12, జులై 2018, గురువారం

సమస్య - 2730

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పలుకలేనివాఁడె పండితుండు"
(లేదా...)
"పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్"
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలినాయుడు గారికి ధన్యవాదాలు.

108 కామెంట్‌లు:

  1. "అనుద్వేగ కరం వాక్యం..."

    కాటి వరకు వచ్చు కటువైన మాటలు
    పలుక వలెను మాటలులుకు లేక
    సూటి పోటు మాట ఘాటుగ నున్నది
    పలుకలేనివాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    మూకం కరోతి వాచాలం...

    ఇలనిది సాజమే యెవనికేని , లభించిన దైవశక్తి , దా
    నిలువగ లేనివాడు ధరణీధరపంక్తులనెక్కగల్గు , గ....
    న్నుల గనలేని యంధుడు మనోహరలోకము గాంచ గల్గెడున్ ,
    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పలువురు వేదమంత్రఘనపాఠులు ., పల్వురు శాస్త్రకోవిదుల్
      పలువురు సత్కవీశ్వరులు పల్వురు వ్యాకృతిపండితోత్తముల్
      బలిమిని చూపు గోష్ఠుల నవాకుచవాకులు పల్కరాదిటుల్
      పలుకగలేనివాడె ఘన పండితుడంచుగడించుకీర్తులన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. చదువు కన్న మిన్న సంస్కారమును నేర్చి
    సాటి వారి పట్ల సానుభూతి
    కలిగి చెలగు వాడు, కఠినమౌ మాటల
    బలుక లేని వాడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  4. పలుకుల రాణి జిహ్వపయి వర్తిల స్నిగ్ధ మరంద ధారతో
    నలుగురు మెచ్చునట్టి కవనంబును జెప్పుచు శబ్ద సిద్ధిచే
    కలిత మనోజ్ఞ పద్యములె గాని భళీ! యపశబ్దమొక్కటిన్
    బలుకఁగలేనివాఁడె ఘన పండితుఁడంచు గడించుఁ గీర్తులన్

    రిప్లయితొలగించండి
  5. యపశబ్దమెద్దియున్ — అనాలి. శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ చిటితోటి విజయకుమార్ గారూ! ప్రస్తుతం మీరు న్యూజెర్సీ లో ఉన్నా కూడా శంకరాభరణమునకు ఆభరణంగా సమస్యాపూరణ లను చూస్తూ మేటి పద్యములను విరచిస్తున్నందులకు తమరికి అనేకానేక ప్రణామాలండీ. కోట రాజశేఖర్.

      తొలగించండి
  6. ఆంగ్లమాధ్యమమ్మె యసలైన చదువంచు
    మురిసి పోవునట్టి మూర్ఖ జనుల
    దృష్టి లోన జూడ తెలుగించు కైనను
    పలుక లేని వాడె పండితుండు.

    రిప్లయితొలగించండి

  7. పలికిరి పలువురట పద్యములను జడ
    పైన! ప్రకటనమ్ము వడిని సభన
    కంది వరుని గళము గద్గగ మయ్యెను
    పలుకలేనివాఁడె పండితుండు.


    జిలేబి

    రిప్లయితొలగించండి



  8. నిన్న జీపీయెస్ వారు గుండా సుబ్బ సహదేవుడి గారి సహకార వృత్త మెట్లా వచ్చింది అన్న టపా లింకు ఇచ్చేరు.

    https://kandishankaraiah.blogspot.com/2013/02/977.html



    ఈ వృత్తము నాకెంతో నచ్చింది (రెండు జగణాలు వున్నాయి జిలేబుల వేసు కోవ టానికి ).

    కంది వారికి విన్నపము

    ఈ సహకార వృత్తము శంకరాభరణ మందు జన్మించింది కాబట్టి దాని పుట్టుకకు సార్థకత చేకూరేటట్టు ఈ వృత్తము లో కైపద మివ్వ వలసినది.


    సరళము గా హృదిని తాకెనయ్య సాధన జేయన్
    వరుసగ వచ్చెను భళారె పద్య పాదము కూడన్
    విరియ బడంగ సరి కైపదమ్ము వెంబడి నిమ్మా !
    అరయగ లెస్స సహకార వృత్త మాంధ్ర జిలేబీ !

    సుబ్బ సహదేవుడు గారి కి శుభాకాంక్షలతో

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొత్త ఛందోబద్దమైన పద్యాన్ని సృష్టించడం! అద్భుతం!! సంగీతంలో కొత్త రాగాలు సృష్టించినట్లు!
      సహదేవుడు గారికి అభినందన మందారమాల!!💐💐💐💐💐💐💐

      తొలగించండి
    2. గురువుగారూ! జిలేబిగారితో ఏకీభవిస్తున్నాను! ఈ వృత్తంలో సమస్య యివ్వ వలసినది!!
      ఇది మీ కీర్తికిరీటంలో మరో మాణిక్యం అవుతుంది!!🙏🙏🙏🙏

      తొలగించండి

    3. జేజేలు సహదేవుడు గారికి

      సమస్యాపూరణము వస్తే అందరము సహకరించి కనీసము నూట పదహారు పద్యాల దాకా పూరణల చేసి సహదేవుల గారికి బహుకరిద్దాం

      జీపీయెస్ వారు

      మీ వాత్సల్య వాత్సాపు లోకూడా విరివిగా ప్రకటన చేయుడీ

      ఇట్లు
      దురదస్య దురదః జిలేబీ నామ్యా దురదగొంటాకః


      జిలేబి

      తొలగించండి
    4. ముందుగా నిన్న వ్హాట్సప్ లోనే చేసితిని సహకార వృత్త ప్రచారం...మీ మేఘ విస్ఫూర్జితము తో పాటుగా..."అందాల ఓ మేఘ మాలా"

      తొలగించండి
    5. అనుకోకుండా నిన్ననే “ తెలుగు వెలుగులో”
      మేఘవిస్ఫూర్జిత వృత్త పరిచయం చదివాను!
      జిలేబిగారికి హాట్సాఫ్!! 👌👌👌🌹🌹🌹

      ఉత్తమ సమస్యాపూరణలో సహదేవుడిగారి పద్యంకూడ! 💐💐💐

      తొలగించండి

    6. ఏ మాసపు సంచికలో నండి సీతాదేవిగారు ? :)


      జిలేబి

      తొలగించండి
    7. బై ది వే, ఇది మూడో మారు మేఘ విస్పూర్జితం వ్రాయటం శంకరాభరణం లో నే

      మొదటిది జూన్ ముప్పై శ్రీ మాన్ కోట రాజశేఖరుల వారి పద్యానికి వాహ్ వాహ్ అంటూ :)

      https://kandishankaraiah.blogspot.com/2018/06/2721.html?showComment=1530332951545#c5541341563920200550

      రెండోది జడకందానికి నమో అంటూ :)

      https://kandishankaraiah.blogspot.com/2018/07/44.html?showComment=1531030436858#c2835656134670302100



      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    8. జూలై సంచికేనండీ!! మా ఏజెంటు యేనాడూ 10 తారీఖులోపు తేడు! సమస్యాపూరణ గడువు పదోతారీఖు! మనవాళ్ళ పద్యాలు చదివి ఆనందిస్తూంటాను!

      తొలగించండి

    9. ఆ ఆర్టికల్ వ్రాసిన వారెవరో సీరియస్ గా జిలేబి బ్లాగును పరిశీలిస్తున్నట్టున్నారు :) మొట్టమొదటి మారు జూన్ నెల మధ్యలో ఓ ప్రయత్నం చేసా :)


      జిలేబీ నీబ్లాగే తెలుగు వెలుగై చీర్సు చెప్పెన్ భళారే! :)

      తొలగించండి
    10. అవునండీ! ఇదివరలో మీరు పంచచామరం వ్రాసినప్పుడు కూడ యిదే కోయిన్సిడెన్స్ జరిగింది! తెలుగు వెలుగు మీరు ఫాలో అవుతున్నారో, వారే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో గాని యిది నిజం!!😊😊😊
      బహుశః రెండోదే సరియైనదై ఉంటుంది!!
      👍👍👍👍

      తొలగించండి

    11. అవునా? పంచచామరం ఆర్టికల్ ఏ మాసం లో నండి ?

      జిలేబి

      తొలగించండి

    12. బై ది వే ఆగస్టు నెలలో సహకార వృత్తం రావచ్చంటారా? :)

      జిలేబి

      తొలగించండి
    13. గుర్తులేదండీ!
      రావచ్చేమో! నేను ఇండియాలో ఉండను! 26 న అమెరికాకు మా అబ్బాయి దగ్గరకు వెళ్తున్నాను! నవంబరులో తిరిగిరాక!😊😊😊

      తొలగించండి

  9. (తన కొడుకును వివాహమాడనన్న విద్యాధరిని
    నవ్వులపాలు చేయాలని మంత్రి చేసిన మోసం )
    రాకుమారి బ్రతుకు రచ్చ జేయగనెంచి
    గొల్లవాని దెచ్చె కుట్ర మంత్రి ;
    మంచి వేషమేసి మౌన మూనుమనియె ;
    పలుకలేని వాడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    ఏళ్లు కష్టపడుచు నిరుముడి మోసియు
    కవితకిడెను పూర్ణ గతిని శ్రుతిని
    సుడులు స్రుక్క తనదు సోదిని జెప్పంగ
    బలుకలేనివాడె పండితుండు

    రిప్లయితొలగించండి


  11. పలువిధ యత్న మెల్ల సయి పద్యము నేర్వగ చేయుచున్ సదా
    కలమును సాన బట్టుచు సుగంధము లొప్పగ తీర్చి దిద్దుచున్
    పలుకుల లోన గాన్పడెడు ప్రాసల గట్టిగ బట్టి నేర్వగన్
    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. సంత సమున మెండు సభను గాంచినంత
    కనుల నీరు నిండె గగురు పాటు
    గొంతు పెగల దాయె కొనియాడ సభికుల
    పలుక లేని వాఁడె పండి తుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. "సభను గాంచినయంత" అనండి.

      తొలగించండి
  13. మేను గాయ పరచ మేలౌను మందు తో
    మనసు గాయ పడిన మాన దె పుడు
    పరుల తూ ల నాడు పరుష ము లె ప్పుడూ
    పలుక లేని వా డె పండి తుం డు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎప్పుడూ' అనడం వ్యావహారికం. "పరుషము లెప్పుడు" అనండి.

      తొలగించండి
  14. పండితులకు తానుగా ఒక తిక్క వెతికి చూడ
    ఉండును పక్క
    వాగెదరు తిప్పుకోకయే గుక్క పీల్చెదరు నేనను
    హుక్క
    రాతలు నావవి వాతలనుచున్ ముఖమునన్
    హావభావములన్
    పలుకగ లేని వాడె ఘన పండితుడంచు గడించు
    గీర్తులన్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టాసత్యనారాయణ
    పలుకుమటంచు చేతనొక పండితు నడ్గెను రాజు యొక్కెడన్
    కులుకుచు వెంట దా నడచి గూర్చెను చేత నదొక్క మిడ్తనున్
    మలుపును దిర్గి "చెప్పు"మన "మాసెను పేరు"యటంచు పండితుం
    డలిగెను భట్టు(పండితుడు)పేర్మిడుత1,"నౌగద చిక్కితి చేత"నంచనెన్
    పలుకగ లేనివాడె ఘన పండితుడంచు గడించు కీర్తులన్
    (1.పండితుని పూర్తి పేరు మిడుతమ్భట్టు)రాజు మూసియుంచిన చేతిలో మిడుతయే కనిపించింది,చేతిని విప్పగా.దీనితో పండితుని కీర్తి మొక్కవోలేదు.మా నాన్నగారు నా బాల్యంలో జెప్పిన కథ దీనికి ఆధారమై నన్నునూ రక్షించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజు + ఒక్కెడన్, పేరు + అటంచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి

  16. నేటి సభలలోని నెఱిని చూడగ నవ్య
    రచనలపయి మాటలాడుమనగ
    నన్యు లెవరి కయిన నర్థమగునటుల
    పలుకలేనివాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2730
    సమస్య :: *పలుకఁగ లేనివాఁడె ఘన పండితుఁ డంచు గడించుఁ గీర్తులన్.*
    ఏమీ మాట్లాడలేని వాడే గొప్ప పండితుడుగా కీర్తిని పొందుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీమద్భగవద్గీతలో గీతాచార్యుడు శారీరిక వాచిక మానసిక తపస్సులను గురించి తెలియజేస్తూ
    *అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్।*
    *స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే।।* (17 అధ్యాయంలో 15 వ శ్లోకం) అని బోధించారు. కాబట్టి తెలిసికొని సత్యమును పలకాలి. లోక హితమును పలకాలి. ధర్మ బద్ధంగా పలకాలి. ఇలా చేయండి అని ఇతరులకు చెప్పదలచిన దానిని {శ్రీ రామ కృష్ణ పరమహంసల వలె} ముందుగా తాము ఆచరించి ఆ తరువాత చెప్పాలి. చిఱు నవ్వుతో మాట్లాడాలి. ప్రియమును కలిగించే మాటలనే మాట్లాడాలి. ఇలా మాట్లాడ గలిగి యుండి అప్రియములను పలుకలేని వాడే గొప్ప పండితుడుగా కీర్తిని పొందుతాడు అని విశదీకరించే సందర్భం.

    పలుకుము సత్యమున్ దలచి, పల్కుము లోక హితమ్ము నెంచుచున్,
    పలుకుము ధర్మబద్ధముగ, పల్కుము ముందుగ నాచరించుచున్,
    పలుకుము మందహాసమున, పల్కు ప్రియమ్ముల, నప్రియమ్ములన్
    *పలుకగ లేనిఁవాడె ఘన పండితుఁ డంచు గడించుఁ గీర్తులన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగుందండీ అవధానిగారూ! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. శ్రీ కోట రాజశేఖరావధాని గారికి ప్రణామములతో... 🙏

      సలలిత శబ్దగుంఫితవిశాలకవిత్వ మహోపదేశసం...
      కలితమృదూక్తి పూరణముగా తనరారెను కోటవారికిన్ !
      పలుకుల తేనెలొల్కు రసపద్యము! దీనికి భిన్నమౌనటుల్
      పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
    6. నాపై ఆదరాభిమానములతో అవధాని మురళీకృష్ణ గారు వ్రాసిన ప్రశంసాపూర్వక సమస్యాపూరణ పద్యాన్ని బ్లాగులో ప్రకటించిన శ్రీయుతులు ప్రభాకరశాస్త్రి గారికి భక్తిపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  18. అలుక లేక నెప్పు డానంద మనమున
    కలుపుగోలు గాను మెలగుచుండు
    విలువగల్గి ,శాస్త్రవిహితము గాకుండ
    పలుక లేనివాడె పండితుండు !

    రిప్లయితొలగించండి
  19. సమస్య :-
    పలుకలేని వాడె పండితుండు

    *ఆ.వె**

    కొలువు కొరకు వివిధ కోర్సులను జదివి
    తెలుగు సులువనుకొని కొలువు జేరి
    పాఠశాల యందు పద్యమ్ము చక్కగా
    పలుకలేని వాడెపండితుండు
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంఘ వృద్ధి గోరి సలలితమగునట్ఘి
    కవిత లల్లి నీతి కఱపు చుండి
    పాటి నీయకుండు పదముల సుద్దులు
    పలుకలేని వాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంఘ వృద్ధి గోరి సలలితమగునట్టి
    కవిత లల్లి నీతి కఱపు చుండి
    పాటి నీయకుండు పదముల సుద్దులు
    పలుకలేని వాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  22. రచ్చసభలయందురాధ్ధాంతమునుజేయు
    వారిగూర్చికొద్దిపలుకునైన
    పలుకలేనివాడెపండితుండనబడు
    నఱచియఱచియతడెయాగిపోవు

    రిప్లయితొలగించండి
  23. తలచిన యంతమాత్రమున ధారుణి పంండితు డౌట సాధ్యమే?
    పలుమరు కావ్య పాఠములను పద్ధతిగా పఠి యించగా వలెన్
    మెలకువలెర్గియున్ జగతి మేలుగ వెల్గుచు శుష్కవాక్కులన్
    పలకగ లేనివాడె ఘన పండితుడంచు గడించు కీర్తులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాఠముల పద్ధతిగా' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  24. డా.పిట్టాసత్యనారాయణ
    పలుకుమటంచు చేతనొక పండితు నడ్గెను రాజు యొక్కెడన్
    కులుకుచు వెంట దా నడచి గూర్చెను చేత నదొక్క మిడ్తనున్
    మలుపును దిర్గి "చెప్పు"మన "మాసెను పేరు"యటంచు పండితుం
    డలిగెను భట్టు(పండితుడు)పేర్మిడుత1,"నౌగద చిక్కితి చేత"నంచనెన్
    పలుకగ లేనివాడె ఘన పండితుడంచు గడించు కీర్తులన్
    (1.పండితుని పూర్తి పేరు మిడుతమ్భట్టు)రాజు మూసియుంచిన చేతిలో మిడుతయే కనిపించింది,చేతిని విప్పగా.దీనితో పండితుని కీర్తి మొక్కవోలేదు.మా నాన్నగారు నా బాల్యంలో జెప్పిన కథ దీనికి ఆధారమై నన్నునూ రక్షించింది.

    రిప్లయితొలగించండి
  25. ధనము కలిగి యున్న ధర్మ శూన్యుడొకడు
    నిర్ధనుండొకండు నిజబుధుండు
    వారి యందు గొప్ప వారెవ్వరనుచును
    పలుక;లేని వాడు పండితుండు

    రిప్లయితొలగించండి
  26. అలరి వసంతమందు పిక మయ్యెడ మౌనియె వానకారులో,
    కలచ "బెకల్ బెకల్" బొసగు కప్పలు కర్ణకఠోర మట్లుగన్,
    దులువలు దుష్టభాషణల దూరుచు రేగినఁ గారుకూతలన్,
    పలుకగ లేని వాడె ఘనపండితు డంచు గడించుఁ గీర్తులన్.

    రిప్లయితొలగించండి
  27. వేద శాస్త్రములను విశదముగ నెఱిఁగి
    యుత్తమంపు విద్యయు వినయము న
    ఖర్వ మున్న నింక గర్వ మది, నిజము
    పలుక,లేని వాఁడె పండితుండు


    అల జల మున్న నేమి లవణాంబుధి మెత్తురె త్రాగి నీటినిన్
    మల గరళమ్మ యల్పతర మాత్రమ త్రెక్కొను బాల నన్నిటిన్
    సలలిత శబ్ద భావ స రసక్షయ వాక్కులఁ గర్కశమ్ముగం
    బలుకఁగ లేని వాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి


  28. 1.పరుల మనసు కెపుడు బాధ కల్గింపక
    మంచి మాటలాడి మన్ననంది
    వసుధ యందు సతము పరుషవచనములు
    పలుకలేనివాఁడె పండితుండు.

    2.పరహితమును సతము వాంఛించెడి సుజీవి
    కల్మషమెరుగ నట్టి కష్ట జీవి
    దైవతముల గొల్చు ధర్మాత్ముడిల చెడు
    పలుకలేనివాఁడె పండితుండు.

    3.చదువు సంధ్య లెల్ల చక్కగా నేర్చుచు
    నవని లోని జనుల యాదరమును
    పొందినట్టి ఘనుడు పొరపాటుగా చెడు
    పలుకలేనివాఁడె పండితుండు.

    4.మంచి మాట లెపుడు మాన్యత చేకూర్చు
    నోటి మాట జార చేటు కలుగు
    హాని గూర్చు మాట లవనిలో నెప్పుడూ
    పలుకలేనివాఁడె పండితుండు.

    5.పుట్టు మూగ వాడు పుడమిలో నొక్కడు
    పలుకలేనివాఁడె పండితుండు.
    నయ్యె దైవ కృపయు నంద నసాధ్యమై
    నట్టి దేది దెలుపు డవని యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం.
      'ఎప్పుడూ' అనడం వ్యావహారికం. "ఎప్పుడు' అనండి.

      తొలగించండి

  29. సవరణతో

    పరహితమును సతము వాంఛించెడి సుజీవి
    కల్మషమ్మెరుగని కష్ట జీవి
    దైవతముల గొల్చు ధర్మాత్ముడిల చెడు
    పలుకలేనివాఁడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  30. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పలుకలేనివాఁడె పండితుండు

    సందర్భము: పలుక.. అన్యార్థంలో...
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అడిగినంత పలుకు నాతడే బుధుడౌను..
    పలుకుదు నని యనడు వ్రాసి, చూచి...
    కనుగొనంగ కలము, కాగితాల్, బలుపాలు
    పలుక...లేని వాఁడె పండితుండు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    12.7.18

    రిప్లయితొలగించండి
  31. తెలియనట్టివైన తెలివిగావివరించు!
    మాట మహిమదెలిపి చాటిజెప్పు
    మూఢు డెదురుబడగ?మూగగామారుచు
    పలుకలేనివాడె పండితుండు

    రిప్లయితొలగించండి
  32. పలుకగలేనివాడెఘనపండితుడంచుగడించుగీర్తులన్
    బలుకగలేకపోయిననుబంధములయ్యవిపెద్దవారితో
    గలిగినవాడుచోనికనెకాయెకిగాగడియించుగీర్తులన్
    దలపగనట్టివాడునిలదారసపడ్డనుజుచితేయెటన్

    రిప్లయితొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    ("పైన భటారం లోన లొటారం")

    పలుకుచు ధర్మ సూత్రములు పండుగ జేయుచు పట్టు పంచెతో
    విలువగు నీతి శాస్త్రములు వీనుల విందుగ నొక్కిచెప్పుచున్
    చిలుకగ పొట్టనంతయును చిట్టిది పొట్టిది స్వీయ వాక్యమున్
    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్

    స్వీయ వాక్యము = మనసులోని మాట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. చదువుకున్నయంత సంస్కారి కాలేడు
    వినయమున్న వాని విద్య పొసగు.
    సర్వ మెరుగుదునని గర్వ మతిశయించి
    పలుకలేనివాఁడె పండితుండు.

    రిప్లయితొలగించండి
  35. చంపకమాల
    కలుగును ధారుణిన్ ప్రజకు కష్ట సుఖమ్ములు జీవనమ్మునన్
    వలవల నేడ్వ కష్టములు బాయునె? క్రుంగని వాడుగా సుఖ
    మ్ముల స్పృహ లేనివాడగుచు పొంగక తా సమ దృష్టి డంబముల్
    బలుకఁగ లేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్

    రిప్లయితొలగించండి
  36. నా రెండవ పూరణ

    విలసితపాండితీప్రథితవేదసముచ్చయశాస్త్రశేముషీ
    కలితుల గోష్ఠు లందు కనగా నొక యజ్ఞుడు మౌనముంటచే,
    వెలయగ సత్కరింప బడు విజ్ఞుల తోడుగ నంతవట్టు తా,
    పలుకగ లేని వాడె ఘనపండితు డంచు గడించుఁ గీర్తులన్.

    "వరం మౌన మపండితానామ్".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  37. పండితా సమ దర్శనః 🙏🙏🙏🙏

    కలిమిని లేమినిన్ మనము కష్టసుఖంబుల నంటనీయడే
    కులమును జాతినిన్ గుణుని కూళను
    వేరుగ జూడనొప్పడే
    వెలుతురు నిచ్చునౌదగు వివేకపు మార్గములో నసత్యమున్
    బలుకగ లేనివాడె ఘన పండితుడంచు గడించు కీర్తులన్

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    కష్టముల కొరిగి సుఖములకు పొంగుచు
    నాటుపోటు లకునుఁ గాటు వడక
    సాగి పోవుచుఁ గని సమదృష్టి డంబముల్
    పలుకలేని వాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి
  39. సకల శాస్త్రములను చక్కగా పఠియించి
    జ్ఞాన సంపద గొని మానితముగ
    వసుధలోన నెట్టి వ్యర్థపు పలుకులన్
    పలుకలేనివాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పలుకలేనివాఁడె పండితుండు

    సందర్భము: సులభము. ఆ పండితు డెవరో పలుక నక్కర లేదు. తెలిసిపోతూనే వున్నది కాబట్టి మళ్ళీ తెలుపలేదు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పలికెడిది య దేమొ భాగవతం బంట!
    పలుకఁ జేయు రామ భద్రు డంట!
    పలుకఁ జేయు వాడు పలికించనప్పుడు
    పలుకలేనివాఁడె పండితుండు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    12.7.18

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    పలుకలేనివాఁడె పండితుండు

    సందర్భము: ఒక నవాబు వద్ద నిద్దరు వేద పండితులు సన్మానితులై అక్కడనే యుండిరి. ఒకనాడు వారు విద్యా గర్వంతో "పర్యటించి వేద పండితు లందరినీ గెలిచి వస్తా" మన్నారు. అతడు సరే నన్నాడు.
    దత్తాత్రేయుని యవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామికి త్రివిక్రమ భారతి యను శిష్యు డుండేవాడు. అతనికి ఎవరితోను వాదన యిష్టం వుండేది కాదు. వేద పండితు లాతనిని తమతో వాదించితీరా లన్నారు. అతడు స్వామి యనుమతి కావా లన్నాడు.
    స్వామి దారిన పోయే హీన కులజుడైన ఒక పామరుని బిలిచి యేడు గీతలు నేలపై గీయించి ఒక్కొక్కటీ దాటు మన్నాడు. అత డట్లే చేశాడు. ఏడవ గీత దాటగానే "నీ వెవ" రని యడిగినాడు స్వామి."వేద శాస్త్ర పారంగతుడనైన బ్రాహ్మణుడ" నన్నాడు వాడు. స్వామి వాదించు మన్నాడు.
    ఆత డద్భుతంగా వాదించి వేద పండితుల గర్వ మణచినాడు. వారు స్వామికి పాదాక్రాంతులైరి.
    ఏమీ పలుకలేనివాడు వేద మంత్రాలను సస్వరంగా పలుకడం చూసి ప్రజ లాశ్చర్యంతో స్వామిని కొనియాడిరి.
    "విద్యా విహీనులైనా సాటి బ్రాహ్మణుల పట్ల ద్వేషం పనికిరా దని, వినయ విధేయతలు గురు భక్తి గలవాడు ఏ కులంవాడైనా క్రమంగా బ్రాహ్మణత్వం పొందడానికి అర్హుడే అవుతా" డని స్వామి వేద పండితులను ప్రజలను ఉద్దేశించి పలికినాడు.
    శక్తి పాత మంటే యిది సుమా... అన్నారు శిష్యులు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అరయ నొక్క నవాబు నాస్థాన పండితుల్
    వేద శాస్త్ర జ్ఞాన విదు లిరువురు
    పర్యటన మొనర్చి పండితులను గెల్చి
    వత్తుము, యశము మీ కిత్తు మనిరి..
    యతిరాజ శ్రీ నృసింహ సరస్వతీ శిష్యు
    వాదంబునకు బిల్వ స్వామి నగుచు
    పామరుండైనట్టి బాటసారిని బిల్చి
    బ్రాహ్మణత్వ మిడి గెల్వంగ జేసె..
    "మహి నితండు వేద మంత్రంబులను నిన్నఁ
    బలుకలేనివాడు.., పండితుండు
    నేడు చూడు..స్వరము నిలిపి మధురముగాఁ
    బలుకుచుండె" ననిరి ప్రజలు మురిసి...

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    12.7.18

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  42. ఎలాంటి గుణవంతులు తన భక్తులగునో శ్రీకృష్ణుడు పలుకు సందర్భము....

    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్
    వలసిన మాటలాడి నిరపాయపు జీవనయానవర్తియై
    కలిమిని, లేమినిన్ తుదకు కాననవాసమునున్ సమాంతర
    మ్ములుగ తలంచు ధన్యుడె సుమోహితుడౌ నిజభక్తుడర్జునా

    రిప్లయితొలగించండి
  43. పూజ్యాయ రాఘవేంద్రాయ...
    ఆదోని దివాన్ వెంకన్న వృత్తాంతం::

    తెలియదు భాషయన్న , యరె! తెంపరి! నీవు పఠింపకుంటివో
    చలనము తప్పునంతకడ చండపుదండనలిచ్చెనన్నచో
    తెలివిడిజిక్కి రాఘవయతీంద్రుని దుర్జయమౌకృపన్ వలెన్
    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్

    రిప్లయితొలగించండి
  44. చిలుకుచు సంధి సూత్రములు ఛిద్రము లెన్నుచు రామభద్రుడే
    పలుకగ పోతనార్యునకు పన్నుగ నిచ్చిన కావ్యకన్యనన్
    కులుకుచు ఛాందసమ్మునను గుండెలు చీల్చిన నొక్క పద్యమున్
    పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్

    రిప్లయితొలగించండి