19, జులై 2018, గురువారం

సమస్య - 2737

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి"
(లేదా...)
"ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్"

109 కామెంట్‌లు:

 1. వంట వార్పులన్ని వదలి వేయుచునుండ
  తిండి తిప్పలన్ని ముండ మోయ
  చదువు సంధ్యలన్ని చంక నాకుచునుండ
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం హృద్యం. 🙏🏼👌
   వదలివేయుచునుండ మామూలు పదబంధ మయింది. తక్కిన రెండు పాదాలతో పోలిస్తే..

   వంటవార్పు లన్ని తంటవాయుచునుండ...
   అని తొలిపాదం వుంటే తక్కిన రెండుపాదాల స్థాయిలో వుంటుందేమో అని నా ఊహ.

   ...డాక్టర్ వెలుదండ సత్యనారాయణ

   తొలగించండి
  2. ఆర్యా! భాష కొంచెము వెగటుగా నున్నది! సంస్కరించిన బాగుండునేమో! 🙏🙏🙏

   తొలగించండి

  3. అన్నయ్య యైన విడువము
   మన్నిక యైనట్టి భాష మరిచిన వేళన్ :)


   జిలేబి

   తొలగించండి
  4. నా హైదరాబాదు ఆటవెలదిలో:
   మొదటి పాదం = zomato
   రెండవ పాదం = sugar
   మూడవ పాదం = 52" led TV

   తొలగించండి

  5. వామ్మో ! వామ్మో ! చెల్లెమ్మ గారు వాయించేరని ప్లేటు ఫిరాయించి భాష్యం వేరే గా రాసు కోవడమే :)

   ఒల్లమండీ ఒల్లము :)


   జిలేబి

   తొలగించండి
  6. ప్రభాకార శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చెల్లెమ్మలతో వాదప్రతివాదాలకు నాకు ఓపిక లేదండీ!

   తొలగించండి
  7. దుష్టసమాసాలతోనే చిక్కేగాని, దుష్టభాషతో కాదనుకుంటా గురువుగారికి! నమోనమః!!🙏🙏🙏

   తొలగించండి
  8. ముండమోయు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక
   దే. అ.క్రి .

   2. వ్యర్థమగు

   *******************************

   చంకనాకు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 గ్రంథసంకేత వివరణ పట్టిక
   అ.క్రి.

   లొంగిపోవు

   తొలగించండి

  9. దుష్టభాష శిష్టమా దుష్టమా సాధువా అసాధువా :?   జిలేబి

   తొలగించండి
  10. వంట వార్పులన్ని మంట గలసి యుండె
   తిండి తిప్పలన్ని దండు గాయె
   చదువు సంధ్యలన్ని చట్టబండలు నాయె
   ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

   తొలగించండి
  11. Sir:

   This is called "bowdlerizing":

   *****************************

   bowd·ler·ize (bōd′lə-rīz′, boud′-)
   tr.v. bowd·ler·ized, bowd·ler·iz·ing, bowd·ler·iz·es

   To remove material that is considered offensive or objectionable from (a book, for example); expurgate.

   https://www.thefreedictionary.com/bowdlerize

   తొలగించండి
  12. శాస్త్రి గారు నమస్సులు. మీ పూరణములో నసభ్యమైనవి యేమి లేవు.
   భావము బాగుండుట వలను శబ్దలాలిత్యమును గూడ జత చేయ ప్రయత్నించితిని. అంతే.
   ముండ = స్త్రీ, కాలక్రమమున విధవ ,వేశ్య స్త్రీగా పరిణమించినది. మాట యసభ్యము కాదు.
   “..ఈ / ముండకు జుల్క నైతి గద మూరిన దుర్విధి నేమి చెప్పుదున్” పల్నాటి బాలచంద్రుని పల్కులు.

   చంక మాటలో నసభ్యత లేదు. వ్యావహారికములో “చంక నాకు” తిట్టుగా కన్పించుచున్నది. కుంభకోణము వలె. ప్రయోగ వర్జితము కాదనే యనుకుంటాను.

   అయినా నలుగురి యభిప్రాయములను మన్నించడము కవుల కుచితము.

   తొలగించండి
  13. నిజమే!

   "ముండమోయు", "చంకనాకు", "గుండుకొట్టు"...

   ఇత్యాది పదములు dead metaphors క్రిందకు వచ్చునని నా అభిప్రాయము. ప్రస్తుత పరిభాషలో వీటికి "ముండ", "చంక", "గుండు" లతో సంబంధం క్షీణించినదని.

   అందుకనియే కాబోలు శబ్దరత్నాకరము వంటి నిఘంటువులలో వీటిని కలిపి వ్రాస్తారు ("ముండ మోయు" లా కాకుండా)...

   నమస్సులు!

   https://en.m.wikipedia.org/wiki/Dead_metaphor

   తొలగించండి
  14. జిలేబి గారు:

   "దుష్టభాష" సాధువు (నా లాగే)

   తొలగించండి


  15. దుష్టభాషకు జయమహో! ధూర్తపల్కు
   సర్వ సాధారణంబహో సాధువైన
   చాలు పద్యము వ్రాయవచ్చని తెలిసె జి
   లేబి రాసుకో పదముల లెస్సగాను :)

   జిలేబి
   (ఇవ్వాళ అన్నయ్య గారిని వదిలేది లే :))

   తొలగించండి
  16. Rated Best SEO Company in Faridabad, Haryana, we offer quality Digital Marketing and SEO Services. Contact the #1 SEO Services Company in Faridabad for SEO charges.

   తొలగించండి

 2. వారె వా జిలేబి :)

  చిదిమి దీపము నిడు చిన్ననాటి హరిమ
  నుండి నెరసిన తల నొంచు హరిమ
  దాక నిగ్గులాడి తను చింత తనకేల
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి!


  జిలేబి
  కుదిరె పండిత సభ క్రుమ్మరింప కవితల్ :)

  రిప్లయితొలగించండి
 3. పతియె యున్న వేళ పడకింటి కితనని
  జేరనీదు ముద్దు గోర నీని
  కఠిన హృదయు రాలు గయ్యాళి యత్తకు
  ముదిమి మీదబడగ మురిసె బడతి

  రిప్లయితొలగించండి
 4. గురువు గారు ఇక్కడ ణ-న ప్రాసలగురించి ప్రస్తావించారెందుకో? అర్థమవడం లేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. టెంప్లేటు ప్రాబ్లెమ్ అయి వుంటుంది

   తొలగించండి
  2. ముందుగా "గుణవంతుడు గలుగు కొంప కొల్లేరగురా" అన్న సమస్యను షెడ్యూల్ చేశాను. దీనికి నేను సిద్ధం చేసిన వృత్తపాదం సంతృప్తికరంగా లేక ఆ సమస్యను మార్చాను. కాని చివరి 'ణ-న ప్రాస నిషిద్ధం' అన్న వాక్యాన్ని తొలగించడం మరచిపోయాను.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  వదలరు మమ్మునొంటరిగ , వచ్చెదరెక్కడికేని , భర్తతో
  పది దినముల్ విలాసముగ బాధ్యతలన్నియు విస్మరించియున్
  ముదమును పొంద యాత్రలకు బోవగ నెంచగ , నత్తమామలున్
  ముదిమినిఁ బొందఁగా ., మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉదయము బాలభానుడన నొప్పునతండట మధ్యకాలమం...
   దు దనరు యౌవనస్థుడన , దోచు దినాంతమునందు నాతడే
   ముదిమినిఁ బొందినట్లు , వలపుల్ చెలరేగ ., దివాకరుండటన్
   ముదిమినిఁ బొందఁగా ., మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

  2. దివాకరుని పద్యము చాల బాగున్నది.
   దానికి ప్రభాకరుల సైదోడు కూడా


   జిలేబి

   తొలగించండి
  3. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. అందె పెత్తనమ్ము అత్తమామలకును
  ముదిమి మీఁదఁ బడఁగ, మురిసెఁ బడఁతి
  మదను కేళిలోన మగని తామెప్పించి
  యంద లమ్ము నెక్కి పొంద సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పెత్తనమ్ము + అత్త' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "పెత్తనమది యత్త..." అనండి.

   తొలగించండి
 7. దేవిక
  -------

  అత్త గారు తనను ఆరళ్ళు బెట్టగ
  కోడరికము నెరిపె కోమలాంగి
  సత్తు సన్నగిల్లి యత్త మూలనబడి
  ముదిమి మీద బడ మురిసె బడతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దేవిక గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తనను + ఆరళ్ళు' అని విసంధిగా వ్రాయరాదు. "అత్తగారు సతత మారళ్ళు..." అనండి.

   తొలగించండి
  2. దేవిక
   -----
   ధన్యవాదాలు గురుదేవా! దోషం సవరించుకుం టాను.

   తొలగించండి
 8. ఏమి నేర్వ కున్న నిల్లాలి వెట్లౌదు
  వన్న వారి మాట లెన్ని చదివి
  వినయ భరిత యౌచు విజ్ఞాన బలిమిచే
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   జ్ఞానవృద్ధను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. ఆరుటకు ముందు చూడు దీపము అధికమై
  తాను వెలుగునట
  కళ్ళ కాటుక కాళ్ళకు గజ్జెలు ముసలితనమున
  సోకులట
  వయసున తీరని పడుచు కోర్కెలు వయసుడిగిన
  ఆర్తిగన్
  ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దు
  లొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 10. పెత్తనాలపెంపు సత్తువలా బెరిగి
  వయసు మీరగానె భయము బెరుగ!
  "మారికోడలన్న మర్యాదలుంచెను
  ముదిమిమీదబడగ" మురిసెబడతి!

  రిప్లయితొలగించండి
 11. సమస్య : ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్

  (మహాశివభక్తు డైన చిరుతొండనంబిని పరీక్షించేందుకు జగత్పితరులు వృద్ధ మూర్తులైనపుడు పార్వతి పరమశివుని ముద్దాడే సన్నివేశం)

  సదమలమానసంబునను శంకరుసేవల జేయు భక్తునిన్ ;
  గదలని శైవదీక్షితుని ; గమ్రమతిన్ ; జిరుతొండ నంబినిన్
  బదనుపరీక్ష సల్ప శివపార్వతులిర్వురు నొక్క మాటుగా
  ముదిమిని బొందగా; మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్ .

  రిప్లయితొలగించండి

 12. ముదిమి యదేమి పోరచియ ? పోడిమి గాదె జిలేబికిన్ భళా
  చిదిమి ప్రదీపమున్ తనదు చెక్కిలి పైనిడు నాటి నుండి తా
  పొదికిలి ముద్దు లొల్కు పువుబోడియ ! అందము చూర బోవునా
  ముదిమినిఁ బొందఁగా ? మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కనమ్మ యెప్పుడైనా అందమే!!👌👌👏👏

   తొలగించండి

  2. నమో నమః సీతాదేవి గారు
   వందశాతం రైట్ :)

   జిలేబి

   తొలగించండి
  3. 👌🏻👏🏻🙏🏻
   అందమంటే కన్నులకింపైనదే కదా!
   అనురాగమున్నపుడు ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు.
   😀

   తొలగించండి
  4. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. సాగ రమ్ము వంటి సంసార భారమ్ము
  నప్పగించి తాను హాయి నొ oది
  రామ కృష్ణ యనుచు రమ్య నామ జపాన
  ముదిమి మీద బ డ గ మురిసె బడ తి

  రిప్లయితొలగించండి
 14. అందమైన యువతి యగచాట్ల పాలాయె
  నంద మామె శత్రు చంద మాయె
  నిడుమల నడుమ తన యీడంత గడువగా
  "ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శత్రు చందము' అన్నది దుష్టసమాసం.

   తొలగించండి
 15. ఏండ్లకేండ్లు గడచె నీశ్వరుని మరచి
  పతిని, సంతు జాక పడతి బ్రతుకు
  మోక్షమందగాను మోహమ్ము దొలగించు
  ముదిమి మీద బడగ మురిసె బడతి

  రిప్లయితొలగించండి
 16. చదువు సందెలన్ని సంతుకు చెప్పించ
  సంతసముగ సుతుడు సాకు చుండె
  భర్త కాలమొంద బాధ్యత చేపట్టి
  ముదిమి మీద బడగ మురిసె పడతి

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2737
  సమస్య :: ముదిమిని పొందగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్.
  భర్త ముసలితనాన్ని పొందగా చూచి మురిసిపోతూ భార్య ముద్దులు పెట్టింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
  సందర్భం :: యయాతి మహారాజు శుక్రాచార్యుని కుమార్తె యగు దేవయానిని వివాహం చేసికొని సంతతిని పొందినాడు. ఆమె చెలికత్తెయైన శర్మిష్ఠను కూడా పెండ్లియాడి ఆమె ద్వారా కూడా సంతానమును పొందినాడు. ఈ విషయం తెలిసికొన్న శుక్రుడు శాపం ఇవ్వగా యయాతి ముసలితనమును పొందినాడు. యయాతి తన ముసలితనాన్ని తీసికో అని చిన్నకుమారుడైన పూరుని కోరగా సమ్మతించిన పూరుడు తండ్రి ముసలితనాన్ని పొంది, కొంతకాలం తరువాత తండ్రి దగ్గఱి నుండి యౌవనాన్ని తిరిగి పొందినాడు. గతంలో తాను ముసలివాడుగా మారిన ఈ విషయాన్ని గుఱించి పూరుడు తన భార్య యైన కౌసల్యకు తెలియజెప్పే సందర్భం.

  ఇది యని పూర్వగాథ వచియింప యయాతిసుతుండు, ‘’పత్ని! నా
  ముదిమిని స్వీకరింపుడని పుత్రుని నన్నడుగంగ తండ్రి, నే
  ముదమున సమ్మతించితి నపూర్వమునౌ పితృవాక్యపాలనన్
  ముదిమిని పొందగా’’; మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
  (19-7-2018)

  రిప్లయితొలగించండి
 18. వదలడు సేయినింకఁ దన వాంఛల నన్నియుఁ దీర్చుచున్ సదా
  మెదలును తోడునీడగను మీఱకఁ జేసిన బాసలన్నియున్
  కదలిన కాలమంత తన కన్నుల ముందర కానుపించగా
  *"ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మీరక చేసిన' అనండి. 'అక' ప్రత్యయం కళ.

   తొలగించండి
  2. గురువులు శ్రీ సూరంవారి సవరణ:

   వదలడు సేయి నెన్నడును వాంఛల నన్నియుఁ దీర్చు నిచ్చలున్
   మెదలును తోడునీడగను మీఱడు చేసినబాస లీగతిన్
   కదలిన కాలమంత తన కన్నుల ముందర కానుపించగా
   *"ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్"*

   తొలగించండి
 19. కాళ్ళుసేతులాడకబలహీనమగును
  ముదిమి మీదబడగ,మురిసె పడతి
  తానుకోరుకొనునతడుభర్తగారాగ
  నింతకంటెమంచియేమి యుండు!

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. ముదిమియరాకతోముదితమోహముపెచ్చుగగల్గగా,మదిన్
  ముదిమినిబొందగామురిసిముద్దియ ముద్దులొసంగెభర్తకున్
  నదియెగ వారియిర్వురివి,హాస్యపుచిహ్నములట్లుగన్పడెన్
  ముదమునగొల్వగానిడుదుమోహనమూర్తినివేంకటేశునిన్

  రిప్లయితొలగించండి
 22. రక్తిగ మనుమలు, మనుమరాండ్లు, పతియు
  సుతలు, జామిజామాతలు, సుతులు, సహజ
  సహజులు,మరిదిమరదళ్ళు సంతసమును
  పూన్చ ముదిమి మీదబడగ మురిసె బడతి

  అరువదేండ్ల ప్రాయమామూలమవ్వగ
  సహచరులు సచివులు జతగ గూడి
  షష్ఠిపూర్తి వేడ్క జరుపనెంచినవేళ
  ముదిమి మీదబడగ మురిసె బడతి

  రిప్లయితొలగించండి
 23. శుక్రు శాప ముక్తి చొప్పడు విధ మెంచి
  ధరను దారుణమని తలఁచకయె య
  యాతి కొడుకు పరువ మంది వేగమ వీడి
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి


  ముదమున బెస్త దంపతులు మూరి సముద్రము సేరి శీఘ్రమే
  పదముల యందుఁ బమ్ముకొన వారిజనేత్ర వికాసవంతమై
  యదరుచు నున్నయండజము నారయఁ ద్రుళ్ళుచు నంది తా ముద
  మ్ము దిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్

  [తిమి = పెద్ద చేప / సముద్రము]

  రిప్లయితొలగించండి
 24. వదరుట మానివేసితివి, పౌరుష మంచు శివాలు త్రొక్కుచుం
  గదుముట లాగె, నా పలుకు కర్ణము లొగ్గి గ్రహించి చేయుటల్
  కుదిరెను, తోడు రమ్మనుచు కోరుచు నుంటివి పోవు చోటికిన్,
  పదనిస లాయె నాబ్రతుకు బాటను నేటి కటంచు ప్రేమతో
  ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్.

  రిప్లయితొలగించండి
 25. ఆలు మగల మధ్య ఆత్మీయత పెరుగు
  ముదిమి మీఁదఁ బడఁగ. మురిసెఁ బడఁతి
  మగని మనసు లోని మమకార మెరుగంగ,
  విదిత మాయె గృహిణి విలువ పతికి.

  రిప్లయితొలగించండి
 26. పెంచిరంట ప్రభుత వృద్ధాప్య పించను
  లంచు తెలియ గానె యతియ బలికె
  తోడు లేని నాకు కూడుబెట్టుననుచు
  ముదిమి మీద బడగ మురిసె బడతి

  రిప్లయితొలగించండి
 27. సదయితయౌవనోద్ధృతనిశాభృశవర్ధిపునారతమ్ములన్
  సదమలకామనార్హపురుషాయితసంతతసంగమమ్ములన్,
  హృదయగతమ్ములం, దలచి,
  లబ్ధరహస్యవిలాసవేళలో,
  ముదిమినిఁ బొందగా, మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్.  రిప్లయితొలగించండి
 28. వార్షికోత్సవమున వార్ధక్యవేషమున్
  వేయవలసివచ్చి వేడ్కతోడ
  సఖియలంకరించ సమ్ముఖిన్ జూచుచు
  ముదిమి మీద బడగ మురిసె వనిత!!!
  సమ్ముఖి = అద్దము

  రిప్లయితొలగించండి
 29. డా.పిట్టా సత్యనారాయణ
  కొదమ సింహమమర గురిసిన వీర్యమ్ము
  జతనమాయె రతన వితము సతము
  జతగ గూడలేని శయ్యన గలసియు
  ముదిమి మీదబడగ మురిసె బడతి
  (సంతానం కొరకే ప్రణయము--ప్రేమ సహజము-నిత్యము)

  రిప్లయితొలగించండి
 30. మిత్రులందఱకు నమస్సులు!

  [శర్మిష్ఠతోడి సౌఖ్యములఁ దేలియాడుచుఁ, దనపుత్రిక దేవయానిని నిర్లక్ష్యము చేసినాఁడని కోపించిన శుక్రుఁడు "ముదిమినిఁ బొందు" మని యిచ్చిన శాపమున కవధికై, యయాతి తన తనయు లైదుగురిని తన ముదిమిని స్వీకరింపుఁడని కోరఁగా, నల్వురు తండ్రి ముదిమిని స్వీకరింపనిచ్చగింపకుండుటచే, నైదవవాఁడును, శర్మిష్ఠ సుతుఁడును నగు పూరుఁడు సమ్మతించి, తండ్రి ముదిమినిఁ దాను బొందఁగా, నాతని తల్లి శర్మిష్ఠ సంతసించి, తన భర్త యయాతిని ముద్దుఁగొను సందర్భము]

  ముదిత కురీర సౌఖ్యమునుఁ బొందుచు, శుక్రుని శాపశక్తిచే
  ముదిమినిఁ బొంది, వేడెనటఁ బుత్రుల నల్వుర; వా రసమ్మతిన్
  గుదియఁగఁ, బూరుఁ డత్తఱినిఁ గూరిమిఁ, దాల్చఁగ సమ్మతించి, యా
  ముదిమినిఁ బొందఁగా, మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్!

  రిప్లయితొలగించండి
 31. ముదుసలు లన్న గిట్టదని ముద్దుల భార్యలు చెప్పినంతనే
  వదులుచు తల్లిదండ్రులను పట్టణమేగగ పుత్రులెల్లరుల్
  వ్యధపడు చున్నవేళన సహాయము జేయ ప్రభుత్వమిచ్చెనా
  ముదమగు వృద్ధ పించనులు, మోదము గూర్చగ సంభ్రమమ్ముతో
  ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దులొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా సత్యనారాయణ
  ఒదిగిన ప్రెమ సంతుకని యూరట జెందగ ముట్లు దప్పగా
  గదిసిన శేష జీవితము గాథలు లేనిది; సత్య ప్రేమమే
  మది విడకుండ సాగునని మానిని జీవన యానమందునన్
  ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దు నొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 33. తల్లిఁ దండ్రు లపుడు దనను బెంచిన తీరుఁ
  దాళిఁ గట్టి నతనిఁ దలచు కొనుచు
  తాను గన్న వారి దాంపత్యములఁ జూచి
  *"ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి"*

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు సరదా పూరణ:
  ("స్వర్గమితి స్వర్గమితి పరమం పవిత్రం")

  చదువుల నారితేఱుచును చక్కని జీతముదెచ్చు సూనుతో
  చిదిమిన దీపమా యనెడి చిన్నరి కోడలు చెంతనుండగా
  కదలిన పండ్లకన్నిటికి కట్టుడు బెట్టుచు కౌగలించుచున్
  ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఆబ కందము :)
   చదువన్ బాగుగ పోడిమి
   కుదిరిన కొమరుడు మురిపెపు కోడలు మగడో
   పదిలము గా తన దాసుడు
   ముదిమిని ముద్దుల నొసంగె ముదిత జిలేబీ :)


   జిలేబి

   తొలగించండి

 35. అదనున బెండ్లియాడి తన యచ్చటముచ్చట దీరగాదగన్
  ముదమును గూర్చెడిన్ దనయు బొందగ పెద్దల మెప్పు నందుచున్
  తదుపరి పౌత్రులన్ బడసి తామరతంపరగా ప్రపౌత్రునిన్
  ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దునొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 36. డా.పిట్టా సత్యనారాయణ
  ఒదిగిన ప్రెమ సంతుకని యూరట జెందగ ముట్లు దప్పగా
  గదిసిన శేష జీవితము గాథలు లేనిది; సత్య ప్రేమమే
  మది విడకుండ సాగునని మానిని జీవన యానమందునన్
  ముదిమిని బొందగా మురిసి ముద్దియ ముద్దు నొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  రైలు త్వరిత గతిని రానున్న దన్నచో
  సరిగఁ బెట్టె బేడ సర్దుకొనక
  కబురులందుఁ బడెను.. కనుగొన ననిపించె
  "ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి"

  2 వ పూరణము:-

  సందర్భము: "పదవి విరమణ దిన మిదే! ఇక ముదిమి వచ్చేసినట్టే!" అన్న భర్తతో ఒక యిల్లా లే మంటున్నదో చూడండి..
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "అంతము కా దిది యారంభ మనవచ్చు
  సమయమున్ వెచ్చింప సత్కృతులకు..
  నంతము కా దిది యారంభ మనవచ్చు
  సమయమున్ వెచ్చింప సాధనలకు..
  నంతము కా దిది యారంభ మనవచ్చుఁ
  బుణ్యతీర్థాల్ చూడబోవుకొరకు..
  నంతము కా దిది యారంభ మనవచ్చు
  మిత్ర బాంధవులందు మెలగుకొరకుఁ..
  బదవి విరమణ దిన.. మిదియె ముదిమి వచ్చి
  నది, యనంగబోకు.. డిదియె మొదలు
  కొన్ని మంచిపనులకు.." నని పల్కె... పతికి
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  3 వ పూరణము:-

  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  సందర్భము: భర్త పదవీ విరమణకై ఎదురుచూస్తున్న ఒకానొక ప్రత్యేక వ్యక్తిత్వం గలిగిన మహిళ విషయ మిది.
  "ప్రతి దానికీ యేదో ఒక సమాధానం చెబుతాడు మా ఆయన. పదవి ముగియనీ! ఆయన పని చెబుతా" నంటున్న దీవిడ..
  ముదిమి మీద బడుతుం దట! ఎట్లా పడుతుందో మేమూ చూస్తాం.. అంటూ మాట్లాడుతున్న ఆవిడతో.. ఇక మనం యేం మాట్లాడగలం??
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "పుణ్య కార్యంబులఁ బూని చేయు డటన్న
  నాకుఁ దీర దటంచు నసుగుచుండె..
  బ్రదుకు సార్థకములౌ పనులు చేయు డటన్న
  నలసిపోవుచు నుంటి ననుచు నుండె..
  దాన ధర్మంబులు పూని చేయు డటన్న
  చాలదు మన కని ప్రేలుచుండె..
  దైవ చింతనఁ జేసి తరియించుడీ యన్న
  పదవి ముగియ నంచుఁ బలుకుచుండె..
  నా మగనికి ముగియునా యెప్పుడు పదవి!
  యనుచుఁ జూడ నేడె యది ముగిసెను..
  మీదఁ బడు ట దెట్లొ మేముఁ జూచెద" మనె..
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  19.7.18

  రిప్లయితొలగించండి
 38. రిటైర్మెంట్ గిఫ్ట్...

  కదనపు జీవితంబున నిఖార్సుగ పోరునుసల్పినోర్మిచే
  మదనునివైరిబోలు శుభమానసగాత్రునిగన్ పునీతుడై
  పృధివిన కర్మయోగి వలె వేండ్రపు కాలుని గెల్చినారనిన్
  ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గమనిక::- భాష మాత్రమే నాది. భావము పెక్కు పద్యాలనుంచి (సం)గ్రహింపబడింది..

   తొలగించండి


 39. పిన్నవయసునందె పెండ్లియు జరుగగ
  బాధ్యతలవి హెచ్చె పతిగృహమున
  సంతుపెరిగి మంచి సంపాదనమునంద
  ముదిమి మీద బడగ మురిసె పడతి.

  ఇంటి పనులు మరియు వంటపనుల తోడ
  బ్రతుకు గడిచి పోయె బాల్యమందు
  కోడలిల్లు చేరి కూర్మిని పంచగ
  ముదిమి మీద బడగ మురిసె పడతి.

  ఇంతకాలమునకు నీశుని పూజకు
  సమయమొదవెననుచు సంతసించి
  పదవి విరమణవగ పరమహరుషముతో
  ముదిమి మీద బడగ మురిసె పడతి

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  సందర్భము: భర్త తన మాట వినడం లే దని మాన్యులైన శ్రీ కంది వారిని కూడా వదలిపెట్టకుండా ఒకానొక గృహిణి ఎన్ని మాట లన్నదో చూడండి.
  చివరికి మాట "వింటా" నని మగ డన్నా డట! కాదు..కాదు.. ఆమెనే అనిపించిం దట! మంచిదే! (అననైతే అన్నాడు గాని ఆచరణలో... ???)
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "నాదు మగ డటంచు నాదు మగ డటంచు
  పెద్ద కాలంబును బ్రేమఁ జూప
  మగనికి మగడాయె మహనీయుడా *కంది!*
  మా మాట వినకుండ మార్చివేసె..
  పద్యాలు వాయిదా పడకుండ వ్రాయించు
  పనులన్ని వాయిదా పడుచునుండె..
  సిస్టమో సెల్ ఫోనొ యిష్టమా నాకంటె!..
  నింతకంటెను కష్ట మేమి కలదు?
  పత్ని మాట వినని బ్రతుకు బండ లనండు..
  పద్య కాంతకొరకు పాకులాడు.."
  ననుచుఁ దుదకు"విందు"ననిపించె మగనిచే..
  ముదిమి మీఁదఁ బడఁగ.. మురిసెఁ బడఁతి

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  19.7.18

  రిప్లయితొలగించండి
 41. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  పగలు రేయి యనక పాకులాడితిఁ గదా!
  ప్రాయ మంత నేగె పైసకొరకె..
  జగతి పుణ్యమునకు శ్రమియింతు నిపు డని
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి 1.

  మందలించ రైరి మనుజులు న న్నిప్డు..
  దగ్గ రగుదు నింక దైవమునకు..
  నక్కరకును వచ్చు నిక్క మాతడె యని
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి 2.

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  19.7.18

  రిప్లయితొలగించండి
 42. ఆటవెలది
  ఎదురు జూచి జూచి యినకుల విభునకై
  ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి
  కంటి నీదు మోముఁ గౌసల్య నంచును
  రాముడనఁగ శబరిఁ బ్రేమ తోడ

  చంపకమాల
  వదరుచుఁ గోడలమ్మ యమబాధలు నిత్యముఁ బెట్టుచుండగన్
  ముదరగ నామెతో గొడవ పుత్రుని గోరెను యాశ్రమంబునన్
  వదలమటంచు తల్లి సుఖభావన జేయ ప్రశాంత చిత్తయై
  ముదిమినిఁ బొందఁగా, మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్

  రిప్లయితొలగించండి
 43. The era has been running and the acceleration is provided by the online services. Therefore the online might act as the catalyst to look for the top IAS institute in Delhi. The utility of online isfast and accurate.
  Top IAS institute in Delhi
  upsc coaching in Agra
  UPSC coaching in Delhi

  రిప్లయితొలగించండి
 44. నెల్లూరు రంగనాయకమ్మ:👇

  చదువుట కష్టమాయెనని జాణొక సర్జను కాడకేగగా
  ముదిరిన మీద రమ్మనుచు పూవుల బోడిని పంపివేయగా
  తుదకిక కంటిదౌ పొరది తోషము మీరగ కాటరేక్టుకై
  ముదిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్ :)

  రిప్లయితొలగించండి
 45. For best outcomes in IAS test, civil administrations, UPSC tests join Ramanasri IAS Institute now. We give the best investigation material to the two Prelims and principle test of IAS. Ramanasri IAS Institute is the top instructing place for UPSC and common administrations tests which furnishes a high calibre of training with singular consideration. You can concentrate under the specialists and clear the IAS tests accomplishing highest levels.  maths optional

  రిప్లయితొలగించండి
 46. Top ranking is very important for your online business and it is the only way to success online. According to the sources, the first page of Google gives 95 percent web traffic whereas if your website are coming to the second page, then you will get only 5 percent of the total traffic, so rank your website at first page on google is important for your business.

  seo company in Faridabad

  రిప్లయితొలగించండి
 47. Nice Blog With Full of Knowledge
  Thanks For Sharing.. such informative post, I learned a lot from this Post Thank you!!
  Here My website for Pubg Mobile MOD APK check out for all sort of MOD APK.

  రిప్లయితొలగించండి
 48. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 49. Thanks for sharing this valuable and understanding article with us.Finding SEO Company in surat then plusply digital is offering the best SEO Services in surat for your business website or Online Marketing.

  రిప్లయితొలగించండి
 50. Future Of Chatbots

  The future of chatbots can be useful in many aspects of the Customer Experience. It provides customer service, presents product recommendations, and engages customers through targeted marketing campaigns.

  Chatbots are the future and will be around for a long time. Chatbots are useful and create monetary value. Hence, eventually, chatbots will become a fact of our online lives.

  రిప్లయితొలగించండి
 51. Oak Dining Chairs

  Oak dining chairs are a part of our exclusive dining chairs that will fit perfectly with any dining table. The oak dining chairs are constructed from high-quality wooden furniture and oak.

  The oak wood gives your surroundings a versatile look like the color and the grain of the wood is amazing and can exceed your expectations.

  రిప్లయితొలగించండి