13, జులై 2018, శుక్రవారం

సమస్య - 2731

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన పూరణ ఇది...
"వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్"
(లేదా...)
"వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్"
ఈ సమస్యను పంపిన రాణి వెంకట గోపాలకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

82 కామెంట్‌లు:

 1. శీలమె చేలము సీతకు;
  కాలము దాపించిన దశకంధరు డలుకన్
  బ్రేలగ రాఘవు;గర
  వాలమొకటె తక్కువగద వసుధాత్మజకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🙏

   బాపూజి గారు:

   మూడవ పాదం గణములు సరియా?

   తొలగించండి
  2. మూడవపాదం "బ్రేలగ రఘురాముని ; గర " అని చదువ మనవి . ధన్యవాదాలండీ శాస్త్రిగారూ !

   తొలగించండి
  3. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పూరణ గణదోషాన్ని సవరించండి.

   తొలగించండి


 2. జాలము లోన జిలేబికి?
  గాలికొమరు జఘ్నియేది? గాదిలి మీరన్
  బాలా! పెనిమిటి రాముడు?
  వాల మొకటె తక్కువ; గద; వసుధాత్మజకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. పేలవమగు సీతక్కకు
  తేలికగా పనస తరుగ తేకువ తోడన్
  మేలుగ వంటింటినిటను
  వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్!

  వాలము = కత్తి

  రిప్లయితొలగించండి

 4. జాలంబందు జిలేబి చీర్సులగనన్ జంబమ్ము లన్గానగా ?
  కోలాటమ్ముల చేయు బాల యెవరో? కోలంకిపిట్టెవ్వరో ?
  బాలారాజము రాముడెవ్వరి సమాప్తాలుండు చెప్పన్ సఖీ !
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా; వామాక్షి ; సీతమ్మకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. సాలమునుండి ఫలమ్ముల
  నా లక్ష్మణుడు కొనితెచ్చె నాకలి వేళన్
  మేలుగ ముక్కలు జేయగ
  వాలమొకటె తక్కువగద వసుధాత్మజకున్

  రిప్లయితొలగించండి
 6. బేలగ దలంచి రావణు
  డా లలనను లంకలోన డాఁచిన వేళన్
  కాలికలా యగుపడె, కర
  వాలమొకటె తక్కువగద వసుధాత్మజకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కాళికలా' అనడం వ్యావహారికం. "కాళికవలె" అనండి.

   తొలగించండి
 7. కాలానుగుణమ్మున కద
  కాలూనెనురాము పత్ని కష్టపు కడలిన్
  ఆలములోనను రావణు
  హ్వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  ఏ లీలన్ రచియించితిట్టులవురా ! ఈ చిత్రమున్ మిత్రమా !
  కోలన్ గూర్చితి వాలికిన్ , హనుమకున్ కోదండమున్ గూర్చితో !
  లీలన్ రాముని చేతిలో గదను , చాలించింక నీ చేష్టలన్
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిత్రకారుని నధిక్షేపిస్తూ మైలవరపు వారు చెప్పిన పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 9. రామ పట్టాభిషేకమునకు వచ్చిన వానరపత్నులు సీతను చూచి తమలో తాము అనుకొన్నారట!

  ఏలీల బ్రహ్మ సేసెనొ
  యీ లోలనయనను? వానరేందుముఖులతో
  పోలికఁ జెప్పంగఁ దగునె?
  వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ....

   లోలాక్షింగని జానకిన్ కపిసతుల్ లోలోన భావించిరీ
   లీలన్ , విశ్వమనోహరాంగి , జగతిన్ లేదిట్టి పూబోడి , యీ
   వాలంబున్ ధరియింపనీమె మనదౌ వంశస్థురాలయ్యెడిన్
   వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్ !!

   తొలగించండి
  2. గురువుగారి పూరణ, దాని ననుసరించిన మైలవరపువారి పూరణ అద్భుతంగా ఉన్నవి!🙏🙏🙏🙏

   తొలగించండి
  3. కంది వారి , మైలవరపువారి పద్యాలలో సురుచిరహాస్య
   స్పూర్తి మూర్తిమంతమయింది .

   తొలగించండి
 10. డా.పిట్టాసత్యనారాయణ
  హేలగ ప్రచారమందున
  చాలగ స్త్రీజాతి నకట సై యని వాడన్
  లీలగ నీగతి విడ,కర
  వాలమొకటి తక్కువగద వసుధాత్మజకున్(సీతామాత వారసురాలగు మగువకు)

  రిప్లయితొలగించండి
 11. ద్విపాద మర్కటములుగ వనమున చూడగ ఆ
  రాక్షస వనితలు
  అప్రియము పలికి చెరలో నెలతకు రేపిరి మనమున
  పెక్కు కలతలు
  చేతలు కోతులన వారికి వాలంబొక్కటి తక్కువయ్యె
  నకటా
  వామాక్షి సీతమ్మకున్ జారెను అశ్రువుల ఇడుములు
  కటకటా

  రిప్లయితొలగించండి
 12. మేలుగ నటి యింతు ననుచు
  లీలగ ధరి యించె నొకడు లేమగ వేషం
  బా లల న గని యను కొని రి
  వాలమొ కటి తక్కువ గద వసుధాత్మ జ కు న్

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా సత్యనారాయణ
  వాలిం జంపకయున్న రాము డపుడే వాటంబుగా రావణున్
  వాలంబందునజుట్టి చంపుగద సవ్వాల్లేదు స్త్రీ జాతికిన్
  చాలంగా తగు సాహసంబు లమరున్ శర్వాణులే శౌర్యపున్
  వాలంబొక్కటి తక్కువయ్యె నకటా!వామాక్షి సీతమ్మకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సవ్వాల్ + లేదు' అన్నపుడు ద్విత్వలకారం రాదు.

   తొలగించండి
 14. ఆలన పాలన లేక ని
  రాలంకృతయౌ కృశాంగి రాక్షస వేష్ఠిన్
  జాలిని గనతైలభరిత
  వాలమొకటె తక్కువగద
  వసుధాత్మజకున్!

  వాలము = వెంట్రుక = జడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పేలున్ జోరుగ కక్షయందు చనవున్
   విద్యార్ధి లోకంబునన్
   గేలిన్ జేయును చిన్నవారిని సభన్
   గించిత్తు లక్షించకే
   వీలుంజూసి దృశాను మేలము గొనున్
   వీరత్వమున్ జూపగా
   వాలమ్మొక్కటి తక్కువయ్యె నకటా! వామాక్షి సీతమ్మకున్!

   సీత అనే ఒక అల్లరిపిల్ల! ( నేను కాదు)😊😊

   తొలగించండి
  2. ఇవ్వాళ జీపీయెస్ వార ఆటవిడుపు సరదా పూరణ మీరు వేసేసారు సీతాదేవి గారు :)


   జిలేబి

   తొలగించండి
  3. నా పని ఇలాగున్నది:

   "తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచె"

   😊

   తొలగించండి
  4. సీతమ్మవారికి వాలమనేసరికి యింతకన్న తోచలేదు!! 😊😊🙏🙏

   తొలగించండి
  5. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  6. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి
 15. "బాలేన రమతే సీతా బాలచంద్ర నిభాననా" అను సుమంత్రుని మాట విని "అయ్యో, ఆవాలం(ఆలవాలం- అయోధ్య) ఒకటే తక్కువయిందని కౌసల్యాదులు బాధపడుతున్న సందర్భం....


  హేలన్ నృత్యములాడుచుండె భళిరే! హిందోళ రాగమ్ముతో
  బాలేభమ్ము వలెన్ చరించెనటవిన్ భద్రుండు భద్రమ్మిడన్
  కాలేకంఠుని చిద్విలాసమమరెన్,కార్చిచ్చు దాచన్ మదిన్
  నే లేమిన్ గనఁ, 'యాలవాల'మనుచున్, నేర్పున్ సుమంత్రున్ నుడన్
  జోలల్ పాడిన మాతృ ప్రేమ వివశన్ జోగిన్ తలంచేడ్వ యా
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేంకటేశ్ ప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నుడన్, వివశన్, తలంచ్యేడ' ఇవి సాధు రూపాలు కావు.

   తొలగించండి
 16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2731
  *వాలమ్మొక్కటి తక్కు వయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్.*
  సందర్భం :: లంకలో సీతాదేవిని కనుగొన్న హనుమంతుడు సంతోషించాడు. ఐతే దీన వదనంతో ఉన్న ఆ తల్లి పరిస్థితికి ఎంతగానో కుమిలిపోయాడు. శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన ఈమె భూమాతకు కుమార్తెగా అవతరించింది. శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ రామచంద్రుని వివాహమాడింది. రావణాసురుని ప్రాణాలను తీయగల కాలసర్పమై లంకలో ప్రవేశించింది. ఈ పతివ్రతకు విముక్తిని కలిగించగల శక్తికి *ఆలవాలం* ఈమె భర్త యైన రఘురాముడే. ఈ సీతమ్మకు సకల ఐశ్వర్యాలూ ఉన్నాయి కానీ ప్రాణేశ్వరుడైన శ్రీ రాముని సన్నిధి ఒక్కటే తక్కువయ్యింది కదా ! అని విచారించే సందర్భం.

  శ్రీ లక్ష్మీ కళ బుట్టె నీ ధరణికిన్, చేపట్టె శ్రీరామునిన్,
  గ్రాలెన్ రావణు మట్టుబెట్టు ఫణియై, కాల్ వెట్టె నీ లంకలో,
  పాలింపన్ విభు డాలవాలమయి చూపట్టండు, లాలుప్త మా
  వాలమ్మొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్.
  [ల+ఆలుప్తము=లాలుప్తము]
  { లాలుప్తము + ఆవాలమ్ము = లాలుప్తమావాలమ్ము}
  ( ఆలవాలము అనే పదంలో *ల* అనే అక్షరం పూర్తిగా లోపించినప్పుడు ఏర్పడిన ఆవాలము అనే పదము)
  {ఆవాలము అనగా ఆలవాలము అని అర్థం}
  [పూరణ పద్యాన్ని పరిష్కరించిన అవధాన వరేణ్యులగు *శ్రీ సూరం శ్రీనివాసులు* గారికి ప్రణామాలర్పిస్తూ}
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (13-7-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ విశిష్టంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు.

   తొలగించండి
 17. త్రూలుచు ప్రేలెడు వానికి
  వాల మొకటె తక్కువ గద! ; వసుధాత్మజకున్
  చూలాలిగ యుండినపుడె
  యేల విరించియె విధించె నిడుమలనెన్నో ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చూలాలుగ నుండినపుడె' అనండి.

   తొలగించండి
 18. వాలుగకంటి పనుపుపయి
  యా లంకాధిపతి కట్టుచేయగ నరుణుం
  బోలు కనులజూసెను కర
  వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్

  రిప్లయితొలగించండి

 19. ఏమండీ కంది వారు

  జడకందం పుస్తకమ్ పంపించగలరు

  మీకు మైయిలు పెట్టినాను


  నెనరులు
  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. బాలు రిరువురు కుశలవులు
  బాలార్క నిభులు జనించఁ బరమానందం
  బే లలనకుఁ బతి పా దా
  వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్

  [ఆవాలము = ఆలవాలము]


  ఆలం బందునఁ జంపు రాముఁ డని తా నాశించుటన్ వాసు రాం
  బా లాలిత్య తపో బలమ్మునను దా మండించ కుండంగఁ గ
  ల్లోలాత్ముండు దశాననున్ విడిచెనే రోషమ్ము నారీ మహా
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్

  [వాసు రాంబా లాలిత్య = భూమాత యంత లలిత భావము (క్షమ) కలది; నారీ మహా వాలము = స్త్రీలకు గొప్పదైన కత్తి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బంధువుల తోడ రావణు భండనమునఁ
   జంపి రాముఁడు నను జేరి చక్కఁగఁ గొని
   పోవ నిచ్చట నుండి యద్భుతముగ నది
   యోగ్య మగు నతనికిఁ బురుషోత్తమునకు ... శ్రీమదాంధ్ర. సుం. 37. 57.


   యది రామో దశగ్రీవమిహ హత్త్వా సబాన్ధవమ్.
   మామితో గృహ్య గచ్ఛేత తత్తస్య సదృశం భవేత్ ..వా. రా. .৷৷5.37.62৷৷

   తొలగించండి
  2. ఆర్యా! మీ కందము మాకందము రీతి రసవత్తరము!! 🙏🙏🙏

   తొలగించండి
  3. పతిపాదావాలము చక్కని కూర్పండి.
   రావణసంహారకీర్తి తన భర్తకే రావాలని కోరి తాను సంహరించే శక్తి కలదైనను సీతమ్మ, రావణుణ్ణి చంపక వదలింది అనే భావనతో మీ పూరణ ప్రశంసనీయం.

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు, రామాయణ పద్యం అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారికి మఱియు రామాచార్య గారికి ధన్యవాదములు.

   తొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

  ఒక అత్త కోడలును గూర్చి పొరుగు ఆడవారితో
  ~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~

  చెప్పి వాపోవుట
  ~~~~~~~~~~


  శ్రీలక్ష్మీ కళ యుండె నా ముఖమునన్ | సీతమ్మ పేరుండెగా |

  చాలున్ నచ్చెను పాప మా కనుచు నిష్టం బొంది , యే కట్నము

  న్నాలోచింపక చేసుకొంటిమి | వివాహంబై గృహం బందునన్

  గాలున్ మోపగ దెల్ల మాయెను గదా గయ్యాళి గంగమ్మ యం |

  " చోలమ్మో " మొగు నేమి లెక్కిడదు | వేయున్ గంతులన్ | వానిపై

  కాలున్ ద్రవ్వును | కోతి వోలె బరుకున్ | కర్మమ్ము కాల్చెన్ మమున్ |

  వాలం బొక్కటి తక్కు వయ్యె నకటా " వామాక్షి సీతమ్మకున్ "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 22. లోలాక్షి!జగన్మాత వి
  శాలాక్షి!అవనిజ! సీత! జానకి! వైదే
  హీ!లిబ్బిపడతుక! ఘన
  జ్వాలమొకటె తక్కువ గద వసుధాత్మజకున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జ్వాల' ఉంది. కాని 'జ్వాలము'?

   తొలగించండి
 23. సీతమ్మను సరసి (సరస్సు)గా వర్ణించుచు,
  ఆ సరసులోని ఒక దానితో పోలిక తక్కువై నదనే సందర్భము.

  రోలంబాసితకేశపాశ మమరన్ లోలోరగాభాసమై,
  లీలానిర్జితనీరజాక్షయుగళిన్, రేవెల్గు మోముం దగన్
  శ్రీలావణ్యతరంగశోభిసరసిన్ జెన్నొంది, యందొప్పు శై
  వాలంబొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్.

  శైవలము, శైవాలము రూపాంతరము (నీటిలోని నాచు).


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారు నమస్సులు. మీ యద్భుతోపమానముతో సీతాదేవిని వర్ణిస్తూ చేసిన పూరణము మనోహరముగా నున్నది.
   తుమ్మెదలు. బృహద్మీనములు నీరజములు తరంగములు శైవాలము లన్నియు సరస్సు తో ప్రత్యక్ష సంబంధమున్నవి. చంద్రుఁ డొక్కఁడే సరస్సుకు దూరము. అందుచేత
   “లీలానిర్జితనీరజాక్షయుగ సుగ్రీవాభసంచారిణీ” అనిన నెట్లుండును!

   తొలగించండి
  2. కామేశ్వరరావుగారు మీ సూచనకు ధన్యవాదాలు.
   సరస్సులో చంద్రప్రతిబింబం ఉంటుంది కదండి.
   సరస్సులో ఉన్న వాటిలో ఒక నాచుతో ఉపమానము లేదని నాభావన.

   తొలగించండి
  3. రామాచార్య గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  ("తోక కోసి సున్నం పెడతా"...మా టీచరు)

  స్కూలున్ జేరగ జానకమ్మ కనెనా కోలాహలమ్మున్ భళీ
  బాలల్ బాలిక లేకమై పెనుపుగా వాలమ్ములాడింపగా
  పాలింపంగను కోతి మూకలను వేపాకమ్మ బెత్తమ్ము తో
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్

  వాలము = తోక
  వాలము = కత్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కందము


   స్కూలున్ జేరెన్ జానకి
   బాలల వాలముల నరికి పడవేయ నహో
   చాలమి మీరగ సూ, కర
   వాలమొకటె తక్కువాయె వసుధాత్మజకున్ !

   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారి ఆటవిడుపు పూరణ, దాని అనుకరించిన జిలేబీ గారి పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 25. తాలిమి,నాయకుడందము
  మూలముచెలికత్తెదెలుప?మురియుచురాముం
  డాలిగ!సీతకు మనసున
  వాల?మొకటితక్కువగదవసుదాత్మజకున్ (రాముడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని 'వాల?మొకటి' విరుపు అర్థం కాలేదు.

   తొలగించండి
 26. బాలా!కనుమాగంతులు
  వాలమొకటెతక్కువగద,వసుధాత్మజకున్
  నాలవకుశులిరువురుపు
  త్రులుగాజన్మించిభరతభూమినినేలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆత్మజకున్ + ఆ' అన్నపుడు నుగాగమం రాదు. లవకుశులు ఏలెన్... వచనదోషం!

   తొలగించండి
 27. (లంకలో రావణునితో సీత పలుకులు )

  ఆలము సలుపగ జాలక
  హేలనముగ మాటలాడు హీనుడవౌ, నీ
  నాలుక ఖండించగ కర
  వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్

  చాలిక నీ ప్రేలాపన
  కూలును నీరాజ్యమంత కులనాశక, నీ
  పాలిట మృత్యువు వచ్చితి
  కాలము కడతేరదె పరకాంతను గోరన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూర్తి గారూ,
   మీ పూరణ, దాని ననుసరించి వ్రాసిన పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. ఆ లావణ్యము గాంచి రావణుడు మోహావేశమున్ బొంద, కం
   ఠాలమ్మందున రాముడే తునిమి వెంటన్ దెచ్చెనా జానకిన్
   లోలాక్షిన్ గనినట్టి వానరులె యాలోచించిరే యివ్విధిన్
   వాలంబొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్

   తొలగించండి
 28. బాలల్ జేరిరి క్రీడకై పిలువగన్ బంతాటకై దండిగా
  కేళీ సంబరమందు గెంతుచు నటన్ క్రీడించుచున్ జానకిన్
  గేలింజేయుచు పల్కిరీ విధి సఖుల్ కేలెత్తి చూపించుచున్
  వాలంబొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్

  రిప్లయితొలగించండి
 29. కందం
  పోలిచె తృణముగ రావణు
  శీలవతిగ సీత సబల శ్రీరాముండా
  వేళకు గాండ్రించెడు నా
  వాలమొకటి తక్కువ గద వసుధాత్మజకున్

  రిప్లయితొలగించండి


 30. శూలము వంటి పలుకులను
  బాలామణితోడనసురవరుడాడంగన్
  హేలగ జూడగ నాకర
  వాలమొకటె తక్గువ గద వసుధాత్మజకున్.

  2.బేలా ననువరియించగ
  నేలా యాలస్యమనుచు నిలసుత తోడన్
  ప్రేలగ నసురునిజంపగ
  వాలమొకటె తక్కువ గద వసుధాత్మజకున్.

  రిప్లయితొలగించండి
 31. శార్దూలవిక్రీడితము
  శీలంబెంతయొ యున్నతంబుగననౌశ్రీలక్ష్మి సీతమ్మకున్
  శ్రీలంకాధిపుడాశజూప తృణమన్ రీతిన్ బ్రవర్తించె పో
  గాలమ్మా సమయాన వానిఁ గనదోగాండ్రించు రాముండు నా
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటావామాక్షి సీతమ్మకున్

  రిప్లయితొలగించండి
 32. "అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా। పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్"

  వాలిన్ గాచగ భ్రాతతో రణమునున్ వారింప యత్నించెనే
  చాలింపుమ్మిక నాట పాటలనుచున్ సాధించె సుగ్రీవునే
  గాలింపంగను తారతో ప్రతిభనున్ కన్పించుగా నివ్విధిన్:👇
  వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్!

  రిప్లయితొలగించండి