24, జులై 2018, మంగళవారం

సమస్య - 2741

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల"
(లేదా...)
"అమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా"

80 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. అమరు లెల్లరు వచ్చిరి మమత మీర
   పుడమి వింతలు చూడగ బుద్ధి లేక
   హైదరాబాదు చేరగ హాయి జెంది
   అమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల

   అమృతము = పాలు (ఆంధ్ర శబ్దరత్నాకరము)

   అమరుడు = దేవత

   తొలగించండి

  3. హైద్రా బాదులో ఇరానీ చాయ్ తాగక అమృతము పాలు గట్రా తాగితే ఎట్లా మరి :)

   జిలేబి

   తొలగించండి
  4. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. అమరు లెటులైరి సురలని యడిగితినిను
  ధార్త రాష్ట్రులే మైరట తగువు నందు
  తారకుని సంహరింపగ గోరి రెవరు
  అమృతమును ద్రాగి, మరణించి, రమరు లెల్ల.

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  నారదుడు... ఇంద్రునితో.. 👇😀

  అమృతస్థాలికి కాలకూటమనుచున్ , హాలాహలంబున్న భాం...
  డముపై వ్రాయ సుధారసంబని , గనన్ రాబోవుగా చీమలం
  చు , మదిన్ నీవు దలంప , వ్రాసిరటులే ! చూడిప్పుడేమయ్యెనో !
  అమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. యథా రాజా తథా ప్రజా :)


   జిలేబి

   తొలగించండి
  2. అమృతోత్పాదనవేళ వాసుకిని నీ యా వైపులన్ లాగగా
   నమరుల్ దైత్యులు శక్తిఁ జూపునెడ స్పర్ధావిష్టులై యుండ ., భాం...
   డము రాన్ ., దూలిరి త్రాడువీడనసురుల్ , నవ్వంగ రక్షోగణం
   బమృతమ్మున్ చవిజూచి ., చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. గురుడు చెప్పెడి పాఠాలగోల యేల
  వలదు వలదంచు తిరిగెడి వాడొకండు
  పలికె నీరీతి యజ్ఞాన కలితు డగుట
  అమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల

  ధూమ పానంబు జ్ఞానమున్ దొలగ ద్రోయు
  శక్తులను గూల్చు పలువురు జగతిలోన
  నమృత! మును ద్రాగి మరణించి, రమరు లెల్ల
  రట్టి వారని క్షమియింతు రనుట కల్ల.

  రిప్లయితొలగించండి
 5. మరణ మొందిన జనులంత నరక మందు
  బాద పడలేక యమునిపై పగను బూని
  విషము గ్రక్కిరి సురలన్న వెగటు బుట్టి
  అమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషం ఉన్నట్టుంది!

   తొలగించండి
  2. మరణ మొందిన జనులంత నరక మందు
   బాధ పడలేక భర్గుపై పగను బూని
   విషము గ్రక్కిరి సురలన్న వెగటు బుట్టి
   అమృతమున్ ద్రాగి మరణించి రమరు లెల్ల

   తొలగించండి
 6. స్వర్గ ము ను జేరె వ్యాపారి చ చ్చి తాను
  స హ జ మతి తోడ కల్తీ ని సల్పి నంత
  విషము కలిపే న సు ధ యని వె ర పు లేక
  న మృ త ము ను ద్రాగి మరణించి రమ రు లె lla

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విషము కలిపెను' అనండి.

   తొలగించండి
 7. నాలుగేండ్లు కేంద్ర భరోస నమ్మి మోస
  పడిన యాంధ్రప్రదేశపు ప్రజను గాంచ
  యమృతమును ద్రాగి మరణించి రమరులెల్ల
  రని తెలిసె నవిశ్వాసతీర్మాన మందు

  రిప్లయితొలగించండి
 8. ఓడిపోవుట అది చావు కాదె ఓడితిరిగా మరి
  మీరెన్ని మార్లు
  భోగ లాలసతలు తామవి వెతుకగ మీ తనువుల
  లోన పొంగి పొర్లు
  దైత్యులు మిమ్ము తరిమి దునుమ శరణంటిరిగా
  ఓ సురగణాధిపా
  అమృతమ్మున్ జవి చూచి చచ్చిరి సురల్ హా
  స్వర్గలోకాధిపా

  రిప్లయితొలగించండి


 9. మృతమనిన నేమి నరుడ యమృత మనినను
  నేమి త్రాగి యొనరిచిరి నేరములను
  యోచ ననుచేసి చూడగ యోగులైన
  నమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. అమరు లెటులైరి స్వర్గమ్ము నదితి సుతులు?
  స్వర్గముఁ జన సేన లనిలో సలిపిరేమి?
  మోహినిని గాంచి కాంచిరి మోదమెవరు?
  అమృతమును ద్రాగి, మరణించి, రమరు లెల్ల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మోద మెవ్వ। రమృతమును...' అనండి.

   తొలగించండి
 11. డా.పిట్టాసత్యనారాయణ
  ఉపగ్రహము నిగ్రహము మానె నుర్వి ద్రవ్య
  గణనములు మూత బడియెను గతిని గనక
  ధన ఋణంబులు నేకమై ధరణి మొరసె
  గ్రుడ్డివారైరి లెక్కల గ్రుద్దుకొనుచు
  అమృతమును ద్రాగి మరణించి రసురులెల్ల
  (నేటి కంప్యూటర్ నిక్షిప్త ద్రవ్య గణనపైనాధారపడిన అతి తెలివి ప్రభావమునూహించి)

  రిప్లయితొలగించండి


 12. సమరమ్ముల్ సయి మానభంగముల విస్తారంబుగాజేసిరే
  కమనీయంబుగ మీరు కట్టుకథలన్ కారుణ్య వారాశిగా
  సుమనస్కుల్ పరమాత్ములేయని భళా జొప్పించిరే!చూడగా
  అమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టాసత్యనారాయణ
  సమృషల్ వే వ్యవహారముల్, ఋతయుతుల్ శాస్త్రంపు విజ్ఞానపు
  న్నమృతంబిచ్చె; నరాళి తామె సురలున్నై బ్రహ్మలై సృష్టికి
  న్నమృషంబౌ బ్రతి సృష్టి జేయగలుగన్నౌరా యణూత్పత్తిని
  న్నమృతమ్మున్ జవి చూచి జచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!
  (పురహరులైన నరులు అణుబాంబులతో కుప్పగూలే సంభావన గలదు)

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులు కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2741
  సమస్య :: అమృతమ్మున్ జవి జూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !
  అమృతాన్ని రుచిచూచి దేవతలు చనిపోయారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి అమృతకలశాన్ని చేతబట్టుకొని దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోమని చెప్పగా వారు అలాగే కూర్చున్నారు. మోహిని అమృతాన్ని ముందుగా దేవతలకు వడ్డిస్తూ ఉండగా తమ దాకా రాదేమో అని సందేహించిన రాహువు అనే రాక్షసుడు దేవతావేషంలో దేవతల వరుసలో చేరి ఆ అమృతాన్ని త్రాగినాడు.
  ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు అయ్యో దేవతలమైన మనకు మాత్రమే దక్కవలసిన అమృతం రాక్షసులకు కూడా దక్కింది. ఇక మనం చచ్చినట్లే అని అనుకొన్నారు.
  ఈ సంగతిని ఒకరు ఇంద్రునికి విన్నవిస్తున్న సందర్భం.

  సుమతిన్ గూర్చొని రా సురాసురు లటన్ జూడంగ వేఱ్వేఱుగా,
  విమతిన్ రాహువు శంకతో సురునిగా వేషమ్మునే దాల్చి య
  క్రమతన్ జేరెను దేవతావళిని, వీకన్ మృత్యువున్ గెల్చినా
  ‘’డమృతమ్మున్ జవి చూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.

  రిప్లయితొలగించండి
 15. అమృతమునుద్రాగి మరణించిరమరులెల్ల
  రనుట యుచితమె?యరయగనమరులనగ
  మరణరహితులువారల మృతమువలన
  నమృతపానమ్ముజేయునునమరులుగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 16. కానిపని యైన కద్రువ దేని గోరె ?
  మద్య మమితము ద్రాగిన మనుజు లెచట ?
  భారతికి బ్రతుకు నిడినవార లెవరు ?
  అమృతమును ; ద్రాగి మరణించి ; రమరు లెల్ల .

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వాడు సురలసురుల గూర్చి వల్లె వేసి
  తరగతి పరీక్షలకు బోయి తత్తఱిల్లి
  నొకటి కొకటిగా ప్రత్యుక్తి నుంచె నిట్లు
  అమృతమును ద్రాగి మరణించి రమరులెల్ల

  రిప్లయితొలగించండి
 18. దివికి నేగిన ఖగపతి దేని దెచ్చె?;
  విఫల మైన రైతులకట!వేగ విషము;
  మరణమును గెలిచిరి కదా నరులు కాని;
  అమృతమును ; ద్రాగి మరణించిర ;2మరు లెల్ల !

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  [మన కిష్టములేని కోరిక ననిష్టముతో నొప్పుకొనవలసి వచ్చినప్పు "డిచ్చిచావు!", "తీసికొని చావు!" మని యనుచుందుము. అదే విధముగ సురాసురులు కలసి సాధించిన యమృతమును, మోహిని మోసముచే, తనకు వంపకుండా, దేవతలకు మాత్రమే వంపఁగా, నది కనులారఁ జూచి, "వా రమృతమ్ముం ద్రాగి చచ్చి" రని యక్కసుతో రాక్షసులు తమలోఁ దామనుకొను సందర్భము]

  "సమరమ్మందునఁ జావకుండ నిలువన్ సర్వాసురుల్ దేవతల్
  విమలమ్మౌ నమృతమ్మునొంది వెలయన్, వే దంభ నారాయణీ
  తమిఁ జిక్కంగనె, కోలుపోయితి మయో! తన్మానినీ దత్తమౌ
  యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్! హా! స్వర్గలోకాధిపా
  లు మహేంద్రున్ దయఁ జూచి చచ్చె నకటా, లోలాక్షి ధౌర్త్యాక్షియై!"

  రిప్లయితొలగించండి
 20. సంతసమున జరుగఁ బెండ్లి సంబరములు
  వింతఁ జెలరేఁగెనె విషాద మంత విషపు
  టమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల
  రైరి దుఃఖ మలముకొన నందఱ కట

  [అమృతము = అన్నము / పాలు]


  దమ నార్హం బగు యుక్త తంత్రము సదాదానా వడిం దల్చుమా
  యమి తోగ్రాస్త్ర నికాయముల్ ఘనులు దైత్యాగ్రేసరుల్ వీరులా
  యమరద్వేషులు క్రూర మానసులు వేయన్ వారుణాస్త్రావృతే
  ష్వమృతమ్ముం జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా

  [అమృతము = జలము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
 21. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  అమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల

  సందర్భము: వాళ్ళు అమరులు కారు. అది అమృతం కాదు. ఏమిటో చూడండి.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "క్షీరసాగరమథనముఁ" జేరి యాడ
  జరిగె నాటక; మింద్రుండు సురలఁ గూడి
  కల్లు పాకకున్ జనె; మందు కల్లనియెడు
  నమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  24.7.18

  రిప్లయితొలగించండి
 22. అమృతమ్మున్జవిచూచిచచ్చిరిసురల్ హాస్వర్గలోకాధిపా!
  విమలా!యేమిదిపల్కుచుంటివిటనీవేమీకనుంగొంటివా!
  యమితోత్సాహముజెందుచున్నిటులమాట్లాడంగనెట్లొప్పెనో
  నమృతమ్మున్జవిచూచివారలటహాహాయంచుగెంతేసిరే!

  రిప్లయితొలగించండి
 23. తేటగీతి
  'చెరపకుమురా చెడెదవంచు' సురలువినరొ
  యమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల
  ననుచు తన స్వప్న గాధను నసురుఁడనఁగ
  శ్రమను దోచిన ఫలమని సణిగె నొకడు

  రిప్లయితొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  ("గుడుంబ రహిత రాష్ట్రంగా తెలంగాణ...తాటి, ఈత చెట్ల పన్నులను ఈ క్షణం నుండి రద్దు...: పద్మారావు")

  "అమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా"...
  యముడీ కల్లను చంద్రశేఖరునకున్ హై!యంచు తెల్పంగ..."నా
  కమనీయంబు గుడుంబకున్ బదులు మా కల్లున్ ఫెడెక్స్ మీదుగా
  మమతల్ మీరగ పంపెదమ్మనుచు
  మా మామూలు పంపండనెన్"


  కల్ల = fake news
  హై! = హై : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
  పిలుపు, ఆహ్వానము.
  గుడుంబ = కల్తీ నాటు సారాయి
  కల్లు = toddy, palm-wine
  మామూలు = బహుమతి

  రిప్లయితొలగించండి


 25. Export quality :)


  ఆబ కందము :)

  అమృతమును ద్రావి చచ్చిరి
  సుమనస్కులసురులని యినసుతుడన చంద్ర
  న్న మనదగు బొంగులో క
  ల్లు మనసురభినంపెదనని లుకలుక లాడెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. దేవిక
  ------
  గిట్టుదు రవసానమ్మున గీతయనెడు
  అమృతమును ద్రాగి ; మరణించి రమరులెల్ల
  మదిపనిపడ గీతామృత మాలకించి
  శాంతి బొందె నటంచు సన్మతి దలపరె!

  రిప్లయితొలగించండి
 27. దేవిక
  ------
  నిన్నటి పూరణ:
  ————_——____

  కనుగొన నరకమ్ము దొరకు
  ఘన పాపాత్ములకు; ముక్తి కాంత లభించున్
  మనమున హరిని దలంచుచు
  ననయము వినయమతులౌ యనఘుల కల దివిన్ !

  రిప్లయితొలగించండి
 28. సార్, "అనూచానం" సంధికార్యం తెలుపగలరు..

  రిప్లయితొలగించండి
 29. అమరేంద్రుండను జేరి చెప్పెనొక డాయాసమ్ముతోనివ్విధిన్
  నమృతోత్పాదన వేళలో వెడలె గా హాలాహలమ్మున్ గన
  న్నమృతమ్మే యదటంచు నెంచి సురలే యానందమున్ బొంది య
  య్యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా.

  రిప్లయితొలగించండి
 30. చచ్చి స్వర్గాని కేగిన జడుడొకండు,
  మునులవలె ధ్యాన ముద్రలో మునిగి యున్న
  సురల గాంచుచు నెదలోన యరసె " కల్తి
  యమృతమును ద్రావి మరణించి రమరు లెల్ల"!

  రిప్లయితొలగించండి
 31. అమృతమగుమాట మూటలు మాన్య.లివ్వ
  ఆంధ్రవర్యుల కానందమంతబెరుగ!
  విభజనౌ కల్తిమత్తుయే విలువటన్న
  అమృతమును ద్రాగి మరణించి రమరులెల్ల!
  (అమరు=ఒప్పుకొన్న)

  రిప్లయితొలగించండి
 32. గుఱ్ఱం సీతాదేవి గారు, నేడో రేపో మీరు అమెరికాకు పయనమవుతున్నట్లున్నారు కదా. మీ విదేశయాత్ర సౌకర్యవంతంగానూ విజయవంతంగానూ జరగాలని నా శుభాకాంక్షలు 💐.

  రిప్లయితొలగించండి
 33. ధన్యవాదములు నరసింహారావుగారూ! రేపే ప్రయాణం! ఇప్పుడే గురువుగారి యింటర్వూ విన్నాను! చాల సంతోషం!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబిగారూ! నాకు తమిళం తెలియదు! సారీ!

   తొలగించండి
  2. డా. సీతా దేవి గారు
   శివశ్చ తే౽ధ్వాస్తు భగినీ లలామ!!! (Bon Voyage!!!)

   తొలగించండి
  3. పూజ్యులు కామేశ్వరరావుగారికి సప్రణామ ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి
 34. సవరణతో
  గురువర్యులు కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2741
  సమస్య :: అమృతమ్మున్ జవి జూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !
  అమృతాన్ని రుచిచూచి దేవతలు చనిపోయారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి అమృతకలశాన్ని చేతబట్టుకొని దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోమని చెప్పగా వారు అలాగే కూర్చున్నారు. మోహిని అమృతాన్ని ముందుగా దేవతలకు వడ్డిస్తూ ఉండగా తమ దాకా రాదేమో అని సందేహించిన రాహువు అనే రాక్షసుడు దేవతావేషంలో దేవతల వరుసలో చేరి ఆ అమృతాన్ని త్రాగినాడు.
  ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు అయ్యో దేవతలమైన మనకు మాత్రమే దక్కవలసిన అమృతం రాక్షసులకు కూడా దక్కింది. ఇక మనం చచ్చినట్లే అని అనుకొన్నారు.
  ఈ సంగతిని ఒకరు ఇంద్రునికి విన్నవిస్తున్న సందర్భం.

  సుమతిన్ గూర్చొని రా సురాసురు లటన్ జూడంగ వేఱ్వేఱుగా,
  విమతిన్ రాహువు శంకతో దివిజుగా వేషమ్మునే దాల్చి య
  క్రమతన్ జేరెను దేవతావళిని, వీకన్ మృత్యువున్ గెల్చినా
  ‘’డమృతమ్మున్ జవి చూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
  (24-72018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజ శేఖర్ గారు నమస్సులు.నా యనుమానము తీరునట్లు దివిజు గా మార్పు చేసితిరి. బాగుంది.

   తొలగించండి
 35. డా.పిట్టాసత్యనారాయణ
  సమృషల్ వే వ్యవహారముల్, ఋతయుతుల్ శాస్త్రంపు విజ్ఞానపు
  న్నమృతంబిచ్చె; నరాళి తామె సురలున్నై బ్రహ్మలై సృష్టికి
  న్నమృషంబౌ బ్రతి సృష్టి జేయగలుగన్నౌరా యణూత్పత్తిని
  న్నమృతమ్మున్ జవి చూచి జచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!
  (పురహరులైన నరులు అణుబాంబులతో కుప్పగూలే సంభావన గలదు)

  రిప్లయితొలగించండి
 36. బృహస్పతి ఇంద్రునితో...

  మత్తేభవిక్రీడితము
  సుమనస్కుల్ సురలంచు నెంచ నగునే చోద్యంపుఁ జేష్టల్ గనన్
  క్రమమౌ మార్గము వీడుచున్ హిముడు తారన్గూడి సంతున్గనెన్
  భ్రమలే వీడరె భూమిపై నరులు? నప్రాచ్యంపు కార్యాలకా
  యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా?

  రిప్లయితొలగించండి
 37. అమరు లెట్టులైరి దివిని యమరులనగ
  నమృతమును త్రాగి,మరణించి రమరులెల్ల
  సాగరమథనంబవనట్టి సమయమంద
  టంచు దెలుపు భాగవతము నందరకును.

  రిప్లయితొలగించండి
 38. అమరుల్ కానగ చార్మినారునిట హాహాకారముల్జేయుచున్
  మమతల్ మీరగ భాగ్యనగ్రముననున్ మర్యాదలన్ వీడుచున్
  కమనీయంపు గుడుంబ గైకొనుచునే కంగారు లేకుండనా
  యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!

  గుడుంబ = Telangana's famous bootleg liquor

  రిప్లయితొలగించండి