16, జులై 2018, సోమవారం

సమస్య - 2734

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్"
(లేదా...)
"వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్"

81 కామెంట్‌లు:

  1. అల ద్రౌపది హృదిలోనను
    చెలరేగగ నగ్ని శిఖలు శ్రీకారముగా
    ఇల భారత మొదవెనుగద...
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా, మీ సమస్యాపూరణకందపద్యభావము నాకు అర్థము కాలేదు. దయ చేసి వివరించ ప్రార్థన.

      తొలగించండి
    3. మహాభారత(యుద్ధ)మను వటవృక్షమునకు ద్రౌపదిని కించ పరచుటయే మూలమని...

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    శిలలను చెక్కి శిల్పముల శిల్పులు నిల్పగ దేవళమ్మునన్
    ఫలములఁ దెచ్చి , వాయసము వ్రాలి భుజించెను , విత్తనమ్ములున్
    శిలలఁ బడంగ వాన కురిసెన్ , తడి తాకగ నంకురింపగా ,
    వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సలలితరామకావ్యకవిచంద్రునికిన్ విపులార్థభావసం..
      కలితపురాణవాగృషికి , కావ్యరసజ్ఞులకెల్ల నీడయై
      యలరుచునాశ్రయమ్మన మహాకవికోటికి , భారతాంబ యన్
      వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. మైలవరపువారి రెండవ పూరణ మహాద్భుతమ్ముగా నున్నది!!🙏🙏🙏🙏

      తొలగించండి
    4. ద్రౌపది...

      లలనల మానసమ్ము మృదులమ్ము , శిలాసదృశమ్మునౌ , సభన్
      వలువలనూడ్వ దుర్మతులు నాటుకొనెన్ మదిలో
      పరాభవో...
      జ్జ్వలితవిషాంకురమ్ములవి , బాష్పజలమ్ముల సేచనమ్మునన్
      వెలది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. ఈ భావం మొదటగా కలిగించినది శ్రీ ప్రభాకరశాస్త్రి గారు... వారి తొలి కందం... ఈ అభినందనలలో సగం వారి ఖాతాలోనికే... నమోనమః 🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    6. వాగృషి -- .భలే పదం వేశారు సార్...

      తొలగించండి
  3. పలుకులురాని మృగయునకు
    కలహప్రియు బోధనమున కలుగగ మతి తా
    ను లిఖించెను కృతి, పలుకుల
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. కిలకిలమని నగె కృష్ణుడు ;
    విలవిలమని పూతన పడి వీడెను నసువుల్ ;
    పొలతుక నేలను బూడ్వగ
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్ .

    రిప్లయితొలగించండి
  5. సంతాన లక్ష్మిగా మాయత్త శుభము కలుగు
    ఆమె ఊసెత్త
    డజను సంతానముగ గుత్త పిల్లలకై కుట్టెను
    కుల్లలు మెత్త
    పిల్లల కోడిగ పదిలమె ఆరోగ్య మాశ్చర్య
    కరంబుగన్
    వెలది యురమ్ము నందు వటవృక్షము మొల్చె
    మహాధ్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
  6. ఖలురట నిండు సభలో
    వలువల నూడ్చి యవమాన పరచిన వేళన్
    జ్వలియించిన క్రోధాగ్నులె
    వెలది యురమ్మన నొక వట వృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "ఖలు రచట నిండు సభలో" అనండి.

      తొలగించండి
  7. కలియుగ వింతలు వినగను
    కలకల ములురేపు నంట కల్లలె యైన
    న్నుల్లము జల్లను వార్తలు
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
  8. లలనహృదంబుజంబున హలాహల ముండగ, నోష్ఠమందునన్
    తలచ సుధాస్రవమ్ము కలుదం చనె నొక్క కవీంద్రుడ ట్లుగన్
    వెలయగ వంశవృక్షములు, వేరులు స్తన్య మొసంగుఁ జన్నులై
    వెలది యురమ్ము నందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల దంచనె' టైపాటు?

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2734
    సమస్య :: *వెలది యురమ్ము నందు వట వృక్షము మొల్చె మహాద్భుతమ్ముగన్.*
    సందర్భం :: ఒక శిల్పి త్వర త్వరగా ఒక సుందరి విగ్రహాన్ని చెక్కినాడు. మనోహరంగా ఉన్న ఆ స్త్రీ అందాన్ని చూస్తూ తనలో తాను మురిసిపోతూ ఉండగా ఆ బొమ్మ యొక్క వక్షస్థలము దగ్గర సన్ననైన పగుళ్లు కనిపించాయి. వెంటనే ఆ శిల్పి ఆ విగ్రహాన్ని అవతల పడవేశాడు. కాలక్రమంలో కొన్ని వర్షాలకు {కొన్ని సంవత్సరాలకు} తరువాత చూడగా, విగ్రహంగా ఉన్న ఆ యువతి వక్షస్థలంలో అద్భుతంగా ఒక మఱ్ఱి చెట్టు మొలిచి ఉన్నది అని తెలియజెప్పే సందర్భం.

    మలచెను శిల్పి వేగముగ మానిని విగ్రహమున్, మనోజ్ఞతన్
    తలచుచు వక్ష మందు గన, దానికి సన్న పగుళ్లు దోప నా
    వల బడవైచె , కాలగతి వర్షము లేగిన యంత జూడ నా
    *వెలది యురమ్ము నందు వట వృక్షము మొల్చె మహాద్భుతమ్ముగన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (16-7-2018)

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా సత్యనారాయణ
    చలి గన పాపడు నాటల
    వలపున బ్రియ భర్త నొసలు పలు మిషలందున్
    చలమున మోపరె నిండగు
    వెలది యురమ్మున నొకవటవృక్షము వెలసెన్

    రిప్లయితొలగించండి
  11. కలి యుగ ధర్మం బ న గా
    పలు వింత లు పుట్టు చుండె వసుధా స్థలి లో
    కల కాదిది నిజ మ రె రే
    వెలది యు రమ్ము న నొకవట వృక్ష ము మొల్చేన్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    తలకును వ్రేళ్ళు క్రిందుగను తావలమైనవి శాఖ లిచ్చటే (ఊర్ధ్వమూల మధఃశాఖమ్....)
    వలపులు రేగు నాభి యొక వాయనమైనది పుట్టి చచ్చుటల్
    కలకలముల్ననశాంతులను గడ్పెటి జన్మములాయె జీవికిన్
    వెలది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్!
    (....అధశ్చ మూలా న్యను సంతతాని॥ కర్మాను బంధీని మనుష్యలోకే...గీతా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలకలముల్ + అశాంతులు = కలకలము లశాంతులు' అవుతుంది.

      తొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    శత్రువైనను చూతము సరళగతిని
    "మేకినిండియ"యనిబిల్చి మేయుమనగ
    మిత్రుడగునను యాశయే మిగులునేమొ?
    మూషికంబొండు పిల్లిని ముద్దులాడె

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    పోషణ లేదె యో,కొరియ! బుద్ధులుబోవె గతంబు దల్వవే
    ఈషణ వీడదుగ్రమును యీర్ష్యల,నగ్రమునౌ నమేరికా
    రోషము మాని ట్రంపనెడు రూక్ష్ణపు యానన మిడ్వకుంటివే
    మూషిక మొండు పిల్లిగని ముద్దులొసంగెను ప్రేమ తోడుతన్

    రిప్లయితొలగించండి


  15. అలలన్ ముద్దా డ పరుగు
    న లహరిగన్మార నలకనందగ మొదలై
    పలుదెసల బోవగ కడలి
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. భూసారపు నర్సయ్య గారి పూరణ....

    తలక్రిందుగఁ బ్రకృతి యనెడు
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొలిచెన్
    కలవంటి దనిరి బుధు లిలఁ
    దలఁపఁగ దృఢమైనఁ జాలు తగులము లుడుగున్.

    రిప్లయితొలగించండి
  17. కులమును బెంచగ లలనయె
    తులతూగు పయో ధరముల ద్రుహిణుని సృష్టిన్
    వెలగట్ట లేని విధమున
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొలిచెన్!

    రిప్లయితొలగించండి
  18. దేవిక :



    ఇల శోకమ్మెందులకని
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్
    కలగొని ఎరుకను బొందెన్
    పలుకమి రాహులుడె బుద్ధ భగవానుండై !

    రిప్లయితొలగించండి
  19. బలమగుకంతులువేయగ
    పలువురుగనిబాధపడిరిపరిపరివిధముల్
    ఖలుడొకడపుడిట్లనియెను
    వెలదియురమ్ముననొకవటవృక్షముమొలిచెన్

    రిప్లయితొలగించండి
  20. ఉలితో శిల్పులు చెక్కగ
    వెలసిన విగ్రహములందు పెద్దశి లపయిన్
    మలచబ డినట్టి బొమ్మగు
    వెలది యురమ్మున నొక
    వటవృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
  21. జలజల రాలుచు నభము వ
    దలుచు జటాజూటు శిరము దవిలి కులుకునన్
    వెలయ జటాలమనఁ గడలి
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    [కడలి వెలఁది = మిన్నేఱు; జటాలము = జడలు గలది, మఱ్ఱిచెట్టు]


    వలచిన వాఁడు మాధవుఁడు పన్నుగఁ దాల్చిన వాఁడు శేషుఁడుం
    గొలిచిన వారు భూజనులు కూర్మి నొసంగఁగ నెల్ల వారికిన్
    గలగల వానవచ్చిన ముఖమ్ము వెలుంగ మఱింత భూమి యన్
    వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  22. పలువురు విస్మయమొందగ
    పలువేల్పులరూపములను ప్రత్యక్షముగన్
    నిలుపుచు పొలుపుగ, ధరయను
    వెలది యురమ్మున నొకవటవృక్షము మొల్చెన్!!!


    రిప్లయితొలగించండి
  23. కలసి మెలంగు పద్ధతి నఖండ సమున్నత జాతికిచ్చుచున్
    వెలయగ నార్షధర్మపు పవిత్రత దెల్పెడు నైతిహాస్యముల్
    విలువల బేర్చుచున్ సకల వేళల
    నిల్చుచు భారతాఖ్యయౌ
    వెలది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్!

    రామాయణ, భారత, భాగవతాది ఐతిహ్యములే హైందవ ధర్మానికి చల్లని నీడనిచ్చే రక్షక కవచముల వంటి వటవృక్షాలు! ఆర్షధర్మము కాల పరిమితి లేనిది! సనాతము!

    రిప్లయితొలగించండి
  24. కలయదివచ్చెనాకిపుడకాంచితినేనొకవింతయందునన్
    వెలదియురమ్మునందువటవృక్షముమొల్చెమహాధ్భుతంబుగన్
    నలినదళాయతాక్షిగనునాతినిజూడగనాకుదోచెడిన్
    గలయదిగానెఱింగితినిగంటినిరెంటినిమూసికొంటినే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కన్నుల రెంటిని' అనండి. పదాలమధ్య వ్యవధానం ఉంచండి.

      తొలగించండి
  25. ఆటవిడుపు సరదా పూరణ:
    ("మమతా బెనర్జీ...కలకత్తా కాళి")

    విలవిలవోవ కాంగ్రెసహ! వీధుల వాడల వంగభూమిలో
    మిలమిలలాడు కంఠమున మ్రింగుచు మెక్కుచు కమ్యునిస్టులన్
    నిలకడలేని రాష్ట్రమున నిల్వగ నీరజనేత్ర చక్కనౌ
    వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్

    వటవృక్షము = తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    వెలఁది యురమ్మున నొక
    వటవృక్షము మొల్చెన్

    సందర్భము: సులభము
    మైదాకు=గోరింటాకు రోవెలది=వేశ్య
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అల చెంపలు చేతు లుర
    స్థలమును మైదాకు చిత్ర చయమున నందా
    లొలికెన్.. బరికింపగ రో
    వెలఁది యురమ్మున నొక
    వటవృక్షము మొల్చెన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    16.7.18

    రిప్లయితొలగించండి

  27. SeethaDevi Gurramజులై 16, 2018 4:57 PM
    జిలుగు వెలుంగుల పచ్చని
    కులవృక్షము వలెను దోచు కూడిక గలదౌ
    వలువ ధరించగ దోచెను
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొలచెన్

    ఇప్పటి టీ షర్టులపై చెట్టు డిజైన్

    తొలగించు

    రిప్లయితొలగించండి


  28. కలగాంచితివో ? మత్తున
    వెలదుల సయ్యాటల బలుపెక్కితివో ! నీ
    పలుకుల యెరువులతో యే
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొలచెన్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ అధిక్షేపాత్మకమైన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. కలమున గీసిన చిత్రము
    వెలదియురమ్ముననొక వట వృక్షముమొల్చెన్
    "ఇలగలకాంతకు కష్టము
    దలచియు యూహించివేసె దర్పణమువలెన్"

    రిప్లయితొలగించండి
  30. కలుగగ ననుమానము తన
    చెలికాని పయిన నొకింత చీత్కారముతో
    నలుక వహింపగ నప్పుడు
    వెలది యురమ్మున నొక వట వృక్షమము మొలిచెన్
    ***)()(***
    (అనుమానమొక పెను వృక్షమై వక్షమున మొలిచింది.)

    రిప్లయితొలగించండి


  31. విలువలు తెలియని ఖలుడట
    వలువల నీడ్వంగ వేడె వసుదేవసుతున్
    వలువలపారము లయ్యెను
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్.

    పాలిడ వచ్చిన రక్కసి
    పాలను గ్రోలుచు మురారి బాలుండయ్యున్
    లీలగ నసువులు గ్రోలగ
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్.

    రిప్లయితొలగించండి
  32. నా ప్రయత్నం పరిశీలించ పెద్దలందరకూ నా విన్నపం

    కందం
    తెలివిన్ విశ్వద భ్రమలన్
    దొలగించఁగ నీతి శతక తోటన్ వేమా
    ర్యులు నాట ఆట పూరపు
    వెలది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    చంపకమాల
    తెలివిగ వేమనార్యునకుఁ దెల్పగ విశ్వద రోసె మోహమున్
    దొలఁగుచు వారివౌ భ్రమలు ద్యోతక మాయెను వేద సారముల్
    యిలనొక నీతిదౌ శతక మేర్పడ జెప్పగ నాట పూర్వపున్
    వెలది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్



    రిప్లయితొలగించండి
  33. లలనామణి విగ్రహమది
    అలగోపురమందుపైన నలరారుగదా
    కలకాలమటుల నిలువగ
    వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

    రిప్లయితొలగించండి
  34. ** చాలా ఆలోచించిన మీదట,, ధూర్జటి ప్రేరణతో **

    తెలివిడి వేగిఁ పెల్లెగసి తెల్లనిగొంతుకవాని పూజకున్
    కొలదిగ మార్గమందకను కోమలి చన్నును భక్తితోడుగన్
    కొలిచిన పద్ధతిన్ తలపఁ కూర్పగ వచ్చును పద్యపాదమున్
    వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్

    ***

    నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
    చన్నో కుoచమొ మేకపె౦టికయొనీచందంబెఱి౦గించి నా
    కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే
    చిన్నీరేజవిహారమత్త మధుపా! శ్రీ కాళహస్తీశ్వరా !


    రిప్లయితొలగించండి
  35. పలువురు భామ లొల్లుచును పండుగ జేయగ బోనలందునన్
    సులువుగ పారిపోవుచును సుందరి యొక్కతి బాయిఫ్రెండుతో
    కులుకుచు భాగ్యనగ్రమున గుట్టుగ దాల్చగ పచ్చనొక్కటిన్
    వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్

    పచ్చ = tattoo

    రిప్లయితొలగించండి