31, మే 2017, బుధవారం

సమస్య - 2374 (దోషమే కాదు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దోషమే కాదు చేయుట దొంగతనము" 
(లేదా...) 
"దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

57 కామెంట్‌లు:

  1. ముగ్ధ మోహన రూపాన స్నిగ్ధతమిడి
    గాన మాధురి నొలికించు ఘనుడు కృష్ణ
    గోపి కాహృద యంబుల గోప్యముగను
    దోషమే కాదు చేయుట దొంగతనము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "స్నిగ్ధత నిడి" అనండి. 'కృష్ణ' అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. అక్కడ "ఘనుడు హరియె" అనండి.

      తొలగించండి
  2. తుంటరిగ వెన్న నాతడు దొంగిలించె
    దొరతనమున రుక్మిణినియు దొంగిలించె
    ధర్మసూత్రము లందున మర్మ మెరిగి
    దోషమే కాదు చేయుట దొంగతనము

    రిప్లయితొలగించండి
  3. కూర్మి నవమాసములు మోసి కొడుకునుకన
    ఆమె కాన్సరు కోరల నకట చిక్కె
    వైద్యమందింప చౌర్యము వాడొనర్చె
    దోషమేకాదు చేయుట దొంగతనము

    రిప్లయితొలగించండి
  4. వంపు సొంపులతో జేరి వలపు మీర
    మదనతాపాన బడవేయు మగువ నంది
    మాన మొసగగ నద్దాని మానసమును
    దోషమేకాదు చేయుట దొంగతనము.

    దొంగ రాజట మంత్రులు దొంగ లచట
    చౌర్య కళలోన బ్రజలను శోభనముగ
    తీర్చి దిద్దుట కృత్య మా దేశమునను
    దోషమేకాదు చేయుట దొంగతనము.

    దొంగల రాజ్య మచ్చటను దొంగ ప్రభుం డిక మంత్రు లందరున్
    దొంగలు వారి కృత్య మది దోచుట యెల్లెడ కేగి నిత్యమున్
    దొంగలుగా బ్రజావళికి ద్రోవను జూపుట శాసనం బటన్
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    ఒకడు కథ వ్రాయ కీలక మొకటిదెచ్చి
    నికరమతుకుల బొంతగా నిలుప దాన
    దోషమేకాదు చేయుట దొంగతనము
    బాహుబలి కళాఖండ ముద్భవము గాగ

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    అంగన నమ్మ బాలుడని యారడి జేయడె వెన్నదొంగ నా
    సంగము బాసెనే తుదకు సత్కృతమిచ్చట నేడు కొండలన్
    బంగరు బ్రోవు జేయుటను బాయడు యింకను "బాల" "జీ"న్గొనెన్
    దొంగతనమ్ము సేయుటయు దోషము కాదది పుణ్య కార్యమే!
    (దొంగయైన ఆ బాలకు జీ యను గౌరవ మివ్వగా"బాలాజీ" యైనాడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      '...బాయడు+ఇంకను' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "...బాయ డొకింతయు" అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా,ధన్యవాదాలు

      తొలగించండి
  7. నగ్నముగ స్నానమాడుట నదులలోన
    కూడదని దెల్ప నాడెడు గోపికలకు
    చీరలన్ గొని కన్నయ్య చెట్టునెక్క
    దోషమే కాదు! చేయుట దొంగతనము

    రిప్లయితొలగించండి
  8. అద్భుతంబైన పూరణలందజేసి
    శంకరాభరణంబులో సభ్యులంత
    దోషమే కాదు చేయుట దొంగతనము
    శంకరుని మనసునది నిస్సంశయముగ

    రిప్లయితొలగించండి
  9. తనువు మనముల తపనల తల్లడిల్ల
    చింతలనెడు చీరెలుదోచి చిద్వి లాస
    హాసమూర్తి మోక్షముజూపి నార్తి బాపె
    దోషమేకాదుచేయగా దొంగతనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...జూపి యార్తి బాపె" అనండి.

      తొలగించండి
  10. వెన్నుడానాడు నుట్టిపై వెన్న పెరుగు
    పాలు మ్రుచ్చిలి పెట్టె సావాసులకును
    తెలియజెప్పెను పరులకై తిండి కొరకు
    దోషమే కాదు చేయుట దొంగతనము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆనాడు + ఉట్టి' అన్నపుడు సంధి నిత్యం. నుగాగమం రాదు కదా! "వెన్ను డానాడె యుట్టిపై" అనండి.

      తొలగించండి
  11. దోషమే కాదు చేయుట దొంగతనము
    వెన్న ముద్దలు రేపల్లె నెన్నొ సార్లు ,
    తోటి బాలుర కిడఁగ న దొక్షజునకు
    బాల్య చేష్టలు గలవవి పలువిధములు

    రిప్లయితొలగించండి
  12. దోషమే కాదు చేయుట దొంగ తనము
    నటుల నగునెడ యగుదురు హర్త కులిల
    నార్య ! భూప్రజ లెల్లరు వీర్య ముడిగి
    దొంగ తనమును జేయుట దోష మగును

    రిప్లయితొలగించండి
  13. ఆలయములేమి లేకున్న అన్ని పల్లె
    లందు రాముని మందిరాలైన యుండు,
    రామ పూజలు చేయని సీమ లేదు,
    రామ రామ యని యొక మారైన అనని
    హిందువులు లేరు, ఈరీతి డెందములను
    రామ చంద్రుడు దోచెను రమ్య గతిన,
    దోషమేకాదు చేయుట దొంగ తనము

    రిప్లయితొలగించండి
  14. దొంగిలు చుండ స్నేహితుల దుస్తుల జూచి గురుండు నీచుడా!
    దొంగతన మ్మదేల నన దూరకు డంచు వచించె శిష్యు "డా
    దొంగయు తానె యంచనడె ధూర్జటి రుద్రము నందు నేరరే!
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే".

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.

    పరులకున్ మేలొనర్చుచు పలు విధాల

    పుణ్య కార్యముల్ సలుపుట పుడమి
    యందు
    దోషమే కాదు ; చేయుట దొంగతనము

    పాపపు పనులు జరుపుట పాడి
    యగునె?
    ***************************

    రిప్లయితొలగించండి
  16. కారణ శతమ్ము లుడివిన నేర మది య
    దోషమే? కాదు చేయుట దొంగతనము
    దాన ఫలిత మనుభవింపఁ దప్పునె యిహ
    మున నయినఁ బరమున నైన ఘనుల కయిన


    అంగజ సన్ని భావయువ యాదవ పుంగవ వాసుదేవునిన్
    సంగర సింహవిక్రముని సన్నుత వాసవ సక్త చిత్తయై
    యంగన రాధ తల్చె మది నచ్యుతు కృష్ణుని దివ్య చిత్తమున్
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వలయు వేళల నాప్తుల వద్ద యప్పు
    దోషమే కాదు చేయుట; దొంగతనము
    దుర్మతిని గూడు పోడిమి దోషమౌచు
    మాయపోతుగా నిలుపును మనుజు నిలను

    తీవ్రవాదాన నుప్పొంగు తిప్పకాయ
    దాచినట్టి బందూకుల తలము నెఱిగి
    నతనికెఱుక లేకుండగ నటమటించ
    దోషమే కాదు చేయుట దొంగతనము

    రిప్లయితొలగించండి
  18. తొలుత చిన్నారియై వెన్న దొంగిలించె
    గోపికల గుండెలను వెన్క కొల్ల గొట్టె
    కృష్ణ పరమాత్మ యాడెడు క్రీడ లోన
    దోషమే కాదు చేయుట దొంగతనము

    రిప్లయితొలగించండి
  19. అంగన ! వింటివే యిదియ యర్వది నాలుగు లోనిదే గదా
    దొంగ తనమ్ము సేయుటయు, దోషము గాదది పుణ్య కార్యమే
    భంగము లెన్ని గల్గినను బాధను జెందక భవ్య మూర్తులై
    యంగవి హీనులైన బ్రజ కండగ నిల్చిన నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  20. దోషమే కాదు,చేయుట దొంగతనము
    దండనీయమధికరణ మండపమున
    పట్టుబడినచో, శిక్ష తప్పక విధింత్రు
    నేరమది ఋజువయ్యె నేని,నవనీత
    చోరుకైనను తల్లి రజ్జువున శిక్ష

    రిప్లయితొలగించండి
  21. అంగన భార్యయై తొలుత నార్తిగ సజ్జకఁ జేరవచ్చినన్
    తొంగియుఁ జూడ దాచు తన దోరవయస్సును సిగ్గుమొగ్గయై
    చెంగును దాకి దోచుకొన చెక్కిలి ముద్దిడ నడ్డుఁజెప్పదే!
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే!!

    రిప్లయితొలగించండి
  22. దోషమే కాదు చేయుట దొంగతనము నిదురను నటించు చున్నట్టి నీలవేణి యారబోయగ నందాల నర్థితోడ శయన మందిరమందున చక్కగాను

    రిప్లయితొలగించండి
  23. బీదరికముచే కడుపుకై భిక్ష మెత్త
    దోషమే? కాదు! చేయుట దొంగతనము,
    నమ్మకద్రోహమును, దైవనామధేయ
    దూషణ, యవినీతియె గాదె దోషమేను

    రిప్లయితొలగించండి
  24. నింగిని తాకుచున్నయవి నీతి సమాజములోని మానవుల్
    దొంగతనంబు దోపిడిని తోరముగానొనరించు వారలున్
    లంగతనంబుచే బ్రతుకు లంగలె యిట్టుల నందురెప్పుడున్
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే

    రిప్లయితొలగించండి
  25. బాల్యమందున తెలియక బాలురెల్ల
    తప్పుపనులను చేయంగ దండనొసగ
    దోషమే కాదు జేయుట దొంగతనము
    పాపమనుచునెరుకజేయ వలెను సతము .

    ఆరుగురు శత్రువులనిట నదుపు చేయ
    దోషమే కాదు;జేయుట దొంగతనము
    నసలు కాబోదు విజ్ఞానమరయుటయును
    నందు రనవరతము బుధులవని యందు.

    రిప్లయితొలగించండి
  26. భార్య బిడ్డలన్నార్థులై పగలు రేయి;

    తల్ల డిల్లగ జూచుచు తాళలేక;

    జాలి గుండెల యజమాని తలచె నిట్లు;

    దోష మేకాదు చేయుట దొంగ తనము.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామముని రెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు.కడప జిల్లా,7396564549.

    రిప్లయితొలగించండి
  27. రంగము శంకరాభరణ ప్రాంగణమవ్వగ పూరణమ్ములే
    బంగరు సొమ్ములవ్వగను భారతికిన్ భళ! సారెసారెకున్
    దొంగగ మారెదన్ గనుల దోచగ నట్టి సువర్ణ పంక్తులన్
    దొంగతనమ్ము సేయుటయు దోషముగాదది పుణ్యకార్యమే

    రిప్లయితొలగించండి
  28. బంగ ప్రదేశమందునట భారతి పూజల వీధివీధులన్
    రంగులు రంగులన్ వెలసి రంజన నిచ్చెడి పందిరిండ్లకై
    వంగుచు నక్కుచున్ శిశులు పన్నుగ పూసిన పూలతొట్లనున్
    దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే!

    రిప్లయితొలగించండి