22, మే 2017, సోమవారం

సమస్య - 2366 (కలికి కౌగిలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె" 
(లేదా...) 
"కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా"
ఈ సమస్యను పంపిన చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలు.

70 కామెంట్‌లు:

 1. తేనె తుట్టలో పుట్టిన తేనెటీగ
  మగడు పనిపాట లేకనె మసులు చుండు
  రాణి కోరిక దీర్చంగ రాలి పోవు
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె!

  "Should a drone succeed in mating, he soon dies..."

  https://en.m.wikipedia.org/wiki/Drone_(bee)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   చక్కని పూరణతో శుభారంభం చేశారు. బాగుంది. అభినందనలు.
   క్రొత్త విషయం తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 2. రతిసుఖము కోర మరణించు సతులు కూడ
  పాండు రాజుకు, మునుల శాపమ్ము నిడగ
  జీవితమున భార్య దరికి చేర దలచ
  కలికి కౌగిలి ప్రాణాoతకారి గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మంచి ఐతిహ్యంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
   కొంత అన్వయ దోషం ఉంది.
   "రతిసుఖము గోరి పాండుడు సతుల గూడ
   ప్రాణములు వీడు మునుల శాపమ్ముచేత" అందామా?

   తొలగించండి
 3. పసుపు పచ్చనవ్వ కనులు పరుగు లెట్ట
  "వెల్ల” పసరు మందు కొఱకు వెళ్ళ వైద్యు
  డంత చెప్పెను కొన్ని నియమము లందు
  కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె.
  ( వెల్ల కామెర్ల వ్యాధికి పసరు మందుకు రాష్ర వ్యాప్తంగా పేరు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవ్వ' అన్న ప్రయోగం సాధువు కాదు. "పసుపు పచ్చనై కన్నులు" అనండి. 'వెళ్ళ' అన్నది వ్యావహారికం. "వెడల" అనండి.

   తొలగించండి
  2. గురువుగారికి ధన్యవాదములు తెల్పుచూ సవరణానంతరం

   పసుపు పచ్చనై కన్నులు పరుగు లెట్ట
   "వెల్ల” పసరు మందు కొఱకు వెడల వైద్యు
   డంత చెప్పెను కొన్ని నియమము లందు
   కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె.
   ( “వెల్ల” కామెర్ల వ్యాధి పసరు మందుకు రాష్ర వ్యాప్తంగా పేరు)

   తొలగించండి
 4. ఆర్య నిన్నటి పూరణం ఒక్క సారి వీక్షించి తప్పులు సరిదిద్దగలరు
  విరాట రాజు కొల్వు లోనికి చేరు సమయమున అర్జునుడు ధర్మ రాజుతో పల్కిన పల్కులు

  పాపము కాబోదు పార్దా| విరహ తాపమున ఈశరీరము మోజు పడుచు
  నీపొందు కోరెను నిజముగా, ఇంద్రలోకమున వావివరుస లేమి లేవు.
  ఊర్వసి యర్పించె సర్వము నీచెంత, కోపమున్విడువుము , కోరు చుంటి,
  వేడుచుంటిని, నిన్ను విడువలేను విజయా, రా, రమ్ము రయముగ రతిని సలిపి
  సౌఖ్యమును పొందు ఫల్గుణా, సరస మాడ
  కున్న పేడివై వసియించు, గోత్ర బిధుని
  ప్రేయసిని నేను శాపము నీయు చుంటి
  వేగి రమ్ముగా అర్జునా వెడలి పొమ్ము
  యనుచు రమణి శపించెను నన్ను , నేడు
  యదియె వరమాయె, విరటుని అంత పురము
  లోన నాట్యము నేర్పింతు ఘనత తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   సీసపద్యంలో మీ పూరణ ప్రశంసనీయం. రెండవ పాదంలో ప్రాసయతి (కము-లేమి) తప్పింది. ప్రాసకు ముందున్న అక్షరాల గురులఘుసామ్యం ఉండాలి. 'పొమ్ము+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "పొమ్మ।టంచు..." అనండి.
   సీసపద్యంలోని ఎత్తుగీతికి నాలుగు పాదాలే ఉండాలి. తేటగీతిని విడిగా వ్రాసినపుడు ఎన్నిపాదాలైన 'తేటగీతిక' పేరుతో వ్యాయవచ్చు. "వెడలి పొమ్ము" వరకే ఉంచి "ఊర్వశి అర్జునును శపించిన సందర్భము" అంటే సరి!

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువర్యా ఇవాళ ఇంకొక క్రొత్త విషయము నేర్చుకున్నాను. సీస పద్యము ఎత్తు గీతికి నలుగు పాదముల లోనే ముగించ వలెనని నియమము. తప్పక పాటిస్తాను. ప్రాస యతీ గురించి ఒక్క సారి విపులముగా సలహా ఇవ్వండి.

   తొలగించండి
 5. నిండు పేదరికంబున నిత్యమవని
  బహుళ సంతతి సాకగ బలిమి యింత
  లేక మెతు కైన దొరకమి నాకలి యను
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   క్షుత్కాంతా పరిష్వంగాన్ని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి


 6. పలుకుల తియ్యబోడి ! మజ! పద్యములెల్ల సదా భళాయనన్
  కలికి కవుంగిలింత; కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా
  కలకువ యై జిలేబి సరి కావ్యము ముద్దుగ రాక బోవగన్ !
  నెలతుక యత్నముల్ వలయు నెల్లపుడున్ వికసింప యోచనల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. దశ దిశలకు నాత్మాహుతి దాడులెగయ
  ముఖ్యులైన వారలనెంచి సఖ్యతఁ గొన
  నంపు యుగ్రవాదుల మారణాయుధమగు
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె

  రిప్లయితొలగించండి
 8. అలసట నొందజేయుచును హాయిని గూల్చుచు నంతరంగమం
  దలమట గల్గజేయుచును నన్నివిధంబుల గుందజేయుచున్
  పలికెడి శక్తినంతటిని భంగమొనర్చెడి క్షుత్తు రూపియౌ
  కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 9. కలికి శశిరేఖగా ఘటోత్కచుడు మారి
  లక్ష్మ్మణునితోడ సరస సల్లాపమాడె
  దుడుకు చేష్టల కౌరవుల్ జడిసిపోవ
  కలికి కౌగిలి ప్రాణాంతకారిఁగాదె.

  రిప్లయితొలగించండి
 10. కామ వశమున మాద్రిని కౌగలించి
  కిందమ మహర్షి శాపాగ్ని కీల తాక
  నిండు ప్రాణమ్ము కోల్పోయె పాండు రాజు
  కలికి కౌగిలి ప్రాణాంతకారి కాదె

  రిప్లయితొలగించండి


 11. కలికి! కౌగిలి ప్రాణాంతకారి గాదె,
  పలుకుల కొలికి! నెలతుక! పదముల వలె
  నను పిడినిడుచు పట్టుగ నలిపి పిండి
  జేయ వలదు జిలేబియ! చేవిడు చెలి :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. రొయ్య లందున కననాడ రొయ్య తనను
  కూడు మగరొయ్య నచ్చక కూడ దెపుడు
  చపలతను చూప దానిని చంపివేయు
  కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె

  రిప్లయితొలగించండి
 13. శూర్పణఖ మారురూపము జూసి మదిని
  కలికి కౌగిలి ప్రాణాంతకారి కాదె
  తలచి లక్ష్మణుడామెకు తగు శిక్ష
  వేయ ముక్కు చెవులుకోసె వేగ మపుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తగిన శిక్ష' అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 14. రాజ నీతిని పాటింప రాజు కొఱకు
  విషయ మగుచును చేరగ విషపు కన్య,
  దాని పొందగ మరణించు ధరణి పతియు
  కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తమికి లొంగుచు నిచ్చలు తనరు జుండు
  పడుపుగొమ్మ నెఱిని గూడి సుడివడినను
  విటుల మార్చుచు కులికెడి వికరముండ
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె?


  రిప్లయితొలగించండి
 16. తెలియనెయిడ్సు నేడు కడు తీవ్రముగావడకించె నెల్లరన్
  పలువురు దాని బారి పడి ప్రాణభయమ్మున కుందుచుండరే
  తెలియక నెల్లరున్ వలపుతీపికి లోనయి గీత దాటినన్
  కలికి కవుంగలింత కనగానుసురుల్ గొనునట్టిదే కదా
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 17. శూర్పణఖ మారురూపము జూసి మదిని
  కలికి కౌగిలి ప్రాణాంతకారి కాదె
  తలచి లక్ష్మణుడామెకు తగు శిక్ష
  వేయ ముక్కు చెవులుకోసె వేగ మపుడు

  రిప్లయితొలగించండి
 18. అరయ నెల్లరు నీతిగా తరలుచుండ
  న్యాయమెల్లడ వికసించు తీయనైన
  కాలమేతెంచు ధర్మమన్ కాంతడాయ
  కలికికౌగిలి ప్రాణాంతకారిగాదె
  వీటూరి భాస్కరమ్మ
  కలియుగానికి ధర్మమనే కాంత కౌగిలి ప్రాణాంతకర అనే అర్థంతో పూరించాను
  భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 19. నాయకునిజంప సింహాసనమను చిత్ర
  మందు ప్రతినాయకుండంప మాయతోడ
  వలపులోదింపె విషకన్య - కలుషమైన
  కలికి కౌగిలి ప్రాణాంతకారిగాదె

  రిప్లయితొలగించండి
 20. దేశపు సమగ్రతన్ కాచు దీక్షతోడ
  శత్రురాజుల రయమున సంహరించ
  విషముగొనిరహస్యముగను పెరిగినట్టి
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. కలహమునందు శత్రువుల క్రన్నన పేరడగించ చిన్నపి
  ల్లలకు విషమ్మునిచ్చుచును లాలితమైన విధమ్ము పెంచుచున్
  మెలకువతోడ కంటకులమేదినికా విషకన్య నంప నా
  కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా

  రిప్లయితొలగించండి
 22. అన్నపరెడ్డి వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. పలుకులనొలుక తీయటి వలపు లెల్ల
  తలపులఁ జిలుక కమ్మని కులుకు లెల్ల
  లలిత లలితంపు మినుకుల నిలను దనదు
  కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె!
  [కాదని భావము.]


  విలవిల లాడి ద్రౌపదికి వీడెను బ్రాణము కీచకుండలన్
  వలచియిలాతనూజనటఁ బ్రాణము వీడెను రావణుండు మున్
  లలనలు నిప్పు రవ్వలు ధరంగన నన్యున కామె చెందినం
  గలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా

  "గలికిని కౌగిలించఁ గనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా "
  అనిన బాగుండు నని నా యభిప్రాయము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. వలపుల రేప నీడు కలవారల కాంతను ప్రేమ మీరగన్
  పలుకులు పంచుకొందమని పచ్చికబైలుకు పిల్చినంతనే
  తలుపులు నొక్కటై మరచి తన్మయమందగ నామె సొంతవారలున్
  కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

   శంకరాభరణం
   *22-05-2017 (సోమవారము)*

   *సమస్యా పూరణము *

   *కవిమిత్రులారా!*

   ఈరోజు పూరించవలసిన సమస్య ఇది

   *"కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె"*

   (లేదా...)

   కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా

   నా ప్రయత్నము

   దశ దిశలకు నాత్మాహుతి దాడులెగయ 
   ముఖ్యులైన వారలనెంచి సఖ్యతఁ గొన
   నంపు యుగ్రవాదుల మారణాయుధమగు
   కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె. ...1


   వలపుల రేప నీడు కలవారల కాంతను ప్రేమ మీరగన్
   పలుకులు పంచుకొందమని పచ్చికబైలుకు పిల్చినంతనే
   తలపులు నొక్కటై మరచి తన్మయమందగ సొంతవారలున్
   కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా.

   తొలగించండి
 25. గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
  కోపము నందిన విప్రుల
  శాపములకు తనదు నీవి జతగా చేరన్
  పాపముల ఫలితము కడు ప్ర
  తాపముతో నంగ రాజు తనువును కూల్చెన్!

  రిప్లయితొలగించండి
 26. తీవ్రతర కామవాంఛను తీర్పు కొనగ
  కాముకులు సానుల దరచు కలుతు రకట!
  రోగ పీడితులు ధనమును లాగు పడుపు
  కలికి కౌగిలి ప్రాణంతకంబు కాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈరోజు 'సాక్షి' పత్రికలో మీ 'చీకటి వెలుగులు' పద్య ఖండికల సంపుటిని గురించిన పరిచయం చూశాను. శుభాకాంక్షలు!

   తొలగించండి
  2. గుగురువుగారికి నమస్కారములు.మీ అభిమానమునకు ధన్యవాదాలు
   ఏమి వ్రాశారో నేను చూడలేదు. మాకా పేపరు అందు బాటులో లేదు

   తొలగించండి
  3. గుగురువుగారికి నమస్కారములు.మీ అభిమానమునకు ధన్యవాదాలు
   ఏమి వ్రాశారో నేను చూడలేదు. మాకా పేపరు అందు బాటులో లేదు

   తొలగించండి
 27. చంద్ర గుప్త మౌర్యు నెదిరి చంప లేని
  శత్రువులు నాడు విష కన్య సాయమంది
  చాటుగా కథ నడిపిరి వేటు వేయ!
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె!

  రిప్లయితొలగించండి
 28. సింహబలు డేగ సైరంధ్రి చెంత రతికి
  వంట శాలను వధియించె వనలుడపుడు
  జనదు చెరపగ నెపుడైన సాధ్విమణుల
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పాపముగా దలచక సం
  తాపము నొనగూర్చ సాధ్వి ద్రౌపది కి సభన్
  కోపమున బలుక భీముడు
  శాపము దుశ్చాసను కయి చావొనగూర్చెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   బీముడు కీచకుని చంపినది నర్తనశాలలో. వంటశాలలో కాదు. 'వలలుడు' అన్నది టైపాటు వల్ల 'వనలుడు' అయింది. రెండవ పాదాన్ని "చంపె వలలుడు నర్తనశాలలోన" అందామా?

   తొలగించండి 29. 1.వెలది పొందును గోరుచు విరటు బావ
  మరిది నర్తన శాలలో మరులుగొనగ
  నాతి రూపున్న భీముని చేతిలోన
  నుసురు గోల్పోయె కీచకుడుర్వి యందు
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె.


  2.సప్తసంఖ్యలో వ్యసనముల్ సంఘమందు
  మానవుల కెల్ల కలిగించు మానహాని
  యందు నాత్మనాశమొనర్చు నహరహమ్ము
  కలికి కౌగిలి ప్రాణాఐతకారిగాదె.


  3.వరము పొందినట్టి యసురవరుడు కోరె
  కలికి కౌగిలి,ప్రాణాంతకారి గాదె
  నదియు కొని దెచ్చె నెన్నెన్నొ యాపదలను
  పరసతిని కోరి మృతుడయ్యె వసుధ యందు.


  4.మునియు శాపమిడెను పాండు భూవరునకు
  పడతి పొందును కోరంగ బాయుదువిల
  ప్రాణములటంచు,నయ్యును వాంఛ చేసె
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె.


  5కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె
  యనెడి పాత కాలపు మాటలవసరమ్ము
  కాదు,వలచిన చెలిపొందు కాదనకని
  పల్కె నూర్వశి స్వర్గాన/ముదముతో పార్థు తోడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ ఐదు పూరణలు ఒకదానిని మించి ఒకటి బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 30. ప్రకృతి శోభను గాంచుచు పరవశమున
  భార్య మాద్రిని తాకంగ పాండురాజు
  మౌని శాపకారణముగ మడిసె భువిని
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె!!!

  రిప్లయితొలగించండి 31. నాకమునకధిపతి యయ్యు నాతి పొందు
  కోరి శప్తుడగుచును నా గోత్రభిదుడు
  వేయ కన్నుల వేల్పుగా వినుతికెక్కె
  కలికి కౌగిలి ప్రాణాంతకము గాదె.

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. నా పూరణ

  పాండు మారాజు మాద్రిని బడయ నెంచి
  శాప ఫలితాన యతడు వశమును దప్పి
  భార్య దరిజేర నారాజు ప్రాణ మొదిలె
  కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'మారాజు(మహారాజు), ఒదిలె(వదలె)' అన్నవి సాధువులు కాదు. "పాండు నరపతి మాద్రిని... ఫలితాన నతడు... ప్రాణము విడె..." అనండి.

   తొలగించండి
 34. చలికిట నౌషధమ్మగును చారు సులోచన ధర్మపత్నియౌ
  కలికి కవుంగిలింత;...కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా
  కలికి కవుంగులింత కనగా పరనారిది వెచ్చవెచ్చనౌ...
  బలుపగు గండ్ర గొడ్డలిని పట్టుకు రాగనె నామె భర్తయే :)

  రిప్లయితొలగించండి