5, మే 2017, శుక్రవారం

సమస్య - 2353 (డాండడ డాండాం....)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్"
(లేదా...)
"డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్"

104 కామెంట్‌లు:



  1. భండన భీముడు తాకన
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్
    గుండమ్మా ! యెల్లరికిన్
    నిండగు రీతిని విరించి నేర్పుగ జేర్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      శుభోదయం!
      పద్యం బాగుంది. కాని పూరణ భావం నాకు అవగాహన కాలేదు. దయచేసి వివరించండి.

      తొలగించండి


    2. ఎవరెట్లా తాకితే అట్లా మోతలు వినిపిస్తాయని :)

      జిలేబి

      తొలగించండి
  2. సంగీత కచేరి లో గురువు తనశిష్యులతో తన ప్రావీణ్యాన్ని చూపిస్తూ
    కం. .. అండగ శిష్యుల గూడి గు
    …… రుండు సరిగమల మధురిమ రుచులన్ జూపన్
    …… దండిగ సంగతు లందగ
    …… డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్.

    రిప్లయితొలగించండి


  3. పడతీ ధాటిగ వచ్చె నమ్మ పదముల్ పద్యమ్ము గానమ్ములున్
    డడ డండం డడ డాండ డాండ డడడం డాండమ్మనెన్ వీణియల్
    వడగాల్పుల్ సడి మద్దెలయ్యె శృతియై వాగీశ్వరిన్నెమ్మిగా
    నడకల్ నాట్యములై జిలేబి గళమున్ నాదమ్ములాయెన్ భళీ‌!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      వృత్తరచన చక్కగా సాగింది. కాని వీణ డాండడడాం అనడం?

      తొలగించండి


    2. ఓ వీణ డాండడామ్మన లేదన్న మాట :)

      జిలేబి

      తొలగించండి
  4. ఖాండవ వన దహనమ్మున
    పాండవ మధ్యముని బాణ వాదన తోడన్
    గాండీవ ధ్వని యెటులన:
    "డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      పద్యం బాగున్నది. కాని 'వీణెల్' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
    2. గాండీవపు తోరమునకు మీటిన వీణల తంతులకు పోలిక ప్రయత్నం...

      తొలగించండి
  5. కడు దూరంబుగ నేగె నా పతి,కనంగా నోచ నీనాటికిన్
    బడబాగ్నుల్ మదిలో చెలంగె నది చెప్పన్ శక్యమేయంచు నే
    ర్పడ శోకించెడు నామెఁగాంచె తన భర్తన్--మ్రోగె సన్నాయిలే
    డడడం డండడ డాండడాండడడడం ఢండమ్మనెన్ వీణియల్

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ వృత్తం చక్కని భావంతో చాలా బాగుంది. కాని వీణాధ్వనులు డాండడడాం అని ఉండవు కదా!

      తొలగించండి
  6. గుడికిన్ పోవగనేల దైవమునకున్ గోరంగ సాన్నిధ్యమున్
    తడబాటుల్ విడనాడి సల్పగవలెన్ ధ్యానమ్ము నేకాంతమున్
    విడనాడంగనె బాహ్యచింతన ధ్వనుల్ విన్పించు నాంతర్యమున్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      పద్యం బాగుంది. అంతరంగంలో వీణానాదాలు... కాని అవి డాండడడాం అనవు కదా!

      తొలగించండి
  7. నిండగు బడులు సరస్వతి
    తాండవ మాడెడు కరముల తరళ విపంచుల్
    మెండు ఫలితముల మ్రోతన
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్ కుమార్ గారూ,
      మీ పద్యం బాగుంది. కానీ వీణానాదం డాండడడాం అని ఉండదు కదా!

      తొలగించండి
    2. "మెండు ఫలితపు పటాకుల" అనుకుని మరిచి..
      మోతన నే ఉంచాను.

      తొలగించండి
    3. బడులను సరస్వతి వీణలుగా, మెండుఫలితములు వచ్చినపుడు వాళ్ళ మ్రోతలు వీణావాదనల్లా వినసొంపుగా ఉండవు. డండం..అనే మోగుతాయి.

      తొలగించండి
  8. భండన మందున ఢక్కలు
    డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
    మెండుగ మ్రోగెను గెలుపుల
    పండుగలో నగరమందు బహువిధములుగాన్.

    మెండైన యతిశయోక్తులు
    భండన భీముండు చేరి పలుకుచు మిత్రుల్
    రండనుచు దెలిపె నిట్టుల
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మొదటి పూరణ చాలా బాగుంది. ఈనాటి సమస్యకు సరియైన పూరణ నిచ్చినవారిలో మీరు ప్రథములు!
      రెండవ పూరణ పద్యం వరకు బాగున్నది. కాని వీణెలకు అన్వయం?

      తొలగించండి
    2. ఆర్యా
      అతిశయోక్తులు కదా.
      అన్వయించ వచ్చునేమో అని వ్రాశాను.

      తొలగించండి
    3. అవును వీణెలు డాండడడాం అన్నాయి అని అతిశయోక్తిగా చెప్పారు రెండవ పద్యంలో. రెండూ బాగున్నాయి.

      తొలగించండి

  9. జిలేబి ఈ పనులన్నీ చేస్తే నిజంగా వీణ డాండాం అనే అంటుంది :)

    ఎడబాటుల్ విడనాడి యింటిమగనిన్ యీరమ్ముగా జూడగన్
    గుడిగంటల్గన మేలుకాంచి శుభమై గుమ్మమ్మునన్ ముగ్గుల
    న్నిడగన్ చెంతన రాయడౌ మగనికిన్ నీరాజనమ్ముల్ గనన్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండమ్మనెన్ వీణియల్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      వ్యతిరిక్తమైన పనులు చేసే వారికి వీణలు డాండడడాం అనే అంటాయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'మగనిన్+ఈరమ్ముగా' అన్నపుడు యడాగమం రాదు. "మగని న్నీరమ్ముగా" అనవచ్చు. కాని 'నీరమ్ముగా' అనే అపార్థానికి అవకాశం ఉంటుంది.

      తొలగించండి

  10. ఈ రోజు ఎవరి వీణా మోగినట్లు లేదు యింత దాక !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, రెండవ వృత్తంలో మీరు వీణెలను సరిగానే మ్రోగించారు!

      తొలగించండి
    2. నాది "ఢాం ఢాం డఢాండ ఢాం" అనింది :(

      తొలగించండి
    3. కొండంత ముదము తోడుగ
      దండిగ యత్నమ్ము నేడు దండుగ కాగా
      పండిన నా హృదయమ్మున
      డడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

      ;)

      తొలగించండి
  11. డా.పిట్టా
    కుండల వివిధత గని యా
    బాండువలన్ విప్ప మట్టి భాసుర లీల
    న్నండన జేరగ తత్త్వపు
    డాండడ డాండాం డడాండ డామ్మనె వీణల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      ఎవరికీ అంతుపట్టని తాత్త్వికతను ఆశ్రయించారు. తత్త్వశాస్త్రం సాధించలేనిది ఏముంది? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  12. బండలఁ దేలఁగ వారధి
    దండిగ కపిసేన లంక దాటిగఁ జేరన్
    మండోదరి మీటంగనె
    డాండడ డాండాం డడాండ డామ్మనె వీణెల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మండోదరి వీణను అపశ్రుతులు పలికించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు మరియు G.P. శాస్త్రులవారికి ధన్యవాదములు

      తొలగించండి
    3. చిన్న సవరణతో
      బండలఁ దేలఁగ వారధి
      దండిగ కపిసేన లంక ధాటిగఁ జేరన్
      మండోదరి మీటంగనె
      డాండడ డాండాం డడాండ డామ్మనె వీణెల్

      తొలగించండి


  13. గడగట్టన్ సరి భేరి నాద రవమున్ ఘాతమ్ములై పద్యముల్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండమ్మనెన్, వీణియల్
    విడిగా మ్రోగెను రాగముల్ తెలియకన్ వీరమ్మ గుండమ్మునన్
    పడి పాదంబులు బాణి మార్చ మది రాపాడెన్ జిలేబీ చెలీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    పెడ యోగంబది, పేదకందనిది, యా పిప్పీల సంగీతపున్
    దడ,వాయిద్యములెల్ల మ్రోగగ జుమీ దండించుకొండన్న నా
    కడు వ్యాపారిది జీవనంపు కళ(Art of Living)యే ?గాంచంగ ధ్యానంబె? నీ
    జడులే బంచిరి మూడు కోట్ల ధనమున్ సంపన్న యోగంబుకై!
    డడడం డండడ డాండ డాండ డడడం॥ డండమ్మనెన్ వీణియల్
    కడకున్ "గిన్నిసు"నెక్కె నీఘనత నా కాసుల్ వృథా!నమ్మరే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, ధన్యవాదములు.నిన్నటి డా.వసునందన్ సభకు మన ప్రాంతం వారు వెళ్ళినారా తెలుపండి.విశేషాలు మీకడ నున్నాయా?

      తొలగించండి
  15. మండిత ఢక్కానాదము
    డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
    నిండుగ నిక్వణములనిడె
    తాండవమాడంగ శివుడు తన్మయుడగుచున్!!


    దడఁబుట్టింపగ రామలక్ష్మణులు యుద్ధంబందునన్ కుంభక..
    ర్ణుడు జచ్చెన్, దగ నింద్రజిత్తును నదే త్రోవన్ జనెన్ , లుప్త ధీ..
    రుడు లంకేశుడు చిత్తశాంతికయి తంత్రుల్ మీట చిత్రమ్ముగా
    డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్ !!

    రిప్లయితొలగించండి


  16. భండన భేరియు మ్రోగన్
    డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
    నిండుగ సుస్వర నాదము
    మెండుగ జేసెన్ జిలేబి మేల్మిని గనుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. పండుగవేళ టపాసులు
    డాండడ ఢాంఢాండడాండ ఢామ్మనె, వీణెల్
    మెండుగ మోగెను కన్నియ
    గుండెన, కళ్యాణఘడియ గోచరమవగన్

    రిప్లయితొలగించండి
  18. నిండుగ తాండవ గణపతి
    తుండమ్మును తాకె మహతి తొట్రిలె తీగెల్
    పండగవేళనుబళిరా
    డాండడ డాండా డడాండ డామ్మనె వీణెల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. దడ పుట్టించెడు మ్రోతలన్ చదువులో తామొక్కరే భేషుగా
    తొడ గొట్టన్ బడులన్ని వీధినబడెన్ దుర్మార్గపున్ బేరమై
    పడిపోయెన్ గద విద్య చిత్రమిపుడున్ వాగ్దేవియే మీటగా
    డడడండం డడడాండ డాండ డడడండండమ్మనెన్వీ ణియల్

    రిప్లయితొలగించండి
  20. యెడదన్ పొంగగ ప్రేమ భావనలు సౌహృద్యంబుగా దోచెడిన్
    పొడమన్ మానసమందు సంతసము విస్ఫూరంబుగా,చప్పుడుల్
    డడఢం ఢండడడాండడాండడడ డండండమ్మనెన్, వీణియల్
    సడులన్ జేసెను కన్నెగుండె విల సత్సౌభాగ్య సౌఖ్యంబులన్

    రిప్లయితొలగించండి
  21. లగ్నము సమయమున భజంత్రీల వాద్యాలు, టపాసుల మోతలు మ్రోగగా పెండ్లి కూతురు మదిలో వీణలు మ్రోగి ఆనంద భాష్పములు కార్చెను.
    మండపము దరి టపాసులు
    డాండడ డాండాం డడాండ డామ్మనె, వీణెల్
    పెండిలి కూతురు మదిలో
    నిండుగ మ్రోగ, కనులందు నీరము కారెన్

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భండన భూమిని భేరుల్
      డాండడ డాండాం డడాండ డామ్మనె, వీణల్
      మండలి యందున మరికను
      పండుగ జేసెను చెవులకు పలువురు వినగా

      తొలగించండి
    2. మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. సడిలేక ధరచీలి సలిపెన్ సర్వమ్మది థ్వంసం
    నడిరేయి జనమెల్ల నలిగెన్ నర్తించ విలయం
    గడియొక్క యుగమౌచు గడిచెన్ కాలమ్ముతానున్
    డడడండ డడడాండ డడడం డమ్మనె వీణెల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ యీ విశేషవృత్త పూరణ బాగున్నది. అభినందనలు. ఇది ఏ వృత్తం?
      అయినా సమస్య పాదాన్ని మార్చి పూరణ చేయడం సంప్రదాయం కాదు.

      తొలగించండి
  24. భండనమున రాముడు కో
    దండము నెక్కిడుచు కరకు దనుజుల మ్రోలన్
    నుండగ రిపుదండు మదిన
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

    రిప్లయితొలగించండి
  25. కం||
    మెండుగ భక్తులఁగలిగిన
    చండిక గుడిముందుజేరి చపలపు భండుల్,
    దండై మహతులఁ మీటగ
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

    భండులు =ఆకతాయిలు, దండు+అయి= దండై=గుంపై
    (వీణతీగెలు డాంమ్మని తెగిపోయాయని)
    ముమ్మడి చంద్రశేఖరాచార్యులు, పెంట్లవెల్లి.

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


      *పడిపోయెన్ రహదారిలోజరుగగాన్ భారీప్రమాదంబునే*
      *ర్పడెభీభత్సపరిస్థితుల్ రుధిరముల్ పారెన్ క్షతాంగంబులన్*
      *పడినన్ వీణరవాణవాహనముదౌర్భాగ్యంబులెట్లుండినన్*
      *డడడం డండడ డాండ డాండ డడడం డండమ్మనెన్ వీణియల్*

      *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

      తొలగించండి
    2. సందిత గారూ,
      మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  27. పండితవర్యునిగృహమం
    దుండిన వీణియలు జారి, నురుములు ఉరమన్
    మెండుగ,తబలల పైబడ
    డాండడడాండాం డడాండ డామ్మనె వీణల్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారు:
      అద్భుతమైన ఊహ! 2010 సంవత్సరమందు శంకరాభరణం లోని మీ పూరణలు చదివి ఆనందిచుచున్నాను. నమస్సులు!

      తొలగించండి
    2. పీతాంబర్ గారూ,
      ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ పునర్దర్శనం! సంతోషం!
      చక్కని పూరణ. అభినందనలు.
      'జారి యురుము లురుమగన్' అనండి.

      తొలగించండి
  28. మండపమున తూర్య ధ్వనుల్
    డాండడ డాండాం డడాండ డామ్మనె, వీణెల్
    మెండుగ మ్రోగెను సకి మది
    గండర గండడు పతియను కల ఫలియించన్

    రిప్లయితొలగించండి
  29. మెండగు భయము|పరీక్షన
    డాండడ డాండాం డడాండ డాంమ్మనె|”వీణెల్
    గుండెకువినిపించెను|ను
    ద్దండులవిజయమ్ము నాకుదగ్గరగాగా|
    2.సుడిగాలట్లుగ నాట్యభంగిమలతో శోభాయ మానంగ తా
    వడిగా నాడెను గొట్టగా తబల సర్వా భీష్టసంధానిగా
    డడడం డండడ డాండతాండ డడడండండమ్మనెన్|”వీణియల్
    బడిగా రాగము బంచె|వేళ్ళచటి నిర్వాకంబె వాయించగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పరీక్ష+అన, సుడిగాలి+అట్టుల' అన్నపుడు యడాగమం వస్తుంది. 'శోభాయమానంగ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "శోభాయమానమ్ముగా" అనవచ్చు. 'సంధాయిగా' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  30. మెండుగ టపాసు లక్కడ
    డాండడ డాండాండడాండ డామ్మనె,వీణల్
    గండర గండర యనుచును
    పండితులే మెచ్చువిధము బాగుగ మ్రోగెన్

    రిప్లయితొలగించండి
  31. నడిరేయైనను నోలలాడ జనులానందాబ్ధిలో చూడ సం
    దడిగా మ్రోగెను శ్రావ్యరీతి పలువాద్యముల్, మృదంగంబటన్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్, వీణియల్
    కడు సంతోషము కల్గు నట్టుల పతాకస్థాయిలో మ్రోగెనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేమాని వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాద్యమ్ముల్' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  32. గండర గండుని మద్దెల
    డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
    మండిత సువాసినీ కర
    మండితమై మ్రోగె రుచిర మందధ్వనినిన్


    కడు దూరంబున నుండి బండి పయి చక్కంబెట్టి యావీణెలన్
    తడఁబాటింతయు లేక పోవునెడ సత్వంబడ్డుగన్ వచ్చినన్
    వడిఁదా నాపఁ దటాలునన్ ధరణి సంపాతమ్ములై యన్నియున్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండమ్మనెన్ వీణియల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. బండలు విస్ఫోటించగ
    డాండడ,డాండడ,డడాండ,డామ్మనె, వీణల్
    నిండుగ మ్రోగినరీతిని
    పండెను బధిరు0డు మేను పరవశమందన్

    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝
    వడిగా బాంబులవెన్నొ తానుఁ గొనియున్, బస్సొక్కటావీథినిన్
    సడితో వచ్చుటఁ గాంచి, బాంబుల నిడెన్ సంతోషముప్పొంగ; సం
    దడితో వీణియ లొక్కఁ డప్డు గొనియున్ దద్వాహనమ్మందుఁ దా
    నిడి, వేగన్ సిగరెట్టుఁ గాల్చ, నదరుల్ నిల్వం దగన్ బాంబుపై,

    డడడం డండడ డాండ డాండ డడడం డండమ్మనెన్ వీణియల్!
    😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝😛😜😝

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  35. దండిగ టపాసు కాల్చగ
    డండడ ఢాంఢాం డడాండ డమ్మనె,వీణెల్
    మెండుగ ఝణఝణ మోగెను
    పండుగ వేళను మనములు పరవశ మొందన్!

    రిప్లయితొలగించండి
  36. వడిగా మింటను దేవదుందుభులు సంభావ్యంపు వాద్యంబులున్
    డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్, వీణియల్
    కడు సమ్మోదము నొంద మ్రోగె నపుడా కౌసల్యసూనుండు రా
    ముడుపెండ్లాడగ జానకీ సతిని యీభూమాత హర్షించగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  37. పిన్నక నాగేశ్వరరావు.

    పెండిలి ముహూర్తమునకున్

    దండిగ మ్రోయంగ మేళ తాళములెల్లన్

    గుండెలదర వినిపించుచు

    డాండడ డాండాం డడాండ డామ్మనె
    వీణెల్.
    ***************************

    రిప్లయితొలగించండి
  38. మెండగు కళా తపస్విగ
    దండిగ తీగల బిగించి దంభము జూపెన్
    భండన ఖడ్గ ధ్వనియని ,
    డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్

    నిన్నటి న్యస్తాక్షరి కి నా పూరణ

    నిన్నువిడి నాడు పరుగిడె నీదు నాతి
    నాకమున గాక గిరికేగినా కుబేరు
    చెంత పొందిన నిధి సరిజేయ తరమ
    నీకు ; సిరియుండ నీ చెంత నేల గోల ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  39. ఉడుకల్,డిండిమ,డోలు,ఢక్క,ఘటముల్,హోరెత్తి మ్రోగించగన్
    డడడం డండడ,డాండడాం,డడడ,డం డండమ్మనెన్,వీణియల్,
    తుడుముల్,తప్పెట,వాయులీనముల గీతుల్ గాయకుల్ పాడగన్
    వడిగా సాగెను వేంకటేశుని రథం బావీటి పౌషమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  40. డాండడడాండాం డడాండ డా మ్మనె వీణెల్
    గాండీవమ్మును దాల్చుచు
    భండనమున యర్జునుండు పగతుర కూల్చన్
    గుండెలవియునట్లేడ్వగ
    డాండడడాండాం డడాండ డా మ్మనె వీణెల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భండనమున నర్జునుండు పగతుర గూల్చన్' అనండి.

      తొలగించండి
  41. నడిరేయిన్ రహదారిపైన తగు సన్నాహంబు లేకుండగన్
    వడినింపన్ పనివాండ్లు వాహనమునన్ వాద్యమ్ములన్ త్రోలు నా
    తడు సారా తెగ తాగి బండినడుపన్ తానంత తూగాడగన్
    డడడండం డడడాండ డాండ డడడం డాండామ్మనెన్ వీణెయల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  42. 🌺🌱🌺
    శంకరాభరణం.

    డడ డాండాం డడాండ డా మ్మనె ;వీణెల్!

    నేటి పూరణ.

    కం.
    తడబాటులేక విలుగొని
    డడ డాండాం డడాండ డా మ్మనె ;వీణెల్!
    తడిమెడి కరమే నేడున్,
    బడవేసెను నానరకుని పాపాత్మకునిన్,!!

    ............ *అంబటి*

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    రిప్లయితొలగించండి
  43. వడిగా నేర్వ ప్రభాకరుండు తెనుగున్ పద్యమ్ములన్ కోరుచున్
    కడకున్ శంకరు కొల్వుజేరుచును కంగార్వీడి చెల్వాడగా
    దడబుట్టెన్ హృదినిన్ సరస్వతికి సర్దాపూరణల్ చద్వగా...
    డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్

    రిప్లయితొలగించండి