29, మే 2017, సోమవారం

దత్తపది - 114 (కాంత-నారి-మగువ-వనిత)

కాంత - నారి - మగువ - వనిత
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మర్యాదా పురుషోత్తముడైన రాముని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

66 కామెంట్‌లు:

  1. ధర్మ మునకునే”కాంత”పు ధర్మ రూపు
    శౌర్యమందు”నా రి”పుమర్ద శాసకుండు
    మోహనాకార”మగువ”న్నెమోము వాడు
    అ”వని త”నయకు మారాము డనగ పతియె.
    (ఏకాంతము= మార్పులేనిది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధర్మ రూపు' అనడం దుష్ట సమాసం. అక్కడ "ధర్మమూర్తి" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు. గురువుగారి సవరణానంతరం

      ధర్మ మునకునే”కాంత”పు ధర్మ మూర్తి
      శౌర్యమందు”నా రి”పుమర్ద శాసకుండు
      మోహనాకార”మగువ”న్నెమోము వాడు
      అ”వని త”నయకు మారాము డనగ పతియె.
      (ఏకాంతము= మార్పులేనిది)

      తొలగించండి
  2. కరుణఁజూపగ భక్తులే*కాంత*మందు
    *నారి*కేళంబులనుఁదెచ్చి నతులొనర్చి
    నిత్య*మగువ*ర కైవల్య నియతి నంద
    అ*వనిత*నుజాత ధవునకు నంజలింత్రు.

    రిప్లయితొలగించండి
  3. చేయ వచ్చితి నే'కాంత'సేవ నిపుడు
    'నారి'కేళమున్ గొట్టెద నో రఘువర!
    హృదయమందు సుందర'మగు వ'దన శోభ
    యలరఁ బురుషోత్తముఁడవు నీ 'వని త' లంతు.

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    కాంత*ము రండు రాముడట కర్ణము దాటగ *నారి*లాగి ని
    ర్భ్రాంతిని వీరతన్ గదుర భవ్య ధనస్సును యొంచులీల వి
    భ్రాంతుల జేయ నందర ‌సభా భవనంబున;నెంచ గన్య వే
    కాంతుల జిమ్ము లే*మగు, వ*గల్ బెనగొన్న శుభంపు వేళ నా
    తంతున ‌సీతగా*వ,నిత*రంపు ‌సుఖంబులు శూన్య సంపదల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధనుస్సును+ఒంచు?(వంచు)' అన్నపుడు యడాగమం రాదు. "ధనుస్సును వంచు లీల..." అనండి.

      తొలగించండి
  5. సీ.
    ఏ(కాంత)పరిచర్య లేకాలమును జేతు
    నీకాంత గొలిచెదన్ నిత్య మవని
    గుణఘ(నా! రి)పునాశ! కువలయాధిపతీశ!
    నీనారి సీతను నిష్ఠ దలతు
    వర(మగు వ)చనంబు, భవ్య దేహంబుతో
    మహి వెల్గు రామ! నీ మగువ గొలుతు
    న(వని త)న్మయభావ మందుచు శ్రీరామ!
    భక్తి నర్చింతు నీ వనిత నెపుడు
    ఆ.వె.
    నిరత మొసగువాడ పరుషోత్తమా! నీకు
    నతుల గౌరవాన నతుల శతము
    భావశుద్ధి గూర్చి బహుమూల్య గుణ మిచ్చి
    కావు మయ్య నన్ను గరుణ జూపి.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దత్త పదాలను అన్యార్థంలోను, స్వార్థంలోను ప్రయోగిస్తూ చెప్పిన మీ పూరణ అత్యద్బుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. చంద్రకాంత శిలాభాస సౌధమందు
    నారిపుభయంకరుడురాము నాదరమున
    లేమ గువపిట్టయై కౌగిలింత నొదిగి
    చేవనితరాంత ప్రేమను సీతజూపె

    రిప్లయితొలగించండి
  7. అవని తనయను చేకొన్న యధిపునకును
    కీర్తి కాంతత్వమై వెలయు మూర్తిమతికి
    చేరి మదనారి మదిదల్చు శ్రీపతికిని
    మధురమగు వచనునకు నమస్సులిడుదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరుగారూ! ధన్యవాదములు/
      చిన్న దోష సవరణతో....

      అవని తనయను చేకొన్న యధిపునకును
      కీర్తి కాంతత్వమిలవెల్గు మూర్తిమతికి
      చేరి మదనారి మదిదల్చు శ్రీపతికిని
      మధురమగు వచనునకు నమస్సులిడుదు.

      తొలగించండి
  8. శ్రీరామ!
    కాంతారమ్మున శిలనే
    కాంతగఁ గని, వింటినారిఁ గట్టుచు ద్రుంచన్
    సంతసమగు వదనమ్మున
    చెంత నవని తనయ జేర జేజేలయ్యా!

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. రెండు రోజులుగా లేకపోవుటచే పూరణలు పంపలేదు. మన్నించి క్రింది మూడు పూరణలు పరిశీలించండి.
    26-05-2017:
    హితవుపడి సృష్టి జేయుచు
    వితముగ జన్యువుల నిలకు పోజేయుటలో
    జతపడి వెలిగెడి యా భా
    రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె దలపన్
    27-05-2017:
    దారి తెన్నులు గానక తల్లడిల్లు
    సమయమందు తటాలున సంభవించు
    మార్గదర్శిని గనినంత మది నతనికి
    మండు టెండలో గురిసెను మంచుజల్లు
    28-05-2017:
    ఒక్కగానొక్క కొమరుడు యొరవు జాఱి
    తల్లిదండ్రుల నెగ్గించి తక్కి నపుడు
    వారి నాదరించెడి సుత పాటి నెంచి
    అమ్మయె నమస్కరించిన దాత్మ సుతకు

    రిప్లయితొలగించండి
  10. రక్ష నీవని త లచియు రామ ! నేను
    జేరి యుంటిని నేకాంత సేవ కొఱకు
    సుందర మగు వదనమును జూడగానె
    నిక్క బొడిచెను రోమముల్ నిక్క ముగను
    నారి కేళము నిత్తును నార గించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిచ్చెద నారగించు' అనండి.

      తొలగించండి
  11. భద్ర మగు వసుమ తీంద్రున
    కద్రి నిభ దృఢాంగకునకు నవని తనూజా
    భద్ర విదూరునకా కాం
    తద్రుణ భేదకు ఘనారి దర్ప లయునకున్

    [కాంతము = ఇనుము; ద్రుణము=విల్లు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమూ, అనన్యసామాన్యమూ, అత్యుత్తమమూ అయిన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న సవరణ
      .“ కాం / తద్రుణ భేదికి” యనిన బాగుండు ననుకుంటాను..

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారు అమోఘము ఒక్కసారి మమ్మల్ని ఏ సి గదిలోకి పంపినట్లు ఉంది మీ పూరణము కందములో ఎంత అందంగా చిత్రీకరించారు. ఉదయము నుంచి కష్టపడుతున్నాను అన్యార్ధములో పద్యము వ్రాయటానికి. సీసము నిండితెగాని తేట తెల్లమవ్వలేదు.

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారికి కైమోడ్పులు.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      రెండూ సాధువులే అని నా అభిప్రాయం.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      భేదకుఁడు : భేదకున్ అంటే భేదకునకు బదులు భేదకుని అని అర్థమోస్తుందని యనుమానముతో “భేదికి” ని వాడాలనుకున్నాను సంశయావకాశము లేకుండా.

      తొలగించండి
  12. పాపమను యిందుకాంతను రూపడంచు
    పద్మనయనా! రిపు విదార! పద్మనాభ!
    శుభమగు వరదా! నినుఁ దల్చ శుద్ధభక్తి
    పావని తనువున వసించు పార్థివిపతి

    రిప్లయితొలగించండి
  13. అవనితనయ హృదయము దోచి ఆపదలను బాపు చుండెడి లలిత రామ,
    ధరణీ పతులకు కాంతాళము కలుగు చందము నేలిన దశరధ తనయా వి
    కస బింబ వాoఛిత కౌసల్య రామ, సుందర మగువదనము మరులు గొల్ప
    జనులెల్ల మోహించు జగదభి రామ, పద్మనయనా రిష్టఫల ప్రదాత
    దుష్ట రావణ సంహారా శిష్ట నరుల
    రక్షకా, తాటకాంతకా, రామ చంద్ర ,
    హనుమ పూజితా. సుమనసే, అక్షరాయ
    కాచుము నిలలో జనులను కరుణ చూపి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ కోసం మీరు పడిన శ్రమ స్పష్టంగా గోచరిస్తున్నది. చాలావరకు సఫలమయ్యారు. బాగుంది. అభినందనలు. 'పద్మనయనా రిష్ట ఫలప్రదాత' అన్నచోట గణదోషం. అందులోను అరిష్ట ఫలదాత అనడం సబబుగా లేదు. "పద్మనయన! యిష్టఫల ప్రదాత" అనండి. అలాగే "శిష్ట నర సు।రక్షకా..." అనండి.

      తొలగించండి
  14. చంద్ర కాంతరేకుల బోలు చక్షులుగల
    నీలమగు వన్నెతోనిల నివ్వటిల్లు
    నిండు నలినారి మోమున్న నేలరేడు
    అవనితనయ చిత్తేశునకంజలింతు!!!

    రిప్లయితొలగించండి
  15. చేరి యేకాంతముగ గుడి నారికేళ
    మవని తనయను బోలిన మహిళ యొకతె
    భక్తి పరమగువచనమే పాట గాగ
    రామునకు సమర్పించెను రాగ మలర

    రిప్లయితొలగించండి
  16. ఏకాంత యైన సీతాకాంత నెత్తుక
    ........చనిన రాక్షస కాంతు జంపినావు
    నారిని సంధించి నారిని బడగొట్టి
    .........యజనారిమూకల నణచినావు
    మగువ దుర్భరమగు వగ ధూళి బడి యుండ
    .........నిజమగు వపువున నిలిపినావు
    వనిత తా వలచి వచ్చిన వని తగ దని
    .........దండించినా వని తలతురు నిను

    మాయ నారిని దునుమాడి మఖము గాచి
    గౌతముని మగువకు రూపు బ్రీతి నిచ్చి
    యసుర వనితను శిక్షించి యసురు జంపి
    ప్రేమ గాంతను చేగొన్న రామ నతులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ శబ్దాలంకార చమత్కృతితో అత్యద్భుతమూ, అత్యుత్తమమూ అయి మనోరంజకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మిస్సన్న గారు పోతనామాత్యుని సీసము తలపింప చేసినది మీ పూరణ. యమకాలంకారముతో దత్తపదాలని పలుమారులు ప్రయోగించి శ్రవణానందము కలిగించారు. దత్తపద బంధనమున కెక్కువ యైనా రామ స్తోత్రమున కెన్ని సీసము లైనా తక్కువే! అభినందనలు.
      “యజనారిమూకల” నకు బదులు “యజనారిగణముల” అంటే బాగుంటుందేమో.

      తొలగించండి
    3. అంద మైనట్టి పూరణ కంద మందు
      పోచి రాజు వారల్లెను పోతన కవి
      ఘనత మిస్సన్న పొందెను, కనగ నేటి
      దత్తపది ముదమునిడె నా చిత్త మందు

      తొలగించండి
    4. సరస్వతీస్వరూపులు కామేశ్వరరావుగారూ మీరు ఏదైనా పద్యాన్ని మెచ్చుకొన్నారంటే పద్యకర్తకు పట్టాదక్కినట్లే.ధన్యవాదములు.మీసవరణ సముచితము.మీరన్నట్లు రామచంద్రుని నుతించడానికి ఆదిశేషునికేవశంకాదు.నాబోటు లెక్కడ?

      తొలగించండి
    5. పూసపాటి వారి పొగడిత పులకింత.

      తొలగించండి
  17. కాంతమువలె మనోజ్ఞమాకారమదియె
    నారి సవరింప రిపువులు నాశ మొంద
    నసువు లవిలీన మగు వచ్చి యాహవాన
    యవనితలమున రాముడె నట్లుచేయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యాహవమున। నవని... రాముడె యట్లు చేయు" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు.మీరు సూచించిన సవరణ చేశాక పద్యం మరల పంపుతున్నాను
      కాంతమువలె మనోజ్ఞమాకారమదియె
      నారి సవరింప రిపువులు నాశ మొంద
      నసువు లవిలీన మగు వచ్చి యాహవమున
      నవనితలమున రాముడె యట్లుచేయు

      తొలగించండి
    3. ధన్యవాదములు.మీరు సూచించిన సవరణ చేశాక పద్యం మరల పంపుతున్నాను
      కాంతమువలె మనోజ్ఞమాకారమదియె
      నారి సవరింప రిపువులు నాశ మొంద
      నసువు లవిలీన మగు వచ్చి యాహవమున
      నవనితలమున రాముడె యట్లుచేయు

      తొలగించండి
  18. గురువు గారికి నమస్కారములు మీరు సలహా ఇచ్చిన ప్రకారము " పద్మ నయన, యిష్ట ఫల ప్రదాత" అని సవరించిన " నారి " ప్రయోగము కుదరదు. అందువలన మరల పద్యము మార్చి వ్రాశాను పరిశీలించి సలహా ఇవ్వండి. మీకు శ్రమ కలుగ చేస్తున్నందుకు భాద పడుతున్నాను.

    అవని తనయ హృదయము దోచి ఆపదలను బాపు చుండెడి లలిత రామ,
    ధరణీ పతులకు కాంతాళము కలుగు చందము నేలిన దశరధ తనయా, వి
    కస బింబ వాoఛిత కౌసల్య రామ, సుందర మగు వదనము మరులు గొల్ప
    జనులెల్ల మోహించు జగదభి రామ, పద్మ నయనా, రిక్ధప్రదాత, పితృ
    వాక్య పరిపాలకా, దశ వదన దర్ప
    భంగ, తాటక సంహార, భద్ర శైల
    వాస, మారుతి పూజితా, వరము లిచ్చి
    కాచగ వలయు మమ్ములన్ కరుణ తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      నిజమే! సవరణను సూచించే సమయంలో దత్తపదచ్యుతి జరిగిందన్నది గమనించలేదు. మన్నించండి.
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. అంద మైనట్టి పూరణ కంద మందు
    పోచి రాజు వారల్లెను పోతన కవి
    ఘనత మిస్సన్న పొందెను, కనగ నేటి
    దత్తపది ముదమునిడె నా చిత్త మందు

    రిప్లయితొలగించండి
  20. వని,తపసుల యజ్ఞము గా
    చెను,ఏకాంతమున,సీత సేవల నందెన్
    ఘనమగు,వనచరుల సహ్య
    మ్మున మదనారి భక్తు మూయించె ననిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గాచెను ఏకాంతము..' అని విసంధిగా వ్రాశారు. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనమగు వరమ్ము లెంచుచు
    ననయము యవని తనయ పతి నారఘు రాము
    న్ననువున నేకాంతమ్ముగ
    తను నా మదనారి కాప్త దాసుని గొల్తున్

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    రాముఁ డేకాంతముననుండ రమణ మీఱ
    సీత, "చిన్నారి జింకను శీఘ్రముగను
    పట్టి తేవ నీవె తగుదు!" వని తఱుమఁగఁ,
    "బడఁతి! యదియ నా పరమగు వనమున!"ననె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రామాయణార్థంలో కాదు, రామస్తుతి వ్రాయమన్నాను. మీరు గమనించినట్టు లేదు.

      తొలగించండి
  23. కాంతారమున్ వసించియు
    శాంతము ,మదనారి సేవ .సారస బుద్ధిన్
    సంతసమగు వచనములన్
    ధాంతుడవని తనయ ప్రేమ తప్పడు పుడమిన్

    రిప్లయితొలగించండి