17, జులై 2018, మంగళవారం

సమస్య - 2735

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్"
(లేదా...)
"పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే"
(ఈరోజు నా పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ సమస్య...)

153 కామెంట్‌లు:

 1. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  శంకరాభరణం శంకరయ్య మహాత్మునకు జన్మదిన శుభాకాంక్షలు!

  🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  రిప్లయితొలగించండి
 2. పుట్టి నట్టి రోజు భూరిశుభములొంది
  వెలగ వలయు నీవు విశ్వమందు
  అష్ట సిరుల తోడ ఆయురా రోగ్యముల్
  సిద్ధి గలిగి జెందు వృద్ధి నీవు

  గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. శంకరాభరణానికి ఆభరణమైన శంకరార్యులకు
  జన్మదిన అభినందనాలు -అభివందనాలు .💐🙏

  రిప్లయితొలగించండి
 4. "పునరపి జననం"

  పరిపరి పుట్టుచు గిట్టుచు
  సరిసరి యానంద మూడి శాశ్వత మగునా
  పరమాత్మ నుండి వెలిబడ
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్ :)

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు
  గురువులకు జన్మదిన శుభాకాంక్షలు . ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నెన్నో జరుపుకుంటూ ఆ శంకరుని ఆభరణమై సన్మానములు పొందుతూ వెలుగొందాలని
  ఆశీర్వదించి అక్కయ్య .

  రిప్లయితొలగించండి
 7. ( గాంధీజీని కబళించిన గాడ్సే పుట్టినరోజు మనకు సంతాపదినమే)
  అరమర లెరుగని "బాపు"ను
  "భరతపిత " మృతు నొనరిచిన భ్రష్టుడు గాడ్సే
  విరసుడు పుట్టిన రోజును
  జరిపిరి జన్మదినమనుచు సంతాపసభన్ .

  రిప్లయితొలగించండి
 8. నిరతము తికమక పడుచును
  పరుగులు పెట్టించు నేత పలుకులు వినుచున్
  పెరిమను నటించు శిష్యులు
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులకు జన్మదిన శుభాకాంక్షలు🌹🎂🌹🙏

  రిప్లయితొలగించండి

 10. కవివరులకు జేజేలు !
  కందివారికి హార్ధిక శుభాకాంక్షలు !
  शुभकामनाये!
  May the Lord bless you aplenty! Amen!
  मुबारक् हो!
  நல் வாழ்த்துக்கள்
  ಶುಭಾಸಯಗಳು


  ಜಿಲೇಬಿ

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా సత్యనారాయణ
  స్థితప్రజ్ఞ శ్రీ శంకరగురునకు అవతారోత్సవ శుభాకాంక్షలు!!
  "యః సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య'శుభాశుభమ్'
  నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా..గీతా ౨--౫౭

  అరకొర స్త్రీయాదరణము
  చెరబడె నీ జన్మకిపుడె చేసిన శోకం
  బరయును లోకంబని చెడి
  జరిపిరి జన్మ దినమంచు సంతాప సభన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   ధన్యవాదాలు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
  పద్యమున్నంత కాలం మీరూ ఉండెదరు గాక.

  రిప్లయితొలగించండి


 13. మరణానికావలయు కవి
  వరులు సజీవముగ భువిని వర్ధిల్లెదర
  న్న ఋతపు దృష్టాంతముగా
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్!

  जिलेबी

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  పుట్టెడు బుద్ధులం జెలగి పూరణ విద్యకు నొజ్జగా మనన్
  ఎట్టి పరాకు లేక తను మెట్టె "నమేరిక" వీర్యవంతుడై
  గిట్టెను దుండగీడుని పగేల?తుపాకికె దెల్యకుండె నా
  చట్టపు చండశాసనమె శారద మాన్పగలేకనే "శరత్"
  పుట్టిన రోజటంచు గడు బూనిక శోకసభన్ రచించిరే
  పట్టగ దోషి జచ్చెను తపంచ (ఆయుధము)నిషేధము ట్రంపు కార్యమౌ!
  ("శరత్ "వరంగల్ నుండి పై చదువులకు వెళ్ళిన విద్యార్థి)

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు... 💐💐💐🙏🙏🙏💐💐

  "పుట్టినరోజటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే ?
  మిట్టిదటంచు" నీవడుగ నిట్టులు చెప్పినదమ్మ "శంకరా !
  పట్టెడు బువ్వఁ దింటివ ? శుభమ్మని కట్టితివొక్కొ క్రొత్తవౌ
  బట్టలు ? దైవదర్శనము భావన జేసితివొక్కొ ? నేడనన్
  పుట్టినరోజునే మరచి ప్రొద్దునెరుంగక రేబవళ్లు నీ...
  విట్టులు శంకరాభరణమే పరమావధి యంచు కైతలం...
  దట్టిటు దోషమున్ గుణమటంచు వివేచన చేసి , నీవు నీ
  మట్టుకు సంతసమ్మని యమాయకబుద్ధి చరించుచుండగా
  నెట్టులు పండువౌనిది ? గణింపవు కష్టమటన్న "అమ్మకీ..
  విట్టులు దెల్పినావొ ! నిజమే! జననీ ! భవదీయపుత్రుడి
  ప్పట్టున సాహితీ జగతి భాసుర సద్యశమందుచుండ నీ...
  కెట్టి ముదంబు గల్గు! జనులెల్లరు మేలని మెచ్చ., నాకిటన్
  పుట్టినవాడొకండయిన మోదము గూర్చెను వీడు , లోకమం..
  దిట్టిదలభ్యమౌ జననికెంతటి గారవమంచు" బల్కగా
  పెట్టదె ముద్దులెన్నొ ? తినిపింపదొ ముద్దులు ? ప్రేమమీరగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరుసగ వచ్చెను గాంధికి
   జరుపగ వర్ధంతి , ఱేని జన్మదినంబున్ !
   మరి యని ., వారము ముందుకు
   జరిపిరి జన్మదినమనుచు సంతాపసభన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 16. కందిశంకరయ్య కలకాలమందున
  గురుతరంబునిల్పి మరువనట్టి
  పద్యవిద్యచేత భావనలందించ?
  వాణి వాక్కుబంచు!వరలశక్తి

  రిప్లయితొలగించండి
 17. నిన్న ధూర్జటి సహాయంతో
  నేడు పోతన వీరభద్ర విజయం స్ఫూర్తి తో.....

  పట్టిసమంటి చేయి ఘన పట్టిస పట్టిన పెద్ద చేయి, చే
  పట్టిన కార్యమున్ దివినృపాలుల గుండెగుభిల్లనన్ శివా
  ల్బెట్టెను నీదు చేయి, మరులెత్తెడు రౌద్రపు వీరభద్ర! నీ
  పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే
  జెట్టున వచ్చినట్టి శివసేనలు దక్షనిరీశ్వరోహుతిన్

  *******

  (వీరభద్ర విజయము 4-165)
  కఱకువేల్పులఁ బట్టువారల కాళ్లు సేతులు పొట్టలున్
  మొఱలు కూఁతలు వెట్ట నుగ్రత మొష్టిఘాతల నొంచుచున్
  పఱవగం జననీక శృంఖలబంధనంబులు చేసి తా
  నరిమురిన్ రణకేళి సల్పెను నాత్మ నెంతయు సోలుచున్.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ కంది శంకరయ్య గారికి జన్మ దిన శుభాకాంక్ష లు
  మురియు చు నాప్తు ని కనుగొని
  విరిసిన హృదయాల తోడ వేడుక మీర న్
  ధర సన్మానిం త్ర దె చ ట
  జరిపి రి జన్మ దిన మను చు సంతాప సభ న్ ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   __/\__
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సన్మానింత్రదెచట'... పదవిభాగం?

   తొలగించండి
  2. సన్మానిం త్రు +అది +ఎచట =సన్మానిం త్ర దె చట

   తొలగించండి
 19. అగ్రగణ్యులయందగ్రగణ్యులైన శంకరయ్యగారికి హృదయపూర్వక పుట్టినరోజుశుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అగ్రగణ్యులందు నగ్రగణ్యులుయైన
   పండితోత్తములలొ పసిడియైన
   భాష గరిమతోడ భాసురించెడు మీకు
   శతజవములు దక్కు శంభు దయనుఁ


   మన్ను బోలునట్టి మానిసినగు నాకు
   పద్యమల్లటందు వలపుబెంచి
   సాహసించి రచన సాగించు వీలిచ్చెఁ
   శతజవములు మీకు శంభు దయనుఁ

   తొలగించండి
  2. మీరు నేర్పఁ నేర్చి, మీసముల్ మెలిబెట్టి
   నాదు పద్యమంచు నకలు చెప్పి
   గురువునేర్పుదాచు గూఢమౌ స్థితికి నన్
   తోసివేయకయ్య తోయజాక్ష

   తొలగించండి
 20. ఈవారం ఆకాశవాణి వారి సమస్య తెలియజేయగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సుబ్బారావు గారికి

   ఆక్రోశవాణి సమస్య ఈవారానికి


   నరునకు వానరునకు నిల నాలుగు కాళ్లే


   జిలేబి

   తొలగించండి

  2. జిలేబి వారి జాంగ్రి :)


   అరె తల్లి దయని భువిలో
   న రమణముగ బిడ్డ పుట్టి నటునిటు నడయా
   డె రయము గన్ బ్రాకి, నరయ
   నరునకు వానరునకు నిల నాలుగు కాళ్లే !


   జిలేబి
   బొంగలూరు

   తొలగించండి
 21. [17/07, 07:28] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
  అరెరే పుట్టెను చచ్చెను
  సరిగా నొక తిథిని గాదె సరసిజ నేత్రా
  వరుసగ రెండొకరోజే
  జరిపిరి జన్మదిన మనుచు, సంతాప సభన్
  [17/07, 08:02] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
  పరమాత్మునిలీలలవియె
  వరుసగ హర్షంబు నేడ్పు వదలవు దేహిన్
  మరచుచు నాత్మజ్ఞానము
  జరిపిరి జన్మదినమంచు,సంతాపసభన్

  రిప్లయితొలగించండి
 22. కొందఱు ఛాత్రులు యుద్ధ వీరులకు సంతాపము తెలుప దలచినారు.అదేదినమున గురువు గారి జన్మదినమని తెలియటముతో దానిని (సంతాప సభను)మరియొక వేళకు జరిపినారు.ఇక్కడ జరుపుట అంటే మరొక సమయానికి వాయిదా వేయుట అని అర్థం!
  ****)()(****
  అరివీరులకు నివాళియె
  మరిమరి యర్పించ దలచి,మార్చుచు నపుడే
  మరియొక వేళకు తగునని
  "జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్"

  రిప్లయితొలగించండి
 23. పురమున కుహనా ప్రముఖుకు
  తరిగినదొకసాలు మీకు ధరణిపయిన యీ
  తరుణమునందయ్యో యని
  జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రముఖునకు' అనడం సాధువు. అక్కడ "కుహనా నేతకు" అనండి.

   తొలగించండి
 24. పుట్టిటివటయీరోజున
  పుట్టినయోశంకరార్య!పోడిమితోడన్
  బుట్టుకయంతయుగడుపుము
  చట్టునిగానాదునతులుస్వామీ!యివియే

  రిప్లయితొలగించండి
 25. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 26. అరయగ నీకాలపు ప్రజ
  తరతమ భేదంబులేక దనరుచు మిగులన్
  నిరవౌకాదో తలపక
  జరిపిరిజన్మదినమనుచుసంతాపసభన్

  రిప్లయితొలగించండి
 27. పూజ్య గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు! ఇటువంటి ఆనందకర పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, నమస్సులతో
  సీతాదేవి. 🎂🎂🎂💐💐💐🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 28. అరి పక్ష్య నాయకుండని
  వెరపున నగుబాటు జేయ వెక్కసమొదవన్
  పురమందిరమున ఘనముగ
  జరిపిరి జన్మదినమనుచు సంతాపసభన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అరిపక్ష' టైపాటు!

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! టై పాటే! మన్నించండి! 🙏🙏🙏

   తొలగించండి
 29. గురువర్యులకు నమః పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి

 30. పాపం కవి రాట్ :)


  గిట్టని వారటంచు గిరి గీసుకొనన్ మది రాక బిల్వ గా
  చట్టని వెళ్ళినాను కవి సత్కృతి జన్మ దినమ్ము మీకనన్
  తట్టక పోయెనయ్య యిది తంత్రము హేళన చేయ నన్ను! హా!
  పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. .......పూజ్య గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు.......

  రిప్లయితొలగించండి
 32. పూజ్యులు గురు వరేణ్యులు శంకరయ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. వారికి సంపూర్ణాయు రారోగ్యములు ప్రసాదించ వలెనని భగవంతుని ప్రార్థించు చున్నాను.

  రిప్లయితొలగించండి
 33. కరుణ వరదలై పాఱగఁ
  బురుష వరేణ్యుం డొకండు పుట్టగ గ్రీష్మం
  పు రెయిని నెండలు మండగ
  జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్

  [సంతాప సభ = మిక్కిలి వేడి సభ]


  కరుణను వీడఁగ దైవము
  పురుష వరేణ్యుం డొకండు పుణ్యపు లోకం
  బరిగినఁ బుట్టిన రోజున
  జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్


  దట్టపుఁ గ్రూర భావమున దైత్య వికారుఁడు నాంగ్ల దేశపుం
  బుట్టుక వాని పంపున నపూర్వపు రీతి నమృత్సరమ్మునన్
  గిట్టిరి మిక్కిలిన్ జనులు కేళి వనమ్మున నుండ దానికిం
  బుట్టిన రో జటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 34. పుట్టిన రోజుగా మదికి బోధకమయ్యునుజింతజేయకే
  పుట్టిన రోజటంచు గడుబూనిక శోకసభన్రచించిరే
  యిట్టులనుండెబోప్రజలునీయదిసత్యమ?కాద?పల్కిరే
  యెట్టులుమార్చగా నగునునిట్టిజనంబులనిధ్ధరన్రమా!

  రిప్లయితొలగించండి
 35. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆర్యా

  సమస్య :-
  "జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్"

  *కందం**

  అరకొర జ్ఞానము గలిగిన
  పురవాసులు రాజకీయ పురుషుని ప్రతిమన్
  పరవశము బొంది వేడ్కగ
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్

  రిప్లయితొలగించండి
 36. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2735
  సమస్య :: పుట్టిన రోజటంచు కడు పూనిక శోకసభన్ రచింపరే.
  పుట్టినరోజు అని చెబుతూ సంతాప సభను ఏర్పాటు చేయరా అని అడగడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన సందర్భం.
  శ్రీయుతులు రాజశేఖర రెడ్డి గారు ప్రజలను గొప్పగా పరిపాలించినారు. ఘన కీర్తులను పొందినారు. ఎన్నో మంచి పనులను చేసినారు. ఐతే హఠాత్తుగా భువి నుండి దివికి వెళ్లిపోయారు. వారు చేరుకోగా స్వర్గం విరాజిల్లింది. వారు మమ్ము విడిచి వెళ్లినారు అని బాధతో ప్రజలు వారి స్ఫూర్తికి పుట్టిన రోజు అని అంటూ సంతాప సభను జరుపుతున్నారు అని తెలిపే సందర్భం.

  పుట్టెను రాజశేఖరు, డపూర్వముగా ప్రజ నేలినాడు, చే
  పట్టెను కీర్తిరాశిని, శుభమ్ముల గూర్చెను, ధాత్రి వీడి కా
  ల్వెట్టెను స్వర్గమందు, దివి వేడుక సాగెను, వారి స్ఫూర్తికిన్
  ‘’పుట్టినరోజటంచు కడు పూనిక శోకసభన్ రచింపరే.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
  (17-7-2018)

  రిప్లయితొలగించండి
 37. పుట్టిన రోజు బాలునికి ప్రొద్దది గ్రుంకగ పార్టి యంచు నా
  వట్టి రసాయనమ్ములను వార్చిన స్ప్రేలవి గొట్టినంతనే
  దట్టము గా దవానలము దాపునఁ బుట్టి దహించె నక్కటా!
  *"పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంగ్ల పద ప్రయోగము చేయకుండా ఉండడానికి విఫల ప్రయత్నం చేశాను. సరైన పదాలు తట్టలేదు. క్షంతవ్యుడను.

   ఈమధ్య వాట్సాపులో వచ్చిన పార్టీ ప్రమాదాల వీడియోలు ప్రేరణ.

   తొలగించండి

  2. పార్టీ చేసుకోవడం గట్రా మన సంప్రదాయం కాదు కదండీ కాబట్టి వాటికి ఆపదాలే సరి :)


   జిలేబి

   తొలగించండి
  3. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. జిలేబి వారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు
   🙏🏻🙏🏻

   తొలగించండి


 38. పుట్టెను భారతాంబ కొక పుత్రుడు మిక్కిలి దేశభక్తుడై
  మెట్టెను రాజకీయముల మించెను దేశ ప్రధాన మంత్రియై
  యట్టి మహానుభావుడు జరాదులచే దపియింప ప్రేమతో
  పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే.

  రిప్లయితొలగించండి
 39. గురువుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 40. గురువర్యులు కందిశంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు....

  కం!

  అందరి ప్రేమలు,మన్నన
  లందుకొనిన కంది శంకరయ్యాఖ్యులు మా
  డెందమలర జీవించగ
  వంద వసంతములు భక్తి భజియింతు హరిన్

  ~ ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 41. నరహరి మందిరమందున
  జరిపిరి జన్మదినమంచు"సంతాపసభన్
  మరుసటిరోజున బాడుగ
  అరుదుగనేజిక్కెననచు నథితులుమెచ్చన్

  రిప్లయితొలగించండి
 42. అరయగ రావణు డేలిన
  పురమది శ్రీలంక యందు పురజను లెల్లన్
  హరివైరిఁ గౌరవించుచు
  జరిపిరి జన్మదినమనుచు సంతాప సభన్.

  రిప్లయితొలగించండి
 43. పుట్టినరోజు వేడుకలు భూరిగ జేయగ నెంచి మిత్రులన్
  కిట్టడు భావినాయకుడు కీర్తిని కోరెడు వాడు పిల్వగన్
  పట్టణమేగి యచ్చటనె ప్రాణము వీడగ శోకతప్తులై
  పుట్టిన రోజటంచు గడు బూనిక శోకసభన్ రచించిరే.

  రిప్లయితొలగించండి


 44. అరయన్ పార్టీలనటన్
  జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
  పిరియము గా గంధవతిన్
  సరసన జేర్చుకొనిరి సరసాంగి! జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 45. ఆటవిడుపు సరదా పూరణ
  ("Fair & Ugly")

  కొట్టుచు కొబ్బరుల్ పదులు గొప్పగ జేయగ భూమిపూజయున్
  గట్టిగ గోడలన్నిటిని కట్టగ పెట్టగ ద్వారబంధమున్...
  ముట్టగ కానరాగనట పుట్టలు పుట్టలు తెల్లవౌ...చెదల్
  పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఒక
   అద్భుతమైన
   ఆలోచన
   వచన కవిత లో
   వయ్యారాలు పోతా వుంటే ,
   ఛందం లో చచ్చి సగమై
   బిక్క మొగమేసి
   నిలబడుతోంది !


   జిలేబి

   తొలగించండి

  2. ఆబ కందము అర్థము నాకూ కాలే :)

   కొట్టిరి కొబ్బరి కాయల
   గట్టిగ యిడుపులను గట్టిగాకట్టిరయా
   పుట్టల కొలదిగ చెదలై
   పుట్టిన రోజనుచు మురిసి పోయిరి జనులున్ :)

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారి పూరణ, దాని ననుసరించిన జిలేబీ గారి పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 46. కవిశిక్షకులు, కవిప్రేరకులు శ్రీ కందిశంకరకవీంద్రుని జన్మదినోత్వవసందర్భం లో నా ఆకాంక్ష.
  శార్దూలశ్లోకం.

  జీయా త్కందిసువంశమండనకవి, ర్జేగీయతాం సజ్జనైః,
  దీర్ఘాయు శ్చ సమేధతాం, ప్రవిలసత్కీర్తిం చ రారాజతాం,
  ఆరోగ్యం చ వివర్ధతాం, కవివరా స్తచ్ఛిక్షణం ప్రాప్యతాం,
  భూయాసు ర్జననోత్సవా హ్య గణితా, శ్చేత్థం శివం ప్రార్థయే.

  రిప్లయితొలగించండి


 47. అరరే కట్టెయు రాగన్
  జరిపిరి జన్మదిన మనుచు,సంతాపసభన్
  కురిపించిరి కన్నీళ్లన్
  సరి కట్టెయుబోవగాను సహజమిదిగదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ యీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 48. పుట్టు వశాశ్వతం బనియు, భూరిసమార్జిత విత్త మేదియున్
  జట్టుగ వెంట రాదను, విచార మొకింతయు లేక దుష్టుడై
  గిట్టిగ, దుర్దినమ్ము వలె కృత్యము లయ్యవి దల్చి, వానిదౌ
  పుట్టిన రోజ టంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచింరే?.

  రిప్లయితొలగించండి
 49. అరయగ వ్యాకరణంబున
  వరమగు వ్యుత్పత్తిగలదు "వర్ధంతి"యనన్
  అరయక "జయంతి" యర్థము
  జరిపిరి "జన్మదిన" మనుచు సంతాపసభన్!!

  రిప్లయితొలగించండి
 50. పూజ్య గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.
  ........దేవిక.

  రిప్లయితొలగించండి
 51. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షాలు!

  మిత్రులందఱకు నమస్సులు!

  [సైనికుఁడైన తమ కుమారుఁ డా నాఁడు తన పుట్టిన దినమైనను, తన విధులు నిర్వర్తించుచు, సరిహద్దులలో శత్రుసైనికులతోఁ బోరాడుచు, వారి చేతికిఁ జిక్కి, మరణించఁగా, నా కుమారునిఁ దలంచుకొని యేడ్చెడి తల్లిదండ్రుల వేదనాపూరిత వాక్కులు]

  "బొట్టె! యిదేమిటయ్య? కనఁ బుట్టినరోజును సంతసమ్మునన్
  గట్టిగ స్నేహితుల్ జరుప, నట్టడవిన్ విడనాడి మమ్ము; నీ
  వెట్టి కనంగరాని దివి కేఁగితివయ్య? సిపాయివై యటుల్
  కొట్టుచు వైరులన్ మిగులఁ, గ్రూరుల చేఁతనుఁ జిక్క, నిన్ దుదన్
  ముట్టఁగఁ జేసిరే! కొడుక! పుట్టిననాఁడిటు లేఁగితే దివిన్?
  గట్టిఁడి పాపు లిట్లు కనుఁగానని ద్రోహముఁ బూని నీకటన్
  బుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే?"

  రిప్లయితొలగించండి
 52. ఇంగ్లండ్ లో పుట్టె నింగ్లీషు రచయిత విలియము షేక్ ష్పియర్,వెలిగి పోయె
  నాతడు వ్రాసిన నాటకములు జగతి నలుదిశల లోన దీప్తి బడసి,
  మరణము నొందెను సరియగు జనన దినము నందు, ముదపు సభను జరిపిరి
  జన్మదిన మనుచు, సంతాప సభనెల్లరు జరిపి పొగడినారు ఘన మైన
  కీర్తి ,రోమియో జూలియట్ కేళి రూప
  మందు కొందరాడి జనుల మనసు దోచ.
  జూలియస్సు సీజరు నాడి హేల నిడెను
  సభల లోన జనమునకు సరస గతిని

  విలియము షేక్ ష్పియర్ జననము మరణము రెండును ఒకే దినములోన
  Life always surprises us. Filled with numerous twists and turns, it never follows a particular pattern. Nothing is certain about life. Neither can we choose the day of our birth, nor the time of our death. However, as luck would have it, there are a chosen few for whom, life, very strangely, came a full circle. Among the very few, these 15 famous people died on the same day they were born. Sadly, for them, birthdays, that are always associated with cheer, took a rather morose turn.

  WILLIAM SHAKESPEARE: The famous English playwright and poet was born on April 23, 1564 and passed away on April 23, 1616. (Source: Thinkstock Images)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణసూర్యకుమార్ గారూ,
   కంద పాదాన్ని సీసపద్యంలో ఇమిడ్చి గర్భకవి ననిపించుకున్నారు. ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 53. దీపమ్ జ్యోతి పరబ్రహ్మమ్ అది లోకైక
  దీపాంకురమ్
  చీకటి నొదులు వెలుగుల మయమ్ మనమున
  తమముల సంహారమ్
  వెలుగు నార్పగ కూడిరి పదుగురు చీకటులను
  వచించిరే
  పుట్టిన రోజటంచు గడు బూనిక శోకసభను
  రచించిరే

  రిప్లయితొలగించండి
 54. మరిమ దినమాయె షేక్ ష్ పీ
  యరు పుట్టిన రోజు నాడె యతని కిచట న
  బ్బురముగ, జనమ్ము ఘనతన్
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్

  రిప్లయితొలగించండి
 55. వరమగుచు సుతుడు గలుగగ
  జరిపిరి జన్మదిన మనుచు; సంతాప సభన్
  పొరుగింట జరిపె, తండ్రికి
  సరిగన్ వత్సర మగుటను సంస్మరణముగన్!

  రిప్లయితొలగించండి
 56. అరయగ యొకనాయకునకు
  పరముగ పుట్టిన దినమునె వర్థంతి బడన్
  పురజనులందరు ఘనముగ
  జరిపిరి జన్మదినమనుచు సంతాపసభన్!!!..

  రిప్లయితొలగించండి
 57. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  " పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే! "

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  పుట్టిన రోజు పండుగకు పోయిన బంధు వొకండు "పుట్టు ట
  న్నట్టిది కాదె శోకమున కాది యగున్! మరి మీద నెన్నియో
  గుట్టల తీరుఁ గూలెడి నొకో!" యని పల్క.. నొకండు ని ట్లనెన్
  " పుట్టిన రో జటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే! "

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  17.7.18

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారికి నమస్సులు.
   నరుదుగ వేడుకను తొలుత
   జరిపిరి జన్మదినమనుచు,సంతాపసభన్
   మరణించిన బంధువులన్
   మరల మరల తలచుదురే మాన్యత నొందన్.

   తొలగించండి
  2. డా. వెలుదండ వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   **************
   వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   __/\__

   తొలగించండి
 58. కందం
  దురహంకారుడు నేలిక
  నెరవేర్చడు ప్రజల కలలు నేతగ వానిన్
  దరుమంగ విపక్షమ్ములు
  జరిపిరి జన్మదిన మనుచు సంతాపసభన్

  ఉత్పలమాల
  గుట్టుగ గూఢచారులుగ గూర్చుచు విశ్వసనీయు లందరిన్
  బట్టుచు పాలకుల్ సతమున్ పాలన మందున జేయుతప్పులన్
  నెట్టుచు నేతపై నెపము నీచుని జేసి విపక్షమెల్లరున్
  బుట్టిన రోజటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తం రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   గుట్టుగ గూఢచారులుగ గూర్చుచు విశ్వసనీయు లందరిన్
   బట్టుచు పాలకుల్ సతము పాలన మందున జేయుతప్పులన్
   నెట్టుచు నేతపై నెపము నీచుని జేసి విపక్షమెల్లరున్
   బుట్టిన రోజటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే

   తొలగించండి
 59. దేవిక

  సిరి యను బాలకు వేడుక
  జరిపిరి జన్మదినమంచు ; సంతాప సభన్
  పురిటిని సుతన్విడి జనని
  పరమున కేగుట దలంచి వగచిరి హితులున్ !

  రిప్లయితొలగించండి
 60. సవరణతో..
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్

  సందర్భము: ప్రముఖ ప్రపంచ విషాదాంత నాటక రచయిత విలియం షేక్స్పియర్. హామ్లెట్, రోమియోఅండ్ జూలియట్, మాక్బెత్ మున్నగునవి ఆయన రచనలు.
  ఆ మహా రచయిత జనన మరణా లొకే తేదీనాడు సంభవించడం సృష్టి వైచిత్రి. అది 23 ఏప్రిల్.. జనన సంవత్సరం 1564.. మరణ సంవత్సరం 1616..
  ఆ విషయమే గుర్తుంచుకోవడాని కుపకరిస్తుం దని పొడి పొడి అంకెలలో అందినంతమేర పొందుపరిచాను.
  ఆరోజే ఆతనికిమాత్రం జన్మదినం.. మృత్యుదినం... నిరభ్యంతరంగా..
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ధర.. నొక టా రొక టారును
  మరి.. యొక టై దారు నాల్గు
  మరణము జననం...
  బిరువది మూ డెప్రేలే!
  జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  17.7.18

  రిప్లయితొలగించండి
 61. అరిగినను దివికి నేతకు
  జరిపిరి జన్మదిన మనుచు.. సంతాపసభన్
  జరుపుచు నుందురు ప్రతి వ
  త్సరమును వీడక యతనికి తద్దినముననే

  రిప్లయితొలగించండి
 62. తిట్టుచు రాష్ట్రభక్తులట త్రిప్పుచు నెత్తిని నక్లిఖడ్గముల్
  కొట్టుచు ద్వేషభాషణలు కుత్తుక నొవ్వగ బొబ్బరిల్లుచున్
  చెట్టున గుడ్డ బొమ్మనిడి చిచ్చును పెట్టి మహాత్మ గాంధిదౌ
  పుట్టినరో జటంచుఁ గడుఁ బూనిక శోకసభన్ రచించిరే

  రిప్లయితొలగించండి