జిలేబీ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'సుబ్బారావు' గారి మార్గాన్ని బాగానే గుర్తు పట్టారే! అంటే మీరు అందరి పూరణలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నమాట! సంతోషం!
కోటికి లోపుగనె జనాభా మన జిల్లాగ తానొక దేశము దాని పేరది ఇజ్రాయేలు అభివృద్దికి అది ప్రవేశము డీశాలినేషన్ ప్రక్రియగ తాగు నీటికి కలిగెనెలమి సాగరమందు నీరమది చక్కెర తీరున దియ్యనౌ సుమీ
దాగిన నుప్పు వారగని త్రాగుట కై సరి జేసి సాంద్రమున్ బాగుగ జేసి రిజ్రయిలు భారత భూమికి వారు ప్రోదిగా చేగలవారి కైపులన చేవయు గూర్చెద మంచు చేయగా సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2742 సమస్య :: సాగరమందు నీర మది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ. సముద్రంలోని నీరు చక్కెర లాగా తీయగా ఉంటుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ‘’వహ్నిః తస్య జలాయతే .....’’ అనే శ్లోకంలో మహాకవి భర్తృహరి గొప్ప శీలముచే ప్రకాశించేవారి మహిమను తెలియజేసినారు. ‘’పవి పుష్పంబగు ......’’ అనే పద్యంలో ధూర్జటి మహాకవి భగవన్నామ స్మరణ చేస్తే లోకం వశమౌతుంది అని భక్తుల మహిమను వివరించారు. కాబట్టి త్యాగము చిత్తశుద్ధి ధర్మము శీలము భక్తిభావము సంపూర్ణంగా ఉన్న యోగులకు అసాధ్యములు సుసాధ్యములౌతాయి. సముద్రములోని నీరు చక్కెర లాగా తీయగా మారుతుంది అని విశదీకరించే సందర్భం.
త్యాగము చిత్తశుద్ధి వరధర్మము శీలము భక్తిభావమున్ బాగుగ నున్న యోగికి శుభమ్మగు, లోకము వశ్యమౌ, రుచిన్ సాగును జీవిత, మ్మిల నసాధ్యము సాధ్యముగా జెలంగగన్ సాగరమందు నీర మది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-7-2018)
డా.పిట్టా సత్యనారాయణ మురికి నీటిపై రంధ్రపు ముట్టునీరు గంగపై పీనుగులు క్రుళ్ళు గబ్బునీరు సహజ పారుదలన్నాపు సరసిపంక్తి భూమి కంపించు తెరవది భూరి విపద త్రాగు నీరు భగీరథ తపమె రేపు సాగర జలమ్ము తీయన చక్కెర వలె
గురువులకు, మాన్యులకు నమస్సులు.🙏🙏🙏 రామ చరితమ్ము వినినంత రమతి కల్గు రామ కీర్త న నిరతము రమను గూర్చు రామ భక్తులకు నిలను రామ భక్తి *సాగర జలమ్ము తీయన చక్కెర వలె!*
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. 'అయ్యది న్దనరె' అన్న ప్రయోగం సరిగా లేదు. రెండవ పాదంలో 'సాగర' శబ్దం రెండు సార్లు ప్రయుక్తమయింది.
మన పురాణము లన్నియు ఘనము ఘనము
రిప్లయితొలగించండిచదివితినిర వింతగ పాల సంద్రములను
పారజూచిన దొరకును పంచదార
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
"Seven intermediate oceans consist of salt-water, sugarcane juice, wine, ghee, yogurt, milk and water respectively.[2][3]"
తొలగించండిhttps://en.m.wikipedia.org/wiki/Jambudvipa
మైలవరపు వారి సవరణ:
తొలగించండిమన పురాణము లన్నియు
ఘనము, లందు
పాల సంద్రము గలదట్లె పారజూడ
పంచదారకు దొరుకును వార్ధి , యట్టి
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభోగవిలాసవస్తుపరిమూఢునికిన్ గన జీవితంబు నా
సాగరమౌను , తజ్జలము క్షారము ., దాను నిమిత్తమాత్రుడై
రాగవిహీనుడై చెలగ రమ్యము జీవితమెల్ల ., వానికా
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమూగగ కన్నులన్ గలిపి ముచ్చట దీరగ మాటలాడుచున్
రిప్లయితొలగించండివేగము మీరగా హృదయవీథుల రాగము రెండుగుండెల
న్నాగక నిండుచున్ తొణుకులాడెడి సంద్రము రూపుదాల్ప; నా
సాగరమందు నీరమది చక్కెర తీరున దీయనౌ సుమీ !
బాపూజీ గారూ,
తొలగించండిహృద్యమైన పూరణ. బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"సాగర జలమ్ము తీయన చక్కెరవలె"
తే.గీ*
ఉప్పు శాతమధికముగా నున్న నీరు
శుద్ధి జేసి నీటి కొరత సులువు దీర్చు
కొనిరరబ్బుదేశీయులు కొన్ని కఠిన
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
..................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనదు క్షేమమ్ముగోరుచు మాటలాడు
రిప్లయితొలగించండివారి మాటలఁ గాంచిన వసుధ యందు
సాగర జలమ్ము, తీయని చక్కెర వలె
నుండవవి గాని సమకూర్చు దండి మేలు.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
'మనదు' శబ్ద సాధుత్వం గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నది.
మంకు పట్టును పట్టకు శంకలేదు
రిప్లయితొలగించండిఔషధమ్మిది తొలగించు నామయమును
చేకొనంగను దగు పుత్ర! చేదు కాదు
సాగర! జలమ్ము తీయన చక్కెరవలె.
వేగమె రమ్ము పుత్రక! నవీనము సత్యము విశ్వసింపుమా
రోగము ద్రుంచివేయు నతిరుచ్యము నిన్ననె తెచ్చినాను నీ
వేగతి శంకపూనవల దించుక చేకొను మోయి క్షేమమౌ
సాగర! మందునీర మది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిసాగర శబ్దాన్ని సంబోధనగా చేసి చెప్పిన మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భోగములంద వచ్చు నల!భోజన మందున పాన్పులందునన్
రిప్లయితొలగించండిరాగము దీయవచ్చు ననురాగము తోడుత దంపతుల్ భళా
జాగును సేయకండిమరి జాగృతులై వడి నీదరండి *సం*
*సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ*
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంసారసాగరము' నకు 'సంసాగరము' అన్న కొత్త పదాన్నిసృష్టించారా?
భక్త జన రక్షకుడు ! దీన బాంధవుడు! పి
రిప్లయితొలగించండిలిచిన పలుకెడు ప్రేమమూర్తి! సతము కడు
దురితముల బాపు విశ్వనాథుని కరుణపు
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
~ ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపొసగు నాగార్జునుని పేరు పొందినట్టి
సాగర జలమ్ము తీయన చక్కెరవలె,
వెలుగు తేటగీతి మనది వెలుగు లొల్కు
తెలుగు జాతిమనది నిండు తెరగుల భళి!
జిలేబి
రిప్లయితొలగించండిసుబ్బారావు గారే మాకివ్వాళ మార్గ దర్శకులు :)
పోగయి నాము పొందికగ పూరణలన్ భళి జేయ శంకరా!
జోగుచు పొద్దు పూట మరి జోరుగ స్వాదము గాంచినారకో?
హేగురు!యేమి చెప్పితిరి! యెక్కడ సుమ్మి జిలేబి పోకడన్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సుబ్బారావు' గారి మార్గాన్ని బాగానే గుర్తు పట్టారే! అంటే మీరు అందరి పూరణలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నమాట! సంతోషం!
కోటికి లోపుగనె జనాభా మన జిల్లాగ తానొక
రిప్లయితొలగించండిదేశము
దాని పేరది ఇజ్రాయేలు అభివృద్దికి అది
ప్రవేశము
డీశాలినేషన్ ప్రక్రియగ తాగు నీటికి
కలిగెనెలమి
సాగరమందు నీరమది చక్కెర తీరున
దియ్యనౌ సుమీ
తొలగించండిరమేశా వారి భావనకు
దాగిన నుప్పు వారగని త్రాగుట కై సరి జేసి సాంద్రమున్
బాగుగ జేసి రిజ్రయిలు భారత భూమికి వారు ప్రోదిగా
చేగలవారి కైపులన చేవయు గూర్చెద మంచు చేయగా
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం చక్కగా ఉన్నది. అభినందనలు.
'ఉప్పువార గని'...?
తొలగించండిఉప్పును వారగ దీసి (వేరుగ చేసి)
జిలేబి
దేశ భక్తి ని గల్గియు దీక్ష తోడ
రిప్లయితొలగించండిపూని వైరు ల న్ దును ము చు ముందు కురికి
సాగర ; జలమ్ము తీయన చక్కెర వలె
భరత జాతికి నానoద వార్ధి యందు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2742
సమస్య :: సాగరమందు నీర మది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ.
సముద్రంలోని నీరు చక్కెర లాగా తీయగా ఉంటుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ‘’వహ్నిః తస్య జలాయతే .....’’ అనే శ్లోకంలో మహాకవి భర్తృహరి గొప్ప శీలముచే ప్రకాశించేవారి మహిమను తెలియజేసినారు. ‘’పవి పుష్పంబగు ......’’ అనే పద్యంలో ధూర్జటి మహాకవి భగవన్నామ స్మరణ చేస్తే లోకం వశమౌతుంది అని భక్తుల మహిమను వివరించారు. కాబట్టి త్యాగము చిత్తశుద్ధి ధర్మము శీలము భక్తిభావము సంపూర్ణంగా ఉన్న యోగులకు అసాధ్యములు సుసాధ్యములౌతాయి. సముద్రములోని నీరు చక్కెర లాగా తీయగా మారుతుంది అని విశదీకరించే సందర్భం.
త్యాగము చిత్తశుద్ధి వరధర్మము శీలము భక్తిభావమున్
బాగుగ నున్న యోగికి శుభమ్మగు, లోకము వశ్యమౌ, రుచిన్
సాగును జీవిత, మ్మిల నసాధ్యము సాధ్యముగా జెలంగగన్
సాగరమందు నీర మది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
(25-7-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
హిందుసేన మెఱుపుదాడి నేర్పరచిరి
రిప్లయితొలగించండిశత్రుమూకలాక్రందము సలుపుచుండ
సాగర జలమ్ము తీయన చక్కెర వలె
నుండి వీనులకింపయి నొప్పెనపుడు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమురికి నీటిపై రంధ్రపు ముట్టునీరు
గంగపై పీనుగులు క్రుళ్ళు గబ్బునీరు
సహజ పారుదలన్నాపు సరసిపంక్తి
భూమి కంపించు తెరవది భూరి విపద
త్రాగు నీరు భగీరథ తపమె రేపు
సాగర జలమ్ము తీయన చక్కెర వలె
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిజాగరణంపు నీ జనత చావగ నీయదు, పెంపు నీయ దా
కాగల కార్యమే బ్రకృతి గాంచును మానవ దౌష్ట్యమిట్టిదౌ
ఆగు మటంచు నీటినల నాపిన లాభమె భూప్రకంపనల్
సాగును మన్ను మిన్నులపచారము నోపునె;నోరు దడ్పగన్
సాగరమందు నీరమది చక్కెర తీరున దియ్యనౌ సుమీ!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉ.
రిప్లయితొలగించండివాగనుశాసనాది కవి వర్యులపద్యజలాభిరామమై
రాగము ఫేనమై యతియు ప్రాసయు ఛందము బుద్బుదమ్ములై
యూగెను తెన్గుసాగరము నూర్మికలౌచుప్రబంధకావ్యముల్
సాగరమందు నీరమది చక్కెర తీరున దీయనౌ సుమీ ! ..కోట శర్మ
తొలగించండిచాలా బాగుందండీ తెన్గు సాగరపు మంచినీరు
జిలేబి
కోట శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు,
రిప్లయితొలగించండిగాను గాడుచు నిసుకలో నూనె తీయ
వచ్చు,ఘనతన జగమంత మెచ్చునట్లు
సాగర జలమ్ము తీయన చక్కెర వలె
శాస్త్రవేత్తలు జేయుచు సంతసమ్ము
నెల్లరకు నీయవచ్చును, కల్లమాట
గాదె మూర్ఖుల మనసును మోద భరిత
మగునటుల జేయ నిలలోన తెగువజూపి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కలియె పరమాన్న మతనికి చెలియ యున్న
రిప్లయితొలగించండిపరగ కఠిన నేలయె మల్లె పాను పౌను
పండు వెన్నెలౌ యెండ తానండనుండ
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిజాగరణంపు నీ జనత చావగ నీయదు, పెంపు నీయ దా
కాగల కార్యమే బ్రకృతి గాంచును మానవ దౌష్ట్యమిట్టిదౌ
ఆగు మటంచు నీటినల నాపిన లాభమె భూప్రకంపనల్
సాగును మన్ను మిన్నులపచారము నోపునె;నోరు దడ్పగన్
సాగరమందు నీరమది చక్కెర తీరున దియ్యనౌ సుమీ!
డా. పిట్టా వారూ,
తొలగించండిసవరించిన మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిఎంత జలమున్న విశ్వంబు కేమి ఫలము
సాగర జలము?తీయన చక్కెర వలె
నారి కేళ జలము కడు నాదరణము
భూరి విరాళమునకన్న పూలు మిన్న.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విశ్వంబునకు' అనడం సాధువు. అక్కడ "జగమున కేమి.." అనండి.
సంద్రములలోన దియ్యటి సంద్రమొకటి
రిప్లయితొలగించండిపంచదారనుబేరనబరగెభువిని
దానిజలములుదీయనననుచు బలికె
సాగరజలమ్ముతీయనచక్కెరవలె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండికరివరదుడు నొగి యుగయుగముల దుష్ట
శిక్షణార్థము శిష్ట సంరక్షణార్థ
మరసి యవతారముల నెత్తె నజుని హృదయ
సాగర జలమ్ము తీయన చక్కెరవలె
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎంత యత్నించినను గాని కొంతయినను
రిప్లయితొలగించండిమారదిల లవణ భరితమదియు గనుడు
సాగర జలమ్ము,తీయన చక్కెర వలె
నుండు నారికేళ జలము నుర్వి యందు.
అరసి చూడ తేనెయు తీపి యవనియందు
నరటి పండది తీయన నటులె భక్తి
సాగర జలమ్ము తీయనచక్కెర వలె
సతము భజియించు సద్భక్త జనుల కిలను.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భూరి సప్త సముద్ర సుముద్రి తాచ
రిప్లయితొలగించండిల సువిభూషిత లవణ జలధి ముఖాంబు
రాశి సప్త రత్నముల నరయఁగ నిక్షు
సాగర జలమ్ము తీయన చక్కెర వలె
నాగరి కాత్మ చింతనలు నైజము నెక్కుడు వింతలే సుమీ
యేఁగఁగ మీరి యూరక యహీన దురాసద యాన మీ గతిన్
వేఁగఁగ క్షుత్పిపాసల నపేత జలోదన యాత్రి కాళికిన్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅమృతమవతరిల్లగ జేసినట్టి పజ్జ
రత్నధాతువులకునెల్ల రచ్చపట్టు
అచ్యుతుని నివాసమగుచు నడరు క్షీర
సాగర జలమ్ము తీయన చక్కెర వలె?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అతివతో సతతము తేలునట్టి ప్రేమ
రిప్లయితొలగించండిసాగర జలమ్ము తీయన చక్కెరవలె
నారుచి స్మరణీయమవని ననవరతము
అనుభవించిన వారల కవగతమగు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యం చదివాక మా ఆవిడ దగ్గరికి తిరిగి వెళ్ళాలనిపిస్తున్నది సుమా!
గురువులకు, మాన్యులకు నమస్సులు.🙏🙏🙏
రిప్లయితొలగించండిరామ చరితమ్ము వినినంత రమతి కల్గు
రామ కీర్త న నిరతము రమను గూర్చు
రామ భక్తులకు నిలను రామ భక్తి
*సాగర జలమ్ము తీయన చక్కెర వలె!*
మంత్రవాది వారూ,
తొలగించండిత్యాగయ్య రామభక్తి సామ్రాజ్యమంతే మీరు రామభక్తి సాగర మన్నారు. చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు
తొలగించండి_/|\_
ధన్యవాదములు గురువుగారు
తొలగించండి_/|\_
సాగరముల్ గలవవనిసప్తకసంఖ్యకుమొత్తమందునన్
రిప్లయితొలగించండిసాగరమయ్యదిన్దనరెచక్కెరనామకసాగరంబ,యీ
సాగరమందునీరమదిచక్కెరతీరునదియ్యనౌసుమీ
సాగరమేర్పడున్నదులసద్మములొక్కటజేరగాదగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. 'అయ్యది న్దనరె' అన్న ప్రయోగం సరిగా లేదు. రెండవ పాదంలో 'సాగర' శబ్దం రెండు సార్లు ప్రయుక్తమయింది.
మంచివారి తోడ చెలిమి మల్లె తీరు
రిప్లయితొలగించండిమనసు తెల్లన మాటయు మత్తు జల్లు
విబుధుల చెలిమి కోరిన విహిత మతికి
సాగర జలమ్ము తీయన చక్కెరవలె"
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
thank you..
తొలగించండిబాగరి కొంగు తాకినను స్వర్గమె చెంతకు చేరవచ్చు తా
రిప్లయితొలగించండిసైగను చేసి పిల్చినను చక్కిలి గింతల బెట్టినట్లగున్
రాగము తో వయస్యునకు లాలన మందున తెచ్చియిచ్చినన్
సాగర మందు నీరమది, చక్కెర తీరీనఁ దియ్యనౌ సుమీ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి("సప్త సప్త మహాసప్త")
సాగర సప్తముల్ గనుడు స్వచ్ఛపు హైదరబాదు నందునన్
వేగమె రండి రండిటను వేడుక మీరగ మా హుసేనుదౌ
సాగర మందునన్ గలడు శాక్యపు మౌనియు,...నోసుమాను దీ
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ
హైదరాబాద్ సప్తసాగరములు =
Hussain Sagar, Osman Sagar, Himayat Sagar, Nizam Sagar, Saroor Sagar, Veer Sagar, Fox Sagar
తొలగించండిఆబ కందము :)
సాగరము లేడు హుస్సైన్
సాగరమందు కలిసెనయ శాక్యపు గురువుల్
భాగమయిరి దానినడుమ
సాగరపు జలము జుమోజు సహజ జిలేబీ :)
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిజిలేబి గారూ:
హుసేన్ సాగర్ నీరు త్రాగిన తత్క్షణమే మోక్షము లభించును.
ఒస్మాన్ సాగర్ (గండిపేట లేక్)+ హిమయత్ సాగర్లు హైదరాబాదు ప్రజలకు అప్పుడప్పుడూ త్రాగుడు నీరు సరఫరా చేయును.
మిగిలిన సాగరులు నీటి తామర (water hayacinth) తో స్వచ్ఛ భారత్ కొరకు వేచియున్నవి.
ద్వీపకల్పన యందున దిగులుమాన్ప
రిప్లయితొలగించండియంత్రతంత్రాల చేతప్రయాసయనక
సాగరజలమ్ము తీయన చెక్కరవలె
మార్చ?శాస్త్ర వేత్తలచే సమాజసేవ!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాగెడు వేళ జీవనము చక్కిలిగింతలు పెట్టు రాగముల్
రిప్లయితొలగించండితూగు తరంగముల్ సతిని తోడుగ జేకొని దాటు యత్నమౌ
నాగని యాన మీ గతిని హాయిగ తేలెడు వేళ సంసృతీ
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
వెదకి వెదకి శశపు కొమ్ము విపినమున గ
రిప్లయితొలగించండిడించ వచ్చు, సికతము నుండి చమురు వెత
బడక సాధించ వచ్చును, కడిది లేక
నెండ మావిలో త్రాగెడు నీరు పొంద
వచ్చు, జగతిలో జనులెల్ల మెచ్చు నటుల
"సాగర జలమ్ము తీయన చక్కెరవలె"
శాస్త్ర వేత్తలు జేయగ సంతసమ్ము
బడయ వచ్చును, వసుధలో పాటు గాదు
మూర్ఖునిమదిలో నింపగ మోదనమ్ము
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిత్యాగరా జన్నమయ్యల తత్వ లహరి
రామదాసును క్షేత్రయ్య రమ్య కృతుల
కెరలు చుండెడి రాగ సంగీత సార
"సాగర జలమ్ము తీయన చక్కెర వలె!"
శిష్ట్లా వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమరొకపూరణము
రాగము తోడనా సతియు రక్తియు భక్తియు కల్గునట్లుగా
నాగులపూజలన్ విడక నాచరణమ్మును చేయుచున్ సదా
నాగము చేయు పిల్లలను శాంతము తోడను పెంచ ప్రేమపున్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండివేగపు జీవితమ్ము నను వేదన శాంతికి తావు లేకయే
స్వాగత మీయ నేర్వుడు ప్రశాంతత చిక్కఁగ మీకు మీరుగా
నాగగ శ్వాసపై తమరి ధ్యాసయె యోగము కూడు ధ్యానమన్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂ సమస్య 🤷♀..................
*"సాగర జలమ్ము తీయన చక్కెరవలె"*
**************************************
సందర్భము: యోగిరాజైన షిరిడీ సాయి బాబా నూనెకు బదులు నీళ్ళు పోసి ద్వారకామాయిలోని దీపాలు వెలిగించినాడు.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా పెట్రోలు లేకపోతే నీళ్ళు పోయించి కారు నడిపింప చేసినాడు.
యోగుల కసాధ్య మే మున్నది!
==============================
లీలగ జలమే నూనె... దీపాలు వెలుగు
కనుగొన జలమే పెట్రోలు... కారు నడచు..
యోగుల కసాధ్య మున్నదే యుర్విమీద!
మరొక పూరణము:-
సందర్భము: యోగియైన తరువాత మగవాని కసాధ్య మే మున్నది? కాని యోగిగా తయారు కావడానికి ప్రధానమైన అడ్డంకి యేమిటో చూడండి.
ఒలయు= చుట్టుకొను, కమ్ము, కలుగు, వ్యాపించు
==============================
వేగ జాలరి గాలము విసరినట్టు
మొలక నవ్వుల వలపు చూపులను మెలత
లొలయకున్నచో మగవాడె యోగి... నాడె
*"సాగర జలమ్ము తీయన చక్కెరవలె"*
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
25-7-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
అంబుజముల యందలి తేనె లారగింప
రిప్లయితొలగించండివనమునందలి భ్రమరముల్ వాలె గొన్ని
యిభముల వెనుక తుమ్మెద లేగె కొన్ని
సాగర జలమ్ము దీయన చక్కెరవలె
(శంకరయ్య గురువుగారు తొలిసారి ఈ బ్లాగులో పోస్టు చేస్తున్నా. దయతో నా పద్యం స్వీకరించగలరు🙏)
👌
తొలగించండిదేవిక
రిప్లయితొలగించండి-------
ఎన్నగ గురుని ఙ్ఞానసంపన్నతదియె
సాగర జలమ్ము ; తీయన చక్కెర వలె
సౌమ్యమౌ వాక్కులరయంగ ; సౌమనస్య
మున్ బడయరె ఛాత్రులిలను ముదము మీర!
సాగరమునందు నీరము చవిగొనంగ
రిప్లయితొలగించండియుప్పుగమరియుండునుగద యుర్వి, గాని
మనమునందున పొంగెడు మౌన భావ
సాగర జలమ్ము తీయన, చక్కెరవలె!!!
25.7.18
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య
*సాగర జలమ్ము తీయన చక్కెర వలె*
పూరణ
తే.గీ
గాన లహరిని వినుచుండ గాత్రమందు
నలల వలె సాగు స్వరములు హాయి గొల్ప
సరిగమల గమకాలలో జతుల రాగ
*సాగర జలమ్ము తీయన చక్కెర వలె*!!
హంసగీతి
పెద్దలు తప్పులుంటే తెలుపగలరు🙏🏻🙏🏻
త్రాగగ తల్లి జేసినది ధన్యలు నూరిన నుల్లిచారహో
రిప్లయితొలగించండిసాగరమందు నీరమది;...చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ
త్రాగగ పానిపూరిదది ధైర్యము మీరగ రోడ్డు సైడుదౌ...
వాగగ గర్లుఫ్రెండు వడి వంకర టింకర మాయమాటలన్