కవిమిత్రులారా, నమస్కృతులు. ఈరోజు మా తమ్ముని కొడుకు నిశ్చితార్థం కొరకు వెళ్తున్నందున మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
కృష్ణునకు యశోదేమగు, శిష్యు నెపుడు గురువు దీవించు, జీవుడు మరణ మొంద దివికి చేరునేది, జనకుడు ఎవరి పెండ్లి కొరకు ప్రకటించెనట స్వయo వరము నాడు అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు
కవి మిత్రులకు నమస్కారములు ఈ పద్యము పరి శీలించి తప్పులను సూచించి సాయము చేయగలరు
నాగమణి గారు క్రమాలంకారములో పంచపాద తేటగీతి లో మీ పూరణ బాగుంది. కృష్ణు..శిష్యు లలో ప్రాసయతి భంగము. ష-ణ లతో సంయుక్తాక్షరమే ఉండాలి. సవరించండి. “నమస్కరించినది” దీనికి ప్రశ్నలో అన్వయలోపము కన్పించుచున్నది. జనకుడు+ ఎవరి సంధి నిత్యము. గణదోషము కూడా ఉంది.జనకుడెవరి యని సంధిచేస్తే రెండు దోషాలు పోతాయి. నాడు / అమ్మయె వాక్యాంతము పాదాంతము కాబట్టి విసంధియైన పరవా లేదు.
పోచిరాజు కామేశ్వర రావు గారికి నమస్కారములు మీరు తెల్పిన ప్రకారము ఇంకొక పూరణము పంపుతున్నాను పరిశీలిoచి అభిప్రాయము తెలుపగలరు . ధన్యవాదములతో పూసపాటి
అవనిజ కుశునకేమగు, అచల పుత్రి ఎదురు బడిన రాముని జూచి ఏమి చేసె, జనులు మరణించిన పిదప తనువు విడచి దివికి చేరునేది, జనకు డెవరి పెండ్లి కొరకు ప్రకటించెనట స్వయoవరము నాడు అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు
కామేశ్వర రావు గారికి నమస్కారము అచల పుత్రిని నేను భూపుత్రి (సీత) గా తలచి వ్రాశాను తప్పు కాదు గదా. మిగిలినవి దిద్దుకుంటాను. శ్రీ శబ్ద రత్నాకరము లో 1082 వ పీజిలో భూమి పర్యాయ పదములు అచల అని ఇచ్చారు తప్పు కాదుగదా తెలుపవలెను
మనకు 'అచలాత్మజా పరిణయము' అన్న ద్వ్యర్థికావ్యం ఉండనే ఉన్నది. అచల (అకారాంత పులింగం) + ఆత్మజా (పర్వతము యొక్క పుత్రిక అయిన పార్వతి) పరిణయము. అచలా (ఆకారాంత స్త్రీలింగం) + ఆత్మజా (భూమి యొక్క పుత్రిక అయిన సీత) పరిణయము.
రాణి వాసము గోల్పోయి రాత్రి పగలు
రిప్లయితొలగించండికాననమున కేగి తుదకు ఘనము గాను
ప్రాణమును సమర్పించిన రాణి సీత
కమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాత్రి పగలు'కు అన్వయం?
ఒక్క కార్యాలయంబున నొప్పు మీర
రిప్లయితొలగించండితనదు తనుజాత యధికార దర్ప మంద
నచట బంట్రోతు పదవిలో నమరి నట్టి
దమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.
హ.వేం.స.నా.మూర్తి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండివిజ్ఞతను విద్దెలను మేటి వినయమునను
మెలగు పిన్నకు పెద్దలు మిడిసిపడమి
గౌరవమునిచ్చు సంస్కృతి గన్నదగుట
నమ్మయె నమస్కరించిన దాత్మ సుతకు
డా.పిట్టా
రిప్లయితొలగించండిదిమ్మదిరుంగ భారత సుదీప్తిని గళ్ళకు గట్టినట్లుగన్
కొమ్మయె నైన మ్లేచ్ఛులకు గుంఫన మొప్పగ వారి భాషలో(ఆంగ్లంలో)
"పొమ్ము యెరుంగ జేయుమన"బోయె మహాత్ముని యాజ్ఞ మేరకున్
దమ్ముల "కోకిలమ్మ"గదె తానె సరోజినిదేవి,దేశపున్
అమ్మ నమస్కరించినది యాత్మ తనూజను భక్తియుక్తులన్!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'దిరుగంగ'ను 'దిరుంగ' అన్నారు.
వైభవమ్ముగ వరలక్ష్మి వ్రతము జేసి
రిప్లయితొలగించండిముత్తయిదులకు వందనములిడి సరిగ
పార్వతీ సిరి రూపున బరగు గాన
పరిణయంబైన తనయకు వాయనమిడి
అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పార్వతియె సిరి రూపున' అనండి.
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండి1.బాధ లన్నియు భరియించు భవ్య మూర్తి
మాత సీతను గాంచి సమ్మతము తోడ
ధరణి సహనంపు రూపంబు శాంత చిత్త
అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
2.అమ్మయె నమస్కరించిన దాత్మ సుతకు
తనదు పాత్రోచి తంబుగ తన్మ యమున
తల్లి సుతయైచు సుతయును తల్లి యగుచు
నాటకంబున నటియించు నట్టి వేళ.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'యైచు'...? "తల్లి సుత కాగ..." అనండి.
ధర్మ బోధనల నుజేయు తనయు జూచి
రిప్లయితొలగించండిచక్క నైనట్టి యా తని సత్ప్ర వర్త
నమును , ధా ర్మికత్వమ్మును నమ్రత లకు
న మ్మ నమస్క రించిన దాత్మ సుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుతుని విషయం చెప్పి సుతకు నమస్కరింపజేశారు.
భరతమాతకై తనభర్త ధరనువీడ
రిప్లయితొలగించండితనకుటుంబపుభారము తలనుదాల్చి
త్యాగములను చేయుచునుండ, తనివితోడ
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగాలి మాటలు తనువెల్ల గాల్చుచుండ
రిప్లయితొలగించండితన పవిత్రత సకలభూతమ్ములెఱుగ
తనను జేరిన సీతమ్మ త్యాగమునకు
నమ్మయె నమస్కరించినదాత్మ సుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమ్మనిభోజనమ్మిడుచు కన్నకుమారుల వాసమందు తా
రిప్లయితొలగించండినిమ్ముగపెంచి విద్యనిడ నిక్కనువీడిరి వారు తుచ్ఛులై
నమ్మకు నూతమిచ్చి కడు హర్షముతోడుతఁ జూచుచుండగా
నమ్మ నమస్కరించినది యాత్మ తనూజను భక్తియుక్తులన్
తనూజను టైపో - తనూజకు సరియైనది.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్మహిలోన నే జననికిన్ సమకూడనిభాగ్య మమ్మరో
రిప్లయితొలగించండియిమ్ముగ నాకునిచ్చితివి యీశునిరాణివి నాకు కూతువై
మమ్ముల నుద్ధరించగను మాలిమి నంచును మేన,గౌరి క
న్నమ్మ,నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమ పేరున బయటికి వెళ్ళినట్టి
రిప్లయితొలగించండిబిడ్డ కనబడి రోదించ ప్రీతి కోరి
యమ్మయె, నమస్కరించిన దాత్మసుతకు
శుభము కలుగగ దీవించె శోభనిడుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళ్ళినట్టి' అనడం వ్యావహారికం. "వెడలినట్టి" అనండి.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు. ఈరోజు మా తమ్ముని కొడుకు నిశ్చితార్థం కొరకు వెళ్తున్నందున మీ పూరణలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
పేగు తెంచుకు పుట్టిన పెద్ద బిడ్డ,
రిప్లయితొలగించండితల్లి కాలేయము చెడగ, తల్లికి తన
కారిజము నిడి బతికింప కరుణ జూసి
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితల్లి దాసిగ నటియించ , తనయ రాణి
రిప్లయితొలగించండిగనయి దర్బారు సీనున గణుతి కెక్క
పాత్ర యౌచిత్యమును జూపి ప్రతిభ జూప
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
ఎంత జెప్పిన వినకుండ నేడ్చుచున్న
తనయ నొప్పించ లేనట్టి తల్లి తుదకు
విసిగి చేతులు జోడించె వేగలేక
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపుత్రికా వివాహ దివసంబునఁ దలంచి
రిప్లయితొలగించండిసుతను లక్ష్మీస్వరూపి యంచు మది నాపొ
లతి వ్రతోద్యాప నావసరమున నడరి
యమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
కమ్మని భాషణమ్ములను గర్జము లీయగ దీవనల్ భువి
న్నిమ్ముగఁ బిన్న వారలకు నీప్సిత సిద్ధికి చిత్త వృద్ధికిన్
నెమ్మి నమస్కరించితిని నే బితృ దేవునకే యథోక్తి, కా
దమ్మ నమస్కరించినది యాత్మతనూజకు, భక్తియుక్తులన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచక్కని అన్వయం కామేశ్వరరావు గారూ! నమస్సులు!
తొలగించండిశర్మగారు ధన్యవాదములు. నమస్సులు.
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపరమశివుని మెప్పించి యపర్ణ మిగుల
రిప్లయితొలగించండినాదిదేవ సమేతయై యలరుచుండ
తనకు జగదాంబ సుతయంచు తనరి మేన
కమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృష్ణునకు యశోదేమగు, శిష్యు నెపుడు
రిప్లయితొలగించండిగురువు దీవించు, జీవుడు మరణ మొంద
దివికి చేరునేది, జనకుడు ఎవరి పెండ్లి
కొరకు ప్రకటించెనట స్వయo వరము నాడు
అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు
కవి మిత్రులకు నమస్కారములు ఈ పద్యము పరి శీలించి తప్పులను సూచించి సాయము చేయగలరు
నాగమణి గారు క్రమాలంకారములో పంచపాద తేటగీతి లో మీ పూరణ బాగుంది.
తొలగించండికృష్ణు..శిష్యు లలో ప్రాసయతి భంగము. ష-ణ లతో సంయుక్తాక్షరమే ఉండాలి. సవరించండి.
“నమస్కరించినది” దీనికి ప్రశ్నలో అన్వయలోపము కన్పించుచున్నది.
జనకుడు+ ఎవరి సంధి నిత్యము. గణదోషము కూడా ఉంది.జనకుడెవరి యని సంధిచేస్తే రెండు దోషాలు పోతాయి.
నాడు / అమ్మయె వాక్యాంతము పాదాంతము కాబట్టి విసంధియైన పరవా లేదు.
నాగమణి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*****
పోచిరాజు వారూ, ధన్యవాదాలు.
కామేశ్వర రావుగారూ నమోనమః. మీ రెండవ పూరణ అత్యద్భుతం.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సమస్య క్లిష్టతరమైనందున కించిదసంతృప్తి నాలో కన్పించింది. మీ అభినందన కొండంత ధైర్యాన్ని యిచ్చింది. నమస్సులు.
తొలగించండిఇమ్ముగ రాజశేఖరుడు పేర్మిని జక్కగ వైద్యవిద్యనున్
రిప్లయితొలగించండిసొమ్ములకాశజెందకను సౌమ్యము తోడన జేయుచుండగా
నమ్మనమస్కరించినది యాత్మతనూజుని భక్తియుక్తుల
న్నమ్మతనూజులన్నరయ యాత్మలు వేరగు బంధమొక్కటే
మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. 'తనూజ'ను 'తనూజు'ని చేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పతికి మూత్రపిండమ్ము నవసరమవగ
నిష్టపడి తన కూతురున్నివ్వ తుదకు
ప్రాణగండము తొలగెను పతికియనుచు
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.
****************************
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోచిరాజు కామేశ్వర రావు గారికి నమస్కారములు మీరు తెల్పిన ప్రకారము ఇంకొక పూరణము పంపుతున్నాను పరిశీలిoచి అభిప్రాయము తెలుపగలరు . ధన్యవాదములతో పూసపాటి
రిప్లయితొలగించండిఅవనిజ కుశునకేమగు, అచల పుత్రి
ఎదురు బడిన రాముని జూచి ఏమి చేసె,
జనులు మరణించిన పిదప తనువు విడచి
దివికి చేరునేది, జనకు డెవరి పెండ్లి
కొరకు ప్రకటించెనట స్వయoవరము నాడు
అమ్మయె, నమస్కరించిన, దాత్మ , సుతకు
పంచపదిని షట్పది చేసారే!బాగుంది. “ ..మగు, నచల పుత్రి (పార్వతి)
తొలగించండియెదురు బడిన.. యేమి చేసె, విడిచి ” అనండి.
కామేశ్వర రావు గారికి నమస్కారము అచల పుత్రిని నేను భూపుత్రి (సీత) గా తలచి వ్రాశాను తప్పు కాదు గదా. మిగిలినవి దిద్దుకుంటాను. శ్రీ శబ్ద రత్నాకరము లో 1082 వ పీజిలో భూమి పర్యాయ పదములు అచల అని ఇచ్చారు తప్పు కాదుగదా తెలుపవలెను
తొలగించండిచలించనిది యన్న యర్థములో భూమి కూడ సాధువే.
తొలగించండిమనకు 'అచలాత్మజా పరిణయము' అన్న ద్వ్యర్థికావ్యం ఉండనే ఉన్నది.
తొలగించండిఅచల (అకారాంత పులింగం) + ఆత్మజా (పర్వతము యొక్క పుత్రిక అయిన పార్వతి) పరిణయము.
అచలా (ఆకారాంత స్త్రీలింగం) + ఆత్మజా (భూమి యొక్క పుత్రిక అయిన సీత) పరిణయము.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి చక్కని విషయము చెప్పారు.
తొలగించండినాగమణి గారూ, మీ ప్రయత్నము ప్రశంసనీయం. స్వస్తి!
తొలగించండినమ్మిన కొడ్కులిర్వును నమ్మిక వమ్మును జేసి యమ్మకున్
రిప్లయితొలగించండిదుమ్ము మిగిల్చిపోయిరి సుదూరపు దేశము శాశ్వతంబుగా
కమ్మని ప్రేమతోడ కడు కష్టము కోర్చియు సాకె కూతురే
అమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసర్వ జనులాత్మ రూపులై జగతి వరల
రిప్లయితొలగించండినెల్లవారిని దైవమంచెలమి భక్తి
భావమున నతులును సమర్పణ నిడరె!
అమ్మయె నమస్కరించినదాత్మ సుతకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపు టమ్మ గౌరికిన్,
రిప్లయితొలగించండియమ్మ నమ్స్కరించినది,యాత్మతనూజకు భక్తి యుక్తులన్
సమ్మతి నిచ్చి పూజలను శ్రద్ధయుతమ్ముగ జేసి భర్త ప్రే
మమ్మును బొంది కాపురము మార్దవ మొప్పగ సంతు గల్గగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గౌరికిన్+అమ్మ' అన్నపుడు యడాగమం రాదు. "గౌరికే। యమ్మ..." అనండి.
కన్న సుతులు కాఠిన్యులై "నన్ను భార
రిప్లయితొలగించండిమంచు నెంచుచు వృద్ధాశ్రమంబులోన
బార వైచిరే తల్లి!కాపాడుమంచు"
యమ్మయె నమస్కరించిన దాత్మసుతకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదేశభక్తుడిల తనదు తిరుగులేని
శౌర్య విక్రమములు జూపి జయము నంద
ధరణి మాత ఋణము దీర్చ తనయు జూచి
యమ్మయె నమస్కరించిన దాత్మసుతుని.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిజయదశమిన బాలలే వేడ్క మీర
రిప్లయితొలగించండిబాల రూపున పూజలన్ బరగ నిలువ
పట్టి జూజుచు మననున భక్తితోడ
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దశమిని...' అనండి.
మాస్టరుగారూ! ధన్యవాదములు.
తొలగించండిదోష సవరణతో....
విజయదశమిని బాలలే వేడ్క మీర
బాల రూపున పూజలన్ బరగ నిలువ
పట్టి జూజుచు మననున భక్తితోడ
నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు
ఉత్పలమాలలో నిన్నటి నా పూరణ కనిపించడం లేదు గురువుగారూ!
రిప్లయితొలగించండిఇమ్ముగ నాదిదేవుడట నిండుగ మెచ్చి యపర్ణ సేవలన్
నమ్మిన దేవతల్ మురియ నందను జేకొన మోదమై కనుల్
చెమ్మగిలన్ పరాత్పరియె చిక్కెను కూతుగ నంచు మేనకౌ
యమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్
వమ్మవ నాశలన్నియును భామలు వీడుట బుర్కవుర్కలన్
రిప్లయితొలగించండిదమ్ములు మీరగా సుతలు దారుణ నీతుల ధిక్కరించగా
కమ్మగ జెడ్డ పట్నమున కారును తోలెడి కూతుజూచి బూ
బమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్
జెడ్డ = Jeddah, city in Saudi Arabia