ఏమో! నాకు నాలుగు వృత్తాలే తెలుసు. వేనవేలు వృత్తాలున్నాయని విన్నాను. మన గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు సృష్టించిన క్రొత్త వృత్తానికి "సహకారము" అని విబుధులు నామకరణం చేసిరి:
డా. విష్ణు నందన్ఫిబ్రవరి 25, 2013 11:26 PM
యథాలాపంగా సహదేవుడు గారు రచించిన నూత్నచ్ఛందమ్మును చూసి సంతోషపడితే , దానికి గన్నవరపు నరసింహ మూర్తిగారి వినూత్న నామకరణము రెట్టింపు ఆనందము కలుగజేసినది . నేనూ ఆ నామకరణాన్ని బలపరుస్తున్నాను .
సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్ రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశం :: దత్తపది (సంఖ్య - 142) అరి-ఉరి-కరి-గిరి అనే పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయాలి. సందర్భం :: పాండవులు ద్వైత వనంలో ఉండగా దుర్యోధనుడు తన పరివారంతో అక్కడికి వెళ్లి వేటాడుతూ గంధర్వులకు బందీ అవుతాడు. భీమార్జునులు గంధర్వులను జయించి సుయోధనుని విడిపిస్తారు. అపకారికి కూడా ఉపకారం చేసే పాండవులు శ్రీ కృష్ణ భగవానుని దివ్య కృపా కటాక్ష వీక్షణలతో బలమును జయమును కీర్తిని పొందినారు అని విశదీకరించే సందర్భం.
అరికట్వద్దుర! నన్ను నీవికను నీ యార్భాటమున్ వీడిన న్నురికొల్ప్వద్దుర! నీకు దండమిదె బాబోయ్ నన్నుపోనిమ్ము నీ కరికెక్కయ్యెడి మాటలన్నిటికి నాకన్నుల్ చెమర్చించురా గిరికీల్ కొట్టుచు నేనుపోయెదను జాగేలేక నా సారథీ!
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికృష్ణదౌత్యం....
అరిగిరి కాననమ్ములకటంచును న్యూనతఁ జూడబోకుమా !
యురికి వధించు భీముడు మహోగ్ర గదా ప్రహరమ్ములన్ నినున్ !
కరిగిన సైన్యమందు గన కర్ణుడు భీష్ముడు ద్రోణుడేడ ? దా...
గిరి యమరూపులైదుగురు కృష్ణభుజంగములై ! యెరుంగుమా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మహత్తరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివివాహభోజనంబు... వియ్యాలవారి విందు... 😀
తొలగించండిఅరిసె లడ్డు బూంది యప్పడాలను గన
నురికె నా మది ., పులి హోర తినగ
కరిగి పోవుచుండె , కనులముందదిగొజాం...
గిరి ! వివాహవేళ వరెవ ! విందు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండివాహ్ వాహ్ ! వివాహ భోజనంబు మురళీమోహనమ్ము
జిలేబి
తొలగించండిగోంగూర, జిలేబి లేని వివాహ భోజన మే ప్చ్ :) వెలితి గా వుందండి :)
జిలేబి
రిప్లయితొలగించండిమాయాబజార్ :)
జిలేబీలున్ వహ్వా యరిసెలు ! భళీ జీడిపప్పుల్! మజారే
విలాసంబే ! జంబూ యురికొలిపెరా ! వీరభోజ్యంబిదే ర
మ్మ! లడ్డుల్ పోళీలున్నొసగిరి వడల్ ! మా యశోదేయుడే క
ర్త! లావై కల్యాణమ్మగు మకరికారాజికల్ చెక్కిలిన్ దా
కు లే! వహ్వారే లక్ష్మణుడు మగడౌ ! కుంభకోణంబిదేరా !
జిలేబి
👏👏👏
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండివహ్వా! మీ పూరణ మజ్జారే!
'మాయాబజారు' కథ కల్పితం. మహాభారతంలో లేదు.
తొలగించండి:)
జిలేబీ గాధల్ సుమ్మి వరుసగ బజ్జీలయెన్ శంకరార్యా :)
జిలేబి
ఆహా! చక్కని సాధన!
తొలగించండి...మేఘవిస్ఫూర్జితాఖ్యన్
గ్రమంబొప్పెన్ జూడన్ యమనసములున్ రాగముల్గా జిలేబీ!
తొలగించండి:)
ధన్యవాదాలండీ మధుసూదనార్యా !
జిలేబి
ఆహా మృదుమధుర రస కలిత జిలేబికి నతిధృతి మేఘ విస్ఫూర్జిత గాంభీర్య మలవడినది! మీ విశేష వృత్తాభిరుచికి వందనములు. అభినందనలు.
తొలగించండి
తొలగించండిధన్యవాదాలండి పోచిరాజు వారు
టైంపాస్ అంతే :)
జిలేబి
పండుగ జేయండి జిలేబీ గారు...జిలేబీలతో...
తొలగించండి
తొలగించండికొండాట్టమే కొండాట్టం :)
జిలేబి
మైలవరపు మురళీకృష్ణ:
తొలగించండి👏👏👍🏻అవునండీ... మేఘవిస్ఫూర్జితమే.... నమోనమః 🙏
ఏమో! నాకు నాలుగు వృత్తాలే తెలుసు. వేనవేలు వృత్తాలున్నాయని విన్నాను. మన గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు సృష్టించిన క్రొత్త వృత్తానికి "సహకారము" అని విబుధులు నామకరణం చేసిరి:
తొలగించండిడా. విష్ణు నందన్ఫిబ్రవరి 25, 2013 11:26 PM
యథాలాపంగా సహదేవుడు గారు రచించిన నూత్నచ్ఛందమ్మును చూసి సంతోషపడితే , దానికి గన్నవరపు నరసింహ మూర్తిగారి వినూత్న నామకరణము రెట్టింపు ఆనందము కలుగజేసినది . నేనూ ఆ నామకరణాన్ని బలపరుస్తున్నాను .
సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా
సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్
రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై
సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !
https://kandishankaraiah.blogspot.com/2013/02/977.html?m=1
తొలగించండిమైలవరపు వారికి నెనరుల్స్
జిలేబి
ఉరికితివట కరివేడ మ
రిప్లయితొలగించండికరిగూల్చగ దలచి నీవు గరుడుని పై నే
నరచిన నామొర వినవో
హరి, చెలరేగిరి గరాసు లతివని గనరా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరిగె కృష్ణుండు కురుసభ కమితయుక్తి;
రిప్లయితొలగించండినురికె రారాజు బంధింప నుద్ధతుడయి;
ధూర్తు లడగిరి విశ్వంపుమూర్తి జూచి;
మోకరిల్లిరి భీష్మాది మోక్షవరులు.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నమస్సులండీ!
తొలగించండిపాండవులు విరాట పర్వంలో
రిప్లయితొలగించండితే: సేకరించి వివరములు చేరి విరటు
కొల్వునన్ సాగిరి కరము కూర్మితోడ
తలచు కొనుచు దైత్యారి వాక్కులను మదిని
నురికిరనికి కావవిరటు తరుణ మెంచి
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఉరి*సిన నేర శిక్షలకు నున్నత స్థానము /(నున్నవితావులవెన్నొ)లెన్నొ?భారతం
బరి*సిన జంపుటే తెలియు నడ్డము లేకనె వీరుడెవ్వరో (భారతంబు-అరిసిన)
కరి*గల స్వేచ్ఛ నివ్వగను కానకనీ*గిరి* ద్రోహు లంచనన్
తరమె స్వతంత్ర భారతిని సప్తతి వత్సర పాలనమ్మునన్
(ఉరియు॥చలించు,పక్వమగు,నెరయు॥నిండు,వ్యాపించు..శ.ర.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅరిసెలు బూరె జిలేబీ
లరె నొసగిరి జంబు! రమ్మ లంబూ మన రా
జు రసమయ లక్ష్మణకుమా
రు రమణిగా నురికొలుపెదరు వివాహమునన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అరె యొసగిరి' అనండి.
అరిగిరి వనవాస ము న కా తరుణ మందు
రిప్లయితొలగించండినొ కరి కొకరు గ నం డ యై నుండి మనె డు
పాండవుల జాడ తెలిసి యు భగ్నపరచ
కౌరవులురి కిరచ్చ్త టి కి ని కక్ష గట్టి
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశం :: దత్తపది (సంఖ్య - 142)
అరి-ఉరి-కరి-గిరి అనే పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయాలి.
సందర్భం :: పాండవులు ద్వైత వనంలో ఉండగా దుర్యోధనుడు తన పరివారంతో అక్కడికి వెళ్లి వేటాడుతూ గంధర్వులకు బందీ అవుతాడు. భీమార్జునులు గంధర్వులను జయించి సుయోధనుని విడిపిస్తారు. అపకారికి కూడా ఉపకారం చేసే పాండవులు శ్రీ కృష్ణ భగవానుని దివ్య కృపా కటాక్ష వీక్షణలతో బలమును జయమును కీర్తిని పొందినారు అని విశదీకరించే సందర్భం.
(అరి)గిరి పాండవుల్ వనికి, నంతట ద్వైత వనమ్ములోన తా
(మురి)కిరి దివ్య గాయకుల నుక్కడగించిరి, మేటి గర్వమే
(కరి)గె సుయోధనాదుల, కఖండ బలమ్ము జయమ్ము నంద సా
*(గిరి) సుయశో విశాలురయి కృష్ణుని దివ్య కటాక్షవీక్షణన్.*
{దివ్య గాయకులు = గంధర్వులు}
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-7-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిఅరిగిరి పాండు తనూజులు
రిప్లయితొలగించండిఉరిమిన యా నీలమేఘమో యన ననికై,
కరిమాచలమై చెలరే
గిరి, శ్రీ హరి యానను జయ కేతన మందన్!
కరిమాచలము=సింహము
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉరికివచ్చె యుధిష్ఠరుడుండలేక
రిప్లయితొలగించండిఅరిగిపోయె పరువు జూదమందు నోడ
వాదులాడకనాగిరి పాండుసుతులు
మకరి కన్నీరునొలికించె మంకునృపుడు
మంకు=మూర్ఖుడు (ఇచట ధృతరాష్ట్రుడు)
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీకృష్ణపరమాత్మ భీమసేను తో...
రిప్లయితొలగించండికందం
అరికట్టుము నీ నిద్రను
యురికెడు భావముననుండ నొప్పుము పొర ను
క్కరివై చెలరేగగ, తూ
గిరి నీ వారలిట లక్క గృహమున భీమా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిద్రను + ఉరికెడు = నిద్ర నురికెడు' అవుతుంది. యడాగమం రాదు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండిశ్రీకృష్ణపరమాత్మ భీమసేను తో...
కందం
అరికట్టుము నలసత్వము
నురికెడు భావముననుండ నొప్పుము పొర ను
క్కరివై చెలరేగగ, తూ
గిరి నీ వారలిట లక్క గృహమున భీమా!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మొనసి కురుసేన *నరి*కట్ట ముందుగేగి
రిప్లయితొలగించండి*యురి*కె రణమంందు నభిమన్యు డుఱుము వోలె
యొ*కరి*తోడు లేకయె తానె యొక్కడయ్యి
పోర,యణ*గిరి*యరులంత భీరులగుచు.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పోర నణగిరి' అనండి.
రాజసమదె చూపగ తుంటరి సుయోధనుడొదిలె
రిప్లయితొలగించండిహస్తినపురి
ధ్వైతవనమునకు చేరిన తరి అహమునకదె
అందెను తొలకరి
దురభిమానమను శృంగగిరి తాకగ చూడు
చిత్రసేన గురి
బ్రద్దలైన తెంపరి సిరి భంగపాటులె మిగిలెను
సరిసరి
రిప్లయితొలగించండిఉరికిరి పరుగుల నరిగిరి
కరికి శరణు నొసగిరి హరి కరుణామయుడై
పరమగతి నొసగె మకరికి
వరదుని క్రేగంటిచూపు వరము జిలేబీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కర్తృపదం హరి ఏకవచనం. క్రియాపదాలన్నీ బహువచనాలు!
అయినా మీరు భారతార్థంలో కాకుండా భాగవతార్థంలో వ్రాసారు.
తొలగించండి
తొలగించండిఇవ్వాళ అన్నీ ఉల్టాపుల్టా అయినట్టుంది :)
జిలేబి
భీముఁడు బకాసురుని చంపిన సందర్భము:
రిప్లయితొలగించండిఅరిగి బకు వనము బలమున
నురి నసురున కతి చలమున నుదర తలపు టు
క్కరి బకు ననిఁ దునుమఁగఁ దిరి
గిరి పుర జను లెలమినిఁ దొలఁగిన యలజడులన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిమీ సర్వలఘుకందము మనోహరం కామేశ్వర రావు గారూ.
తొలగించండికడుంగడు ధన్యవాదములు మిస్సన్న గారు.
తొలగించండిఅరిసియలు,బండెడన్నమాతరుణమందు
రిప్లయితొలగించండిఉరియుచున్న బకాసుర దరికిజేర
కరిజకాయలుభీముడు కరుగజేసి
సాగి రిపువును గలసెను సంతసాన!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బకాసురు దరికి' అనండి.
అరుగపాండవపక్షానమకరిదాయ
రిప్లయితొలగించండియురిమిదుర్యోధనుండటయుసిరికొల్పె
కృష్ణుబంధించుడిప్పుడెగుణముతోడ
సాగిరయమునసేనతోసైనికుండ!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అరి, గిరి' ప్రయుక్తం కాలేదు.
రిప్లయితొలగించండిఅరిగిరి హస్తిన నురికిరి
పరుగుల జూదమున పోయె పడతుక మానం
బురివటలైతలయొగ్గిరి
కరిచెన్ పాండవుల విధి యెకాయెకి సుమ్మీ
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(కరి)ఖలమని దెల్పి కౌంతేయుఁలనుబిల్చి మోసపు గెలుపుతో మురిసి నావు,
రిప్లయితొలగించండితపముతో నా(యరిం)దముని మెప్పించి పాశుపతమ్ము శతముఖ సుతుడు పొందె,
(నురి)గి పోవుచు నుండె నూరువు లనుజీల్చి తాను చేసిన శపధమును దీర్చ
వాయు సుతిని మది, మాయ జూదము కాదు, పాండవ సోదర బహుబలముల
యెదుట కౌరవ (గిరి)కలు చదియ గలవు,
రాజ రాజ! యోచించుము, రణము వలదు
పంచ కుపితమ్ము లిడుమయ్య పాండవులకు
యనుచు బలికె కృష్ణుడు సుయోధనుని తోడ
రాయభారమునకు వచ్చిన కృష్ణుడు సుయోధనునితో పలికిన పలుకులు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాండవులకు ననుచు...' అనండి.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(ఉత్తర కుమారుడు బృహన్నలతో)
అరికట్వద్దుర! నన్ను నీవికను నీ యార్భాటమున్ వీడిన
న్నురికొల్ప్వద్దుర! నీకు దండమిదె బాబోయ్ నన్నుపోనిమ్ము నీ
కరికెక్కయ్యెడి మాటలన్నిటికి నాకన్నుల్ చెమర్చించురా
గిరికీల్ కొట్టుచు నేనుపోయెదను
జాగేలేక నా సారథీ!
ఆంధ్ర భారతి నిఘంటు శోధన:
అరికట్టు = అడ్డగించు
ఉరికొల్పు = రెచ్చగొట్టు
కరికెక్కు = వాడియగు
గిరికీలు కొట్టు = పల్టీలు కొట్టు
(తొట్రుపాటులో ఉత్తర కుమారుడు అఖండ యతి వాడిండు)
తొలగించండిఆబ కందము :)
అరికట్టుమోయి మిత్రుడ!
నురికింపకు గుర్రమును విను బృహన్నల! త్రి
ప్పు రథము గిరికీల్గొట్టుచు
పురమ్ము బోవ కరికెక్క పోదాము పదా!
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
శాస్త్రి గారిని అనుకరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ (నిన్నటి సమస్యకు):
రిప్లయితొలగించండి(జీవాత్మ vs పరమాత్మ)
విశ్వ సృష్టి స్థితి లయము వీడ లేక
బ్రహ్మ విష్ణు మహేశులు భళిభళియని
నేను నేనుకునిటు తాను తానుకునటు
నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
శాస్త్రి గారూ,
తొలగించండినిన్నటి సమస్యకు మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపురజనులుల్లము లురియగ
నరిగిరి పాండవు లడవికి యనఘులు వారే
కురుపతికి రాజ్యమొసగిరి
కరిఖలమున యోడినంత ఘనులే యకటా
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అడవికి ననఘులు...ఖలమున నోడిరంత' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరిది సుయోధనా! గెలుచు టా వర పాండునృపాల సూనుల
రిప్లయితొలగించండిన్నురికిన పిల్ల సింగములు హుమ్మని హస్తిచయమ్ము నొక్కటై
గిరికొను రీతి మిమ్ములను క్రీడగ వేయుదు రాహవమ్మునన్
కరికొని మీ యకృత్యములె కాల్పురి కంపుట తథ్య మెన్నగా.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ.
తొలగించండినేటి దత్తపదాలు అరి, ఉరి, కరి, గిరి
రిప్లయితొలగించండిఈ పదాలను అన్యార్థాలలో భారతపరంగా
పూరించాలి.
నా పూరణ
అరిసడిని యురికి యరిగిరి
కరి తరిమిన గరిణి కరణి కడు దవ్వులకున్
వెఱపునఁ గౌరవసైన్యము
సరగున నెక్కిడు కరమగు శరముల ధాటిన్.
అరి = అల్లె త్రాడు.
కరిణి = ఆడ ఏనుగు
కరణి = విధము.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపకమాల
రిప్లయితొలగించండిఉరివితి ధర్మజా! బ్రతుక నొప్పగ పాచికలాడఁ బొమ్మనెన్
యరిసెలు మెక్క వీడు మని యాతువు పుత్రుని భీమసేనుఁ నాఁ
కరి తురగమ్ము లావులను గావు మటంచును మాద్రిజాలిఁ గిం
గిరి వచనాల వీడె నడగించక కర్ణుడు తల్లిమాటకై
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂దత్తపది🤷♀.. .. .. .. .. .. ..
*అరి - ఉరి - కరి - గిరి*
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యం
సందర్భము: అన్ని పాదాదులలో స్వార్థంలోను.. అన్ని పాదాల ద్వితీయార్ధం ఆరంభంలో అన్యార్థంలోను దత్త పదాలు పొందు పరుపబడినవి.
కరి వేలుపు= విష్ణువు
పొలుపు= సంతోషము
దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనునితో ఇలా అంటున్నాడు...
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"అరి వర్గమును జేత నగునె వారికి గెల్వ!
నరిగిరి కానలే యనువు లనుచు..
నురి వేయుదుమె! మన కూరకే భయమంది
యురికిరి సుఖ మీయ వూ ర్లటంచు..
కరియో మకరియోయెవ రెరుంగుదురు?కృష్ణు
కరి వేలు పని రహో కౌగలించి!!
గిరిఁ గంద మూలాలె సరి భోజనం బేమొ!
ఎగిరి రంతంతెత్తు పొగ ర దేలొ!
"మన్ను దిన్న పాముల వోలె" మౌన ముద్రఁ
జతికిల బడినారే! వీరు క్షత్రియు లట!
కలికి వలువల నొలుచుచు పొలుపు నందు
తరినిఁ దమ్ముడా!"యనె సుయోధన నరపతి..
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
11.7.18
రిప్లయితొలగించండికం:అరిగెను పార్థుడు రయమున
గిరిధారి సమీపమునకు కేలూత గొనన్
కరివే లుపుసాయముతో
నురికెను వైరుల గెలువగ నుత్సాహముతో.
కం:అరిగిరి పాండు కుమారులు
కరిపురమును వీడితాము కారడవులకున్
పురజనులు మూగిరి గనగ
తరుణీ మణితో నురియగ తనువులు ధరలో.
కం:అరిగెను భీముడు ముదమున
గిరివ్రజ పురమునకునుకీటడగింపన్
జరసుతుని,కరివరదునితో
నరుడును రాగా నురికెను నద్దమ రేయిన్.
కం:విరటుని పురమున కరిగిరి
కరివేలుపు దీవెనంది కాంతామణితో
సురవరులటంచు మూగిరి
సురపతి సుతుడురికెముందు సోయగమొప్పన్.
*దత్తపది* :-
రిప్లయితొలగించండి*అరి - ఉరి - కరి - గిరి*
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
*తే.గీ**
పాండవులరికట్టగ లేక దుండగమును
జూడ లేకను దిరిగిరి శోకపడిరి
నొకరి మొగమునొకరు జూచి నొచ్చుకొనిరి
గుడ్లురిమి జూచి మనమున కోపపడిరి
..................✍చక్రి
(ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో పాండవుల స్థితి)