27, జులై 2018, శుక్రవారం

సమస్య - 2744 (భార్యనుఁ గని...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై"
(లేదా...)
"భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్"

80 కామెంట్‌లు: 1. సూర్యా రావు గృహస్థుడు
  భార్యనుఁ గని మనసుపడెను, పరభామినిపై
  వర్యపు గౌరవముకలిగి
  నార్యుని వలెనడచుకొనెను నారాయణ! హా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలిగి + ఆర్యుని = కలిగి యార్యుని' అవుతుంది. దానివల్ల యతి తప్పుతుంది. చివరిపాదాన్ని "..యార్యునివలె నడచుకొనె నహా దైవమ్మా" అందామా?

   తొలగించండి

  2. కంది వారికి నెనరులు

   జిలేబి

   తొలగించండి
 2. కార్యము లోనందముగా
  భార్యనుఁ గని మనసుపడెను; పరభామినిపై
  సూర్యుని పై నొట్టుగనుచు
  నార్యుడు కన్నెత్తడుగద హాయిగ నెపుడున్ :)

  రిప్లయితొలగించండి

 3. Disclaimer
  ఈపూరణలో మీకు నారాయణ! కనిపించినా అనిపించినా జిలేబి పూచీ యే మీ లేదు - :)


  సూర్యకుమారు డాతడయ ,సుందరి భర్త!నిదర్శనం బిదే!
  వర్యపు గౌరవమ్మగును? పారవ బోవదు తప్పుగా సుమీ?
  పర్యటనాస్థలిన్ నదము పారము లెల్లగనంగ భార్యపై?
  భార్యనుఁ జూచినంతఁ ;బరభామినిపై; మనసాయె భర్తకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పెద్దల బలవంతాన కురూపిని పెండ్లాడి ఆమెను ఇష్టపడక పరకాంతా వ్యామోహంలో చిక్కినా డొకడు.....

  ఆర్యవిహిత ధర్మం బని
  వార్య మని కురూపిఁ దా న్వివాహం బాడెన్
  క్రౌర్యఁపుఁ జూపులతోఁ దన
  భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై.

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  శచీదేవి... ఆక్రందన..

  ధైర్యము గల్గునేమొ పరదారల గాంచిన ., విస్మరించి తా
  నార్యుడ నిర్జరాధిపుడనన్న పదమ్ము , మదమ్మునేగి , గాం...
  భీర్యము జూపి . శాపమున వేయికనుల్ గొనె , గౌతమర్షిరా.....
  డ్భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 6. ఆర్యుడు జిలేబి పెనిమిటి?
  వర్యపు గౌరవ మతనికి పరిపరి విధముల్
  మర్యాదస్థుడు గనుకన్?
  భార్యనుఁ గని మనసుపడెను; పరభామినిపై!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. ఆర్యుల సంస్కృతి మన దని
  భార్య ను గని మనసు పడె ను ; పర భామిని పై
  మర్యాద భావ ము గలిగి
  తూర్యమె సోదరి గ నెంచె తోరపు భక్తి న్

  రిప్లయితొలగించండి
 8. ఆమె ఈమెగ ఈమె ఆమెగ తులనాత్మకత
  శృంగారమున
  అతను ఇతనిగ ఇతను అతనిగ ఫాంటసీ
  మెరుపు నయగారమున
  కొత్తవి కథలల్లక పోతె పుట్టునా తేజము
  ఏ రీతిగన్
  భార్యను జూచినంత బర భామినిపై
  మనసాయె భర్తకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. రమేశా వారి భావనకు


   ఆర్యుడు పరాయి వాడై
   భార్య ననుపుకత్తె యైన ఫాంటసి కథలన్
   పర్యాటక కేంద్రంబుగ
   భార్య ను గని మనసు పడెను పర భామిని పై !


   జిలేబి

   తొలగించండి
 9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2744
  సమస్య :: భార్యనుఁ జూచినంతఁ పరభామినిపై మనసాయె భర్తకున్.
  సందర్భం ::
  కార్యేషు దాసీ కరణేషు మంత్రీ
  రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ ।
  భోజ్యేషు మాతా శయనేషు రంభా
  షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ।। అనే నీతి శ్లోకాన్ని అందరూ వినే ఉంటారు. ఐతే ఒక భర్త పైన చెప్పిన విధంగా తన భార్య మసలుకొనడం లేదని విచారిస్తూ స్వార్థపరుడై అధర్మపరుడై వ్యసనపరుడై దురాలోచన చేసే సందర్భం.

  కార్యము లందు దాసి, సరిగా కరణమ్ముల మంత్రి, లక్ష్మి సౌం
  దర్యము నందు, భూమి క్షమఁ, దల్లియు భోజనవేళ, రంభయౌ
  భార్య సుఖమ్ము నందు నని భావన జేయగ నట్లు లేని యా
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-7-2018)

  రిప్లయితొలగించండి
 10. (పాండురంగమాహాత్మ్యప్రబంధంలోని "తేనెపూసినకత్తి"నిగమశర్మగురించి)
  ఆర్యుడు యజ్ఞశర్మకును నంతటి సాధ్వికి సోమిదమ్మకున్
  ధైర్యము జారిపోవునటు త్యక్తసుధర్ముడు నక్షధూర్తుడున్
  స్థైర్యవిహీనుడా నిగమశర్మకు సుందరి సత్స్వభావయౌ
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్

  రిప్లయితొలగించండి
 11. ఆర్యుండొక్కడు కాగల
  భార్యనుఁ గని మనసుపడెను ; పరభామినిపై
  దుర్యుక్తుల బన్నడెపుడు
  కార్యార్థము ధర్మపథము కాదన డెపుడున్.
  ***)()(***
  కాగల = కాబోయే.
  (ఎందుకో మరీమారీ పద్యము జోగ్ జలపాత ధారల (Cascades)లో ఒకటైన 'రాకెట్'ధారలాగా ఆశువుగా దూసుకు వచ్చింది.ఎప్పుడో ఒకమారిలా జరుగుతుంటుంది)

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  థైర్యము లేని పతి యొకడు
  క్రౌర్యము జూపుచు నిరతము కవియుచు తనపై
  హర్యక్షము వలె నడరుపడు
  భార్యను గని మనసు పడెను పరభామినిపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు. పొరబాటును మీ సూచన మేర్ సవరించాను.

   క్రొవ్విడి వెంకట రాజారావు:

   థైర్యము లేని పతి యొకడు
   క్రౌర్యము జూపుచు నిరతము కవియుచు తనపై
   హర్యక్షము వలె నడరెడి
   భార్యను గని మనసు పడెను పరభామినిపై

   తొలగించండి
 13. ఒకనికి వివాహమై 10 వత్సరములు గడచినా సంతానము కలుగ లేదు అతనికి వేరు స్త్రీతో పెండిలి
  ప్రయత్నములు ఆతని జనకుడు చేయు చుండ ఇంటికి వచ్చిన చుట్టము యొకడు ఆ ప్రయత్నము వలదని చెప్పు సందర్భము


  సీసము
  అత్త మామలసేవ ననవరతము చేయు, నాడ పడచులకు నాదరణము
  నిడు చుండు, తల్లియై కడుపార బోజనమును బెట్టు చుండును, ముదము తోడ
  నిడుచుండెను సుఖము ,నేరము కాదుగా సంతు నొసగకున్న , సత్యమనుచు
  నలి (భార్యనుఁ గని మనసుపడెను, పరభామిని పై)న కలుగదు మునపు, మనువు
  బడసి పది వత్సరములాయె, కడుపు పండ
  లేదనెడు బెంగ తో మీరు లేమ నొకతె
  తెచ్చి వివహము చేసిన మెచ్చ బోడు
  సుతుడని తెలిపె నొకనికి చుట్ట్ట మొకడు


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   కందపాదాన్ని సీసపద్యంలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. స్ధైర్యముగలరాజేంద్రుడు
  భార్యనుగనిమనసుపడెను,బరభామినిపై
  చౌర్యపురాలనునిందను
  వర్యుడుగామోపరాదుపగగలిగినచో

  రిప్లయితొలగించండి
 15. కార్యాలయమున తనతో
  కార్యములను నిర్వహించు కలికి, తిరుమలా
  చార్యుని సన్నిహిత సఖుని
  భార్యను గని మనసుపడెను పరభామినిపై.

  రిప్లయితొలగించండి
 16. కార్యము రోజెరిగి మిథున
  కార్యమునకు చాలదని స్వకాంత, మగడు ని
  ర్వీర్యయయి గృహమున మసలు
  భార్యనుఁ గని, మనసుపడెను పరభామినిపై

  రిప్లయితొలగించండి


 17. మర్యాదను విడి రాముని
  భార్యను గని మనసు పడెను పరభామినిపై
  చౌర్యము చేయగ జచ్చెను
  నార్యావర్తమున నొక్క యసురవరుండున్.

  రిప్లయితొలగించండి
 18. సమస్య :-
  "భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై"

  సూర్యుని తేజము వెలిగెడు
  కార్యార్థికి పెండ్లి జేయ గయ్యాళిని తోన్
  మర్యాదివ్వక వాగెడు
  భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గయ్యాళినితోన్' అనడం సరి కాదు. "గామిడితోడన్" అనండి. గామిడి = గయ్యాళి.

   తొలగించండి
 19. ఆర్యుల మాటలన్ వినక స్వాంతము నిల్పక నిశ్చలమ్ముగా
  కార్యములందు నెప్డు సహకారము చేయక యిక్కలోన ని
  ర్వీర్యముగా చరించుచును వేదనఁ బెట్టుచు నుండ నిత్య మా
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్

  రిప్లయితొలగించండి
 20. ఆర్యావర్తము నందునఁ
  గార్యా సక్తులె పురుషులు గాముకు లవరే !
  యార్యా యెవ్వం డెవ్వని
  భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై?


  భార్యను నన్ను జూడకయుఁ బాడిగ నింటను సంతతమ్ము స
  త్కార్య విహీనుఁడై యకట దౌష్ట్య మనమ్మున నుండు దుర్జ నా
  హార్యమ యంచు నెంచమి నిజానన భాతి జితేందు బింబ శో
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్

  [శోభ + ఆర్య = శోభార్య; ఆర్య = తరుణి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 21. ధైర్యము గల తన మిత్రుని
  భార్యను గని మనసు పడెను, పరభామినిపై
  క్రౌర్యమ్మే మోజని, స
  త్కార్యమ్మవ బోదనుచును దలచుచు వీడెన్

  రిప్లయితొలగించండి
 22. క్రౌర్యపుమాటలాడుచు వికారపు చేష్టల తో చరించి స
  త్కార్యము జేయబోవదని కంపర మందును దేహమంతయున్
  భార్యనుఁ జూచినంతఁ, బరభామినిపై మనసాయె భర్తకున్
  ధైర్యము తోడజేరుచును దాకుచు సైగల జేసి పిల్చినంతనే.

  రిప్లయితొలగించండి
 23. ధైర్యముజారిపోయెనటదాసరివాసునకాక్షణంబహా
  భార్యనుజూచీనంత,బరభామీనిపైమనసాయెభర్తకున్
  భార్యసదానుకూలవతిపావనమైనదియైననున్సరే
  వర్యులనంగవారలిలభార్యలయాశలుదీర్చగావలెన్

  రిప్లయితొలగించండి
 24. చూచినంత
  పరభామిని
  గాచదువప్రార్ధన
  (2వపాదంలో)

  రిప్లయితొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  ("పాంచాలీ! పంచభర్తృకా!")

  వీర్యము పూనుచున్ నరుడు వింటిని గూర్చుచు మత్స్యయంత్రమున్
  ధైర్యము చిందుచున్ విరిచి,...ద్రౌపది నొందగ పంచపాండవుల్...
  ఆర్యుడు ధర్మరాజపుడు హాయిగ నాతని సత్యసంధయౌ
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె ...భర్తకున్ :)
  (పరభామిని = ద్రౌపది)

  సత్యసంధ = ద్రౌపది
  (ఆంధ్రభారతి నిఘంటు శోధన)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కందము   శౌర్యము చూపుచు కవ్వడి
   భార్యగ ద్రౌపదిని పొందె ప్రజనిక పలుకై
   నార్యుడు సనాభి ధర్మజు
   భార్యను గని మనసు పడెను, పరభామినిపై!


   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ 'సీరియస్'గానే ఉంది. బాగుంది. అభినందనలు.
   *********
   జిలేబీ గారూ,
   శాస్త్రి గారి వృత్తాన్ని కందంలో ఇమిడ్చారు. బాగుంది.

   తొలగించండి
 26. డా.పిట్టా సత్యనారాయణ
  భార్యయె యపరము దలపన్
  కార్యవిహీనుడవునైన గాంచకుము పరన్
  వీర్యవిహీనుని పనియది
  భార్యనుగని మనసు పడెను పరభామినిపై

  రిప్లయితొలగించండి
 27. డా.పిట్టా సత్యనారాయణ
  శౌర్యమొ యాత్మకెంగిలిని చాటుననైన భుజింప నాతి కౌ
  దార్యమొ మానమమ్మగ వదాన్యతయో పరదార బట్టగా
  ఆర్యుడునౌనొ కాదొ పరిహాసము జేయగ పెళ్లి బాసలన్?
  భార్యను జూచనంత పర భామినిపై మనసాయె భర్తకున్

  రిప్లయితొలగించండి
 28. డా.పిట్టానుండి
  ఆర్యా, టైపాటు..జూచినంత..౪వపాదంలో సవరణ

  రిప్లయితొలగించండి
 29. రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. "చక్కని దనగా" అందామా?

   తొలగించండి
  2. కార్యాలయమున కోమలి
   చర్యల గమనించి ప్రేమ చక్కని దనగా
   పర్యవసానము !?.. రక్కసి
   భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై"
   (సరి చేసాను)

   తొలగించండి
 30. డా.పిట్టానుండి
  ఆర్యా, టైపాటు..జూచినంత..౪వపాదంలో సవరణ

  రిప్లయితొలగించండి
 31. మండోదరి రావణుల సంవాదము...
  ఉత్పలమాల
  భార్యను గల్గి మీరుఁ బరభామిని జానకి బంధి జేయగన్
  శౌర్యము జూపి రాముడిట చాగఱలాడును మీదు వంశమన్
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్
  వర్యు నుపేంద్రు సన్నిధిని వైరమె జేర్చునటంచు దల్చగన్

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  [తన కెంతమాత్రమునుఁ బనికిరాని భార్య వలన విసిగి, వేసారిన భర్త, యిహముపై నాశను వదలుకొని, పరముపై మనసుపడిన సందర్భము]

  కార్యము చేతకానియది, కర్కశ వాక్కులఁ బల్కుచుండు, నా
  చార్యుల లెక్కసేయనిది, సర్వులతో జగడమ్ములాడు, నం
  గార్య వలెన్ గనంగఁబడు, గట్టిగ వాదన సేయునట్టి యా
  భార్యనుఁ జూచినంతఁ "బర" భామినిపై మనసాయె భర్తకున్!

  రిప్లయితొలగించండి
 33. ఆర్యుడు రామునివలెనే
  భార్యనుగనిమనసు బడెను!"పరభామినిపై
  శౌర్యముజూపక బ్రతికెను
  మర్యాదలు మలచునట్టి మాధవుడివలెన్"

  రిప్లయితొలగించండి
 34. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷🏻‍♀.........
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై
  మనసాయె భర్తకున్
  **************************************
  సందర్భం: వ్యసన పరుని బుద్ధి ఎలా వుంటుందో శ్రీ కోట రాజశేఖర్ గారు చక్కగా వివరించారు
  కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...
  అనే ప్రసిద్ధమైన శ్లోకానికి అనుగుణంగా శ్రీమతి వున్నప్పటికీ పురుషుని బుద్ధి పావనమైనది కాకపోతే పక్కదారులు పట్టుతూవుండడంలో ఆశ్చర్యం లేదు.
  ==============================
  కార్యము లందు దాసి, సరిగా కరణమ్ముల మంత్రి, లక్ష్మి సౌం
  దర్యము నందు, భూమి క్షమఁ, తల్లియు భోజనవేళ, రంభయౌ
  భార్య సుఖమ్మునం..దయిన పావన చిత్తము లేనివానికిన్
  భార్యనుఁ జూచినంత పరభామినిపై మనసాయె భర్తకున్

  ✒~ డా.వెలుదండ సత్యనారాయణ
  27-7-18
  ~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 35. కార్యము కర్మనున్ క్రియను కర్తల మర్మము బోధజేయుచున్
  శౌర్యము జూపుచున్ సరిగ చారును పెట్టుట నేర్వలేనిచే
  నార్యుడు రావణుండునిక హైరన తాళుట చేతగాకయా
  భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్

  రిప్లయితొలగించండి