27, మే 2017, శనివారం

సమస్య - 2371 (మండుటెండలోఁ గురిసెను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు"
(లేదా...)
"మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్"
ఈ సమస్యను పంపిన శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలు.

87 కామెంట్‌లు:

 1. రోహిణీ కార్తె రాకున్న రోళ్ళు పగిలె
  మండు టెండలో, గురిసెను మంచు జల్లు
  ఎదుట దృశ్యము కనలేక ఎల్ల జనులు
  భాద పడురీతి గాను ఫిబ్రవరి నెలన

  రిప్లయితొలగించండి
 2. ఎండ మావిలో దొరికెను మెండు నీరు;
  కొండ బండల లోనుండె నిండు కొలను;
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు;...
  ఎండి పోయిన మమతలు పండ లేవు!

  రిప్లయితొలగించండి
 3. నిండు వేసవి మెండుగా నుండె వేడి --
  కారుమబ్బులు నింగిలో క్రమ్ముకొనియె
  పిడుగు లురుముల వర్షము పిక్కటిల్లె
  మండుటెండలోఁగురిసెను మంచుజల్లు

  రిప్లయితొలగించండి


 4. ఆహా! యెండలు మండి పోతుంటే కవివరుల్ కలయే కల !

  గుండెలు మండియెల్లరట గూటికి జేరిరి గాదె ! ఓ కవీ !
  బండెడు బందె మధ్య పద బంధపు చల్లని గాలి బీల్చుచున్
  మెండుగ చెప్పినావు గద మెల్లన జూచితి వయ్యరో కలన్
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్ ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. పేద బ్రతుకుల నాకలి వేదనలును
  పీడితాళియు వెతలను వీడి మురియ
  నండగా నుండి తోడయి యుండగాను
  మండుటెండలో కురిసెను మంచు జల్లు!

  ఎండ వేడిమి తాపము నిండు కొనగ
  నెండమావులు కన్నుల నెగసి పడగ
  మండు టెండలో కురిసెను మంచు జల్లు
  లల్లె చల్లని మేఘాల నల్లి వాన!
  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  ధర్మ మిట నాల్గుపాదాల దనరనేమొ
  కాలమే మమ్ము గాపాడు గరిమ జూపె
  ఋతుపవన పంక్తి మునుముందు రివరివ మన
  మండుటెండలో గురిసెను మంచు జల్లు!

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  కొండలు పిండి జేసినను కూటికి నోచని శ్రామికాళికిన్
  పండిత పామరాళికిని బాయని బాధలు స్వంత రాష్ట్ర స
  న్మండితు కేసియారు గన మా సరి కోర్కెలు దీరె నేటి కా
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్!

  రిప్లయితొలగించండి


 8. మెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు
  మండు టెండలో కురిసెను మంచు జల్లు
  యండగొట్టక చల్లని గాలి వచ్చె
  చండ రుక్కటు దాగెను జలధరమున !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 9. మిగుల దారిద్ర్యమున జక్కి మిడుకు వేళ
  నున్నతోద్యోగమున జేర కన్న కొడుకు
  తల్లి దండ్రుల యరుసంబు తలప దరమె
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 10. ముగ్గు ముదుసలి యెండలోమ్రగ్గు చుండ
  నింటి లోనికి తెచ్చి నీరింత యిచ్చి
  విసన కఱ్ఱతో నొక కుఱ్ఱ వీచునపుడు
  మండుటెండలో గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
 11. ఉద్యమించగ కొలువుకై నోర్మిదోడ
  ఎండ వానల బెదరక నిష్ట పడుచు
  పడ్డకష్టమునకు సరి ఫలము నంద
  మండుటెండలో గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కొలువుకై యోర్మితోడ' అనండి.

   తొలగించండి

 12. [5/27, 8:29 AM] DrNVNChary: డా.ఎని.వి.ఎన్.చారి 9866610429
  1.పిట్ట లన్నియు నెండకు వేగ లేక
  తిరుగు చున్నవి దాహార్థి తీర్చు కొనగ
  మంటి కుండలో నీరుండె నింటిముందు
  మండుటెండలో గురిసెను మంచు జల్లు
  2.బహు కుటుంబపు బాధ్యతల్ బాధలెన్నొ
  అష్ట కష్టాలు నిరుపాధి, అర్థలేమి.
  లాటరీ యందు నరకోటి లభ్యమయ్యె
  మండుటెండలో గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఎస్వీయెన్ చారి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. గుండెలు నిండనార్తి,శుభ గోచర మౌనని వేచియుంటినో
  పండగ స్వప్నముల్,వడిగ పాపవిదూరుని దర్శనమ్ముకై
  కొండల శ్రీనివాసు కనుగొంటిని కన్నుల పండుగాయెనో
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారెనెల్లెజన్

  రిప్లయితొలగించండి
 14. తెలుగు రాష్ట్రాల దాహము దీర్చు కొరకు
  మండుటెండలోగురిసెను మంచుజల్లు
  లవలెవర్షము వడగండ్ల రవము తోడ
  హాయి నొందిరి జనముల య్యవసరమున

  రిప్లయితొలగించండి
 15. ప్రొద్దునెప్పుడో వ్రాసి తి పూరణమ్ము
  గురు సమీక్ష మధ్యాహ్నమ్ము తెరచి చూడ
  పలు ప్రశంసలఁ మెరుపులు పలుకరించ
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు!

  రిప్లయితొలగించండి
 16. ఎన్ని కడగండ్లు కష్టము లెదురయినను
  పత్ని పరివార మెల్లర పరమయినను
  తల్లి యుండి సాంత్వన మిచ్చు చల్లగాను
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
 17. గురు కృపాంజన మరయక దొరకు రీతి
  హరి కటాక్ష వీక్షణములు బరగు వోలె
  అమృత ధార పిపాశువు నరయు నటుల
  మండుటెండలో గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ :

   గుండెల దైవనామమదె కొల్వుగ నుండ సమస్యలెన్నగన్
   నిండి
   వసించు పూరణల నేర్పుగ, పంచగ మాధ్యమమ్ములన్
   పండితులాదిగన్ గురులు బాగని మెచ్చు తటిత్తులేర్పడన్
   మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

   ... గుండా వేంకట సుబ్బ సహదేవుడు

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ :

   గుండెల దైవనామమదె కొల్వుగ నుండ సమస్యలెన్నగన్
   నిండి
   వసించు పూరణల నేర్పుగ, పంచగ మాధ్యమమ్ములన్
   పండితులాదిగన్ గురులు బాగని మెచ్చు తటిత్తులేర్పడన్
   మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

   ... గుండా వేంకట సుబ్బ సహదేవుడు

   తొలగించండి
 19. పశ్చిమంపు దేశమ్ముల భానునిఁ గన
  దుష్కరము కొన్నిట నచట దుర్దినముల
  పార మొకచోట, నట గల వా రెఱుగరు
  మండు టెండలోఁ, గురిసెను మంచు జల్లు

  [మండుట + ఎండలో = మండుటెండలో
  “అగుటరుదె” ఆది పర్వము, భారతమున ప్రయోగము చూచి మండుట+ఎండలో అన్న భావములో పూరణ.]


  గండర గండు లెల్లరను గల్గిన క్రూరపు భీమ చౌర్య దు
  ష్షండము కొల్ల గొట్ట నిజ సంపద నంతయు క్షుత్పిపాసఁ దా
  నుండగ దుఃఖ తాపమున నుత్తమ మిత్రుడు సేద దీర్చగన్
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 20. పండరి పెండ్లి సందడిని పండెను శోభలు రంగురంగు పూ
  దండలు, హాయి గూర్చు విరి తావులు, చిత్రపు దీప మాలికల్,
  మెండుగ శీతశీకరసమీరములన్ విరజిమ్ము యంత్రముల్
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారెనెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 21. నిండుగ కావ్యగాన రస
  నిర్ఝరమందు స్ఫురించు భావముల్
  మెండుగ సన్నజాజి మది
  మెచ్చెడి మల్లియ చల్లగాలులన్
  దండిగ పొందు నా మనసు
  తన్మయరాగ సుహాస గీతిలో
  మండెడి యెండలందు హిమ
  మౌక్తికముల్ గన జారె నెల్లడన్!

  రిప్లయితొలగించండి
 22. కాల్చె కృత్తిక రోహిణి రాల్చ నగ్ని ,
  తగిలి వడదెబ్బ పాంధుడు దారి గూల
  శీత జలమును గుప్పించ శిరము నందు
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు

  నిన్నటి సమస్యకు నా పూరణ

  యతులును ప్రాసలు గణములె
  ప్రతిదిన మాహార మనెడి పండితుడనియెన్
  మతి చెడి పొరపడితిని , భా
  రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 23. మిత్రులందఱకు నమస్సులు!

  దండిగఁ బట్నముం గనఁగ దబ్బున నేఁగఁగ నాకు దాహమే
  మెండుగఁ గల్గ నప్పుడును మెల్లఁగ నా సఖుఁ డొక్కరుండు తా
  నుండెడి యింటినిం గనఁగ నొక్కట నన్నునుఁ గొంచుఁబోవ నా
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్!

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. ఎండెను వాగు వంకలు కడెండల చేతను చెర్వులన్నయున్
   మెండగు తాప బాధలకు మేదిని ప్రాణుల కెల్ల నేసవిన్
   గుండెలు యెండె, నా యివపు కొండలు గర్గుచునుండె నిత్యమున్
   మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

   తొలగించండి
  2. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెర్వులన్నియున్'...టైపాటు. 'గుండెలు+ఎండె' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "గుండెలు మండె" అందామా?

   తొలగించండి
  3. “కడెండ” అనడము సాధువు కాదు. కడు+ఎండ = “కట్టెండ” అవుతుందండి.

   తొలగించండి
  4. పోచిరాజు వారూ,
   ధన్యవాదాలు.
   "వంకలవి యెండలచేతను..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  5. శ్రీ శంకరయ్యగురువర్యులకు కామేశ్వర్ రావుగారికి ధన్యవాదము
   నిజమే పొరపాటు జరిగింది. సవరించిన పద్యమును సమీక్షించండి.

   ఎండెను చెర్వులన్నిమరి యెండెను వాగులు వంకలన్నియున్
   మెండగు తాప బాధలకు మేదిని ప్రాణుల కెల్ల నేసవిన్
   గుండెలు మండె ,నా యివపు కొండలు గర్గుచునుండె నిత్యమున్
   మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

   తొలగించండి
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ దృష్టికి రాలేదని నేను వ్రాసితిని.మీ సవరణ చక్కగ నున్నది.
   లక్ష్మీనారాయణ గారు సవరించిన మీ పూరణ చాలా బాగుంది. “ ప్రాణుల కెల్ల వేసవిన్” అనా మీ భావము.

   తొలగించండి
 25. ముద్దులొలికెడు ప్రియురలు ముదముతోడ
  రైలుదిగి యిక్కకేతెంచి రయముగాను
  మిట్టమధ్యాహ్నమందున తట్టతలుపు
  మండు టెండలో కురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
 26. చండకరుండు తద్దయు ప్రచండపు వేడిని పంపుచుండగా
  బండలు బ్రద్దలై జనులు బాధలనొందుచు నుండ్రి భూమిపై
  గుండములేర్పడన్ గడలి గుప్పున మేఘుపు కుంభవృష్టితో
  మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి

 27. నిప్పులు గురిసెను గనుము నింగిన రవి
  మండు టెండలో ,కురిసెను మంచు జల్లు
  పుష్య మాసము నందున పుడమి యందు
  మురిసిరెల్లరిట తడిసి ముద్దయగుచు.

  రిప్లయితొలగించండి
 28. మధుర దరహాసమొలికించి మా వసంత
  మాటమాటన తేనియలూటలూర
  పలుకరించెను నామది పులకరించ
  మండుటెండలో కురిసెను మంచుజల్లు

  రిప్లయితొలగించండి
 29. కష్టముల కోర్చి చదివెను కాలమంత
  కొలువు రాలేదనుచునంత కోపగించె
  కలిమి తోడను కొలువది కలసి రాగ
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు

  రిప్లయితొలగించండి
 30. పండరి నాధుని న్గృహము పచ్చనిమామిడి తోరణాలతో
  మెండుగ శీతలం బిడుచు మీరని హాయిని గొల్పు వానితో
  దండిగబూలవాసనలు దామరపించుచు నెల్లవారికిన్
  మండెడి యెండలందు హిమమౌక్తికముల్ గన జారెనెల్లెడన్

  రిప్లయితొలగించండి
 31. ఉ. నిండగు చైత్ర మాసమున నింగిని బందిరి జేసినారు ,బూ
  దండలు వాసనల్ గొలుప ధార్మికుఁ లందరి వేద మంత్ర ము
  ల్నిం డెను నేలపైన యన నీమము దప్పక రామచంద్రుకున్
  మండెడి యెండ లందు హిమ మౌక్తికముల్ జారె నెల్లెడన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నేలపైన 'యన'...?

   తొలగించండి
 32. ఆరు నెలల జీతమ్మునా కందలేదు
  "కాసులునులేక నెట్టుల కడుపునిండు"
  నంచు దు:ఖించు చుండగా నందె డబ్బు
  మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు.

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.

  అదర గొట్ట నెండలు నపరాహ్న వేళ

  పిల్లలు,ముసలి వారును తల్లడిలెడు

  నంతలో కరి మబ్బులున్నావరించి

  గాలితో గూడియున్ వడగళ్ళు పడుచు

  మండుటెండలో గురిసెను మంచు జల్లు.

  *****************************

  రిప్లయితొలగించండి

 34. మండుటెండలో కురిసెను మంచు జల్లు
  లనెడి మాటలతిశయోక్తు లవనియందు
  మంచు కురిసెడి యాకాలమందు రాని
  జల్లు వేసవి నందెట్లు జాలు వారు.?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   సమస్యను ప్రశ్నార్థకంగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 35. రామ ! శుభనామ ! సుగుణాభిరామ ! యనుచు
  హనుమ కీర్తింప , సీత చిత్తాంబుజమ్ము
  విరిసి మోదమ్మునంది భావించెనిట్లు
  మండుటెండలో కురిసెను మంచుజల్లు!!


  మండిత పాదలేపనుడు మంచుగిరిన్ నడయాడ, మధ్యమా...
  ర్తాండుని వేడిఁ బూతయు గఱంగె, నతండును దారి కోరగా
  నండజయానకున్ తనువునందున దోచగ స్వేదబిందువుల్ !
  మండెడి యెండలందు *హిమ , మౌక్తికముల్*గన జారె నెల్లెడన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ రెండవ పాదంలోని గణదోషానికి మీరేదో సవరణ సూచించారు వాట్సప్‍లో. ఇక్కడ గుర్తుకు రావడం లేదు.

   తొలగించండి

 36. మండుటెండలో కురిసెను మంచు జల్లు
  లనెడి మాటలతిశయోక్తు లవనియందు
  మంచు కురిసెడి యాకాలమందు రాని
  జల్లు వేసవి నందెట్లు జాలు వారు.

  రిప్లయితొలగించండి
 37. మండు టెండలు జనులను మాడ్చు చుండ;

  జనుల కానంద మావిరై చచ్చి బతుక;

  హిమగిరి తనయ నరులపై ప్రేమ గురియ;

  మండు టెండలో గురిసెను మంచు జల్లు.

  విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.7396564549

  రిప్లయితొలగించండి
 38. గుండెలు బాదుచున్ ప్రజలు గుట్టుగ నిండ్లను రొప్పుచుండగా
  మండెడి యెండలందు;...హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్
  పండుగ జేయగా ప్రభులు పార్టిని గుంజుచు బీరువీరుతో
  దండిగ వోట్లు పడ్డవని దాపున మాలున నే.సి. బారులో

  రిప్లయితొలగించండి