15, జులై 2018, ఆదివారం

సమస్య - 2733

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మూషికం బొండు పిల్లిని ముద్దులాడె"
(లేదా...)
"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

88 కామెంట్‌లు:

 1. Tom & Jerry:

  పరుగు పెట్టించి పెరడులో దొరక కుండ
  కలుగు లోనుంచి తొంగుచు వెలికి వచ్చి
  జెర్రి తావచ్చి టాముని వెర్రి జూసి
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  రిప్లయితొలగించండి
 2. నేతల గుణగణమ్ముల నెఱగి కూడ
  పదవిలో ననున్న సచివు వద్ద కేగి
  పలుకు చుండెడు జేజేల ప్రజల గాంచ
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  భూషలు నారవస్త్రములు భోజనముల్ గన కందమూలముల్
  భాషణముల్ పరోపకృతిభాసురముల్ సమభావపద్ధతిన్
  రోషవిహీనులై ఘన మునుల్ చరియించు తపోవనమ్మునన్
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ సమస్య గతంలో ఇవ్వబడినదే... అప్పటి నా పూరణ...

   మూషికమొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్ !
   రోషము రాక యున్నె? యనిరుద్ధబలమ్మున మట్టుబెట్టదే !
   భూషలలంకరించుకొని మోహమదమ్ముల ముద్దులాడ సం...
   భాషణలాడు కీచకుడు వధ్యుడయెన్ వలలాఖ్యుఁ జేరగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి ఇప్పటి, అప్పటి పూరణలు రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. ఆశ్రమం బు న వైరము లంత రించి
  మృగము లన్నియు నేకత న్ మె ల గు చుండ
  కాంచి రచ్చ ట జనుల ప్దు కన్ను లార
  మూషి కం బొండు పిల్లిని ముద్దు లా డె

  రిప్లయితొలగించండి
 5. కోడి పిల్లలు తల్లితో గుట్టు గాను
  గగన మందున దిరిగెడి గ్రద్ద యొకటి
  ముద్దు లొలికెడి కూనలు హద్దు దాటె
  మూషికం బొండు పిల్లిని ముద్దు లాడె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణలో అన్వయదోష మున్నది. భావం అర్థం కాలేదు.

   తొలగించండి
 6. మెత్తనగు వానిఁ గనుగొని మొత్తుచుంద్రు
  సామి మెత్తనైన ప్రజలు సరకుగొనరు
  గ్రుడ్డి తన మావహించిన గుట్టు నెరిగి
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  రిప్లయితొలగించండి
 7. (అమెరికాలోని థీం పార్క్ )
  సిక్సు ఫ్లాగ్సున కేగితి స్థిమితమతిని ;
  కన్ను విందుగ నాముందు కానిపించె
  చిత్రజంతుల వేషాలు స్టేజి మీద ;
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ డిస్నీలాండ్ పాత్రధారుల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. రోషము తోనజూ దమున రొప్పుచు రోజుతు నోడిగెల్వగన్
  వేషము మార్చుచున్ మిగుల భేషజ మొందుచు భీతిగొల్పగన్
  భాషణ మందునన్ మధుర భావన లేకురి పించినంతనే
  మూషిక మొండు పిల్లిఁగని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
 9. సమస్య :-
  *మూషికము బొండు పిల్లిని ముద్దులాడె*

  *తే.గీ**

  బాలలందరు నాటల పాటలందు
  వివిధ బొమ్మల తోడను విసరు కొనెడి
  సమయ మందున నెదురు చప్పున బడి
  "మూషికము బొండు పిల్లిని ముద్దులాడె"
  .................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "సమయమందున నెదుటను..." అనండి.

   తొలగించండి
  2. అవును ఆర్యా గమనించుకోలేదు
   ధన్యవాదములు

   తొలగించండి
 10. ఇంట గెలవగ లేని మగవాడు రచ్చనెటుల తానై
  గెలుచు
  ఇంట్లో పిల్లిగ కనిన జగతి ఎటుల పులిగా
  భయపడి కొలుచు
  మొగుడు తనకు తానెలుకైతె ముదిత తాను
  మార్జాలమనగన్
  మూషిక మొండు పిల్లి గని ముద్దు లొసంగెను
  ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
 11. కలుగు నుంచి పైకొచ్చుచూ కాంచె నెదుట
  మూషికము బొండుపిల్లిని,ముద్దులాడె
  పరుగున వెనుకకు వెడలి పతిని తనకు
  దప్పె చావు నేడనుచు ముదమ్ము తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చుచు'ను 'ఒచ్చుచు' అన్నారు. "కలుగునుండి వెలువడుచు కాంచె నెదుట" అనండి. "పతిని" అన్న పదానికి అన్వయం?

   తొలగించండి
 12. జాతి వైరము మరచుట సహజమౌను
  పరగ సహజీనము నేర్ప ప్రాణులందె
  యట్లె నేర్పగ నొకచోట యచ్చెరువుగ
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చోట నచ్చెరువుగ' అనండి.

   తొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2733
  సమస్య :: *మూషిక మొండు పిల్లి గని ముద్దు లొసంగెను ప్రేమ తోడుతన్.*
  ఎలుక పిల్లిని జూచి ప్రేమతో ముద్దులాడింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ఒక వ్యక్తి తాపసులు నివసించే అటవీ ప్రదేశాలను చూపిస్తూ ఓ మిత్రమా! ఇచ్చటి ఆశ్రమ ప్రదేశాలు ప్రశాంతినిలయాలు. ఇచ్చట ఉన్న మునుల మాటలు సమ భావాలకు ఆలవాలాలు. ఇక్కడ ఎవరూ రోషములకు ఆవేశమునకు లోనుగారు. దూషణలు ఇక్కడ ఉండనే ఉండవు. మనస్సులో ఎటువంటి కల్మషాలూ ఉండవు. జాతివైరాలు కూడా ఉండవు. కాబట్టి ఎలుక పిల్లిని చూచి పారిపోకుండా ప్రేమతో ముద్దులు పెట్టింది చూశావా అని ఆశ్రమ వాతావరణం గుఱించి విశదీకరించే సందర్భం.

  రోషము లుండబో విచట రూఢిగ నాశ్రమ సీమ లందు, సం
  భాషణ లందు శాంతి సమ భావము లుండును, జాతివైరముల్
  దూషణ లుండబోవు, మదిఁ దోషము లుండవు గాన జూడగన్
  *మూషిక మొండు పిల్లి గని ముద్దు లొసంగెను ప్రేమ తోడుతన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. * (15-7-2018)

  రిప్లయితొలగించండి
 14. సాధు గుణమున జరియించి సంతసించు
  ఋషుల వనముల సౌమ్య సరిత్తులలర
  సింగమే జేరె హరిణమ్ము చెలిమి గోరి
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. subbaraoజులై 15, 2018 9:21 AM

  ద్వేషభావములేకుండపిల్లితఱచు
  తనదుచెంతకురాగనుదనరియంత
  మూషికంబొండుపిల్లినిముద్దులాడె
  జాతివైరముమఱచిరిచక్కగాను

  రిప్లయితొలగించండి
 17. ధ్యాన మొనరించు తపసుల తావులందు
  శాంతి స్నేహము వర్ధిల్లు భ్రాంతి దొలగు
  సాధువాదము లచ్చోట సాగుచుండు
  మూషికం బొండు పిల్లిని ముద్దు లాడె
  మెండు బ్రేమను జూపించి గుండెనిండ!

  రిప్లయితొలగించండి
 18. వేషము లెన్నొవేయుచును వేసెను కన్నము భోషణంబుకున్
  దూషణ భాషణంబులను దోషము లెంచుచు ముఖ్యమంత్రినే
  భేషజ మేమియున్ గొనక బేరములాడుచు మోడిగూడుచున్
  మూషిక మొండు పిల్లిగని ముద్దులొసంగెను ప్రేమతోడుతన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భోషాణము' ఉంది. 'భోషణము'?

   తొలగించండి
  2. ఆర్యా! భోషాణమునకు భోషణము వికృతి యైనది గణముల కొఱకున్! 🙏🙏🙏😊😊

   తొలగించండి
 19. ద్వేషములేకయుండగనుబ్రీతినిగన్నముయొద్దకున్జనన్
  మూషికమొండుపిల్లిగనిముద్దులొసంగెనుప్రేమతోడుతన్
  రోషముజూపకాహిహకలోపలికేగెనుసంతసించుచున్
  మూషికచీలిరెండియునుమోదమునొందుచుహాయినుండిరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కన్నము వద్దకున్' అనండి. 'హిహక' అని ముప్రత్యయం లేకుండా ప్రయోగించరాదు.

   తొలగించండి
 20. రెండియును బదులుగా
  రెండునట
  గాజదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. 28/1/2017 నాటి పూరణలు:

   ఏతరి వెతలు వచ్చునో యేరి కెఱుక
   తలుప దైవోపహతులకుఁ గలదె బ్రతుకు
   తల్లి యని యెంచి తాఁ దల్లడిల్ల నంధ
   మూషికం బొండు పిల్లిని ముద్దులాడె


   ఘోష నికేతనమ్మున నఘోర నినాద వినోద మోది యా
   మూషిక రాజ మచ్చట విమోహము నందున నుండ ఖాదనా
   న్వేషమునం జరింప మగపిల్లియ, భక్షణ మయ్యె దానికిన్
   మూషిక, మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

   తొలగించండి
  2. రాజు దుష్యంతుఁడు కుజ నారాతి యిందు
   వంశ తిలకుండు గనఁ బారవశ్య మంది
   కణ్వు నాశ్రమమున వింత కాదనంగ
   మూషికం బొండు పిల్లిని ముద్దులాడె


   మూషిక మేర్పడంగఁ దిని మూరిన తృప్తి బిడాల ముండెనే
   రోషము మాని గోముగ విరోధము సూపక సంభ్రమించుచున్
   భీషణ దేహ దార్ఢ్యమున బీరపుఁ బిల్లి నిరుక్త భుక్త దు
   ర్మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను బ్రేమతోడుతన్

   [నిరుక్త భుక్త దుర్మూషికము = పైన చెప్పఁబడిన, తినఁబడిన గొప్ప యెలుక కలది; ఒండు పిల్లి = మఱియొక పిల్లి]

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ నాలుగు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 22. వేషము వేసె పిల్లిగను భీరువు భర్తయె మూషికమ్ముగన్
  వేసిరి మిత్రలాభమును వేదిక పైనను నాటకమ్మటన్
  భేషని లోకులెల్లరులు పెద్దలు మెచ్చిరటంచు మోదమున్
  మూషిక మొండుపిల్లిగని ముద్దులొసంగెను ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పెద్దలు మెచ్చగ మోదమందుచున్' అనండి.

   తొలగించండి
 23. ఇంట సరుకులుదినుచున్న వంటయెట్లు?
  కంటబడబోదు చిక్కదు కన్నమందు
  మూషికంబొండు!"పిల్లినిముద్దులాడె
  ఎలుక యాగడములు మాన్పదలచిరాము

  రిప్లయితొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  ("పాకీ చీనీ లవ్ జిహాద్")

  ద్వేషము మీర దాంభికులు తీరని వైరము భారతమ్ముతో
  శోషలు వొంద గొంతుకలు శూరులు ధీరులు మీరలంచుచున్
  భూషణలిచ్చి చీనులకు మూతులు నాకగ నిట్లు తోచుగా:
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఇది ఆటవిడుపుకోసం సరదాగా వ్రాసిన పూరణ. కాదు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 25. నేటి సమస్య నాలుగవ పాదం లో
  నా పూరణ

  ద్వేషము లీసులం జెలగు తీవ్రమనోగతభావజాలముల్,
  రోష, లసూయ లెయ్యెడను రోయు డటంచు నేర్పుచున్
  వేషము లందుఁ జూప, నట పిల్లల యందున జంతురూపతన్,
  మూషిక మొండు పిల్లి గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రోష మసూయ లెయ్యెడను...' అనండి. రెండవ పాదంలో గణదోషం. "రోయు డటంచు ముదాన నేర్పుచున్" అనండి.

   తొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  సందర్భము: చనిపోయి పడివున్న పిల్లిని చూచి ఎలుక ఇలా అనుకుంటున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  తనదు చిన్నారి గుండెలో దడలు పుట్టె..
  'తగుదు నమ్మా!' యనుచు నిన్న తరిమి కొట్టె..
  విగత జీవి యీనా డని, వింత యి దని,
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  15.7.18

  రిప్లయితొలగించండి

 27. కూర్చున్న చోటే తిండి అప్పణముగ దొరుకుతా వుంటే వేట మరిచిన మార్జాలపు కథ


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. పోషణ భళి రాచకుమారు పోలికయ్యె
   భేషుగా తండిదొరికె సోంబేరి తనము
   పెరిగి యెలుకల వెంటాడ వెస మరువగ
   మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

   జిలేబి

   తొలగించండి

  2. *తిండి

   నాటి పూరణ


   కలుగు లోన ముఖమునిడ కరకు గాను
   మూషికం బొండు పిల్లిని ముద్దులాడె,
   స్థాన బలిమి మహిమయది చక్క తెలుసు
   కొను జిలేబి జీవనమున కొనరు తెలివి !

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ఈరోజు ఆలస్య మెందుకు?

   తొలగించండి
 28. మిత్రులందఱకు నమస్సులు!

  రోషముతోడఁ గౌశికుఁడు క్రూరమునౌ తప మొండొనర్ప, ను
  ద్భీషణమై యెసంగె! బలభేదియుఁ దల్లడమంది, మేనకన్
  భూషణయుక్తనంపఁ, దలఁపుల్ దనువుల్ దమిఁ గూడె! నెట్లనన్
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్!

  రిప్లయితొలగించండి
 29. నరకం- జన్మజన్మల ప్రేమ :- ఒక సరదా ఊహ::-)

  ఆశలు చచ్చునే నరకమార్గము బట్టినగాని జీవికిన్
  శోషిత వాసనల్ కుదుపు, చోద్యమదేల విధాత కూర్చగన్
  రాశిగ పూర్వజన్మ ప్రియురాలు కనుంగవ ముందు నిల్వగన్
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేంకటేశ ప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. "నరకయానము బట్టిన..." అందామా?

   తొలగించండి
  2. అలాగే సార్, ధన్యవాదాలు.., ఆ' కి మా' కి యతి?

   తొలగించండి

 30. వైరిప్రాణులు చూపంగ వత్సలతను
  నాడు చుండెనవెల్లయు నాశ్రమమున
  సింహము చెలిమిని జేసెను జింక తోడ
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

  రిప్లయితొలగించండి
 31. హింస లేకను మదిని యహింస నిండ
  ప్రకృతి సిద్ధపు వైరము వాని ముందు
  వెడలి యుండగ శాంతియు వెల్లివిరియ
  మూషికంబొండు పిల్లిని ముద్దులాడె

  పతంజలి యోగసూత్రాల్లో ఒక వ్యక్తి 12 సంవత్సరాలపాటు అహింసను ఆచరించి సిద్ధిం చేసుకుంటే అతని సమక్షంలో సహజ వైరం కలిగిన జీవులు స్నేహంతో మసలుతాయని చెప్పబడింది.

  రిప్లయితొలగించండి
 32. పతంజలి యోగసూత్రాల్లో ఒక వ్యక్తి 12 సంవత్సరాలపాటు అహింసను ఆచరించి సిద్ధింప చేసుకుంటే అతని సమక్షంలో సహజ వైరం కలిగిన జీవులు స్నేహంతో మసలుతాయని చెప్పబడింది.

  రిప్లయితొలగించండి
 33. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  సందర్భము: చనిపోయినట్లు నటిస్తూ పడివున్న పిల్లిని చూచి నిర్భయంగా ఎలుక ముద్దులాడింది.
  చటుక్కున పిల్లి పట్టుకున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  గడుసు మూషికమును పట్టగా తరంబు
  గాక మృతురా లయిన రీతిగ నటియింప
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె
  భయము వీడి... చటుక్కున పట్టె పిల్లి..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  15.7.18

  రిప్లయితొలగించండి
 34. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  అరయగ రమణారెడ్డి తా జరుగుచుండె
  సూర్యకాంతము దెసకు నించుకయు నించు
  కయు మరేలనొ సినిమలో రయముగఁ..గన..
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  15.7.18

  రిప్లయితొలగించండి
 35. .
  వైరిప్రాణులు చూపంగ వత్సలతను
  నాడు చుండెనవెల్లయు నాశ్రమమున
  సింహము చెలిమిని జేసెను జింక తోడ
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

  రిప్లయితొలగించండి
 36. తేటగీతి
  కుక్క పార్టీకి సీట్లలో కొరత మిగిలె
  ఎలుక మద్దతు నిడ కుక్క యేలు ననుచు
  పిల్లి బలమౌదు నని యేలఁ బిలిచి నంత
  మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

  ఉత్పలమాల

  వేషము లెన్ని వేసినను పెద్దగ సీట్లెవరిన్ వరించవే
  భేషజమెంచ రెవ్వరును వీలుగ వారలు గద్దెనెక్కగన్
  భేషుగఁ కుక్కనాపగను పిల్లియె మద్దతు నీయనొప్పగన్
  మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

  రిప్లయితొలగించండి
 37. జోషున తండ్రినిన్ దరిమి చొప్పల దంటుడు యాదవుండటన్
  హోషును గోలుపోయిగన యోధుల జంటగు మోడి-షాలనున్
  తోషము తోడ కౌగిలిడె తుంటరి చేష్టల మాయలాడినిన్:👇
  "మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

  రిప్లయితొలగించండి