30, జులై 2018, సోమవారం

సమస్య - 2747 (పడఁతి పడఁతినే...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడఁతి పడఁతినే పెండ్లాడవలెను విధిని"
(లేదా...)
"పడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్"

54 కామెంట్‌లు:

 1. వెదకి వేసారి యువకుడు వేచి యుండి
  కడకు హైదరబాదున నడచి నడచి
  సుందరమ్మగు గుణవతిఁ జూసి నంతఁ
  బడఁతి; పడఁతినే పెండ్లాడవలెను విధిని

  సార్! నాకు అరసున్నలు రావు గదా...క్షమించవలె...ఇంతకన్నా చేతగాదు 🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ శాస్త్రి గారూ.. మీ పద్యం లో విధి బలీయమైనది.. నమోనమః 👏👏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి


  2. తెలియ వర సున్నలు! జిలేబి తెలియవు పడ
   తి, మగవారికి బతుకు బంతిని నటునిటు
   వేసి నడిపింప గాను సూవె! పురుషుడిక
   పడఁతి, పడఁతినే పెండ్లాడవలెను విధిని :)

   జిలేబి

   తొలగించండి


 2. గడగడ పలుకులవిడు జగణ జిలేబి
  పడఁతి! పడఁతినే పెండ్లాడవలెను విధిని,
  పురుషుడు వినుమ ! ప్రకృతి సంపూర్ణముగను
  నపుడె మనుగడ సాగును నపుడె రమణి‌!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. "పడఁతి పడఁతినే పెండ్లాడవలెను విధిని"
  పలుకు టేల నటుల శాస్త్ర పద్ధతౌనె?
  మనిషి జాడ భూతలముపై మరుగు గాదె?
  పడఁతి పురుషుని పెండ్లాడవలెను విధిని

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  అమ్మాయి వివాహవిషయంలో.... భార్యతో... భర్త 👇అంటున్నాడు...

  పడతికి ప్రాయమిద్దియె వివాహము జేయగ., నామె సిగ్గుతో
  నడుగునె పెండ్లిఁ జేయుమని ? యమ్మకె చెప్పును కష్టసౌఖ్యముల్ !
  విడిదిని నేను జూచెదను ! పెండ్లికి సిద్ధము జేయ గల్గెడిన్
  పడఁతి పడంతినే కద ! వివాహము
  గావలె శాస్త్రపద్ధతిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పడుచువారిద్దరొక జంటపడుచులఁగని
   ప్రేమఁబడఁగాంచి పెద్దలు వెంటబడిరి !
   న్యాయమనఁ బెండ్లి ., ప్రతియొక నరుడు నరుడు
   పడతి పడతినే పెండ్లాడవలయు విధిని !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 5. సుడికొను కైపులన్నులవి! సూటిగ పల్కెదనే నితంబినీ!
  గడగడ లాడి నిల్వగను, కప్పుర గంధి! జిలేబి!కేశినీ!
  పడఁతి! , పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
  నడకువ తో కొమారులు వినమ్రముగా తలరాత గా సుమా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. చీర కట్టున నిలబడి యోరకంట
  చూచుచున్నంత మాత్రాన సుందరి యని
  కోరి పురుషుని పురుషుండు చేర దగునె?
  పడఁతి! పడఁతినే పెండ్లాడవలెను విధిని

  రిప్లయితొలగించండి
 7. సమస్య :-
  "పడఁతి పడఁతినే పెండ్లాడవలెను విధిని"

  *తే.గీ**

  తనను ప్రేమించి తక్కిడి తనము జూపె
  ననుచు పోలీసులకు జెప్పె, మనువు గూర్చి
  పడఁతి; పడఁతినే పెండ్లాడవలెను విధిని
  దప్పదనిరి పోలీసులు ధర్మమనుచు
  ...................✍చక్రి

  రిప్లయితొలగించండి
 8. "పడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్"

  నుడువకు నివ్విధంబుగను నోటికి వచ్చిన వ్యర్థ వాక్కులన్

  పుడమిన నంతరించెదరు భూస్పృశులందరు ! గాన మేదినన్

  పడఁతులు పూరుషాళిని వివాహము జేకొన శాస్త్రపద్ధతౌ!


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 9. పుడమిని భర్త పాదములు పొందుగఁబట్టిన భార్య ధన్యయే!
  కడు తరితార్ధదాయిని!సుఖాంబుధిఁదేలెడు ధర్మపత్నియున్!
  నడవడియందు నేర్పరి!మనంబున నాథు సమర్చఁజేయు న
  ప్పడతి-పడంతినే కద వివాహముఁగావలె శాస్త్ర పద్ధతిన్!!

  రిప్లయితొలగించండి
 10. ప్రేమ ఫలియించు మార్గము న్ వె దు కు చుండ
  తోచ వేష ము ధరి యించి తోయజా క్షి
  చెంత కు వెడలె నువిద గ నంత నపుడు
  పడతి పడతి నే పెండ్లాడ వలెను విధి ని

  రిప్లయితొలగించండి
 11. ఇంపు నిడు నెవరు మగని కీవసుదను ?
  పురుషు డెవరి చేకొన వలె బొట్టియ గన?
  ఎవరి నమ్మి పనులను చేయవలయు భువి?
  పడఁతి, పడఁతినే పెండ్లాడవలెను, విధిని

  రిప్లయితొలగించండి
 12. డా.ఎన్.వి.ఎన్.చారి
  చిత్రముగవివాహవిధులు చేరుచుండు
  పాపడనుబోలు "పడ"లను వరుడొసంగ
  వాటి నన్నియు గైకొని ప్రణతి జేసి
  పడతి "పడ" తినే పెండ్లాడ వలెను విధిని

  రిప్లయితొలగించండి
 13. పూరుషునకన్ని వేళల ముదము గూర్చు
  విధము నడుచుకొనెడు రీతి విధియె తాను
  సృష్టి జేసిన యపురూప శిల్ప మేను
  పడతి, పడఁతినే పెండ్లాడవలెను విధిని

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2747
  సమస్య :: పడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్.
  స్త్రీ ని స్త్రీ యే వివాహం చేసుకోవాలి కదా. ఇది శాస్త్ర సమ్మతము అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: పెద్దలు పరమాత్మకు జీవాత్మకు ఉన్న సంబంధాలను గుఱించి తెలియజేసేటప్పుడు పరమాత్మను భర్తగా జీవాత్మను భార్యగా చెబుతారు. అందువలన భగవంతు డొక్కడే పురుషుడు మిగిలిన వారంతా స్త్రీలే. కాబట్టి లోకంలో జీవాత్మలుగా ఉన్న మగవారంతా స్త్రీలే కదా. అందువలన పురుష రూపంలో ఉన్న పడతి పడతినే వివాహం చేసుకోవాలి శాస్త్రపద్ధతిలో అని ఊహించి చెప్పే సందర్భం.

  నుడువగ దేవు డొక్కడె మనోహరుడున్ పురుషుండు భర్తయున్,
  గడమ గలట్టి దంతయును గాంచగ స్త్రీ యని పెద్దలందు రీ
  పుడమిని; గాన చిత్రముగ పూరుష రూపములోన నున్న యీ
  ‘’పడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-7-2018)

  రిప్లయితొలగించండి
 15. పిడికెడు బూతినే పులుమి వేదము నేర్చిన విప్రవర్యుడే
  యడుగిడి మత్స్యయంత్రమునె యబ్బుర పర్చుచు గొట్టినంతనే
  బిడియము తోడ గాంచినది వింతగ విస్మయ మందుచున్ సభన్
  బడతి, పడంతినే కద వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్
  గడసరి బ్రాహ్మణోత్తముడె కవ్వడి యంచునెఱుంగకుండినన్

  రిప్లయితొలగించండి
 16. ఈ సంఘటన మహా భారతములోనిది. ప్రమీల ఒక దేశపు రాణి. పురష ద్వేషి. ఆవిడ రాజ్యములోని పరివారమంతయు స్త్రీలే. స్త్రీలకు వివాహము కాక బాధ పడుతున్న సమయములో తనకు వివాహము కాదు గదా అని ఒక చెలికత్తె ఆవేదన


  నాదు రాజ్యమందున లేదు నరులకు సల,
  నాదు మాటయే వేదము, నాదు మాట
  తఱియ బారిన శిక్షలు తప్పవిచట,
  పడతు లారా తెలుసుకొని నడచుకొమ్ము,
  "పడఁతి పడఁతినే పెండ్లాడవలెను, విధిని
  మార్చి చూపెద ననుచు సామ్రాజ్ఞి తెల్పె ,
  వింత గాదె నెచట నైన, సంతు భర్త
  సంగ మింపక నేరీతి సతికి కల్గు,
  నాదు బెండ్లి జరుగబోదు నరుని తోడ
  ననుచు వాపోయే చెలికత్తె నడలు బడుచు

  రిప్లయితొలగించండి
 17. (మహిళా రాజ్యాధినేత్రి ప్రమీల సభలో అంటున్నది )
  మనసులేనట్టి మగవారు మగువలకును
  చెప్పరానంత యవమతి జేసినారు ;
  పురుషరహితత్వ మనుదీక్ష బూనినాను ;
  పడతి పడతినే పెండ్లాడవలెను విధిని .

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రాణియై నొప్పిన ప్రమీల రాజ్య మందు
  పురుషులే లేని చిత్రమౌ పుడమి మీద
  పడతి పడతినే పెండ్లాడ వలయు విధిని
  ననియెడి షరతు వింటిని నాడె నేను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ బాపూజీ గారికి నమస్కారము. నేను పద్యాన్ని పోష్టు చెసిన తరువాత పైని మీ పద్యాన్ని చూసాను. మీ పద్యాన్ని నేననుసరించలేదు. దయతో గమనించ గలరు.

   తొలగించండి
 19. పురుషరూపముపరమాత్మ పుడమియందు
  తనరెజీవాత్మయింతిగదనకుదాను
  పతియుసతులుగవారలుబరగుకతన
  పడతిపడతినేపెండ్లాడవలెనువిధిని

  రిప్లయితొలగించండి
 20. డా.పిట్టా సత్య నారాయణ
  గై వివాహాలు ప్రబలిన ఘడియలందు
  పబతి పడతినే పెండ్లాడ వలెను విధిని
  ఆడ ,మగ,యని తేల్చగ నౌ ప్రమాద
  మనకు గట్టడి వేయగ ముందు ముందు

  రిప్లయితొలగించండి
 21. డా పిట్టా సత్యనారాయణ
  పడ నజ జల్జ రేఫలను పద్యము సాగునె భా గణ భగ్నమున్నచో
  "పడతి పడంతి నేకద వివాహ ముగావలె శాస్త్ర పద్ధతిన్
  బడ బడ బడ్డ పాత్రలకు ప్రాసయునున్ యతులుండ నోపునే?
  జడ--జడ గల్వ నేమగునొ చాలగ జూడమె నవ్య కైతలన్
  (నవ్య కవితలో లేని సారూప్యతను ఉటంకిస్తూ...)

  రిప్లయితొలగించండి
 22. డా}.పిట్టా నుండి}
  ఆర్యా ,మొదటి పాదం సవరణ
  .........పద్యము సాగదు'భా' విహీనతన్. గా చదువ ప్రార్థన.
  (శాస్త్ర పద్ధతి అవసరమని భావము)

  రిప్లయితొలగించండి
 23. గోత్రశాంతికొఱకు తూలకుండనగును
  పడతి పడతినే; పెండ్లాడవలెను విధిని
  పురుషుని జగతిపై సృష్టిపొసగునటుల
  అతివయెగద మూలాధారమన్నిటికిని

  రిప్లయితొలగించండి

 24. ఇంగిత మిసుమంతయె లేక యెఱుక లేక
  కరుణ లేకున్న వేధించు కనగ భువిని
  పడఁతి పడఁతినే ; పెండ్లాడవలెను విధిని
  ప్రాజ్ఞు రాలైన మేలైన పడతి నిలను.
  ****}{}{****
  (వదినాడు పడుచుల మధ్య సఖ్యత కుదరాలంటే
  విజ్ఞతతో వ్యవహరించి పెళ్ళాడ వలెనని భావము)

  రిప్లయితొలగించండి
 25. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  పడతి పడంతినే కద వివాహము
  గావలె శాస్త్ర పద్దతిన్
  ======================
  శాస్త్రము అనుమతించు పద్దతిన
  ఒక ఆడది మరొక ఆడదానినే కద
  వివాహమాడవలసినదని చెప్పుటలో
  పరస్పర విరుద్ద అర్థమే - సమస్య
  ========================
  సమస్యా పూరణము - 211
  ===================

  శృంగారము మానసికమని
  అంగీకారమున ఆనందమని
  చట్టనేరముగ చూపరాదని
  కోర్టులదిగొ ఎలుగెత్తెనని
  వీధులంబడగ హోమోలు
  హక్కుల పునరుధ్ధరణోద్దతిన్
  పడతి పడంతినే కద
  వివాహము గావలె శాస్త్రపద్దతిన్

  ====##$##====

  స్వలింగ లేదా స్వజాతి సంపర్కం
  చట్టరీత్యా నేరం కాదని ఇదివరకే ప్రపంచం
  లోని 126 దేశాలు తమ ఆమోదమును
  తెలుపగ,సెక్షన్ 377 ప్రకారం అది నేరమని
  మొన్నటి వరకు ఘోషించిన భారతీయ
  కోర్టులు నేడు నేరం ఎంత మాత్రం కాదని
  ప్రకటించటమైనది.

  స్వలింగ/స్వజాతి/హోమో సంపర్కులు
  తమ హక్కుల సాధనకై వీధికెక్కిన నేపధ్యం
  లో , కోర్టులు కూడా అనుమతించిన శాస్త్ర
  అనుమతుల దృష్ట్యా ఇక హోమోలకు
  సంబంధించి ఒక ఆడది మరొక ఆడదానిని
  వివాహమాడవచ్చును కదా యని భావము

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  (శుభోదయం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. గడుసు రమేశుడీతడు! సుఖమ్ముగ సందియమేది లేక తా
   ను డబడబా జిలేబులట నోచు కొనంగ జిలేబులే యటం
   చు డమరుకమ్ము మీటెనుగ, సూటిగ చెప్పుచు దేశ మందు పో!
   పడతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్దతిన్ !

   జిలేబి

   తొలగించండి
  2. ధన్యవాదములు - కృతజ్ఞతలు

   తొలగించండి
 26. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పడఁతి పడఁతినే పెండ్లాడవలెను విధిని

  సందర్భము: సులభము
  ==============================
  ఆడపిల్లలు నాటక మాడ.. పొడవు
  పిల్ల యేమొ రాముడు; పొట్టి పిల్ల సీత;
  శివ ధనువు విరుగఁ బలికెఁ జెలువ యొకతె
  "పడఁతి పడఁతినే పెండ్లాడవలెను విధిని"

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  30-7-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 27. ఇంటిపనులను జేయుచు వంటలొండి
  శుబ్ర బరచెడి సుదతియే శోభ నొసగు
  పడతి!"పడతినే పెండ్లాడవలెను
  మంచిననుకూలవతిగాన?మాధవుండు"!

  రిప్లయితొలగించండి
 28. చూపు లందు నైర్మల్యము దోపు చుండఁ
  జేత లందు నైపుణ్యము సేరి యుండ
  మాట లందుఁ గన్పించఁగఁ దేట పడతి
  పడఁతి, పడఁతినే పెండ్లాడ వలెను విధిని


  అడర గృహస్థ ధర్మము నరాధికుఁ డింపుగఁ బెండ్లి యాడి యె
  య్యెడలను మోక్ష మందుటకు నెంచిన వాఁ డిఁక నిశ్చయమ్ముగన్
  జడతను గాంచ కెన్నఁడును సద్గుణ శాంత వివేక శీల యౌ,
  పడఁతి! , పడంతినే కద వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్

  రిప్లయితొలగించండి
 29. భర్త మాటయె దాటని పత్ని పత్ని
  యత్త మామల సేవించి యలుపెఱుగని
  పడఁతి పడఁతి ;నే పెండ్లాడవలెను విధిని
  యట్టి పడతినే దాంపత్య మనుభవింప
  ****)()(****
  నే = నేను
  (పరుషాక్షరం "పెం" సరళమయి "బెం" కావాలేమో)

  రిప్లయితొలగించండి
 30. నా భర్తను చెల్లి వలలో వేసుకుంటున్నదమ్మ.. దానికి త్వరగా పెళ్లి చేయమ్మ( ఆడదే ఆడదాన్ని మోసం చేస్తుంది కదా..అని వాపోయే సందర్భము)

  ఇడుములు తెచ్చె చెల్లి కట!యీయననే వలలోనవేసి తా
  ముడులను వేయవమ్మ మరి ముంచక ముందర కాపురమ్మునే
  కడు వెఱఁపించు బంధమిది కంటకమాయెను,*మోసగించెహా*
  *పడఁతి పడంతినే కద!* వివాహము గావలె శాస్త్రపద్ధతిన్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (మాయకు మమతకు సంధిజేయగా)

  పడతి యొకంట వేచెను తపమ్మును జేయుచు వంగభూమిలో...
  పడతి యొకంట వేచెను తపమ్మును జేయుచు నుత్తరమ్ములో...
  కడకు నరేంద్ర మోడికి చికాకును బెట్టుచు గద్దె దించుచో...
  పడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్

  వంగభూమి = West Bengal
  ఉత్తరము = Uttar Pradesh
  వివాహము = coalition

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆ.బ కందము :)


   పడతులెటు జూడ పడతులు!
   గడగడ లాడించిరిగద గంధవతుల్ వం
   గడపు రమణులు జిలేబులు!
   పడతి పడంతులె సరి సరి పరిణయమునకున్ :)

   జిలేబి

   తొలగించండి
 32. పురుషునకు పూర్వపుణ్య మపూర్వ మైన
  పడఁతి; పడఁతినే పెండ్లాడవలెను, విధిని
  కాదన, గలుగు నరునకు కరము బ్రతుకు
  నరకమే గాన, కుములుచు నలుగు టగును

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కాంతలు సీతయు , ద్రౌపది
  కాంతలు కైకయును, సత్య, కాంత యహల్యన్ ,
  కాంత లయస్కాంతములే !
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 33. పడతులరాజ్యమందుగలభామినులందరునాడువారినే
  కడుగొనిపెండ్లిజేసికొనుకట్టడియుండుటకారణంబుచే
  పడతిపడంతినేకదవివాహముగావలెశాస్ర్రపధ్ధతి
  న్నడకువగల్గియుండునెడనాయువుబెర్గునుదప్పకుండగన్

  రిప్లయితొలగించండి
 34. విడివడి సర్వ బంధముల వేల్పును చేరగ సన్యసించెడిన్
  నడవడి తప్పు కాదు, భువి నందున మానవ వంశవృద్ధికిన్
  ముడిపడి ధర్మ బద్ధముగ ముచ్చటఁ దీర్చును ముక్తి మార్గమున్
  "బడఁతి; పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్"

  రిప్లయితొలగించండి
 35. కడిది విచిత్ర మెన్న నిది కాదుర పద్ధతి మూర్ఖ యేల నీ
  కడగుట లోకరీతి కొడికమ్మగు బాటను సాగిపోక సం
  గడిని వివాహ మాడుదువె కానిది పూరుషు డీ జగత్తులో
  బడఁతి పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్.

  రిప్లయితొలగించండి
 36. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు 'జడ కందములు - మన కందములు' పుస్తకాలను కవిమిత్రులకు పంపే పనిలో షాపూరు పోస్టాఫీసులోనే గడిచిపోయింది. ఇంకా నెలవు చేరలేదు. చేరినా అలసట వల్ల ఈనాటి పూరణలపై స్పందించలేను. ఈరోజుకు నన్ను మన్నించండి.

  రిప్లయితొలగించండి
 37. ఆరువిధములుగానుతానవని యందు
  శ్రమయనక పనులు చేయు సంతతమ్ము
  తనకు మారుగా సృష్టించె ధాత యొపుడొ
  పడతి పడతినే పెండ్లాడ వలెను విధిగ.

  2.ఆకలైనవేళలయందు నమ్మ యౌను
  నాగ్రహమ్మొదవంగతా నాది శక్తి
  యౌను,వంశవృద్ధి జరుగ నవసరమ్ము
  పడతి,పడతినే పెండ్లాడ వలెను విధిగ

  రిప్లయితొలగించండి
 38. కామ వాంఛల కొరకంచు కాదు పెండ్లి
  భావి తరపు భద్రతకై వివాహమైన
  పడతి పడఁతినే పెండ్లాడ వలెను విధిని
  యనుటె తప్పౌను మాన్యుడా యవని యందు.

  రిప్లయితొలగించండి
 39. తాను కార్యాచరణమందు దాసి గాను
  మర్మ ములనెఱగించుచు మంత్రిగాను
  రాగ మొలికించి మురిపింప రతిగ మారు
  పడతి, పడఁతినే పెండ్లాడ వలెను విధిని

  రిప్లయితొలగించండి
 40. పడతి! పడతి నే పెండ్లాడ వలెను విధిని
  పురుషుడు, జగతి పడతితో పూర్ణుడగును ,
  మగని సోదరి తొలుత దా మగడటంచు
  వరుడు గట్టెను తాళియు వహ్ని సాక్షి

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా సత్య నారాయణ
  గై వివాహాలు ప్రబలిన ఘడియలందు
  పబతి పడతినే పెండ్లాడ వలెను విధిని
  ఆడ ,మగ,యని తేల్చగ నౌ ప్రమాద
  మనకు గట్టడి వేయగ ముందు ముందు

  రిప్లయితొలగించండి
 42. చంపకమాల
  విడువడు సృష్టిజేయుటను విశ్వసృజుండుగ జీవజాలమున్
  తడబడుటన్నదే గనడు ధాతగ రాతను దీర్చి దిద్దుటన్
  కడుముదమంది భారతిని గైకొనె తా సృజియించ వెల్గ నా
  పడఁతి, పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 43. కడకిక పూరుషుండినిట కౌగిలి నింపుగ చేర్చగావలెన్
  పడఁతి;...పడంతినే కద వివాహము గావలె శాస్త్రపద్ధతిన్
  తడబడకుండ పూరుషుడు తబ్బిబు జేయక నోరుమూయుచున్
  కుడువగ చారు ముద్దలను కుంపటి రాజిడి తెల్లవారగా

  రిప్లయితొలగించండి