7, మే 2017, ఆదివారం

సమస్య - 2355 (భరతుని రాఘవుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భరతుని రాఘవుఁడు దునిమె భామిని కొఱకై"
(లేదా...)
"భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్"
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

45 కామెంట్‌లు:

 1. హరుని ధనుస్సు త్రుంచి కనకాంగిని సీతను పెండ్లియాడె సం
  బరమున రాఘవాన్వయుడు, వప్రుని మాటకు నేగె కాననల్,
  మొరగున రావణుండు కొనిపోవగ సీతను యుద్ధమందు దం
  భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్
  (వప్రుడు = తండ్రి; మొరగు = మోసము; దంభ రతుని = దంభము నిండినట్టి)

  రిప్లయితొలగించండి
 2. భరతుని పాదుకలు ఇచ్చి రాముడు వెనుకకు పంపిన పిదప శూర్ఫణక ముక్కు చెవులు సౌమిత్రి సీతకొరకు పర్ణ శాలలో కోసిన ని తెలుపుచు

  తిరిగి పురమునకు పంపెను
  భరతుని రాఘవుడు, దునిమె భామిని కొరకై
  వెరయక అనుజుడు అరి సో
  దరి నాశిక కర్ణములను దయయే లేకన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవి శ్రేష్టులకు నమస్కారము. ఈ రోజు శ్రీ శంకరయ్య గారు వివాహమునకు వెళ్ళుచున్న కారణమున సమీక్షలు చేయటము కుదరదు. దయవుంచి నా ఈ పద్యమును పరిశీలించి తప్పులను సూచించగలరు. ధన్యవాదములతో పూసపాటి

   తొలగించండి
  2. ఉకార సంధి నిత్యం కాబట్టి ౩వ పాదం ఇలా మారిస్తే ఎలా ఉంటుందంటారు ?
   వెరయక యనుజుం డరిసో

   తొలగించండి


 3. వెరవక పాపభీతికిని భిక్షము కోరుచు వచ్చి భూమిజన్
  కరుణయెలేని దుష్ట దశకంఠుడు తోడ్కొని పోవ లంకకున్
  ధరనికనికనుండనీయనని త్రాష్టుడు, నీచుడు, పాపుడౌ స్వలా
  భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్
  (స్వలాభరతుడు సరియైనదేనా మాష్టారూ?)

  రిప్లయితొలగించండి
 4. నరవర రూపమున ధరన
  లరి, వనవాసమ్ము నందు లంకాధిపుడన్;
  నిరతము ప్రీతిగ మెచ్చుచు
  భరతుని; రాఘవుఁడు దునిమె భామిని కొఱకై

  రిప్లయితొలగించండి
 5. పరిపాలన జేయుమనియె
  భరతుని రాఘవుఁడు, దునిమె భామిని కొఱకై
  పురుషాదుడు రావణునట
  సిరిమాతను లంకఁ దాచి చెరలో నుంచన్

  రిప్లయితొలగించండి
 6. సరగున మెచ్చెను సోదరు
  భరతుని రాఘవుడు--దునిమె భామిని కొఱకై
  కరుణయెఁజూపని రావణు
  నరయగ వానరులఁగూడి యని విక్రముడై
  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించండి


 7. నిరతము ముదమున జూసెను
  భరతుని రాఘవుఁడు, దునిమె భామిని కొఱకై
  హరణము జేయన రావణు
  ని,రక్ష యన యభయమిచ్చె నిజమరి యతడౌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. నరపతి జింకకై వెడల నాతిని రావణుడంత లంకకున్
  చెరగొని పోయి మోహమున చింతలఁ బెట్టుచు చేరబోవుచున్
  పరిపరి వైభవమ్ములను పంచెద నంచును రేగెడున్ ప్రలో
  భరతునిఁ జంపె రాఘవుఁడు భామిని కై సురలెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 9. చెరలో నుంచుచు సీతను
  సిరితో ముంచెత్తెదనని చింతలఁ బెట్టన్
  కరిసేన గూడఁగ ప్రలో
  భ రతుని రాఘవుఁడు దునిమె భామిని కొఱకై

  రిప్లయితొలగించండి

 10. అరయగ తండ్రి యానయన కానన మేగెను,యక్కు జేర్చెనౌ
  భరతునిఁ, జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్
  హరణము జేయ రావణుని, హా!శరణమ్మనగన్ విభీషణు
  న్నిరతము రక్ష నిచ్చెను సనీదముగా సుగుణాభిరాముడై !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులారా,
  నమస్కృతులు. ఈరోజు కవిమిత్రులు రఘుకిశోర్ గారి వివాహోత్సవానికి హైదరాబాద్ వెళ్తున్నాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించే అవకాశం దొరకక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 12. పరసతినిగోర లంకా
  పురమందునచిచ్చుపుట్టి ముప్పునుదెచ్చెన్
  ధరపతినిరావణుని శర
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై !!!
  ధరణజనుతెచ్చి లంకా
  పురమందునపెట్టచిచ్చు ముదిరెను లంకా
  పురపతినిరావణుని శర
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై !

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా
  (ప్రతి రాజు దైవాంశ సంభూతుడని,The king can do no wrong అనే సిద్ధాంతీకరణను, చరిత్ర పుటల నాధారంగా సవరించినగదా ప్రజా స్వపరిపాలన వచ్చినది?"భరతుడు","రాఘవుడు"కలియుగపు రాజులకు సాధారణీకృత నామములుగా గైకొని చేసిన పూరణము)
  హర!హర! రాజటె దైవము
  పరనారీ మోహముననె బరగెను చరితల్
  వరుసలు వావియు గనిరే?
  "భరతు"ని "రాఘవుడు" దునిమె భామిని కొరకై!

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా
  "సరగున మాయ సీత యను సారమెరుంగక సాధు రూపునన్
  మరుగున భిక్షనున్ గొనయె మానిని సువ్రత, లంక చేటుకై
  బరగెను దుష్ట సాహసము ప్రాణము దీసె! " నటండ్రు, పూర్ణ దం
  భరతుని జంపె రాఘవుడు భామినికై సురలెల్ల మెచ్చగన్!

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టానుండి
  ఆర్యా,రెండవ పాదంలో తృటి"గొనియె"గా చదువ మనవి.

  రిప్లయితొలగించండి
 16. అరయగ డింభకు డొక్కడు
  సురుచిర సత్కావ్యగంధ శూన్యుడు పలికెన్
  గురుడడుగగ తరగతిలో
  భరతుని రాఘవుఁడు దునిమె భామిని కొఱకై.

  గురు డొకనాడు శిష్యులకు కూరిమి నిండగ ప్రశ్న లెన్నియో
  తరగతిలోన వేయుచును తద్గత భావము దెల్పునప్పు డా
  హరియను మందబుద్ధి యొక డందు వచించె జవాబు లిచ్చుచున్
  భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 17. ధరపతిగ జేసె రఘుపతి,
  దురమున నెవరు దశకంఠు దురిత మడంచెన్,
  మరియేల జంపె నాతని,
  భరతుని; రాఘవుడు దునిమె; భామిని కొరకై!

  రిప్లయితొలగించండి
 18. దురితమని యెఱిగి సీతను
  చెరనిడె రావణుడు దుష్ట చేతస్కుండై
  వర శరమున లలనా లో
  భ రతుని రాఘవుడు దునియె భామిని కొఱకై

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!


  ధరణిజ హర్తనున్, సుర వితాన నియంతను, దైత్య భూపునిన్,
  వరబల గర్వితున్, గిరిశ భక్తుని, నష్ట దిశేశ శత్రునిన్,
  వర ముని బాధకున్, దనుజ వంశ వినాశకు, రావణాఖ్యు, దం

  భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్!

  రిప్లయితొలగించండి
 20. గిరి సుత పతిచే పొందియు
  వరములు,రావణుడు ధరణి వాసిని గాంచెన్
  పరకాంతా,మోహా,లో
  భ,రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై

  రిప్లయితొలగించండి
 21. గిరి సుత పతిచే పొందియు
  వరములు,రావణుడు ధరణి వాసిని గాంచెన్
  పరకాంతా,మోహా,లో
  భ,రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. అరయగ రాపణుడంతట
  చెరగొనె సీతమ్మనపుడు శీఘ్రమ్ముగనా
  హర కరుణపూర వరసం
  భరతుని రాఘవుడు దునిమె భామిని కొ్ఱకై
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 24. గిరిసుత పతి వరముల గొని
  ధరణిన వరబలుడనను విధము గర్వమునన్
  పరకాంతా మోహా లో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొఱకై

  రిప్లయితొలగించండి
 25. గిరిసుత పతి వరముల గొని
  ధరణిన వరబలుడనను విధము గర్వమునన్
  పరకాంతా మోహా లో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొఱకై

  రిప్లయితొలగించండి
 26. అరయగ రావణుండపుడు ఆ జనకాత్మజ తోడ లంకకున్
  అరుగగ రామచంద్రుడసహాయుని రీతిగవంతనొంది వా
  నరులను వెంటబెట్టుకుని నాణెముగా పరిపూర్లుడౌ యశో
  భరతుని రావణున్ దునిమె భామినికై రఘురాముడంతటన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 27. వరమదమున బాధింపగ
  సురనర లోకాలలోని సుజనులు రోయన్
  పరదారా సంగమ లో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొఱకై.

  రిప్లయితొలగించండి
 28. పరుగున వచ్చి జానకిని పట్టగ బోవు విరాధు రక్కసున్
  సరగున రాముడాతని భుజమ్ముల ఖండన జేయ.దానవుం
  డరచుచు రాముపై నురుక నాసురు శీర్షమువ్రేసె, మాంస లో
  భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 30. నరభుజుఁడు రావణుఁడుతా
  విరిఁబోఁడిఁగని హరియించ విరహముతోడన్
  స్థిర మతిని ధరణిజ ప్రలో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై

  రిప్లయితొలగించండి
 31. ధరణిజను దానవుండౌ
  విరాధుడే పట్ట బూనె విఘనముసేయన్
  త్వరితమ్ముగ ఆమిషలో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై

  రిప్లయితొలగించండి
 32. ధరణిజకు నీయ నతి దు
  ర్భర దుఃఖము నా దురాత్ము రావణుని ఘోరా
  సుర రాజుని, నగ్రజుఁ డా
  భరతుని రాఘవుఁడు, దునిమె భామిని కొఱకై  పరమ పవిత్ర వంశమునఁ బన్నుగఁ బుట్టిన లాభ ముండునే
  పరసతిఁ గోర నేరికినిఁ బ్రాణము నిల్చునె ధాత్రి నెన్నడున్
  వర బలగర్వి రాక్షసునిఁ బార్థివు రావణు కామ మోహ లో
  భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సుర లెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 33. చెరబట్టెను సీతమ్మను
  వరగర్వపు రావణుండు పదితల లున్నా?
  తరచుగ నీతిని విడు లో
  భ-రతునిరాఘవుడుదునిమె భామిని కొరకై|
  2.వరములు బొందినట్టి,పరివారము మెచ్చగకుందనట్టి,భీ
  కరమునునమ్మినట్టి,దశకంఠుడు నేననుయుహలౌ ప్రలో
  భ-రతునిజంపె రాఘవుడు భామినికై సురలెల్ల మెచ్చగన్|
  మరువరు రామచంద్ర కథ మాధవ సేవకుమార్గమయ్యెగా|

  రిప్లయితొలగించండి
 34. ధరణిజనుపవనమునఁ గని
  మరుని శిలీముఖముతగిలి మతితప్పిన యా
  నరభోజుని, సకి పరిరం
  భ రతుని, రాఘవుడు దునిమె భామిని కొరకై

  రిప్లయితొలగించండి
 35. ధరణిజఁ దస్కరించి చన దైత్యుడు లంక విభుండు దుష్టుడై
  విరహముతోడ రాఘవుడు వేదనఁ జెందుచు చేరెలంకకున్
  స్థిరమగు ప్రజ్ఞతోడుతను చెచ్చెర వేసి శరమ్ములన్ ప్రలో
  భరతుని జంపె రాఘవుడు భామినికై సురలెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 36. 9493846984 డాబల్లూరి ఉమాదేవి.

  నిరతము మదిలో మెచ్చుచు
  భరతుని,రాఘవుడు దునిమె భామినికొరకై
  శరమును సంధించుచు తా
  వరగర్వితుడైన దైత్యు వసుమతి లోనన్.

  వరగర్వముచే తానప
  హరించె కైకసి సుతుండు నవనిజ నచ్చో
  పరకాంతారతుడా లో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొరకై.

  పురమును పాలింప మనుచు
  భరతుని,రాఘవుడు దునిమెను భామిని కొరకై
  మరుగున దాగుచు నాకపి
  వరుని,కోరుచు రవిజుని వాత్సల్యంబున్

  రిప్లయితొలగించండి
 37. విరివిగ మది బ్రే మించెను
  భరతుని రాఘవుడు, దునిమె భామిని కొరకై
  పరమా త్ముండగు రాముడ
  యరుడగు నారావణాసు నవలీలంగాన్

  రిప్లయితొలగించండి

 38. పిన్నక నాగేశ్వరరావు.

  పరిపాలన చేయుమనెను

  భరతుని రాఘవుడు; దునిమె భామిని
  కొఱకై
  ధరణిజను లంకనుంచిన

  హరు భక్తుండు దశకంఠు ననిలో
  నపుడున్.
  ***************************

  రిప్లయితొలగించండి
 39. పరసతి జానకి నేయప
  హరించిన దురాత్ముడైన యసురాధిపుడౌ
  హరప్రియ భక్తుండు ప్రలో
  భ రతుని రాఘవుడు దునిమె భామిని కొఱకై

  దరిజేరగ నోదార్చెను
  భరతుని రాఘవుడు, దునిమె భామిని కొఱకై
  హరిమూకన్ జే కొని యం
  బరమును దాటియసురాధిపతి రావణునిన్


  ధరణిని యేలుకొమ్మనిన తమ్ముని గాదని చెప్ప రామునిన్
  వరముగ నాపవిత్రమగు పాదుక లిమ్మన నిచ్చిపంపెనా
  భరతుని, జంపె రాఘవుడు భామినికై సురులెల్ల మెచ్చగన్
  పరసతినే హరించి తన బంధిగ మార్చిన రావణుండనే

  రిప్లయితొలగించండి
 40. నిరతము రామ నామమును నిద్దుర మెల్కువ స్వప్నమందునన్
  తిరముగ నారు వత్సములు తీపి జపించుచు సిద్ధినొందగా
  తరతమ భావ మెన్నకను తన్మయ మొందుచు భక్తుడిట్లనెన్:👇
  "భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్" :)

  రిప్లయితొలగించండి