24, మే 2017, బుధవారం

సమస్య - 2368 (నేరమగుఁ జేయ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము"
(లేదా...)
"ఘన దోషమ్మగుఁ గీ డొసంగు సతికిన్ గాత్యాయనీ పూజలే"

72 కామెంట్‌లు:

  1. మట్టి తోజేసి దేవిని పట్టు బట్టి
    మగువ లెల్లరు కాళింది మడుగు లోన...
    బట్ట లేలేక తడబడి నిట్టె మునగ...
    నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము

    https://m.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/photos/a.256156637767075.53293.176629199053153/1045094792206585/?type=3

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాకు తెలిసి దిసమొలతో స్నానం చేయడం కేవలం పురుషులకే నిషిద్ధం. స్తీలకు అలా స్నానం చేయరాదన్న నియమం లేదు.

      తొలగించండి
    2. నాకేదీ తెలియదు సార్!

      "కాత్యాయనీ వ్రతం" అని గూగుల్ లో వెదికితే ప్రప్రధమంగా ఈ సైటు దొరికినది. చాగంటి కోటేశ్వర రావు గారి పేరు వినినదే అయినందున సరి అనుకొన్నాను.

      మీ ఓర్పుకు నమస్సులు!!!

      తొలగించండి
    3. ఇటీవల ఏ పదం కోసం గూగుల్ లో వెదకినా శంకరాభరణం గత సంచికల లోనిది ఏదో ఒకటి ప్రత్యక్షం అవుతోంది. మొన్న నొకసారి గతం లోని నా పూరణయే నాకు సాక్షాత్కరించినది. అంతలో ఉన్నది నా తెలుగు భాషా ప్రావీణ్యత!!!

      తొలగించండి

    4. ఈ కథ శంకరాభరణం కంది శంకరయ్య గారిదే నా ?

      http://patrika.kinige.com/wp-content/uploads/2014/08/Yaabhai-Paisala-Kosam.pdf

      జిలేబి

      తొలగించండి
    5. జిలేబీ గారూ,
      అవునండీ... అది నాదే... కాని అది అనువాదం మాత్రమే. నా స్వంతకథ క్రింది లింకులో చూడండి...
      http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/dattata---kandi-sankarayya

      తొలగించండి

    6. వామ్మో ! కంది వారు మీరు ఉస్తాదులే !

      రెండు కథలు బాగున్నాయి.

      అనువాద కథైతే అనువాదమని చెబ్తే కాని తెలియనంత గా బాగా యిమిడింది !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    7. ధన్యవాదాలండీ.... అయితే వచన రచనలకు నేను పనికివస్తానంటారు!

      తొలగించండి

    8. కంది వారు

      కొప్పున్నావిడకి యేదన్నా చందమే !

      శయ్యాసౌభాగ్యములు గల మీరు యేది రాసినా చందమే చందం :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    9. ...
      వ్రత నిష్ఠలై యుండి వలువలు గట్టక నీరు సొత్తురె మీరు నియతి దప్పి ?
      కాత్యాయనీ దేవిఁ గల్ల సేయుట గాక యీ రీతి నోము వారెందు గలరు?
      .... భాగ. 10. పూర్వ. 841

      తొలగించండి
  2. వనిత మానము భంగింప పతితుడంత,
    చచ్చు నురిశిక్షను తలారి శ్రద్ధనమలు,
    పడుచు పిల్లలు చేతురు భర్త కొఱకు,
    "నేరమగుఁ, జేయఁ, గాత్యాయనీ వ్రతమ్ము"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుభ్రహ్మణ్య శర్మ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. నోములును పూజలెందుకు భామినులకు
    పతిని పూజింప నిత్య సౌభాగ్యమబ్బు--
    తగదు తగదని మెట్ట వేదాంతిఁబలుక
    నేరమగుఁజేయ కాత్యాయనీ వ్రతమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మెట్ట వేదాంతి పలికె" అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
  4. నల్ల ధనము కలిగియున్న నరుల కేమి
    యగును, కన్నియలు ఇలలో మగని పొంద
    తలపు కల్గిన ఎవ్వారి దయను కోరు
    నేరమగు, జేయ గాత్యాయనీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      ప్రశ్నోత్తరిగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కన్నియలు+ఇలలో' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కన్నియ లిలలోన" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు తప్పులు సరి చేసుకుంటాను గురుదేవా

      తొలగించండి


  5. పనిలేకన్ తమ యింట సీరియలులన్ పారాయణమ్ముల్ వలెన్
    గనుచున్ తీవ్రము గా మనస్సు చెదరన్, కావేషముల్ పైబడన్
    ఘన నేరమ్మగుఁ గీ డొసంగు; సతికిన్ గాత్యాయనీ పూజలే
    వినవే భామ జిలేబి మేలయినదౌ ! వీగారులన్ వీడవే !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. సీరియలుల గనన్నట చిత్ర మెల్ల
    మానసమ్మును చెట్టగ మంకిపట్టు
    నేరమగుఁ, జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము
    మేలగు జిలేబి విడువమ్మ మేరమీఱ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా}.పిట్టా
    ఘాటు స్త్రీవాద మొకవైపు గనగ బ్రగతి
    పాలనా నిర్వహణ శాస్త్ర ప్రభలు వలయ
    శుద్ధ సాంకేతికపు విద్య సుగతి నివ్వ
    నేరమగుజేయ గాత్యాయినీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    వినయంబెక్కడ వేపుకొంచు దినుటే విణ్ణాని యే?పూరుషుం
    గన; నాయంతటి వాడె పో, యను ధృతిన్ గాణాచి సంఘాలనే
    మనగా,కోర్టు కితాబులివ్వ తనకున్ "మా" దేవి తానే యిటన్
    ఘన నేరమ్మగు గీడొసంగు సతికిన్ గాత్యాయినీ పూజలే?!

    రిప్లయితొలగించండి
  9. పతికి నెదురాడి నిత్యమ్ము చతుర ననుచు
    విర్రవీగుచు దిరుగుచు వినయ మింత
    దాల్చ కుండగ నుండెడి తన్వి యిలను
    నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. అంగరంగ వైభవముగా నంగనలట
    పూలు నైవేద్యములఁ బ్రీతి పొందు పరచి
    పిదప భర్త యాశీర్వాద విధము లేక
    నేరమగు జేయ గాత్యాయినీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  11. వలువలను వీడి నీటిలో జలకమాడి
    యొప్పు సంకల్పమెక్కింత చెప్పకుండ
    మొక్కు బడి తంతుగా నొక మూల జేరి
    నేరమగు జేయ కాత్యాయనీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  12. మనసు నందున నిష్ఠయె మరుగు పడగ
    భక్తి,నియమము లేనట్టి వ్రతము సల్ప
    నేరమగు,జేయ కాత్యాయనీ వ్రతమ్ము
    నీతిగాతల్లి దీవించు రీతి నెపుడు

    రిప్లయితొలగించండి
  13. విహిత సంస్కార ములకును విలువనీక
    తనకు సహజీవ నమ్మిక తప్పు గాక
    పొలతి తిరుగుచు, ఘనముగ పూనుకొనుచు
    నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
  14. _కనగాపూజలు,భక్తిలేకమది,సౌఖ్యక్షేమ కాంక్షారతిన్_
    _ఘనమున్ కోరుచుసల్పగా ధరణిభాగ్యంబుల్నసాధ్యమ్మ గున్_
    _ఘననేరమ్మగు,కీడొసగు,సతికిన్ కాత్యాయనీ పూజలే_
    _మనమున్ నిష్ఠగ జేయగా ఫలిత మౌమాంగల్య సౌభాగ్యముల్_

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈనాటి సమస్య వృత్త పాదంలో 'ఘననేరము' అనడం దుష్టసమాసం. దానిని "ఘనదోషమ్మగు..." అని సవరిస్తున్నాను. ఈ దోషాన్ని నా దృష్టికి తెచ్చిన మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  16. మునుతానెంతయు భక్తితో మగనికిన్ మోక్షమ్ము చేకూరగన్
    వనితారత్నము దైత్యకాంత గిరిజన్ వైళమ్మె పూజింపగా
    కనిదైత్యుండతి క్రోధమొంది సెగలన్ కన్నుల్ రాల్చగా నిట్లనెన్
    ఘన నేరమ్మగు గీడొసంగు సతికిన్ కాత్యయనీ పూజలో
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో 'కన్నుల్ రాల్చగా' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. చక్కని విషయమ్ము తెలిసె నిక్కముగను
      మూడు కోట్ల సురలు సతీ మూర్తు లనుచు
      సకల దేవతారాధన సమము, మేము
      నేర, మగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము

      [నేరము+అగు =నేరమగు; నేరము = ఎఱుఁగము]


      ఘన దోషమ్మగుఁ గీ డొసంగు సతికిం గాత్యాయనీ పూజలే
      మన మందింపుగ భక్తి నుంచి, యిక సంభారమ్ము లే మాత్రముం
      గన లేకున్నను, జేయకున్న నట కాంక్షాహీన చిత్తంబునం
      దనరున్సంపద లెల్ల కొల్లలుగఁ దత్కారుణ్య మేపారగన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  18. ఇడుమ లెన్నియొ కలిగిన నెంతొ భక్తి
    దేవతల నిష్ట భజియింప తీరిపోవు
    బాధలన్నియు శంకించిపారిపోవ
    నెరమగు జేయ గాత్యయనీ వ్రతమ్ము
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. దైవదూషణఁ జేయుట తప్పకుండ
    నేరమగు, జేయ గాత్యాయినీ వ్రతమ్ము
    నిష్ఠ,నాడువారికి నింట నిశ్చయముగ
    మంచిజరుగున టంచంద్రు మాన్యజనులు

    రిప్లయితొలగించండి
  20. మన వేల్పున్ నగరాజపుత్రి ననఘన్ మాతన్ సదా నిష్ఠతో
    మన మందెంచిన మెచ్చి యిచ్చు కరుణన్ మాంగల్యముల్ నిత్యమున్
    దినుచుం ద్రావుచు నిద్రపోవుచును బాతిన్ వీడి యర్చించినన్
    ఘన నేరమ్మగు గీడొసంగు సతికిన్ గాత్యాయినీ పూజలే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      వేల్పు పుంలింగమని, వేల్పుటాలు స్త్రీలింగమని అనుకుంటున్నాను. "మన దేవిన్ నగరాజ..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువుగారూ సవరణకు ధన్యవాదాలు.అయితే నిఘంటువులో వేలుపుఅంటే దేవత, దేవతాస్త్రీ అనికూడ అర్థాలు కనుపిస్తున్నాయండీ.

      తొలగించండి
    3. నిజమే... మీరు చెప్పాక నేను పరిశీలించాను. అంటే వేల్పు శబ్దం మహదమహద్వాచక మన్నమాట! బాగుంది. ధన్యవాదాలు!

      తొలగించండి
  21. నిన్న సాయంత్రం మా ఇంటి దగ్గరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పూజారి 'శ్రీ కాత్యాయనీ వ్రతం' అన్న పుస్తకం తెచ్చి వాళ్ళ అమ్మాయితో ఆ వ్రతం చేయిస్తున్నానని, అందులోని శ్లోకాలలో, అష్టోత్తర శత నామాల్లో ఏమైనా అచ్చు తప్పులుంటే సవరించమని ఇచ్చారు. రాత్రి కొత్త సమస్యను షెడ్యూల్ చేస్తూ ఏ సమస్య ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా ఆ పుస్తకం కనిపించింది. వెంటనే సమస్య సిద్ధమయింది...

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మదిని చాంచల్య మొందుచు మట్టు లేక
    తీరు తెన్నులు సడలిన దారిలోన
    భగవతి నతివలు గొలుచు పధ్ధతదియ
    నేరమగు జేయు గాత్యాయనీ వ్రతమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్ధతి+అదియ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "పద్ధతి యది" అనండి.

      తొలగించండి
  23. కన్నార తా రాల్పుచున్ మన్నించండి గమనించలేదు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  24. విను నామాటలు! యంబపై మనసులో విశ్వాసమే లేనిచో
    ఘన దోషమ్మగుఁ గీడొసంగు సతికిన్, గాత్యాయినీ పూజలే
    మనసంసారము కోసమై సలిపినన్ మాతంగి రక్షించెడిన్
    ధన సౌభాగ్యములిచ్చుచున్, నిరతమా తల్లిన్ ధృతిన్ గొల్చుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మాటల నంబపై..." అనండి. 'మాటలు+అంబ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి



  25. తే.గీ:వ్రతనియమములెరుగకుండ పడతులెల్ల

           నాచరించుట సరికాదు నవనియందు

           నేరమగు చేయగా గాత్యాయనీ వ్రతమ్ము.

           నెరిగి చేసిన ఫలితమ్ము లిపుడె దక్కు.


    తే.గీ:చేలములు లేక తానము చేయుచుండ

          సత్ఫలితము దక్కగబోదు జగతియందు

          నంతి యేగాదు గనుడిటు  నతివలార

          నేరమగు చేయగా కాత్యాయనీ వ్రతమ్ము.


    తే.గీ:వ్రతము చేయగ నెంచుచు వనిత లెల్ల

           చేరి ముదమున కాళింది చెంత కోక

          లెల్ల వీడిజలకమాడ  నిలను నిదియు

            నేరమగుచేయ గాత్యాయనీ వ్రతమ్ము.

    రిప్లయితొలగించండి
  26. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *వృద్ధులునుపిల్లలాకలైవీడనుసురు*
    *లేదొవ్రతమంచువంటలనిట్టులాపి*
    *పుణ్యమందగపంతంబుపూన తగదు*
    *నేరమగుజేయ కాత్యాయినీ! వ్రతమ్ము*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    గయ్యాలి భార్య కాత్యాయనిని భర్త మందలించు సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      సంబోధనతో మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  27. కోర జూచుట పరసతిన్ ఘోరమైన
    నేరమగు; జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము
    చేరగల్గును సతియయి జీవితమున
    వరముగ కపర్ది సమునకు ; భాగ్యమనగ

    రిప్లయితొలగించండి
  28. చిత్తచాంచల్య మదియేను జిత్తుజేయ
    భక్తి భావమ్ము యెదలోన రిక్త మవగ
    నేరమగుఁ జేయఁగాత్యాయనీ వ్రతమ్ము
    నారి లోకమ్ము భువిలోన నటన తోడ

    2.ఒక భార్యతో భర్త..
    పనిలేదంచును నింటిలోన నెపుడున్ పబ్బంచు క్లబ్బంచు.. నా
    ధనమున్ నీరుగ ఖర్చుజేయుటది విధ్వంసంబుగా నెంచదన్
    ఘనదోషమ్మగు గీడొసంగు సతికిన్!!కాత్యాయనీ పూజలే
    యొనరించంగను లే గదమ్మ సఖి!నీ యుల్లంబు దీపింపగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "చాంచల్య మది కదా చిత్తు జేయు... భావమ్ము మదిలోన (భావమ్ము+ఎద = భావ మ్మెద... యడాగమం రాదు)... రిక్తమైన (అవగ సాధువు కాదు) అనండి.

      తొలగించండి
  29. గురువుగారు ధన్యవాదాలు సవరణతో..
    చిత్తచాంచల్య మదికదా చిత్తు జేయు
    భక్తి భావమ్ము మదిలోన రిక్త మైన
    నేరమగుఁ జేయఁగాత్యాయనీ వ్రతమ్ము
    నారి లోకమ్ము భువిలోన నటన తోడ

    రిప్లయితొలగించండి
  30. గురువుగారు ధన్యవాదాలు సవరణతో..
    చిత్తచాంచల్య మదికదా చిత్తు జేయు
    భక్తి భావమ్ము మదిలోన రిక్త మైన
    నేరమగుఁ జేయఁగాత్యాయనీ వ్రతమ్ము
    నారి లోకమ్ము భువిలోన నటన తోడ

    రిప్లయితొలగించండి
  31. భర్తపై భార్య మౌనవ్రతం:

    ధనము తగలేయ నన్నింటిఁ గొనెద వనఁగ
    తగవులాడుచు నాపైన తప్పులుంచి
    పలుకులాడక మౌనంపు టలకతోడ
    నేరమగుఁ జేయఁ గాత్యాయనీ! వ్రతమ్ము!!

    రిప్లయితొలగించండి
  32. For Men Only:👇

    మనమున్ బంగరు రాళ్ళ నెక్లెసులనున్ మౌనమ్ముగా కోరుచున్
    తనువున్ మెండుగ సామజమ్ము వలెనన్ శ్లాఘ్యమ్ముగా పెంచుచున్
    వినకే నాథుని మాటలన్ విరివిగా వీక్షించుచున్ టీవినిన్
    ఘన దోషమ్మగుఁ గీ డొసంగు సతికిన్ గాత్యాయనీ పూజలే

    రిప్లయితొలగించండి