8, మే 2017, సోమవారం

సమస్య - 2356 (సుగుణాకర! పట్టపగలె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా"
(లేదా...)
"సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు జామునన్"
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

73 కామెంట్‌లు:

 1. జగదంబా మాలు తెరువ
  వగలాడి తమన్న త్రిషలు వహ్వాలనగన్
  నగుమోములతో కులుకగ
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా

  చుక్కలు = తారలు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   సినీతారల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 2. భగవంతుని దర్శింపగ
  మగువలు తిరుమలకు నడక మార్గము నెంచన్
  గగనము నంటెడి గిరిపై
  సుగుణాకర పట్టపగలె చుక్కల గనుమా!

  తిరుమల మొదటి కొండకు చుక్కల పర్వతమని పేరు! చివరిది మోకాళ్ళ పర్వతం!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   చుక్కల పర్వత ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 3. నిగమములన్ని క్షుణ్ణముగ నేర్చినగాని మహత్వకాంక్షతో
  జగమున దానధర్మములు చక్కగ పెక్కులు చేసినంతటన్
  సుగమమె యాత్మదర్శనము? చూడగ కష్టతరమ్మె దానికిన్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు జామునన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నేమాని వారూ,
   ఆత్మదర్శనం కంటె పగలు చుక్కలు చూడడం సులభమంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు

 4. అగణిత వింతలు గలవీ
  భగవంతుని సృష్టి లోన పాగెము గాన
  న్నిగుడన యంతర్దృష్టిని
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా!

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అగణిత వింతలు' దుష్టసమాసం. "అగణితమగు వింతలు గల (అగణిత చోద్యమ్ములు గల) । భగవంతుని... గాన ।న్నిగుడగ నంతర్దృష్టిని..." అనండి.

   తొలగించు
 5. నిగనిగ లాడెడు చెలువము,
  వగలాడియు నందగత్తె వన్నెలభామన్
  సుగుణాల లేమనందుము
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁగనుమా
  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించు
 6. తగినవరుండని ముదమున
  తగుమర్యాదల తనయను దానము నివ్వన్
  గగనము నంటిన ఋణముతొ
  సుగుణాకర పట్ట పగలె చుక్కల గనుమా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఋణముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ "ఋణముల' అనండి.

   తొలగించు
 7. పగటి ముహూర్తపు పెండ్లిన్
  మగడా! కనుము! వసిష్ఠుని మగువల్లదిగో!
  నిగనిగ కులుకె నరుంధతి!
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారి సవరణ:

   * మగువయె యదిగో

   తొలగించు
  2. శాస్త్రి గారూ,
   పట్టపగలే అరుంధతీ దర్శనం.. జనసామాన్యమైపోయింది. మంచి పూరణ. అభినందనలు.

   తొలగించు

 8. త్రిగుణపు సాధనా పథము తీక్షణ మైన జపమ్ము గూడగన్
  సగుణపు రేడు సూర్యుని, శశాంకుని హృత్తున సత్య మై సదా
  నిగుడు జిలేబి నిక్కము సనీదము గాంచుము సృష్టి నంతయున్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్

  జిలేబి

  రిప్లయితొలగించు
 9. డా.పిట్టా
  నగరము పగలులె రెండిట
  సగమగు విద్యుత్తు కాంతి చక్కని సౌధాల్
  బిగి తెర థియేటరున నో
  సుగుణాకర పట్టపగలె చుక్కల గనుమా!

  రిప్లయితొలగించు
 10. డా.పిట్టా
  తండ్రి పెళ్ళికొడుకుతో జేసిన ముచ్చట యిది:
  తగదని యంటివా నిశిని తారల మధ్యన నౌ ముహూర్తమున్
  సగమును రారు బంధువులు చాటుగ బెళ్లన జాప్య మాయె జూ
  డగ నగునా పతివ్రతల డాంబిక దర్శన మౌను మింటినిన్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  2. డా.పిట్టా
   ఆర్యా ,ధన్యవాదాలు.

   తొలగించు
 11. పగలే వెన్నెల నూహల
  జగమే నూగగ,విరిసెను చానమనమ్మునన్
  నగవులు పూయగ, ప్రేమయె
  సుగుణాకర,పట్టపగలె చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
 12. సారీ టైపాటు
  రెండవ పాదం
  చాన మనమ్మున్

  రిప్లయితొలగించు
 13. వగచెను కర్షక వాతము
  దిగులుపెరిగె మిగుల ధరల ధిక్కారమునన్
  నగుబాటు మిగిలి సంతన
  సుగుణాకర!పట్టపగలె చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "జగమే యూగగ.. కర్షక సంఘము..." అనండి.

   తొలగించు
 14. అగణితమగు నవ తారక
  లగపడు నక్షత్ర శాల యందున నిపుడే
  తగ మొదటి యాట మొదలయె
  సుగుణాకర! పట్ట పగలె చుక్కలు గనుమా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విజయకుమార్ గారూ,
   నక్షత్రశాల విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 15. వగచెడు కర్షకాళికి నివారణ జూపు విధాన శూన్యతన్
  పగిలెను రైతుగుండెలు నుపాయము లేదిక నొడ్డుచేరగా
  రగిలెను శోకవేదన విరామము లేక ధరావిఘాతమున్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు ఝామునన్
  ధరావిఘాతము=price fluctuations

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. డా}.పిట్టా
   ధరల విఘాతమా ఏకంగాధర(భూమి)విఘాతమా? తెలియ కున్నది గదా!అలాంటి పారిభాషిక పదము ఉండియుండునేమో!

   తొలగించు
 16. తగిలెను సూర్యగ్రహణము
  అగణితముగ పూర్ణమాయె నాఘటనమ్మా
  పగలేని తిమిర మెసగగ
  సుగుణాకర పట్టపగలె చుక్కలగనుమా
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించు
 17. మగనికి కుష్ఠురోగమని మానసమందున నెంచబోక తా
  నగణిత పుణ్యయౌ సుమతి ఆత్మవిభున్ వెసకాచుకోవగన్
  తగ శపియించె నర్కుని సదాగమనమ్మది నిల్చురీతిగన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో "సూర్యగ్రహణ। మ్మగణితముగ.. పగలే తిమిర మ్మెసగగ..." అనండి.

   తొలగించు
 18. ఖగరాశిభంగి ధరలవి
  యెగురుచు తానింగి జేరె నేమని జెప్పన్
  గగనము నజేరి మెరిసెడు
  సుగుణాకర ! పట్టపగలె చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
 19. [5/7, 6:13 PM] DrNVNChary:సమస్యా పూరణం డా.ఎన్.వి.ఎన్.చారి
  వగచుచు రైతన్న పలికె
  "దిగజారిన గిట్టు బాటు దీనపు ధరలున్
  ధగ ధగ మెరిసే మార్కెటు
  సుగుణాకర! పట్ట పగలె చుక్కల గనుమా."
  [5/7, 6:32 PM] DrNVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి
  ఎగిసెడి మిర్చీ మంటలు
  దిగులున నిరు పేద రైతు దిక్కే లేకన్
  పగతో దాడులు చేయగ
  సుగుణాకర! పట్ట .పగలెచుక్కల గనుమా
  [5/7, 10:25 PM] DrNVNChary: .డా ఎన్.వి ఎన్.చారి
  మగనిని స్కైపున గాంచుచు
  నగయుచు చూపించె నభము నా దేశమునన్
  పగలిట రాత్రక్కడరా
  సుగుణాకర! పట్ట పగలె చుక్కలు గనుమా !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ మూడు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.

   తొలగించు
 20. ఖగుడుదయించియు ప్రొద్దయె
  మగతగ నొళ్ళు విరచుకొని మగువలు తారా
  డె గడపన ముగ్గు వేయగ
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా

  రిప్లయితొలగించు
 21. గగనతలమందు రాహువు
  తొగదాయను మ్రింగుచుండ తొలగెను కాంతుల్
  ఖగు డంతట మాయమవగ
  సుగుణాకర!పట్టపగలు చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
 22. సుగుణపు దొరనే మందుము,
  భగభగ మనునెపుడు రవి, నభములో రేరే
  డు గునియు నెవ్వరి తోడన్,
  సుగుణాకర,పట్టపగలె,చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. గురువర్యా ఇది నా మొదటి ప్రయత్నము మీ ఆశీస్సులు కోరుచు సర్వదా మీ పూసపాటి

   తొలగించు
 23. వగచిన నేమి ఫలమిక న
  వగతము గాక గణితంపు ప్రశ్నలు సాధిం
  పగఁ దరమే నీ కిత్తరి
  సుగుణాకర! పట్ట పగలె చుక్కలఁ గనుమా


  బిగిసిన కర్మఁ దా మనుభ వింపక తప్పునె యెంత వారికిన్
  జగతిని సూర్య చంద్రులకు శత్రువు రాహువు భానుఁ బట్టగం
  బగఁ గొని యా మహా గ్రహణ బంధపు రోజునఁ దామసమ్మునన్
  సుగుణ నిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 24. అగణిత హర్షం బందుము
  సుగుణాకర! పట్టపగలె చుక్కలగను మా
  జగపతి మాంత్రికు మహిమన్
  తగనంచును బిలిచె సఖుని తన్మయు డపుడున్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించు
 25. శ్రీరామచంద్రునితో హనుమ:

  అగణిత బాహుబలమ్మున
  దగ రావణు గూల్చ సీత దరిజేరగనే
  బిగిసిన చీకటి హృదులన్
  సుగుణాకర!పట్టపగలె చుక్కల గనుమా!!

  రిప్లయితొలగించు
 26. బగభగ మండుదువో రవి
  సుగుణాకర పట్టపగలు, చుక్కలు గనుమా
  తగు శీతలంబిడును శశి
  ని గూడి సౌఖ్యంబు గల్గ నిఖిల జనులకున్.

  రిప్లయితొలగించు
 27. ఖగరాశిభంగి ధరలవి
  యెగురుచు తానింగి జేరె నేమని జెప్పన్
  గగనము నజేరి మెరిసెడు
  సుగుణాకర ! పట్టపగలె చుక్కల గనుమా


  జగతిని మూఢచిత్తులును స్వార్థగుణాత్ముల పాలనమ్నులో
  ప్రగతుల పేరు జెప్పి పలు పన్నులు వేయుచు కుంభకోణముల్
  గగనము దాకెనే ధరలు కష్టము లెన్నొ జనాళి జేరెనో
  సుగుణనిధీ! కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు జామునన్

  రిప్లయితొలగించు
 28. ఆర్య నిన్నటి సమశ్య పూర్ణము ఒక్కసారి వీక్షించి తప్పులు సరిదిద్దగలరు


  తిరిగి పురమునకు పంపెను
  భరతుని రాఘవుడు, దునిమె భామిని కొరకై
  వెరయక యనుజుo డరి సో
  దరి నాశిక కర్ణములను దయయే లేకన్

  రిప్లయితొలగించు

 29. 8/5/17
  9494846984 డా.బల్లూరి ఉమాదేవి.

  అగణితమహిమోపేతుడు
  నగధరుడా రమణినచట నయగారముతో
  పొగడగ పూబోణి పలికె
  సుగుణాకర పట్టపగలె చుక్కలు గనుమా!

  జగమున నత్యధికముగా
  దిగుబడి వచ్చుట నిజమని తేలుచు ఖుషితో
  సొగసుగ విత్తులు విత్తగ
  సుగుణాకర పట్టపగలె చుక్కలు గనుమా !

  జగతిన వింతయు కాదుర
  ఖగునికి పట్టగ అమవస గ్రహణము నిలలో
  పగలే చీకటి ముసరగ
  సుగుణాకర పట్టపగలె చుక్కలు గనుమా !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 30. నగవుల రాణియె వధువని
  నిగ నిగ లాడంగ నర్ధనిశి ముడివేయన్
  తగవులు రక్కసిగ వెలుగ
  సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా

  నిన్నటి సమస్యకు నా పూరణ

  ధరణిని యేలగ బంపుచు
  భరతుని, రాఘవుఁడు దునిమె భామిని కొఱకై
  పరి పరి విధముల కుందుచు ,
  నరకమునకు జేర రావణాసురు డంతన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 31. మగువలు చుక్కల చీరలు
  నగలను ధరియించి ప్రీతి నవ్వులు చిలుకన్
  సెగరేగెమానసమ్మున
  సుగుణాకరపట్టపగలె చుక్కల గనుమా

  రిప్లయితొలగించు
 32. అద్దె ఇంటి యజమాని తన ఇంటి వసతుల గురించి వచ్చిన వారికి చెపుతూ:

  తగు నీ గృహమ్ము నొక వం
  ట గదియు నొకహాలు రెండ టాచుడు బాత్రూ
  ముగల పడకగదుల రూఫున
  సుగుణాకర! పట్ట పగలె చుక్కలఁ గనుమా!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ (అన్యదేశ్యాలు ప్రయోగించక తప్పని పరిస్థితిలో) బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. గణభంగమైన మూడవపాద సవరణతో:

   అద్దె ఇంటి యజమాని తన ఇంటి వసతుల గురించి వచ్చిన వారికి చెపుతూ:

   తగు నీ గృహమ్ము నొక వం
   ట గదియు నొకహాలు రెండ టాచుడు బాత్రూ
   ము గదులు పరుండ, రూఫున
   సుగుణాకర! పట్ట పగలె చుక్కలఁ గనుమా!!

   తొలగించు

 33. పిన్నక నాగేశ్వరరావు.

  జగతిన్నమవస రోజు క

  లుగు సూర్యగ్రహణమందు లోకం
  బంతన్
  తగు చీకట్లు ముసరగా

  సుగుణాకర!పట్టపగలె చుక్కల గనుమా!

  *****************************

  రిప్లయితొలగించు

 34. సొగసున మిలమిల మెరయుచు
  నగవుల గురిపించు రేయి నక్షత్ర తతుల్!
  మొగియ నగచాట్లు ప్రియమున
  సుగుణాకర! పట్టపగలు చుక్కలు గనుమా!

  మొగియు=కవియు
  ప్రియము=హెచ్చు ధర

  రిప్లయితొలగించు
 35. ఖగుడదె రాహుగ్రస్తం..
  బగు గ్రహణము బొందె నింగి నల్లదె కాంతుల్
  ధగధగమని దీపింపగ
  సుగుణాకర ! పట్టపగలు చుక్కల గనుమా !!


  అగణితమైన చాతురిని నల్లదె చుక్కలముగ్గు దీర్చెడిన్
  ధగధగలాడ నింగిని ముదమ్మున రేలలితాంగి చక్కగా!
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కల., నే నడిప్రొద్దు జామునన్
  ఖగునకు జూడ శక్యమిది గాదు ! లభించెను నీకె చంద్రమా!!

  రిప్లయితొలగించు
 36. సొగసగు సిల్కు చీరలును షోకుగ మెర్సెడి భూషణమ్ములన్
  మిగులుగ నమ్ము మాలులను మేలుగ తెర్చెడి యార్భటమ్మునన్
  నగవుచు వచ్చిరిచ్చటకు నల్గురు తారలు కుల్కులొల్కుచున్
  సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు జామునన్!

  రిప్లయితొలగించు