14, జులై 2018, శనివారం

సమస్య - 2732

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్"
(లేదా...)
"సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే"
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలినాయుడు గారికి ధన్యవాదాలు.

70 కామెంట్‌లు:

 1. పైరుల పంటల కిడునవి
  నారుల సత్త్వమ్ము కొరకు నవయుగముననన్
  వారము వారము కృత్రిమ
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🙏🏼 నవ యుగమందున్...
   అనడం బాగుం టుందేమో!

   ...డాక్టర్ వెలుదండ సత్యనారాయణ

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వెలుదండ వారి సవరణను స్వీకరించండి.

   తొలగించండి
 2. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ఘోర మగును సంసారము..
  పోరాడుట యొకటె గాని, పో దాహారం
  బే రెండు మెతుకులో.. సం
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  14.7.18

  రిప్లయితొలగించండి
 3. చేరకు ఘుమఘుమ లనుగని
  దారిపొడువున కనబడు పదార్థముల దరిన్
  నారోగ్యము చెడు, నిల ని
  స్సారము లేనట్టి తిండి శక్తిని గూర్చున్

  రిప్లయితొలగించండి


 4. హేరాళముగ పసారపు
  నారోగ్యపు పోషకము మనకదే విటమిన్ !
  కారము చేదున్, తీపియు
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. తీరగు భుక్తి కననిచో
  నీరసము కలుగు తనువుకు నిజముగ భువిలో
  పోరాట సమయమున ని
  స్సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తనువునకు' అనడం సాధువు. "నీరస మొసగు తనువునకు..." ఆనండి.

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  సారపు సత్యమున్ గనఁ బ్రశాంతత శ్వాసను నిల్పి యోగదీ...
  క్షారతులైన తాపసుల గాంచుము , వారికి శక్తి యెట్టి యా...
  హారమునందు లేదు ., ఘనమౌ దృఢమానసవృత్తి కల్గుచో
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. ఆరోగ్యమునే చెరచును
  సారము లేనట్టి తిండి, శక్తిని గూర్చున్
  భూరిగను వివిధ రకముల
  కూరలు పలుదుంపలాకు కూరల దిన్నన్

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా సత్యనారాయణ
  ఘోరము సాత్త్విక వంటలు
  కారము,లవణంబు,నుల్లి గానము గానీ
  కోరియు దిన ఋజలంటవు
  సారము లేనట్టి తిండి శక్తిని గూర్చున్

  రిప్లయితొలగించండి
 9. కారము,క్షారము,మనయా
  హారములోమితముగా విహారము నిడగా
  యీరువు,శిఖియండమ్ము,ని
  "సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్"

  ఈరువు = మాంసము , నిసారము = చేప

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా సత్యనారాయణ
  పూరణ స్వాస్థ్య మూలకము పొందుగ వంటలటంచు నెంచి యా
  హారమునందు వే రుచులె హ్లాదము గూర్చునటన్న, వ్యాధులన్
  బారగద్రోల మండలము1 వండని పచ్చని కూరగాయలన్(1.40రోజులు)
  సారములేని తిండి దిని శక్తిని గూర్చుకొనంగవచ్చులే!
  (కవి,"ఆరోగ్య సాధనము"మాసపత్రిక,వరంగల్ సంపాదకుడు&ప్రకృతి వైద్య చికిత్సకుడు.)

  రిప్లయితొలగించండి
 11. నీరము క్షీరము లనుసరి
  నేరుపుగా గ్రోల కున్న నీరస మొందన్
  ఘోరము నాకులు నలములు
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 12. ఇంటి దానికి రొట్టెలు రావు చేయవెందుకనె
  దమ్ములు లేవు
  బయటి రొట్టెలవి రొట్టెలు కావు తింటె బయటికి
  పోనే పోవు
  స్థూలకాయులుగ అంతట వెలిసిరి సారము లేని
  తిండి దిని
  శక్తిని గూర్చుకొనంగ వచ్చులే మొలక విత్తు
  నిత్యము కని

  రిప్లయితొలగించండి
 13. పౌరుషము బెంచ జాలదు
  సారము లేనట్టి తిండి; శక్తిని గూర్చున్
  చేరిచి సేంద్రియ యెరువులు
  కూరిమి బెంచిన సహజపు కూరలు భువిలో!

  రిప్లయితొలగించండి
 14. ఆరోగ్య ము చె డు ను దిన గ
  సారము లేనట్టీ తిండి ; శక్తి ని గూర్చు న్
  కూరలు పండ్ల ను దినుచు న్
  శారీరక శ్రమ ను స లు పు సాత్వికు ల కి ల న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. అలాంటివి జరిగితే ఇలాంటివీ జరుగుతాయి కదా....

  శ్రీరఘువీరునిన్ నుతులుసేయక క్షిప్రయశాది కాముడౌ
  ఘోరనిపాతశూన్యతరఘోషితదుర్భషకమ్ము క్రెళ్ళి భూ
  భారముతగ్గకుండ, మరి పాపులు పూజలు పొందురోజులన్
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే

  రిప్లయితొలగించండి
 16. కారాగారము నందున్
  శ్రీరాముని కీర్తనములె చింతలె మాన్పన్
  ఆరామ దాసుకట యే
  సారములేనట్టి తిండిశక్తినిగూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   రామదాసును ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. కవిమిత్రులకు నమస్సులు. ఈరోజు నేను వరంగల్లుకు వెళ్తున్నాను. రేపు యాదాద్రి కవిసమ్మేళనానికి వెళ్తాను. నేడు, రేపు నేను సమూహానికి అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 18. డా.ఎన్.వి.ఎన్.చారి
  ఏరై పారెడు మందులు
  చేరగ మనపంటలందు చేరవె రుజముల్?
  కోరుము సేంద్రియమును, విష
  సారము లేనట్టి తిండి శక్తిని గూర్చున్

  రిప్లయితొలగించండి
 19. రమేష్ గారి భావమునకు నా పద్యము

  దారకు రాదుగా తళియ,దారిని గాంచిన రొట్టెలన్ తినన్
  దారుణ మెంతయో జరుగు,దారిని వండెడిదెప్పుడన్ గనన్
  సారము లేనితిండి, తిని శక్తిని గూర్చు కొనంగ వచ్చులే,
  కూరలు,గింజలున్ సతము కూడిన భోజనమందురెల్లరున్

  రిప్లయితొలగించండి
 20. దారకు రాదుగా తళియ,దారిని గాంచిన రొట్టెలన్ తినన్
  దారుణ మెంతయో జరుగు,దారిని వండెడిదెప్పుడన్ గనన్
  సారము లేనితిండి, తిని శక్తిని గూర్చు కొనంగ వచ్చులే
  కూరలు గింజలున్, ఘనత కూడిన భోజనమందురెల్లరున్

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  సారెకు వీధు లందుబడి చద్దిపదార్థము లన్ని మెక్కుటన్ ,

  గోరి పకోడి బజ్జియును కూర్మను మ్రింగుట మేలొకో ! యతీ

  సారము లేని తిండి దిని శక్తిని గూర్చుకొనంగ ‌ వచ్చులే !

  సార మొసంగు పండులు మెసంగుము పాల్పెరు గెప్డు గ్రోలుమా !


  { అతీసారము = అతిసారము }

  ---------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 23. భారమ్మౌ చెడు తిండియె
  యారోగ్యము పాడుజేయు నవలోకింపన్
  తీరుగ జింతింపగ నెటు
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్ ?

  రిప్లయితొలగించండి
 24. నీరసముగలుగజేయును
  సారములేనట్టితిండి,శక్తినిగూర్చున్
  సారముగలభోజ్యములను
  నారారగదినినయెడలనయ్యదిమనకున్

  రిప్లయితొలగించండి


 25. కారము గొడ్డుకారమన కాంక్షల జేర్చెడు జంకు ఫుడ్డులన్
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చు కొనంగవచ్చులే
  బీరును బ్రాంది విస్కి జత బ్రేవుమటంచును త్రేన్పులన్ భళా
  రే రసనాయకా,నెగడ రేవగలున్ చవి‌ గాంచ వచ్చులే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. జిలేబి గారు బీరు తోటి విస్కి బ్రాంది తాగరనుకుంటా చాలా మంది అంటుంటారు బీరు ఎండాకాలములో చలువ చేస్తుంది అని నాకు తెలియదు సుమీ అపార్థం వలదు తల్లి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ధన్యవాదాలండీ పూసపాటి గారు ఎప్పుడైనా తాగి‌వుంటే కదా తెలిసేది :) ఏదో గణాల కోసం వేసుకున్న పదాలు అంతే :) మరీ జిలేబీయం :)

   జింజిరి జిలేబి‌:)

   తొలగించండి
 27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2732
  సమస్య :: *సారము లేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే.*
  సారమే లేనటువంటి ఆహారాన్ని తిన్నప్పటికీ గొప్ప శక్తిని సమకూర్చుకోవచ్చు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: వానరులు కట్టిన వారధిపై కాలినడకతో సముద్రాన్ని దాటి ఆ కోతలే అనుచరులుగా ఉండగా రాముడు దుర్జయుడైన రావణాసురుని జయించ గలిగినాడు. కుండలో పుట్టి అడవిలో నివసించిన అగస్తుడు సముద్రాన్ని త్రాగివేయ గలిగినాడు. అనూరుడు సారథిగా ఉండగా ఒక చక్రమే ఉన్న రథంలో ఉండి సూర్యుడు నిరాధారమైన ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాడు. అశరీరుడైన మన్మథుడు పూలబాణాలతో అన్ని లోకాలనూ జయించ గలుగుతున్నాడు. తగిన ఉపకరణములు లేకపోయినా మహాత్ములు తమ సత్త్వ సంపదతో క్రియాసిద్ధిని పొందుతున్నారు.
  *క్రియాసిద్ధి స్సత్త్వే భవతి మహతాం నోపకరణే* అని వినియున్నాము కదండీ. అట్లే యోగులు సారము లేని ఆహారాన్ని భుజించినా గొప్పశక్తితో విరాజిల్లగలరు అని విశదీకరించే సందర్భం.

  ధీరత రామచంద్రుడు వధించెను రావణు, ద్రాగె దా నకూ
  పారముఁ గుంభసంభవుడు, భానుడు నింగిని సంచరించెడిన్, మారుడు గెల్చు లోకముల మాన్యత సత్త్వము గల్గి, యోగులున్
  *సారము లేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చు కొనంగ వచ్చులే.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (14-7-2018)

  రిప్లయితొలగించండి
 28. కూరలుఁ గాయ లెన్నొ యవి కూర్మి భుజించగ నుండ, నందు శా
  రీరకరుగ్మకారవిపరీతనిరర్థపదార్థజాలమున్
  గోరిక మీర మేకొనక, కొవ్వును జేర్చ నివార్యహానికృ
  త్సారము లేని, దిండి తిని శక్తినిఁ గూర్చు కొనంగ వచ్చులే.

  రిప్లయితొలగించండి
 29. ఆరయఁ బలలము నందున
  మూరిన బల ముండు శాకముల యందుఁ గడుం
  గూరలు గాయలలో ని
  స్సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్


  కారము పుల్పు మిక్కుటము గాక సమంబుగ నుంచి షడ్రుచుల్
  క్షీరము గొంచు నిత్యము నశేష మహోన్నత పుష్టి దాయ కా
  హార వితాన సంయుత వరాన్న భ రామల రోగ కీట కా
  సారము లేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే

  [ఆసారము = వ్యాపించుట]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గు రు మూ ర్తి ఆ చా రి

   పదాభివందనములు :: అ ద్భు త మై న పూ ర ణ

   తొలగించండి
  2. గురు మూర్తి ఆచారి గారు నమస్సులు. ధన్యవాదములు. ఆలస్యముగా చూచి నందులకు మన్నించండి.

   తొలగించండి
 30. సారములేనితిండిదినిశక్తినిగూర్చుకొనంగవచ్చులే
  సారములేనితిండనినజక్కనిభావముగల్గియుండుచో
  మీరలుసేయుడట్లుగనెమేమునుమీవలెజేసిచూతుమీ
  సారములేనితిండిదినశక్తులువచ్చువిధంబునిత్తఱిన్

  రిప్లయితొలగించండి
 31. ఊరున దొరకెడి సాదము
  సారము లేనట్టి తిండి, శక్తిని కూర్చున్
  దార పెరిమితో వండగ
  నోరూరగతినిన, దివిని నోచుకొ నుటయే

  రిప్లయితొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  ("ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు...")

  బోరుర నీవటంచు సతి పుట్టిన సీమకు పారిపోవగా
  కూరలు పప్పులున్ పులుసు గొప్పగ వండుట చేతగానిచో
  భారిగ నార్డరిచ్చుచును పస్తలు పిజ్జలు చిప్సువంటివౌ
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే!

  పస్త = pasta
  పిజ్జ = pizza
  చిప్సు = chips
  సారములేని తిండి = junk food

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కందము


   పోరా మగడ యని సతి సు
   తారముగా పుట్టినిల్లు తా బోవన్ వాహ్!
   వారెవ్వా పిజ్జా ! సం
   సారము లేనట్టి తిండి శక్తిని కూర్చున్ !

   జిలేబి

   తొలగించండి
 33. కారము దీపియు బులుపును
  తీరున సరిపడ లవణము తిక్తము వగరున్
  జేరిన రుచిగూడుచు ని
  స్సారము లేనట్టి తిండి శక్తిని గూర్చున్!

  రిప్లయితొలగించండి
 34. భూరిగ రోగముల్ బడసి ముప్పుయె వాటిల మూల్గుచున్ వడిన్
  జేరువ కాడె మృత్యువుకు జిహ్వకు నచ్చినదంచు పెక్కుగా
  సారము లేని తిండి దిని, శక్తిని కూర్చుకొనంగ వచ్చులే
  జోరుగ నాకుకూరలును శుష్టుగ దుంపలు పండ్లతో సదా!

  రిప్లయితొలగించండి
 35. కం.
  నీరము వచ్చెను, పచ్చని
  పూరిని మేసెను పసరము పొలములయందున్
  భూరిగ బలమే గలిగెను
  సారము లేనట్టి తిండి శక్తిని గూర్చెన్

  రిప్లయితొలగించండి
 36. కం.
  నీరము వచ్చెను, పచ్చని
  పూరిని మేసెను పసరము పొలములయందున్
  భూరిగ బలమే గలిగెను
  సారము లేనట్టి తిండి శక్తిని గూర్చెన్

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  సందర్భము: ఎక్కడంటే అక్కడ తిండి తినకు. దృష్టి దోషం తగిలితే తగులవచ్చు. జాగ్రత్త!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  చేరెడు కన్నులఁ గనుగొని,
  తీరైన వటంచు చేరి తిన బోవకుమా!
  ఆరయగ దృష్టి దోష ప్ర
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  14.7.18

  రిప్లయితొలగించండి
 38. మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత లోని నేటి పద్యములలో నొకటి:

  ఒప్పగు వలువలును దండ లున్న వాని
  నింపు కంపు మేఁ బూఁతల పెంపు వాని
  వెఱఁగు లన్నియుఁ దగ నిండి వెలయు వాని
  నంతఁ జూచు వానిఁ దుది లేనట్టి వాని .... శ్రీకృష్ణ. సూ. సుధా. 11. 11.

  మూలము:
  దివ్య మాల్యాంబర ధరం దివ్యగంధానులేపనమ్ |
  సర్వాశ్చర్యమయం దేవ మనంతం విశ్వతో ముఖమ్ || ....శ్రీమద్భగ. 11. 11.

  రిప్లయితొలగించండి
 39. ఉత్పలమాల
  భారతదేశమందు ఋషివర్యులు దివ్య పునర్నవమ్ము నా
  హారము లేకనే యణువు లందగ సూర్యుని సూక్ష్మ కాంతితో
  దీరెడు రీతి సోహమని తేజముఁ బొందిరి వేల యేళ్లుగన్
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే

  రిప్లయితొలగించండి
 40. కందం
  కూరెను దివ్య పునర్నవ
  మా ఋషుల కణువుల సోహమనగన్ సూర్యా
  ధారిత కాంతిని, యేళ్లుగ
  సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్

  రిప్లయితొలగించండి


 41. ధారుణి లోతెచ్చు రుజలు
  సారము లేనట్టి తిండి ,శక్తినిఁ గూర్చున్
  కూరలు వాడుచు సతతము
  భూరిగ వండితినుచున్న పుష్టియు కలుగున్.

  రిప్లయితొలగించండి
 42. వారము నారు రోజులుగ వంటను మానుచు భాగ్యనగ్రినిన్
  హైరన నొందుచుండి బిరియానిని కుమ్ముచు గుండె మండగా
  కారము నుప్పులేనిదహ కమ్మని గంజిని కూడుకున్నదౌ
  సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే

  రిప్లయితొలగించండి