29, జులై 2018, ఆదివారం

సమస్య - 2746 (కాంతయె మూలమ్ము...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్"
(లేదా...)
"కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"

113 కామెంట్‌లు:

 1. ఇంతులు సత్యలు నందరు
  పంతముతో పట్టుబట్టు భార్యలె కాదా!
  వింతేమున్నది శంకర!
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్!

  ...సారీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇంతులట సత్యభామలు' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
  2. సార్!

   ఆంధ్రభారతి ప్రకారం:

   సత్య = ద్రౌపది, సీత, పార్వతి

   తొలగించండి


 2. పొంతన వుండదు ప్రశ్నల
  దొంతరల జిలేబులెల్ల దొరలు వెసవెసన్
  కొంతైన వినదు మాటల
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వుండదు' ... వువూవొవో లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు. "పొంతన యుండదు" ఆనండి.

   తొలగించండి


 3. పంతము చేయుచు తా రా
  ద్ధాంతములన్ చేయుచున్ సదనమున తానొ
  క్కింతయు చూపదు గరువము
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. వింత జిలేబి తీరులయ వెంబడి రాదు సయాట సల్పదే!
  పంతము లాడుచుండును సభాస్థలి లో గరువమ్ము చూప దే
  కాంతము లోన నెట్టు నరె! కద్దమి యర్మిలి చూపదే! రమా
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  సందర్భము: సులభము
  ==============================
  ఎంతయినను.. నభిమానము
  కొంతయిననులేని తరుణి కోటి కొకరులే!..
  సుంతయిన మాట పడెనా...
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  29-7-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 6. చెంతకు చేరిన భర్త క
  శాంతిని గలిగించి తన వచనముల తోడన్
  స్వాంతమునన్ స్వార్థమడరు
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 7. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  కాంతయె కారణమ్మగును గాదె
  ధరన్ గలహమ్ము లేర్పడన్
  ======================
  ఈ భూమండలము పైన అన్ని
  గొడవలకు స్త్రీ యే కారణమని
  చెప్పుటలో విశేషమే సమస్య
  =======================
  సమస్యా పూరణము - 210
  ====================

  ఫీమేలు క్రేజి అనాదిగున్నది
  పశువులనది వదలకున్నది
  మత్తున జగతి తానూగుతున్నది
  కైపుగ కరిగి పోతున్నది
  ఆమె మనసును అతను గెలువ
  పాట్లవి ఎన్నియో కూర్చెడిన్
  కాంతయె కారణమ్మగును గాదె
  ధరన్ గలహమ్ము లేర్పడన్

  ====##$##====

  స్త్రీల పట్ల పురుషుల ఆకర్షణ యనునది
  ప్రాచీనకాలము నుండియే నున్నది. దానికి
  పశు పక్ష్యాదులు సైతము అతీతము కావు
  ఆడదాని మనుసును గెలుచు కోవడానికి
  మగవాడు పడే పాట్లెన్నో. ఈ క్రమంలో స్త్రీ
  యే ఈ భూమండలము లోని సమస్త
  కలహములకు /గొడవలకు/యుద్దములకు
  కారణభూతమగుచున్నదని భావము

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  ఎంత శ్రమించినన్ గనరదేమిటొ నన్ ., పొరుగింటి గౌరి దా
  వింతగ చీరలన్ నగల వేల ధరింపగ చిన్నబోయె నా
  స్వాంతమటంచు బల్క సతి సంగరమే యిక యింట ! కాంతకున్
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మైలవరపు వారికి రిటార్టు :)


   చెంత జిలేబులూర సయి చేరడు సేవల చేయడే సఖీ
   వింతగ జూచు సేలకొన విన్నపముల్ తెలుపన్ మగండు,తా
   సంతస మందు కైపదము చక్కగ పూరిచినంతయేను యే
   కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్?

   జిలేబి

   తొలగించండి
  2. కేవలం మీ పద్యమునకు పరిహాసప్రతిస్పందన మాత్రమే..... నమోనమః 🙏

   కాంతకు కాంతయే కలహకారణమన్న సమస్య లేదనన్
   భ్రాంతిని పొంది పద్దెమును వ్రాసితినద్ది సమస్య యయ్యె ! నా
   వంత విమర్శలేదు మగవారిసమూహమునుండి , గాని యీ
   కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ, జిలేబీ గారి పద్యానికి స్పందన రెండూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   జిలేబీ గారూ,
   __/\__

   తొలగించండి
 9. సాంతము యోచి oప తెలియు
  భ్రాంతి యు కాదది నిజమని భారత యుద్దం
  బం త యు జరుగు ట కెవరని
  కాంత యె కారణ ము గాదె కలహమ్ముల కు న్

  రిప్లయితొలగించండి


 10. కొంతైన వినడు పల్కుల
  శాంతమసలులేదు భార్య సైగల నర్థం
  బెంతయు గానక దెప్పును
  "కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్"

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతముతో పరికించుచు
   సంతసముగ దిద్ద వలెను సారు; జిలేబీ!
   సుంతయు టైపాటునిచట:
   "కాంతయె మూలమ్ము గాదు కలహమ్ములకున్"

   తొలగించండి


  2. శాంతముతో పరికించుచు
   సంతసముగ దిద్ద వలెను సారు పదములన్,
   కాంతుడు సుమ్మీ, కాదయ
   కాంతయె మూలమ్ము గాదు, కలహమ్ములకున్ :)

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ, ప్రభాకర శాస్త్రి గారూ,
   బింబ ప్రతిబింబాల వంటి మీ పూరణలు బాగున్నవి. కాని సమస్యలోని 'కాదె'ను 'కాదు' అనడం?

   తొలగించండి
 11. డా.పిట్టాసత్యనారాయణ
  కాంతా సుఖమొక మత్తై
  కాంతల యందంబులెల్ల కలవర పరచన్
  కాంతయె కాదని యౌనన
  కాంతయె మూలమ్ముగాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి

 12. మైలవరపు వారికి రిటార్టు :)


  చెంత జిలేబులూర సయి చేరడు సేవల చేయడే సఖీ
  వింతగ జూచు సేలకొన విన్నపముల్ తెలుపన్ మగండు,తా
  సంతస మందు కైపదము చక్కగ పూరిచినంతయేను యే
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కేవలం మీ పద్యమునకు పరిహాసప్రతిస్పందన మాత్రమే..... నమోనమః 🙏

   కాంతకు కాంతయే కలహకారణమన్న సమస్య లేదనన్
   భ్రాంతిని పొంది పద్దెమును వ్రాసితినద్ది సమస్య యయ్యె ! నా
   వంత విమర్శలేదు మగవారిసమూహమునుండి , గాని యీ
   కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 13. డా.పిట్టా సత్యనారాయణ
  భ్రాంతులకెల్ల భ్రాంతి యగు బాయగలేనిది భార్య సౌఖ్యమే
  క్రాంతికినైన కాంతయె సుఖాంతపు జీవిక కైన నాతి న
  శ్రాంతము జూచియున్ మురియు స్వాంతమునే యిటులిచ్చి యివ్వకన్ (చంచల స్వభావ)
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ములేర్పడన్

  రిప్లయితొలగించండి
 14. డా.ఎన్.వి.ఎన్.చారి
  అంతయుమాయయేననుచు నా ప్రభు
  విష్ణుపదా శ్రయంబునన్
  చింతలువీడిజీవులకు సేవలుచేయుచు
  నుండకుండగా
  చింతన తోడ పల్వురకు చేటును జేయగ కోరు నా మనో
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2746
  సమస్య :: కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్.
  తగాదాలు యుద్ధాలు ఏర్పడేదానికి కారణం స్త్రీ యే కదా అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ఎంత చెప్పినా ఎందఱు చెప్పినా వినని మూర్ఖులు లోకంలో ఇద్దఱు. ఒకడు రావణుడు. మఱియొకడు దుర్యోధనుడు.
  ద్వా విమౌ పురుషౌ మూర్ఖౌ, దుర్యోధన దశాననౌ ।
  గోగ్రహం వనభంగం చ, దృష్ట్వా యుద్ధం విచక్రతుః ।।
  అని పెద్దలు చెబుతారు. రావణుడు దుర్యోధనుడు ఇద్దఱూ పరకాంతను కోరి కామమునకు వశులై సమూలంగా నశించినారు. కాబట్టి నీవు మన్మథునికి బానిస కావద్దు. పర కాంతల జోలికి వెళ్లవద్దు. నా మాట విను. పరకాంతను కోరుకొంటే ఆ కాంతయే కలహము, వినాశనము ఏర్పడేదానికి కారణమౌతుంది అని ఒక కాముకునికి ఒక మిత్రుడు హితోపదేశం చేసే సందర్భం.

  కంతుని గెల్వుమా! పరుల కాంతల జోలికి వెళ్ళబోకుమా!
  పంతము బూని కామమున బర్వుచు రావణుడున్ సుయోధనుం
  డంతకు జేరినారు వినుమా! పరకాంతను గోరుకొన్న నా
  ‘’కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్.’’
  {శ్రీ సూరం శ్రీనివాసులు గురువర్యులకు ధన్యవాదాలతో}
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-7-2018)

  రిప్లయితొలగించండి


 16. కొంత సమయమ్ము చిక్కిన
  సంతసముగ మెడ్చెలనుచు చక్కగ బోవున్
  ఇంతిని నన్జూడడు! యే
  కాంతయె మూలమ్ము గాదు కలహమ్ములకున్?


  (శంకరాభరణ బ్లాగ్కాంత ఉబోసు )

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇవాళ వెళ్ళింది మేడ్చెల్ జిల్లా రచయితల సభకు! కట్టుకున్న కాంతను వదలి వృద్ధాశ్రమంలో ఏకాంతంగా ఉన్న నాకు ఏ కాంత అయినా సోదరియే సుమా!

   తొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వింతగు నడవడి తోడను
  సంతత మేపారు చుండి సరివారలతో
  శాంతము జూపక మెలిగెడి
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్?

  రిప్లయితొలగించండి
 18. వింతేమున్నది నృపులు ని
  రంతర మనిగోరుచు చతురంగబలము పో
  షింతురు గద రాజ్యమనెడు
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 19. కందం
  కాంతుని గోరెను కైకయె
  కాంతారమ్ములకు రాముఁ గదుపుమనుచు నీ
  వింతకు మంధర దాసీ
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 20. వింతగ పలుకగ నేడిల
  పంతము లకుబోయి వనిత వరముల పేరన్
  సుంతయు కరుణను చూపని
  కాంతయె మూలమ్ము గాదె కలహ మ్ములకున్

  రిప్లయితొలగించండి
 21. చెంతన వసించు గృహిణిని
  సంతతి నామెపతి ముద్దసలుపుట పోల్చన్
  భీతిగనున్నదహో పర
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 22. సంతు బడయగ వలెననిన
  కాంతయె మూలమ్ము గాదె, కలహమ్ములకు
  న్నిoతులధిక శాతమ్ము ని
  రంతరము కడన మెలుగుచు రహినే గోరున్

  రిప్లయితొలగించండి
 23. కాతల గురించి చెప్పిన
  కాంతయె మూలమ్ముగాదె కలహమ్ములకు
  న్సుంతయిన కాదసత్యము
  పంతమునకుబోదురెపుడు భర్తలపైనన్

  రిప్లయితొలగించండి
 24. తొలిపాదము
  కాంతలగురించి
  గా చచదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 25. వింతగు వర్తనమ్మునను వేదన బెట్టుచు నత్తమామలన్
  కంతుని బాణముల్ తగిలి కాంచ సుఖమ్మును భార్యపొందులో
  చెంతకు చేరినట్టి పతిఁ జేతల తోడ పరాభ వించు నా
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్

  రిప్లయితొలగించండి
 26. {సరదా పూరణము సమస్య పాదము సీసములో నిమిడ్చి)
  భారత యుద్ధము భామిని వలననే కారణ మాయెను ఖలము నందు ,
  రామ రావణ ఘోర రణమున కుం గోపు గాదె నితంబిని క్షాంతి నందు,
  రాణి పద్మావతి రమణీ మణి కతము గాదె ఖిల్జీ రాజ్య కలహమునకు,
  కాంతయె మూలమ్ము గాదె కలహముల కున్విశాల ధర లోన,
  తరచి చూడగ పలనాట తమ్మి కంటి
  కార ణమ్మాయెను గద సంగ్రామమునకు,
  వనిత తలచ శాంతి కలుగు, వనిత తలచ
  కోట నేగూల్చు, నిజమిది క్షోణి నందు

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు
  1. కందపాదాన్ని సీసపద్యంలో ఇమిడ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం నాలుగవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 28. చింతింపగ మితమే హిత
  మంతెఱుగని కీర్తి కాంక్ష యగచాట్లౌగా !
  వింతయె గలదే? కీరితి
  "కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్"
  *****}{}{*****
  మితిమీఱిన కీర్తి కాంత అనేక పోరాటాలకు, యుద్ధాలకు దారి తీస్తుందనేటందుకు కొల్లలుగా పౌరాణిక, చారిత్రక దృష్టాంతాలున్నాయి కదా !

  ****}{}{****

  రిప్లయితొలగించండి
 29. కాంతలు గారు కారణము, కాపురుషుండగు వాని కామమున్
  బంతము గారణమ్మగును ప్రాణము దీసెడి పోరుకంతకున్
  కాంతల యాత్మగౌరవము కంతుని బానిస చేతఁ గూల నా
  *"కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"*

  రిప్లయితొలగించండి
 30. _శాంతము,సహనము జూపును_
  _కాంతయె,మూలమ్ము గాదె కలహమ్మునకున్_
  _సంతసములేని మనుజుల_
  _చింతల బెంచుచు దురాశ చెంతన చేరన్_

  రిప్లయితొలగించండి
 31. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్

  సందర్భము: రామకథ పరువంతది... అనగా కొండంతది లేదా సముద్రమంతది.
  పాండవాదుల కథ (భారత కథ) కూడ కొండంతది లేదా సముద్రమంతది.
  కాని రవ్వంత పరువుపోతే సరి.. ఏ కాంత యైనా కలహాలకే మూల మవుతుంది కదా సీతా ద్రౌపదుల వలె!..
  పరువు=కొండ.. సముద్రము.. గౌరవము..
  ==============================
  ఎం తన.. పరు వంతది.. పరు
  వంతది.. రామకథ.. పాండ వాదుల కథ... ర
  వ్వంత పరువు కోల్పడెనా!
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  29-7-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 32. దేవిక
  -------
  సంతసముగ నెల్లరు మన
  కాంతయె మూలమ్ము గాదె; కలహమ్ములకున్
  సుంత యును తావిడక తా
  సంతసకట్టుగ మెలగగ సంయమనముగన్ !

  రిప్లయితొలగించండి
 33. చింతకు కలిగెడి! కోర్కెలు
  పంతమ్ములుపట్టుదలలు భాగ్యముకొరకే
  కొంతయు ననుమానించెడి
  కాంతయె!మూలమ్ముగాదె కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి


 34. ఇంతియె దీపమ్మింటికి
  బంతివలె నటునిటు తిరుగు పతి సేవితయై
  స్వాంతముగ బతుకు బండికి
  కాంతయె మూలమ్ము, గాదు కలహమ్ములకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. (పలనాటియుద్ధకారకురాలు నాయకురాలు నాగమ్మ )
  శాంతము నిండినట్టి కడుసాత్వికుడా నలగామరాజుకున్
  భ్రాంతుడుగానియట్టి మృదుభావకుడా మలిదేవరాజుకున్
  స్వాంతమునందు గల్మషము సాంతము నింపెను
  నాగమాంబయే ;
  కాంతయె కారణమ్మగునుగాదె ధరన్ గలహమ్ములేర్పడన్ .


  రిప్లయితొలగించండి
 36. కాంతయెకారణమ్మగునుగాదెధరన్ గలహమ్ములేర్పడ
  న్గాంతయెకారణంబుధరగాంతలమధ్యనగల్గసూయయే
  కాంతులవల్లనేనదియుగారణమౌనుదురాగతంబున
  న్సాంతముబ్రేమతోనునికి,సర్వులకందము,జూడముద్దగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాంతల మధ్య నసూయ గల్గగన్' అనండి.

   తొలగించండి
 37. శాంతిని గోరునదిలలో
  కాంతయె, మూలమ్ము గాదె కలహమ్ములకున్
  నంతెరుగని స్వార్థమ్మట
  యంతేలేనట్టికోర్కెలవియే గదరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలహమ్ములకున్ + అంతు = కలహమ్ముల కంతు' అవుతుంది. అక్కడ "కలహములకు తా। నంతెరుగని..." అనండి.

   తొలగించండి
 38. ఇంతియె నవ్వినందుకట యెంతటి ఘోరమొ భారతమ్మునన్
  గాంతను కాదు పొమ్మనిన కారణమొక్కటె దానవాగ్రణి
  న్నంతము జేసినట్టి ఘన హారపు మూలమదేగదా గనన్
  గాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్

  రిప్లయితొలగించండి
 39. సంతత రత సంగ్రామ
  ధ్వాంతులు నాసేతు శీత ధాత్రీధర ప
  ర్యంతము రాజులకు మహీ
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్


  కంతుని కోల కోడి దశకంఠుఁడు గూలె ధరాత్మజార్థమై
  పంతముఁ బూని కీచకుఁడు వాడువడెన్ ద్రుపదాత్మజార్థమై
  భ్రాంతినిఁ బోరు సల్పె శిశుపాలుఁడు భైష్మకిఁ గోరి కృష్ణుతోఁ
  గాంతయె కారణమ్మగును గాదె ధరం గలహమ్ము లేర్పడన్

  రిప్లయితొలగించండి
 40. పొంతన లేనిమాటలవి ప్రోడలు లేతమనస్కులే కదా
  శాంతిని గోరువారు మన జాతికి మూలము పూజనీయమౌ
  కాంతయె, కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్
  గొంతయు కూడయింగితము కూరిమిలేని తనమ్మదే భువిన్

  రిప్లయితొలగించండి
 41. ఆటవిడుపు గంభీర పూరణ:
  ("రమయా వస్తావయా...మైనె దిల్ తుఝ్ కొ దియా")

  "వింతలు పూరుషుండ్లవిట వేషలు భాషలు దూషణమ్ములున్
  చెంతకు చేరదీసి వడి చెన్నుగ పన్నుగ సంతునొందురే
  కొంతయు చింత లేక తమ కోరిక తీరగ వ్రాయుచుందురే:
  "కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"!!!"

  https://m.youtube.com/watch?v=epoB4fvPGj8

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవకాశ వాదులూ లేక పోలేదు బాగుందండీ
   ప్రభాకర శాస్త్రి గారు!

   ఈశ్వర్ రెడ్డి ఊర!

   🌸🌸🌸🌻🙏🌻🌸🌸🌸

   తొలగించండి
  2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'పూరుషుండ్లు'...?

   తొలగించండి
  3. పూరుషుఁడు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
   సం. వి. అ. పుం.

   మనుష్యుఁడు

   తొలగించండి
 42. వంతల శాంతులన్ మదిని పంచుకొనం దగు తోడు మృగ్యమౌ
  నింతికి రక్షణం బుడుగు నెల్లరి చూపులు వ్రాలు నామె పై
  కాంతుడు లేమి సాటి పరకాంతలు దెప్పుచు నుందు రిట్టు "లే
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్".

  రిప్లయితొలగించండి
 43. ఇవాళ గురువు గారు లేరా సమీక్షకు నోచుకోలేదు ఆరోగ్యము ఎలా ఉందో ఏమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉదయమే బయలుదేరి మేడ్చెల్ జిల్లా రచయితల సభకు వెళ్ళి ఇంతకు ముందే నెలవు చేరాను. ఆరోగ్యానికేం? బ్రహ్మాండంగా ఉంది. ధన్యవాదాలు.

   తొలగించండి
 44. ఉత్పలమాల

  తంతుగ జూదమాడి సతిఁ దమ్ముల నోడఁగ ధర్మజుండటన్
  యింతిని ద్రౌపదిన్ సభకు నీడ్చి వివస్త్రను జేయకౌరవుల్
  యంతము నొందు దాక సిగ నల్లనటంచు ప్రతిజ్ఞ జేసెడున్
  గాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అటన్ + ఇంతిని, కౌరవుల్ + అంతము' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

   ఉత్పలమాల

   తంతుగ జూదమాడి సతిఁ దమ్ముల నోడఁగ ధర్మరాజు య
   య్యింతిని ద్రౌపదిన్ సభకు నీడ్చి వివస్త్రను జేయ దుష్టుడే
   యంతము నొందు దాక సిగ నల్లనటంచు ప్రతిజ్ఞ జేసెడున్
   గాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్

   తొలగించండి
 45. 29, జులై 2018, ఆదివారం "శంకరాభరణం "

  సమస్య - *2746*

  *"కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్"*

  (లేదా...)

  *"కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"*

  పూరణ

  ఉ.మా

  కాంతయె కక్ష బట్టుచును కానల కంపెను రామచంద్రునిన్
  కాంతయె పారిజాతమును కాన్కగ కోరుచు కృష్ణు పంపెగా
  కాంతయె కొప్పుబెట్టననె కౌరవు లందరి చావు గోరుచున్
  *కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్*!! (1)

  కం

  పంతము పెరుగును సతికిన్
  చింతలనే దీర్చకున్న చెమరింతలతో
  శాంతము నశించ(చు) మగనికి
  *కాంతయె మూలమ్ము గాదె, కలహమ్ములకున్* !! (2)

  హంసగీతి
  29.7.18

  రిప్లయితొలగించండి

 46. కం:సంతసమున బ్రతుకు గడప
  కాంతలె మూలమ్ము గాదె,కలహమ్ములకున్
  కాంతలె మూలమటంచును
  పంతమునకు మాటలాడ భావ్యం బగునా

  కం:వింతేమున్నది జగతిన
  కాంతల సతతము చులకనగానిటు చూడన్
  పంతము చెలరేగగ నా
  కాంతలె మూలమ్ము గాదె,కలహమ్ములకున్

  రిప్లయితొలగించండి
 47. దేవిక
  --------
  ఎంతయు కష్టము దోచున్
  కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్,
  పంతమ్ములకున్ను యనగ,
  నింతియె లేకను గలుగునె నిండుదనమిలన్ !

  రిప్లయితొలగించండి
 48. మరొక పూరణ
  కాంతయె రామచంద్రుని వని కంపగ కారణమయ్యెగా గనన్
  కాంతను గొంపోవనది కారణ మయ్యెను జూడ నాగతిన్
  కాంతను పందెమొడ్డుటయె కౌరవ వంశము నాశమయ్యెగా
  *"కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్"*

  రిప్లయితొలగించండి
 49. దేవిక
  --------
  చింతలు లేక సుఖపడగ
  కాంతయె మూలమ్ము గాదె ; కలహమ్ములకున్
  కాంతను బలి జేయునిలన్
  సుంతయు దయలేకను పురుషుండెల్లపుడున్ !

  రిప్లయితొలగించండి
 50. సవరణతో
  కాంతయె రామచంద్రునల కానల కంపగ కారణంబయెన్
  కాంతను రక్కసుండ గొన కారణ మయ్యెను పోరుకున్నటన్
  కాంతను పందెమొడ్డుటచె కౌరవ వంశము నాశమయ్యెగా
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్

  రిప్లయితొలగించండి
 51. ఇంతి మహీజయే గదర నింపుగ దెమ్మనె మాయలేడినిన్
  కొంతయు నాపలేక నగె క్రోధము రాజిల పంచభర్త్రుకే
  చింతయు జేయకే కనియె సింపులు డింపును సోనియమ్మయే...
  కాంతయె కారణమ్మగును గాదె ధరన్ గలహమ్ము లేర్పడన్!

  రిప్లయితొలగించండి