2017, శనివారం

సమస్య - 2359 (చీమలఁ గొల్చిననె కలుగు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చీమలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్"
(లేదా...)
"చీమల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగభాగ్యముల్."
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

46 కామెంట్‌లు:

 1. సేమముఁగూర్ప బారులుగ చేరి రవంతయు భీతి జూపకన్
  నీమముతో పదార్ధముల నేరుపుగా గ్రహియించి,తెచ్చి,సం
  గ్రామము చేసి చూపు తమ కార్యము నెగ్గినదాక నేకతన్!
  చీమలఁగొల్చినన్ గలుగు చెచ్చెర సంతత భోగభాగ్యముల్

  రిప్లయితొలగించండి
 2. ఓయీ! పారిశ్రామికవేత్తా!!

  పామరులు గాదు వారలు
  సేమమ్మొసగంగ వారి స్వేదము సిరియౌ
  నీమది దృష్టికి కార్మిక
  చీమలఁ గొల్చిననె గలుఁగు శ్రీ భాగ్యమ్ముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులు మన్నించాలి. సమస్యాపాదమును గణభంగమైనదనిపించి కొద్దిగ సవరించాను.

   తొలగించండి
  2. మూడవ పాద సవరణతో

   ఓయీ! పారిశ్రామికవేత్తా!!

   పామరులు గాదు వారలు
   సేమమ్మొసగంగ వారి స్వేదము సిరియౌ
   నీమదిలో కార్మిక చలి
   చీమలఁ గొల్చిననె గలుఁగు శ్రీ భాగ్యమ్ముల్

   తొలగించండి
 3. పాముల వోలుచు బీదల
  భూముల కాజేయు నట్టి భోక్తల గూల్చన్
  శ్రామిక సభలను నా చలి
  చీమలఁ గొల్చిననె కలుగు శ్రీసౌభాగ్యమ్ముల్


  * సమస్యా పాదములోని గణములు?

  రిప్లయితొలగించండి
 4. ప్రేమను గను శ్రీ రమణుని
  ధామం బరుణాచలేశు ధర్మ సుశోభా
  శ్రీ! మహిమాన్విత ఘన రో
  చీ మలఁ, గొల్చిననె గలుగు శ్రీ సౌభాగ్యాల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో.....

   ప్రేమను గను శ్రీ రమణుని
   ధామం బరుణాచలేశు దర్శన శోభా
   శ్రీ! మహిమాన్విత ఘన రో
   చీ మలఁ, గొల్చిననె గలుగు శ్రీ భాగ్యమ్ముల్!

   తొలగించండి

 5. చీమల్లా కష్టపడిన శ్రీకరమగు పద్య సొబగుల్ :)

  ఓ మాలిని! కష్టేఫలి !
  చీమలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్!
  నీమము గా వాటివలెన్
  కామా, ఫుల్స్టాపులేక కందము రాయన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. ఓమధురాధిపా! వినయ మోహన! మా చిరకాల మిత్రమా!
  శ్రీమయ మౌ శుభమ్ములను శీఘ్రము గా జను లెల్ల దూకొనన్
  చీమల గొల్చినన్ గలుగు శ్రీకర సంతత భోగభాగ్యముల్
  నీమది నిల్పుచున్ పనుల నీమము గా సరి జూడు సామ్యమై !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. కామద మది తిరుమల గల
  భూమీధరపంక్తి బహుళ పుణ్యద మగుటన్
  నీమముతో నీ వో ప్రా
  చీ!మలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 8. క్షేమదమౌచు భక్తులకు క్షేత్రము లందున నున్నతంబుగా
  భూమిని తిర్మలాఖ్యమున పూర్ణసుఖంబుల నందజేయు స ధ్ధామము నమ్మగా వలయు తద్గత మానస మంది నీవు ప్రా
  చీ! మల గొల్చినన్ గలుగు పేర్మిని సంతత భోగభాగ్యముల్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 9. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  శ్రామిక శక్తికి స్పూర్తియు
  సోమరులకు మార్గ దర్శి సోదరులారా
  తామాదర్శ గురువులగు
  చీమల గొల్చినఈను కలుగు శ్రీ సౌ భాగ్యముల్

  రిప్లయితొలగించండి
 10. గురువుగారు మన్నించాలి
  సమస్య పాదం ఇలా వుంటే బావుండేదేమో
  చీమల గొల్చిననె కలుగు సిరిసంపదలే

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  బాము(ఆపద)కు నొక్కొక తంత్రము
  నీమము బాటింపకుండ నేర్పుగ బ్రతుకన్
  పోమె "పిపీలిక -పూజ"కు (చీమలకు శర్కర బంచుట)
  చీమల గొల్చిననెకలుగు శ్రీ సౌభాగ్యమ్ముల్(శ్రీ సౌభాగ్యాల్)శ్రీ సౌ భా.గ్య.మ్ముల్

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  స్వాములు భూములన్ బడసి సర్వమె వారుగ పేదసాదలన్
  బాముకొనంగ లేదె పలు భాతుల యిప్పుడునైన రాజులే!
  క్షేమమటంచు చట్టసభ జేకొన స్థానము వోట్ల ప్రార్థనన్
  ధీమతులట్లు వాలకము దిద్దరె?వారలు గన్న సత్యమే
  "చీమల గొల్చినన్ గలుగు (పేర్మి) శ్రేయము సంయత భోగ భాగ్యముల్"!(బాముకొను॥దోపిడి వెట్టిచాకిరి మొ॥నవి)

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  స. లో సంయతను సంతత గా చదువ గలరు.టైపాటది.,ఆర్యా,

  రిప్లయితొలగించండి
 14. [5/12, 5:31 PM] DrNVNChary: సమస్య - 2359 (చీమలఁ గొల్చిననె కలుగు...)

  కవిమిత్రులారా!  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... "చీమలఁ గొల్చిననె కలుగు శ్రీసౌభాగ్యమ్ముల్" (లేదా...) "చీమల గొల్చినన్...
  [5/12, 5:55 PM] DrNVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  శ్రామిక శక్తికి స్పూర్తియు
  సోమరులకు మార్గ దర్శి సోదరులారా
  తామాదర్శ గురువులగు
  చీమల గొల్చినఈను కలుగు శ్రీ సౌ భాగ్యముల్
  [5/12, 6:32 PM] DrNVNChary: డాఎన్.వి.ఎన్.చారి9866610429
  మామను తెలిపెద వినుమా
  వామాక్షి తండ్రి వలన వర్షము కురియున్
  నీమము తప్పక నిక బా
  చీ! మల గొల్చిననె కలుగు శ్రీ సౌభాగ్యముల్

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టా
  ఆర్యులారా! ధనం లేని వానికి అనుచరులుండరు.అట్టి వారికి చట్ట సభలు,నామినేటెడ్ పోస్టులు మూసివేయ బడినవి.ఇంకా సర్వ సమానత్వం యెప్పుడు చూస్తాము? కవి గళం దానిని సాధిస్తుందా? ని..రా..శ!

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. ఉత్పలమాల పాదము

  "చీమల గొల్చినన్ గలుగు శ్రీకర సంతత భోగభాగ్యముల్."

  రిప్లయితొలగించండి
 18. శ్రీమద్విష్ణువు తిరుమల
  పై మానవుల నిదె ప్రోవ బాగుగ వెలసెన్
  నీమముతో మన దిక్కం
  చీ మలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్.

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులు మన్నించాలి.
  నిన్న ప్రయాణపు టలసట, బ్యాగు పోయిన ఆందోళన కారణంగా సమస్య కందపాదంలో గణదోషం, ఉత్పలమాలలో యతిదోషం ... మిత్రుల సూచనతో సవరించాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. చీమలఁగొల్చినన్ గలుగు శీఘ్రముగా పలు భోగభాగ్యముల్ - అంటే సరిపోతుందేమో?

  రిప్లయితొలగించండి
 21. భామలు స్వామి కిరుదిశల
  కోమలముగ వెలసె నేడు కొండలపైనన్
  క్షేమము, శ్రేయము లిడుస
  ఛ్ఛీమల గొల్చిననెకలుగు శ్రీ భాగ్యమ్ముల్

  సచ్ఛీమల=సత్+శ్రీ+మల=ఆ మంచికొండ

  రిప్లయితొలగించండి
 22. భామలు స్వామి కిరుదిశల
  కోమలముగ వెలసె నేడు కొండలపైనన్
  క్షేమము, శ్రేయము లిడుస
  ఛ్ఛీమల గొల్చిననెకలుగు శ్రీ భాగ్యమ్ముల్

  సచ్ఛీమల=సత్+శ్రీ+మల=ఆ మంచికొండ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా .పిట్టా
   భామ॥వేంకట॥భామ.ఇదివరుస
   వేంక॥భామ॥వేంక॥.వేంక ॥భామ॥వేంక బాగు అంతటా ఆయనే యన్న తత్త్వము.వచనం ఏ.వ.రావుగారూ!

   తొలగించండి
 23. పాములును చంపు నెయ్యవి,
  దేముడు కరుణించు నెపుడు,దేవిని కొలువన్
  ఏమిజరుగు మానవులకు
  చీమల, గొల్చిననె,కలుగు శ్రీ భాగ్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 24. నేమము తోడుత న్నడచి
  నెయ్య మొసంగుచు సంఘజీవనా
  రామ సుగంధము న్నొసగి
  రమ్యతతో తమ జాతియంతకున్
  సేమ మొసంగు సామమును
  జేకొని సాగెడి కర్మజీవులౌ
  చీమల గొల్చినన్ సతము
  జేకురులే ఘన భోగభాగ్యముల్!

  రిప్లయితొలగించండి
 25. కందగణమేల తప్పెన్,
  ఎందుకుతప్పెను యతిగతి, ఎప్పుడు లేదే,
  కందివిరచిత సమశ్యల్
  అందరి మన్ననలు పొంది ఆహ్లాదమిడన్

  పోయెనట బ్యాగు బస్సులో, పుస్త కములు
  పాసు బుక్కులున్న ఎడల భంగ పడక
  పొంద వచ్చు, పాన్ కార్డును పొంద వచ్చు
  మరల,ధనము నగలు యున్న తిరిగి రావు,
  ఐనను వలదు చింతలు, ఆంధ్ర రాష్ట్ర
  కవుల కావ్యపు సంపద గదుల లోన
  తూగుచున్న ఏ దొంగలు దోచ గలరు,
  ఇన్క ముల పైన చేయునా ఎప్పుడైన
  దాడులు అనిశా వారలు, ధరణి పైన
  కంది వారు చింతను మాని కవులు కొరకు
  బ్లాగులోసమస్యల నిమ్ము బాగు గాను  రిప్లయితొలగించండి
 26. ఏమా !సంఘీభావము?
  నీమముతో కలసి మెలసి నిరతము శ్రమతో
  నేమఱకసాగు శ్రామిక
  చీమల గొల్చిననె గలుగు శ్రీభాగ్యమ్ముల్!!!


  పాముకు బాలు,ఫలములను
  రామచిలుకకున్,కబళము శ్రావకమునకున్
  నీమముగ బెట్టు ధాత్రిన్
  చీమలఁ గొల్చిననె గలుగు శ్రీభాగ్యమ్ముల్!!!


  రిప్లయితొలగించండి
 27. సోమరితనమే మనిషికి
  భూమిని పెనుశత్రువౌను పొల్పుగచూడన్
  శ్రామికులె నేడు రాజులు
  చీమల గొల్చినను గలుగు శ్రీభాగ్యమ్ముల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 28. భూమిని గల్గు ప్రాణులలొ పొల్పుగ మానవులే నసూయతో
  తామునుతాము వైరులుగ తద్దయు సల్పుచుండెదర్
  నీమమునైకమత్యమును నీతియు గల్గిన సంఘజీవులౌ
  చీమల గొల్చినన్ సతము జెకుఱులే ఘన భోగభాగ్యముల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 29. పాముకు క్షీరమున్ మరియు, పర్వికి భుక్తియు, బెట్టి వేడ్కతో
  జామిఫలమ్ములన్ చిరికి, చామ్యము జల్లుచు నీడజమ్ముకున్
  నీమము గన్నొసంగిధర, నిత్యము గుట్టక రక్షగోరుచున్
  చీమలకున్ నవాతునిడి, శీఘ్రమె చక్కగ సన్నుతించుచున్
  చీమల గొల్చినన్ సతముజేకురు లేఘన భోగభాగ్యముల్!!!  రిప్లయితొలగించండి
 30. స్వామిన్ నమ్మినవారలు
  క్షేమముగా నుండగలరు, స్థిరమగు భక్తిన్
  శ్రీమంతుని నిత్యము ప్రా
  చీ! మలఁ గొల్చిననె గలుఁగు శ్రీ భాగ్యమ్ముల్
  ప్రాచీః ఒక స్త్రీ పేరు

  రిప్లయితొలగించండి
 31. రిప్లయిలు
  1. గోముగ వేంకట రమణుఁడు
   భామల గూడి వసియించు వర వృష గిరినిం
   గామిత వరప్రదంబం
   చీ మలఁ గొల్చిననె కలుగు శ్రీ భాగ్యమ్ముల్

   వేమఱుఁ జూచు చుందుమిలఁ బెక్కుర నుండగ మూఢ భక్తినిన్
   మైమఱ పేల దైవమును మానుగఁ గొల్చిన నుత్తమంబగున్
   గోముగ జ్ఞాన కోవిదులకుం దగునే పలుకంగ నిట్టులం
   "జీమల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగ భాగ్యముల్"

   తొలగించండి
 32. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ప్రామాణికమౌ శిక్షణ
  చీమల గొల్చిననె కలుగు; శ్రీ భాగ్యముల్
  గోముగ గల్గును భక్తి
  న్నామాధవి భజన లెంచి నర్చించంగా

  రిప్లయితొలగించండి
 33. పామరులకు,పండితులకు,
  శ్రీమంతులు,భిక్షుకులకు.సేవించినచో
  కామిత దాయి,నిలయమం
  చీ,మల,గొలిచిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 34. ఆ మంగపతియె నిలిచిన
  ధామమ్మది పావనమయి ధరణిని వెలసెన్
  నేమముతోమదిని దలం
  చీమలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్

  రాముడు కృష్ణుడై భువిని రక్షణ జేసెడు దీక్షతోడ తా
  భుామిని జన్మనెత్తిన ప్రభుండిల భక్తులబ్రోవనెంచుచున్
  కోమల రూపుడై వెలయ కొండలె పావనమంచు నే దలం
  చీ మల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగభాగ్యముల్.

  రిప్లయితొలగించండి
 35. కవిమిత్రులకు నమస్కృతులు.
  బ్యాగు పోయిన మనస్తాపంతో ఉన్నాను. బస్సుడిపోకు వెళ్ళి అడిగితే ఎవరూ బ్యాగు ఇవ్వలేదన్నారు. దేనిమీదా మనస్సు లగ్నం కావడం లేదు. మీ పద్యాలను చదవడానికి కాని, వ్యాఖ్యానించడానికి కాని వీలుకాలేదు. ఈరోజుకు నన్ను మన్నించండి.

  రిప్లయితొలగించండి
 36. పిన్నక నాగేశ్వరరావు.

  చీమలు నేర్పెడు పాఠము

  నీమముగా పొదుపు చేయ నెటులో
  తెలుపున్
  శ్రామిక శక్తికి రుజువౌ

  చీమల గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్.

  ***************************

  రిప్లయితొలగించండి
 37. 13/5/17
  9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
  కం:సామము తోడను సతతము
  చీమలు గొల్చినను కలుగు శ్రీభాగ్యముల్
  గోముగ చేర్చుట నేర్చిన
  కామములన్ని నెరవేరు ఖచ్చిత మిదియే.

  రిప్లయితొలగించండి
 38. సోముని జ్యోతిర్లింగము
  భ్రామరిదౌ శక్తి పీఠ రాజిత సాల
  గ్రామ శ్రీగిరి దిక్కం
  చీ మలఁ గొల్చిననె గలుఁగు శ్రీ భాగ్యమ్ముల్ ..1

  రిప్లయితొలగించండి
 39. పాముల కిర్వుగా తమరి వాసము లిచ్చును చీమలేనయా!
  నీమము వీడకే మెలగు నిక్కపు పఙ్క్తిని చీమలేనయా!
  రాముని గాథకుండికిల రక్షణ నిచ్చెను చీమలేనయా!
  చీమల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగభాగ్యముల్ :)

  రిప్లయితొలగించండి