18, మే 2017, గురువారం

సమస్య - 2363 (కనఁగ గతజల...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కనఁగ గతజల సేతుబంధనమె మేలు"
(లేదా...)
"గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్"

78 కామెంట్‌లు: 1. వాన రాకడ తెలియక వాడిమి తొలి
  గు సమయము తెలియకపోయె గురు! జిలేబి
  పలుకుల వినదగు చపచపనయు నేది ?
  కనఁగ గతజల సేతుబంధనమె మేలు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'తొలిగు'....?

   తొలగించండి

  2. నెనర్లు అప్పు తచ్చు :) తొలగు

   కళ్లు పోయేను రామా హరే

   వృద్ధా జిలేబి :)

   తొలగించండి
 2. "ఒప్పు కొనెదను ద్యూతము తప్పు తప్పె!
  ఇపుడు చింతించి దూషించ నేమి ఫలము?
  మునులు తాపసు లెందరో వనము లందు!
  కనఁగ గతజల సేతుబంధనమె మేలు..."

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "మున్ముందు మునుల సాంగత్యము మనకు మంచి చేయ గలదు. వనవాసము శ్రేయస్కరమే. జరిగిన దానికి చింతించ వలదు. అంతా మన మంచికే" అని...

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాపసు లున్నారు వనములందు' అనండి బాగుంటుంది.

   తొలగించండి


 3. సతతము భూత కాలపు సజావుల చింతనలన్ సవారులౌ
  గతజలసేతుబంధనమె; కల్గగఁ జేయు ననంతలాభముల్
  వెతలను వీడి యత్నముల వేగము జేయ జిలేబి, ముంగటన్
  బతుకును నీడ్వ మేలగును బాధ్యత గాంచి మెలంగ వే సఖీ‌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. కురుచ చొక్కాలు,గావంచ,మెరయు వోణి,
  పరికిణీ,పాత దుస్తులే...సరసమైన
  తెలుగుదనముట్టిపడు వాటి విలువఁదెలియ..
  కనగ గతజల సేతు బంధనమె మేలు

  రిప్లయితొలగించండి
 5. నీరమును నిల్వ జేసిరి నియతి తోడ
  చెఱువు లన్కుంట లందున కఱవు లేక
  వర్షధారల పూర్వము కర్షకులకు
  కనగ గతజలసేతుబంధనమె మేలు.

  రిప్లయితొలగించండి
 6. జాంబవంతునితో పోరు చక్రి తరచి
  కనగ గత జల సేతు బంధనమె, మేలు
  కల్గి మణితోడ ఇరువురు కన్యకలను
  పెండ్లి యాడెను కన్నయ్య ప్రేమ తోడ

  రిప్లయితొలగించండి
 7. ప్రతి పని చేయగా తగిన వర్జ్యముహూర్తములుండు చూడగన్
  గతి సుగమమ్ముగానగు సుఖమ్ములు లాభము కల్గు నంత ధీ
  మతులు వివేక మొప్పగ సమస్తము చేయరె లాభ మంద సం
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్

  రిప్లయితొలగించండి
 8. గడచి పోయిన దేదియు నడచి రాదు
  గతము గురుతులై మిగిలెడి కాల మందు
  సుఖము నొందగ గతమును జూడ రెవరు
  కష్ట మొదవిన మనసున కసరు నిటుల,
  కనఁగ, "గతజల సేతు బంధనమె మేలు"!

  రిప్లయితొలగించండి
 9. ప్రతి జలబిందువున్ నరుడు రక్షణజేయగ *చంద్రపూర్వులౌ*
  చతురులు *బాబుశేఖరులు* చక్కగ చెప్పుచునున్నవారు ! మా
  హితమును గోరి *త్రవ్వుమనిరింకుడుగుంతలు* , కాని వృష్టి సం
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్"

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  చేసి యూర్కొంటి దానికి చింత తగదు
  వదలివేయుము యనుమాట వట్టి కూత
  వెనుక జరిగిన పొరపాటు వెలయకుండ
  కనగ, గతజల సేతు బంధనమె మేలు
  తడిసిననె గూడు గప్పెడి దరువు మాని
  కనగ గతజల సేతు బంధనమె మేలు
  చేసి చెడుమదె చెడకుండ చేయలేవు
  అనుభవమ్ముల మూటల నరయ సుఖమె!

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  విగత జలాల ధారలవి వెళ్ళె పదంపడి కట్టగట్టు నీ
  మగతకు నర్థమున్నదట మంచి మనస్సున నెంచ దానినిన్
  వగవక వారధిన్ గనునె వార్ధిని దాటునె రామదండు యా
  పగగొని సీతకౌ చెరనుపాయముగా విడిపించె రాముడే!!

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా
  మొదటి వృత్తముయతి పొరపడిసాగింది.
  మతిజెడి కార్య కారణపు మాన్యత గానక పోతి కార్యమీ
  గతిజెడె దొంగ జాడ గనగన్ యొక గొంగళి పోతె పోని యీ
  వెతన జెలంగు యత్నములు వేలకు వేలు ఫలించు, సోదరా!
  గతజల సేతు బంధనమె కల్గగ జేయు ననంత లాభముల్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'వదలివేయుము+అను' అన్నపుడు సంధి నిత్యం. 'వదలివేయు మనెడు మాట' ఆనండి.

   తొలగించండి
 13. స్వంత వాక్యాలు నిర్మించు స్పర్థలోన
  నీకు ననువైన దేదియో నిర్భయముగ
  గోరు మని పల్క బాలుండు గురున కనియె
  కనగ "గతజల సేతుబంధనమె"మేలు.

  క్షితిపయి వార్ధకంబునను కీడ్పడి మిక్కిలిగాగ కుందుటల్
  గతజల సేతుబంధనమె, కల్గగ జేయు ననంత లాభముల్
  సతతము శ్రద్ధ బూనుచును సన్మతితోడ నభాగ్యులందునన్
  చతురత జూపి చేతనగు సాయము జేయుట సత్య మెల్లెడన్.

  హ.వేం. స.నా. మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. డా.పిట్టా
  అతిగ సుసాధ్య సంపదకు నాయువకాళి యటన్న వాణికిన్
  శ్రుతి యెటు దప్పెనో;సరియ, చూడుము వారి యుపాధి, నార్జనన్;
  జతనములెన్నొ చేయుదువు జాగృతికిన్ నిలయంపు సేవలన్
  "వతనును(soil of birth)నమ్ముకొంటివిట వాయకు బాసల "నాసుమానియా(Osmania)
  వితతిని నిమ్మళించగను వీకన రమ్మిటు డాక్టరేటు కై
  సతతము వేచియుండెనది సాలుకు మారుట నోర్వలేము, త
  ద్గత జల సేతు బంధనమె కల్గగ జేయు ననంతలాభముల్
  వెత యిది కాదు మా వినతి వేసట లేదిట కేసియారుకున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా వారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా, సూచన పాటించితిని. ధన్యవాదములు.

   తొలగించండి
 15. ధరణి రక్షించు చెట్లను దారుణముగ
  కూల్చి,కాలుష్యమును బెంచి,కూర్మిజేసి
  వర్షములు లేవనుచు నేడు వగచుటేల
  కనగ,గతజల సేతుబంధనమె మేలు

  రిప్లయితొలగించండి
 16. సుతులకు ఆస్థినంతయును సొంపుగ వ్రాయుచునంతిమమ్మునన్
  గతుకుల బాటలో వెలుగు కానక జీవనమెంతొభారమై
  సతమతమౌచు రోజులు విచారముగన్ కరిగించు వారికిన్
  గతజల సేతు బంధమె కల్గగ జేయుననంత లాభముల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 17. మనసుకెంతయు దగ్గరై మనెడి వారి
  తూలనాడంగబోవక తొట్రుపడక
  పనిని జరిపింపనీనాడు పనికిరారు
  కనగ గతజలసేతుబంధనమె మేలు
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 18. కాంత పరువమ్ములొలుకంగ కాలు జారె
  గతిల వరదల్ల పారంగ గట్లు జారె
  కనగ గతజలసేతుబంధనమె మేలు
  భవిత భద్రమ్ముగా నుండు భయములేక

  రిప్లయితొలగించండి
 19. 1 కుండ పోతగ వర్షాలు గురియు వేళ
  నదులలో పొంగు జలరాశి నొదలి వేయ
  విప్పరే సేతు ద్వారమ్ము ముప్పు తొలగ
  కనఁగ గతజల సేతు బంధనమె మేలు

  2. గతమొక పాఠమంచు మది గైకొని సాగుము చింతయేల ను
  న్నతులను జేరువారలకు నవ్యతరమ్మగు మార్గమిద్దియే
  గతకృత దోషమంతయును గంగకు దానమొసంగ నీ మదిన్
  గతజల సేతుబంధనమె కల్గగఁజేయు ననంత లాభముల్
  శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 20. వెతల దలంచుచున్ మదిని
  వేసరి కుందెడి వారి వైనముల్
  గత జల సేతు బంధనమె,
  కల్గగజేయు ననంత లాభముల్
  ప్రతి గమనంబునన్ పొసగు
  భావన నింపుక జాగరూకతన్
  వితతిని గాంచ నెంచుచు వి
  వేచన మందు చరించ మానవుల్!

  రిప్లయితొలగించండి
 21. ముసురు ధాటికి క్షేత్రముల్ మునిగిపోవ
  కొలను గట్టులు రయమునఁ గూలిపోవ
  గ్రామమును పశు సంపదఁ గావ గాను
  కనగ గత జల సేతు బంధనమె మేలు

  రిప్లయితొలగించండి
 22. కన నజాగళస్తనములు గగన సుమము
  నిల మరీచిక నేతిబీరలను కంటె
  కనగ గతజల సేతుబంధనమె మేలు
  భావి వర్షాంబువులనైన భద్ర పరుచు!!

  రిప్లయితొలగించండి
 23. మృతుడగు భర్త కాయమును మేదిని యందున వీడి కాలునిన్
  జితముగ వెంబడించి తన శీలముచే సమవర్తి మెప్పునన్
  కృతమతి యైన సాధ్వి తన కీర్తిని బెంచు వరంబు బొందెగా
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్

  రిప్లయితొలగించండి
 24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  18, మే 2017

  *"కనఁగ గతజల సేతుబంధనమె మేలు*
  వరదనీరుండనుప్పొంగివాగు నందు
  దాటవలెనంచుత్వరపడన్ తప్పుసుమ్ము
  వంతెనన్ గట్టవేచినన్ వచ్చుశుభము
  *"కనఁగ గతజల సేతుబంధనమె మేలు"*

  (లేదా...)

  *"గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్"*

  ధృతిగని యింజనీర్లునెగదీయకవాటములానకట్టలన్
  క్షతగతికందనోలుపురిగంగమునింగెప్రభుత్వకృత్యమై
  మితిగనలౌక్యమౌ నిలిపిమించిభరించిన నష్టమౌనొకో
  *గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  *18, మే 2017*

  రిప్లయితొలగించండి
 25. గతమునందు జీవించుట, కలత జెంది
  చీలిన మన సంటించుట, చిత్తగించి
  కనగ గతజల సేతు బంధనమె, మేలు
  తామరాకు పై మనుటయె తేమ వోలె౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 26. సంచిత గుణశీలి యనుచు జనులు నమ్మి
  పదవి గట్టబెట్ట పిదప స్వార్థుడగుచు
  మానవతను మంచిని వీడె మమత మరచె
  పదవి పెంచిన గర్వమ్ము పాపియయ్యె
  కనఁగ గతజల సేతుబంధనమె మేలు


  అతిశయమొప్పు సంస్కృతి మహాద్భుతమైన చరిత్ర తోడ భా
  రతధరణీ తలమ్మిదియె ప్రాభవమందెను నాడు నేడిలన్
  జతురత వీడుచున్ జనులశాస్త్రియ పద్ధతులాచరింపగన్
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్

  రిప్లయితొలగించండి
 27. ద్రోహమొనరించి తరువాత దు:ఖ పడుట
  కనగ "గతజల సేతుబంధనము" మేలు
  మరచి కీడు సేసెడివారి మర్మ మెరిగి
  నడచుకొనవలె సుమ్మి యీ పుడమినందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. ఆపదలు గలిగినఁ జూతు మపుడు జనత
  కనఁగ గత జల సేతు బంధనమె, మేలు
  కల్గును భువిని ముందుగఁ గర్జములను
  బన్నుగఁ దలచి చేసిన బాధ్య తూని
  [జనతకు +అనఁగ =జనతకనఁగ ]


  మతి సెడి రెండు సేతులును మండిన నాకులు వట్ట లాభమే
  ప్రతిఫల మెంచి ముందుగనె పాటు పడంగ సతమ్ము మేలగున్
  నుత జల పూరితమ్ములు వినూతన ధారల నిండ నిమ్న గా
  గత జల సేతు బంధనమె కల్గగఁ జేయు ననంత లాభముల్
  [నిమ్నగ +ఆగత =నిమ్నగాగత ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటిపద్యమున సవరణ:
   "పన్నుగఁ దలచి చేసిన బాధ్య తఁగొని "

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని 'ఆగత జల' మన్న ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.

   తొలగించండి
 29. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కాల తత్త్వమునకు తగు గమక మెంచి
  సేతువు బిగించి జలముంచి సేద్యమునకు
  సతము నిబ్బంది సేయని చర్య లవియ
  కనగ గత జలసేతు బంధనమె మేలు!

  రిప్లయితొలగించండి
 30. మతములవెన్నియున్న ఘన మానవతన్ పరిపూర్ణ శక్తి తో
  గతమున మేలు జూపమి విఘాతము గల్గగ మానవత్వమే
  సతమత మై కృశించె గద ! సర్వ జనాళి గ్రహించి పెంచు చో
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా
  అతిగ సుసాధ్య సంపదకు నాయువకాళి యటన్న వాణికిన్
  శ్రుతి యెటు దప్పెనో;సరియ, చూడుము వారి యుపాధి, నార్జనన్;
  జతనములెన్నొ చేయుదువు జాగృతికిన్ నిలయంపు సేవలన్
  "వతనును(soil of birth)నమ్ముకొంటివిట వాయకు బాసల "నాసుమానియా(Osmania)
  వితతిని నిమ్మళించగను వీకన రమ్మిటు డాక్టరేటు కై
  సతతము వేచియుండెనది సాలుకు మారుట నోర్వలేము, త
  ద్గత జల సేతు బంధనమె కల్గగ జేయు ననంతలాభముల్
  వెత యిది కాదు మా వినతి వేసట లేదిట కేసియారుకున్!!

  రిప్లయితొలగించండి
 32. పారు నదులు సంద్రానికై పరుగులిడుచు
  వ్యర్థమగుచుండె నీరంత వ్యధమిగుల్చు
  కలత దీర్చి కరువుకాటకముల యందు
  గనగ గతజల సేతుబంధనమె మేలు

  రిప్లయితొలగించండి
 33. పదవి పొందిన నేతలీ ప్రజల కొరకు
  పాటు పడెదమనెడు వారి మాటలెల్ల
  కనగ గతజలసేతు బంధనమె, మేలు
  గూర్చరు నిజమ్ము తీతురు గోతులేను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 34. హితమొనరించినారమవహేళనలెన్నొ భరించినాము, దా..
  గితిమి పరాయి పంచన నికృష్టపదమ్ముల , నంచు బల్కగా
  గతజలసేతుబంధనమె ! కల్గగఁ జేయు ననంతలాభముల్
  ధృతి భుజశక్తియే!యనుమతింపుము యుద్ధము మేలు మేలనన్ !!

  రిప్లయితొలగించండి
 35. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
  హితము చేకూర్చెదమటంచు నిలను పల్కి
  మాట తప్పుచు మసిలెడు మనుజు లుండ
  కనగ గతజలసేతుబంధనమె మేలు
  జరుగబోదు గనుమెపుడు సదయులార.

  రిప్లయితొలగించండి
 36. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
  హితము చేకూర్చెదమటంచు నిలను పల్కి
  మాట తప్పుచు మసిలెడు మనుజు లుండ
  కనగ గతజలసేతుబంధనమె మేలు
  జరుగబోదు గనుమెపుడు సదయులార.

  రిప్లయితొలగించండి
 37. బాల్యమేమిటో చిలిపిగా పరుగులెత్త
  యవ్వనము కోర్కెల పక్కియై రివ్వునెగియ
  ముసలితనమందు యోచించి ముక్తిగోరు
  కనగ గతజల సేతుబంధనమె మేలు

  రిప్లయితొలగించండి
 38. ధనము కంటెను విజ్ఞాన ధనము మేలు

  సొగసు కన్నను మిన్నయౌ సుగుణ రాశి

  బుధుల కంటెను ప్రవహించు నదులు మేలు

  కనగ గతజల సేతు బంధనము మేలు.

  విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగుపండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా.7396564549


  రిప్లయితొలగించండి
 39. స్తుతినిటు జేసి మోడినహ సుందర రూపుడు పోటుగాడనన్
  మెతుకును గూడ రాల్చడుగ మేలగు నాంధ్రుల రాజధానికిన్
  గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్
  నుతినహ జేసి రాహులిని నున్నని కాళ్ళకు నూనె పూసెదన్!

  రిప్లయితొలగించండి